మెయిన్ ఫీచర్

గల్లా పెట్టె ఖాళీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో చిన్న సినిమాలు చిన్న బోతున్నాయి. ఆడియన్స్‌ని మెప్పించే సినిమాల సంఖ్య తగ్గిపోతుండటంతో -ఇండస్ట్రీ కళ తప్పుతోంది. పెద్ద సినిమాలు ఎన్నొచ్చినా ఇండస్ట్రీకి ఊపే తప్ప -ఊతమైతే కాదన్నది జగమెరిగిన సత్యం. చిన్న సినిమా ఎంత బలంగా నిలబడితే -పరిశ్రమ అంత కళకళలాడుతుంది. గత రెండు మూడు నెలల్లో వచ్చిన చిన్న సినిమాలేవీ ఆడియన్స్‌ని మెప్పించే స్టామినా చూపించలేకపోవడంతో -టాలీవుడ్ ఒక్కసారిగా కళ తప్పినట్టు కనిపిస్తోంది. ఆమధ్య వచ్చిన సాహో, సైరాలాంటి పెద్ద సినిమాలు హడావుడి చేసినా, పదుల సంఖ్యలో వచ్చే చిన్న సినిమాలేవీ నిలబడలేకపోవడంతో టాలీవుడ్ గల్లాపెట్టె ఖాళీ అయిపోయిందన్న భావన కనిపిస్తోంది.
గత ఆగస్టు 30న సాహో, అక్టోబర్ 2న సైరా సినిమాలు థియేటర్లకు రావడంతో.. అంతకుముందు రావాల్సిన, తరువాత విడుదల కావాల్సిన చిన్న చిత్రాల డేట్లు చెల్లాచెదురైపోయాయి. ఆ రెండు పెద్ద సినిమాల ప్రభావం నేరుగా చిన్న చిత్రాలపై లేకున్నా -విడదల తేదీల అడ్జెస్ట్‌మెంట్లు మాత్రం చిన్న సినిమాను భారీగానే దెబ్బతీసినట్టు కనిపిస్తోంది. గత రెండు నెలల పరిస్థితినే తీసుకుంటే -అక్టోబర్ 2న సైరా థియేటర్లకు వచ్చింది. ఆ చిత్రానికి అటూ ఇటూ రావాల్సిన అనేక మధ్యస్థ, చిన్న చిత్రాలు విడుదల తేదీలను మార్చుకోవడం తెలిసిందే. అక్కడి నుంచి థియేటర్‌కు వచ్చిన ఏ తెలుగు సినిమా సైతం సరైన స్టామినా చూపించలేకపోయింది. వారం వారం వస్తున్న చిత్రాలన్నీ ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకోవడంతో -్థయేటర్లన్నీ వెలవెలబోతున్నాయి. బాక్సాఫీస్ కళతప్పి.. టాలీవుడ్ గల్లాపెట్టే పూర్తిగా ఖాళీ అయిపోయిన పరిస్థితే కనిపిస్తోంది.
ఈ ఏడాది మొత్తంలో నాలుగైదు చిన్న సినిమాలు తప్ప మరేవీ బతకలేని పరిస్థితి కనిపిస్తుంటే, గత రెండు నెలల్లో పరిస్థితి మరింత దిగజారింది. థియేటర్ల ఆక్యుపెన్సీ లేక.. వసూళ్లు కానరాక.. దయనీయ పరిస్థితిని టాలీవుడ్ ఎదుర్కొంటోంది. గత రెండు నెలల్లో థియేటర్లకు వచ్చిన ఏ చిన్న సినిమా సాధారణస్థాయి కలెక్షన్లు కూడా సాధించలేకపోవడం గమనార్హం. మల్టీప్లెక్స్‌లన్నీ హిందీ, ఇంగ్లీష్ సినిమాల ఆక్యుపెన్సీతో ఫరవాలేదన్న పరిస్థితిని ఎదుర్కొంటుంటే -సింగిల్ స్క్రీన్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. విడుదల రోజైనా ఏ షోకీ నాలుగైదు వేల మధ్య గ్రాస్ కూడా కనిపించటం లేదన్న టాక్ వినిపిస్తోంది. గత రెండు వారాల్లో విడుదలైన చిత్రాలనే ఉదహరించుకుంటే -గతవారం తిప్పరా మీసం అంటూ శ్రీవిష్ణు థియేటర్లకు వచ్చాడు. తొలి షోతోనే