మెయిన్ ఫీచర్

ఒత్తిడిని శక్తిగా మారుద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానసిక ఒత్తిడి ఉన్నపుడు మెదడు మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాంటివేళ భిన్నంగా ఆలోచించాలన్న మోటివేషన్ మెదడుకి అందిస్తే చాలు, అద్భుతంగా ఆలోచిస్తుంది. సరికొత్త మార్గాల కోసం చకచకా అనే్వషిస్తుంది.

మారుతున్న కాలంలో మనిషి ప్రతికూలాంశాలను మలచుకుని తనని తాను నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు. ఇందుకు ఉదాహరణ మానసిక ఒత్తిడినుంచి పుట్టుకొస్తున్న సరికొత్త ఆలోచనల విజయం. ఈ మధ్యకాలంలో కొంతమందిని మీ విజయాలకు కారణమేమిటని ప్రశ్నిస్తే, ఒకానొక డిప్రెసివ్ మూడ్‌లో అందరిలా కాక, ఏదో కొత్తగా చేస్తే తప్ప నన్ను నేను నిరూపించుకునే సక్సెస్ సాధించలేననిపించి ఆలోచిస్తే, ఈ ఆలోచన వచ్చింది అని అంటే వాళ్ళు డిప్రెషన్ అనే మానసిక ఒత్తిడికి పరాకాష్ట స్థితిలోవుండి కూడా మనసును అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ సమస్యనుండి బయటపడటం కోసం చేసే ప్రయత్నం తాలూకు ఫలితమే అది... ఇదే వారి విజయ సూత్రం.
అనేకమంది సమస్యలు రాగానే సతమతమైపోతారు. మానసిక ఒత్తిడి పెంచేసుకుని డిప్రెసివ్ మూడ్‌లోకి వెళ్లిపోయి మెదడుకి పనిచెప్పడం మానేస్తారు. నిజానికి సమస్య వచ్చినపుడే మనిషి మరింత సమర్థవంతంగా ఆలోచించగలుగుతాడు. అయితే ఆ సమసర్థతను మానసిక ఒత్తిడితో అణచిపెట్టడం చేస్తారు కొందరు. ఇక్కడే సమర్థులకు, అసమర్థులకు తేడా ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడికి ఫీలై మరీ చేయలేకపోతే అది అసమర్థత. మానసిక ఒత్తిడిని అధిగమించి మరేదైనా కొత్తగా చేసి తనను తాను నిరూపించుకుంటే సమర్థత. కాబట్టి సమర్థత, అసమర్థతల మధ్య ఆ తేడాను గుర్తించి అసమర్థత లక్షణాలు తమలో వుంటే వాటిని వదిలి సమర్థత సాధించే దిశగా అడుగు వేయాలి. సమర్థులకే ఈ ప్రపంచం సాదర స్వాగతం పలుకుతుంది.
అయితే మానసిక ఒత్తిడివలన ఏర్పడే డిప్రెషన్, ఆ నిస్సహాయ స్థితిని ఒక శక్తిగా మలచుకోవడం ఎలాగో మనం తెలుసుకుంటే, ఒకవేళ అలాంటి స్థితివస్తే బయటపడటం ఎలాగో ఒక అవగాహన ఏర్పడుతుంది. అప్పుడు మనం అసమర్థతలను, సమర్థతలుగా మలచుకోగలుగుగతాం. ఆ క్రమంలో మీ గురించి మీరు విశే్లషించుకోండి. సమస్య వస్తే అదిగమించటం కోసం ఈ పద్ధతుల్ని పాటించండి.
