మెయన్ ఫీచర్

సంకీర్ణంలో సంక్షోభం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలకు ముందు పొత్తులు పె ట్టుకోవడం, ఎన్నికల తర్వాత మనసు మార్చుకోవడం, మరో సంబంధం వెతుక్కోవడం కొత్త విష యం కాదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కం డువాలు మార్చినంత సులభంగా పార్టీలు మారుస్తుంటే, పార్టీలు సైతం అదే రీతిలో పొత్తుల విషయంలో ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత తమదైన ఫార్ములాను ఫాలో అవు తున్నాయి. మహారాష్ట్ర విషయానే్న తీసుకుంటే బీజేపీ - శివసేన ఒక కూటమిగా, కాంగ్రెస్-ఎన్సీపీ మరో కూటమిగా ఎన్నికలలో పోటీ చేశాయి. ప్రజలు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్న విధంగా కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిని ప్రతిపక్షంలో కూర్చోమని ఆదేశించారు. బీజీపీ-సేన కూటమికి మరో ఐదేళళు బుద్ధిగా పాలించమని అధికారం అప్పగించారు.
రెండు కూటములు, నాలుగు పార్టీలు ప్రజా తీర్పును శిరోధార్యంగా భావించి ఉంటే, ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఇప్పుడున్న ప్రతిష్టంభన ఏర్పడేది కాదు. అదొక ప్రహసనంగా మారేది కాదు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక శివసేన 50-50 ఫార్ములాను తెరపైకి తెచ్చింది. ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళళు పంచుకోవల్సిందే అని పట్టుపడుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజీపీ అధ్యక్షుడు అమిత్ షాతో జరిగిన చర్చలలో ఈ మేరకు అంగీకారం కుదిరిందని శివసేన గుర్తు చేస్తోంది. బీజేపీ ససేమిరా అంటోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేవేంద్ర ఫడ్నవిస్ పేరును తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి, ప్రజాతీర్పు కోరిన విషయాన్ని బీజేపీ గుర్తు చేస్తోంది. ఫడ్నవిస్ ఐదేళళు ముఖ్యమంత్రిగా ఉంటారని బీజేపీ తేల్చి చెప్పేసింది. ముఖ్యమంత్రి పదవి విషయంలోనే కాదు, హోం శాఖ సహా నాలుగు కీలక శాఖలు విషయంలోనూ ఉభయ పార్టీల మధ్య తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానగా మారి ప్రభుత్వ ఏర్పాటును ప్రశ్నార్థకంగా మార్చివేసింది.
రాజకీయ పార్టీల మధ్య పొత్తులు, ఎత్తులు కొత్త కాదు. మన దేశంలో పొత్తులు పెట్టుకోని పార్టీ మచ్చుకు ఒక్కటైనా లేదు. 2014కు ముందు సుమారు మూడు దశాబ్దాలపాటు దేశంలో కొనసాగిన సంకీర్ణ యుగంలో అయితే, చిత్ర విచిత్రమైన పొత్తులు ఎన్నో చూశాం. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వామపక్ష కూటమి 62 స్థానాలు గెలిచింది. అందులో అత్యధిక స్థానాల్లో కమ్యూనిస్టుల ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీ. అయినా, ‘ గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ’ అన్న నిందను నిజం చేస్తూ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఎ ప్రభుత్వానికి వామపక్ష కూటమి బయటినుంచి మద్దతు ఇచ్చింది. స్పీకర్ పదవిని తీసుకుంది. అనేక నామినేటెడ్ పదవుల్లో వామపక్ష నాయకులు, మేధావులు నాలుగేళళు అధికారాన్ని అనుభవించారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్, ఫలితాలు వచ్చాక ఎన్డీఎలోకి దూకేశారు, వాజపేయి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్రను పోషించారు. ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి.
మహారాష్ట్ర విషయానికి వస్తే, కాషాయ కూటమిగా పేర్కొనే బీజీపే,శివసేనల మధ్య ప్రణయ కలహాల వంటి చిరు తగవులు కొత్త కాదు. గతంలో ఇటు అటల్జీ, అద్వానీ, అటు బాలా సాహెబ్ థాకరే వంటి సర్వోన్నత నేతలు నాయకత్వ స్థానంలో ఉన్నపుడు కూడా రెండు పార్టీల మధ్య విభేదాలు వస్తూ పోతూ ఉండేవి. భావసారూప్యత రెండు పార్టీలను కట్టిపడేసింది. 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీని ఎన్డీఎ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడంలో బీజేపీలో కొందరు అభ్యతరాలు వ్యక్తం చేశారు, బాలాసాహెబ్ థాకరే మాత్రం మోదీని గట్టిగా సమర్ధించారు. గోద్రా మారణకాండ అనంతరం గుజరాత్ లో అల్లర్లు చెలరేగినప్పుడు, అనేక కోణాల్లో అనేక మంది మోదీని విమర్శించిన సమయంలోనూ థాకరే గుజరాత్ పులిగా మోదీని అభివర్ణించారు. అదే థాకరే కొన్ని సందర్భాలలో బీజేపీని, మోదీని విమర్శించారు. శివసేన పత్రిక ‘సామ్నా’ సంపాదకీయాల్లో తమ అభిప్రాయలను బలంగా వినిపించారు. థాకరే శకం ముగిసిన అనంతరం కూడా, బీజీపీ, శివసేనల మధ్య శత్రు,మిత్ర సంబంధాలు సమాంతరంగా సాగుతూనే ఉన్నాయి. ప్రస్తుత వివాదం ప్రారంభంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఇరు పార్టీల సంబధాలను చాలా సింపుల్‌గా, ‘బ్లో హాట్ ..