సినిమా ఔటైపోయింది. వీకెండ్లోనూ సినిమా నిలబడలేదు. అడ్రెస్ లేకుండానే గల్లంతైంది. అంతకుముందు వారం వచ్చిన ‘మీకు మాత్రమే చెప్తా’ వీకెండ్ వరకూ మమ అనిపించినా, మోస్తరు సినిమాగానే మాయమైంది. ఇక దీపావళి చిత్రాలుగా వచ్చిన తమిళ డబ్బింగ్ చిత్రాలు సైతం తెలుగు చిన్న సినిమాకు ఊపిరి లేకుండా చేసేశాయి. అజయ్ విజిల్, కార్తి ఖైదీ చిత్రాలు థియేటర్ల వద్ద హడావుడి చేయడంతో -ఆ టైంలో వచ్చిన స్ట్రెయిట్ చిన్న బడ్జెట్ సినిమాలు అడ్రెస్ లేకుండా పోయాయి. గడచిన శుక్రవారం థియేటర్లకు వచ్చిన సినిమాల పరిస్థితీ ఇందుకు భిన్నంగా లేదు. దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి తెరకెక్కించిన సందీప్ కిషన్ సినిమా ‘తెనాలి రామకృష్ణ బిఏబిఎల్’కూ బజ్ కనిపంచటం లేదు. దీనిపై విశాల్ డబ్బింగ్ సినిమా యాక్షన్ డామినేషన్ కనిపిస్తుండటంతో -తెనాలి సినిమా ఎంతకాలం మనగలుగుతుందన్నది అంచనా వేయలేని పరిస్థితే. అంటే, సైరా తరువాత ఏ తెలుగు సినిమా కూడా థియేటర్ల వద్ద నిలబడిన దాఖలా లేదన్న మాట. చిరంజీవి సైరా తరువాత గోపీచంద్ చాణక్య, అవసరాల శ్రీనివాస్ ఊరంతా అనుకుంటున్నారు, ఎవరికీ చెప్పొద్దు, తేజ కంచెర్ల ఆర్డీఎక్స్ లవ్, కృష్ణారావ్ సూపర్ మార్కెట్, మళ్లీ మళ్లీ చూశా, ఆది ఆపరేషన్ గోల్డ్ఫిష్, అశ్విన్‌బాబు రాజుగారి గది 3, రవిబాబు ఆవిరిలాంటి చిత్రాలు ఆశాజనంగానే థియేటర్లకు వచ్చినా -నిలబడిన దాఖలాలు లేవు. వచ్చిన ప్రతి సినిమా ఫ్లాప్ ముద్రేసుకుని వెళ్లిపోతుంటే -విడుదల కావాల్సిన సినిమాలపైనా ఆడియన్స్‌లో ఆసక్తి తగ్గుతోంది. డిసెంబర్‌లో మూడోవారంలో రావాల్సిన ఒకట్రెండ్ పెద్ద సినిమాల హడావుడి తప్ప, ఈ ఏడాది చివరికి ఏ చిన్న సినిమా సైతం నిలబడే అవకాశాలు కనిపించటం లేదు. అంటే, టాలీవుడ్‌కు మరో ఐదారు వారాలు స్లంప్ తప్పదన్నమాట. టాలీవుడ్ మొత్తంమీద ఏడాది మొత్తంలో కలెక్షన్లపరంగాను, బజ్‌పరంగాను ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ చిత్రాలుగా సాహో, సైరా, ఎఫ్2, మహర్షి, ఇస్మార్ట్ శంకర్, రాక్షసుడు, మజిలీ, చిత్రలహరి, జెర్సీ, గద్దలకొండ గణేష్ చిత్రాలనే చెప్పుకునే పరిస్థితి ఉంది. మీడియం రేంజ్, చిన్న చిత్రాల క్యాటగిరీలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, బ్రోచేవారెవరురా, ఓ బేబీ, ఎవరు? చిత్రాలను ఉదహరించుకోవచ్చు. భారీ ప్రచారం, కచ్చితంగా హిట్టు అంచనాలతో వచ్చిన చిత్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్ పార్టులు, వినయ విధేయ రామ, మిస్టర్ మజ్ను, 118, ఏబీసీడీ, సీత, కల్కి, డియర్ కామ్రేడ్, మన్మథుడు 2, గ్యాంగ్‌లీడర్, చాణక్య చిత్రాలు అడ్రెస్ లేకుండా పోయాయి.