మానసిక ఒత్తిడి అంటే ఆలోచనలు అంతం లేకుండా కొనసాగించి మెదడు పనిచేయకుండా చేసుకోవడం. కాబట్టి ఏదైనా ఒక సమస్య మీకు ఎదురైనా లేదా ఏదైనా సాధించడం కోసం మీరేదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆలోచించటం కొద్ది క్షణాలు ఆపండి. ఎడతెగని ఆలోచనలు హఠాత్తుగా ఆపటం సాధ్యమా? అంటే సాధ్యమే. ఆలోచనలు ఆపడానికి అనేక టెక్నిక్స్ ఉన్నాయి. అందులో నెంబర్ కౌంటింగ్, బ్రీతింగ్ టెక్నిక్స్ ఎఫెక్టివ్‌గా వుంటాయి. నా ఆలోచనలు ఆగిపోయాయి. ఇపుడు నేను ఒకటి, రెండు, మూడు.. అంటూ అంకెలను నా కళ్ళముందు నిలుపుకుని, వాటిని దర్శించగలుగుతున్నాను అనుకోవటం నెంబర్ కౌటింగ్ విధానం. ఒకటి, రెండు, మూడు తర్వాత మనసు డైవర్ట్ అయితే మళ్లీ ఒకటినుండి కౌంటింగ్ మొదలు పెట్టడం ద్వారా ఆలోచనలకు బ్రేక్ వేయాలి. ఇవే శ్వాస, నిశ్వాసల మీదనే ధ్యాస నిలపడం ద్వారా కూడా ఆలోచనలు ఆపగలుగుతాం.
పిచ్చి పిచ్చి ఆలోచనలు తగ్గాక మెదడు కాస్త తేలికైనట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మీ గురించి మీరు విశే్లషించుకోవడం మానేయాలి. నేనిప్పుడేం చేస్తున్నాను! ఎలా ఆలోచిస్తున్నాను అనే విశే్లషణ ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా అవసరం.
ఈ విశే్లషణ లేకనే చాలామంది దారి తప్పి నడుస్తున్నారనేది వాస్తవం. విశే్లషణ తర్వాత విధానాల గురించి పరిశీలించుకోండి. విధానాలు అంటే అనుసరిస్తున్న మార్గాలు మనం ఎంత చక్కగా ఆలోచించినా ఎన్నుకున్న మార్గం సరైనది కాకపోతే ఫలితం ఉండదు. ఫలితం లేని మార్గం వెంట ఎంత దూరం ప్రయాణించినా సాగేకొద్దీ ఒత్తిడి మాత్రమే పెరుగుతుంది. అందుకే సరైన మార్గం కోసం సరైన పరిశీలన చేయండి.
సరైన మార్గమే కాదు, సరికొత్త మార్గం ఏదైనా వుందా అంటూ అనే్వషణ సాగించండి. నిజానికి ఇలా భిన్నంగా ఆలోచించడమే సక్సెస్‌కి అసలు సూత్రం. అందులోనూ మానసిక ఒత్తిడి వున్నపుడు మెదడు మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాంటివేళ భిన్నంగా ఆలోచించాలన్న మోటివేషన్ మెదడుకి అందిస్తే చాలు. ఆ మెదడు అద్భుతంగా ఆలోచిస్తుంది. సరికొత్త మార్గాలకోసం చకచకా అనే్వషిస్తుంది. మీరు మాత్రం భిన్నంగా ఆలోచించాలి అని మెదడుకి చిరుసూచన అందజేయండి చాలు.
భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టాక హఠాత్తుగా మెదడులో మెరుపు మెరిసిన ఫీలింగ్ మీకే తెలుస్తుంది. వెంటనే ఆ మెరుపును మెరుపులాటి ఐడియాకు ఏకాగ్రతతో ఆలోచించి అవగాహన చేసుకోండి. ఐడియాను అమలు చేయడంలో కష్టనష్టాలు పరిశీలించండి. ఆలోచనలను ఎఫెక్టివ్‌గా ప్రెజెంట్ చేయడం చాలా ముఖ్యం. అద్భుతంగా ఆరంభిస్తే సక్సెస్ సాధించినట్టే అంటారు.
కాబట్టి సరికొత్త మార్గంలో వెళ్ళదలచుకున్నపుడు ఆ మార్గంలో సక్సెస్ సాధించగలమనుకున్నపుడు కష్టనష్టాల గురించి ముందే అవగాహన చేసుకున్నపుడు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ చేయాలి.

- పి.ఎం. సుందరరావు 9490657424