టాలీవుడ్ పరిస్థితి ఇలావుంటే, కోలీవుడ్ మాత్రం గత రెండు నెలల్లో ఓ మోస్తరు స్టామినా చూపించి బాక్సాఫీస్‌ను కళకళలాడించింది. గత రెండు నెలల్లో విడుదలైన చిత్రాల్లో మెజారిటీ చిత్రాలు కలెక్షన్ల పరంగా సంతృప్తినిచ్చాయి. బిగిల్, ఖైదీ, అసురన్ చిత్రాలు బ్లాక్‌బస్టర్లు కావడంతో -కోలీవుడ్ కలెక్షన్లు 500 కోట్లు దాటేసిందని అంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ అక్టోబర్‌లో కోలీవుడ్‌లో వచ్చిన చిత్రాల సంఖ్య తక్కువే. జనవరి నుంచి ఇప్పటి వరకూ 164 చిత్రాలొస్తే.. అక్టోబర్‌లో కేవలం తొమ్మిది సినిమాలు థియేటర్లకు వచ్చాయి. ఫస్ట్‌వీక్‌లో వచ్చిన అసురన్ సెనే్సషనల్ హిట్టందుకుంటే, హండ్రెడ్ పర్సెంట్ కాదల్ విఫలమైంది. ఓ సాధారణ పల్లెటూరి వ్యక్తిగా, అటు తండ్రి పాత్రతోనూ ధనుష్ మెప్పించటంతో భారీగా కలెక్షన్లు కరిశాయి. సినిమా కలెక్షన్లు, శాటిలైట్ రైట్స్ అన్నీ కలుపుకుని వంద కోట్లు దాటేసిందన్న టాక్ వినిపిస్తోంది. సెకెండ్ వీక్ సినిమాలుగా అరువం, పెట్రోమాక్స్, పప్పీ సినిమాలొచ్చినా ఏదీ నిలబడలేదు. తరువాత పెల పెల, కావియన్ సినిమాలదీ అదే పరిస్థితి. చివరి వారంలో దీపావళిని టార్గెట్ చేస్తూ వచ్చిన బిగిల్, ఖైదీ చిత్రాలు తమ ప్రత్యేకతను చూపించాయి. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన బిగిల్ -విజయ్ ఫ్యాన్స్‌కు కొత్త ఊపునిచ్చింది. ఓవరాల్‌గా 250 కోట్లకుపైనే కలెక్షన్లు సాధించినట్టు చిత్రబృందం ప్రకటించింది. బిగిల్ శాటిలైట్ హక్కులకూ ఫ్యాన్సీ రేటొస్తే, డిజిటల్ హక్కుల ద్వారానూ సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది. మరోవైపు కార్తి చేసిన క్రైమ్ థ్రిల్లర్ ఖైదీ బ్లాక్‌బస్టర్ హిట్టుగా నిలిచింది. విమర్శకుల నుంచీ ప్రశంసలందుకున్న చిత్రానికి వసూళ్లు అదే రేంజ్‌లోనే వచ్చిపడ్డాయి. ఖైదీ సైతం వంద కోట్ల క్లబ్‌ను అధిగమించినట్టు చిత్రవర్గాలే అధికారికంగా ప్రకటించాయి. దీంతో అక్టోబర్ మాసంలోనే కోలీవుడ్ కలెక్షన్లు 500 కోట్లు దాటేసినట్టు లెక్కలు కనిపిస్తున్నాయి. అయితే, కోలీవుడ్‌లో ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన పేట, విశ్వాసం భారీ హిట్లు అందుకున్న తరువాత.. ఆశించిన విజయాలు అందింది మళ్లీ అక్టోబర్‌లో వచ్చిన మూడు చిత్రాలకే. మధ్యలో మీడియం రేంజ్ సినిమాలకు భారీ వసూళ్లు రాకున్నా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సాధించటంతో కోలీవుడ్‌లో ఒకింత కళకళ కనిపిస్తోంది. *