బ్లో కోల్డ్’ అనే ఓ చిన్న ఇంగ్లిష్ సామెతలో చుట్టేశారు. కాషాయ కూటమి మధ్య ప్రణయ కలహాలే గాని ప్రళయ కలహాలకు తావు లేదన్నారు. ఇప్పుడు అదే రౌత్ స్వరం మారింది. ఇప్పటికైనా బీజేపీ ‘తలబిరుసు’ తగ్గించుకోవాలనే వరకు రౌత్ వెళ్లారు. రాజకీయ పరిశీలకులు మాత్రం ఇప్పటికి కూడా చివరాఖరుకు కాషాయ కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఫడ్నవిస్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని, ఐదేళళు పదవిలో కొనసాగుతారని గట్టిగా విశ్వసిస్తున్నారు .ఐదుసంవత్సరాల క్రితం ఇరు పార్టీలు విడి విడిగా పోటీ చేసినా, చివరకు ఒకటిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కొట్టుకుంటూ తిట్టికుంటూ అయినా ఐదేళళు సంకీర్ణ ప్రభుత్వం చక్కగా సాగిపోయింది. ఈసారి కలిసి పోటీ చేశారు, కలిసే ఉంటారు.. అని విశే్లషకులు పేర్కొంటున్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితి గతానికి కొంత భిన్నంగా కనిపిస్తోంది. ఒకప్పుడు రాష్ట్రంలో పెద్దన్న పాత్రను పోషించిన శివసేన ఇప్పుడు కేంద్రంలోనే కాదు, రాష్ట్రంలోనూ జూనియర్ పార్టనర్‌గా సర్దుకుపోక తప్పడం లేదు. ఇది కొంచెం కష్టంగానూ మారింది.మరో ఐదేళళు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగితే, శివసేనకు జూనియర్ పార్టనర్ స్థాయి కూడా మిగలదేమో అన్న అనుమానం లాంటి భయం కూడా శివసేన నాయకత్వం మంకు పట్టుకు కారణంగా కనిపిస్తోంది. ఇటీవల కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే చేసిన ప్రసంగంలో ఈ బాధ తొంగి చూసింది. ‘ఒకే వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో పాతుకు పోవడం మంచిది కాదు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన మనసులోని బాధను బహిర్గతం చేసింది. దీపావళికి ముందు ఫండవీస్ ఐదేళళు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, శివసేన కోరుకుంటున్న నాలుగు కీలక శాఖల్లో ఏ ఒక్కటీ వదులుకునేది లేదని చేసిన వ్యాఖ్యలను కూడా ఉద్ధవ్ తప్పు పట్టారు. ఫడ్నవిస్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాతనే బీజేపీ- శివసేన మధ్య చర్చలు ఆగిపోయాని ఉద్ధవ్ థాకరే ఆగ్రహం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఆయన హావభావాలు, మాట్లాడిన తీరు గమనిస్తే శివసేనను బీజేపీ భయం కంటే ఫడ్నవీస్ భయం ఎక్కువగా వెంటాడుతోందా? అన్న అనుమానం బలపడుతోంది. బీజేపీ మాత్రం ఫడ్నవీస్ విషయంలో వెనుకంజ వేసేది లేదని తేల్చి చెప్పింది. అదే శివసేనకు గొంతు దిగడం లేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి ఇష్టం ఉన్నా లేకునా బీజేపీ, శివసేన పార్టీలకు ఒకరి అవసరం మరొకరికి ఉంది. ఈ పరిస్థితుల్లో కలిసి కాపురం చేయడం మినహా మరో మార్గం ఏ ఒక్కరికీ లేదు. శివసేన ఎంతగా బెట్టు చేసినా, బింకాలు పలికినా బీజీపీ చేయివదిలితే ఆ తర్వాతి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని విషయం కాదు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఒకప్పుడు విశ్వసనీయ మిత్ర పక్షంగా మెలిగిన తెలుగుదేశం పార్టీ, బీజీపీతో చెలిమి కాదని, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్న ప్రతిసారీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికలకు ముందు కమలంతో కయ్యానికి దిగి, కాంగ్రెస్ పంచన చేరిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తప్పయిపోయిందని చెంప లేసుకునే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఏదో విధంగా బీజేపీతో దోస్తీ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. బీహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సార థ్యంలోని జనతా దళ్ కమలానికి కటీఫ్ చెప్పి, కాంగ్రెస్, ఆర్‌జేడీతో కూటమి కట్టి ఎన్నికల్లో గెలిచి కూడా చివరకు మళ్ళీ బీజేపీతోనే చేతులు కలపక తప్పలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వం మూడు నాళ్ళ ముచ్చటగానే ముగిసిన ఉదంతం కళ్ళముందు కనిపిస్తోంది. నిజానికి ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోని పారీవెవేగౌడ ప్రభుతాన్ని కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి పుటుక్కున వెనక్కి లాగేసుకుంది. అందుకే, ఇప్పడు రెండోసారి దెబ్బతిన్న నేపథ్యంలో కావచ్చు జేడీఎస్ అధ్యక్షుడు, మాజే ప్రధాని దేవెగౌడ మళ్ళీ కాంగ్రెస్ తో చేతులు కలిపి తప్పు చేశామని, మరో నెల రోజుల్లో జరిగే 15 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో ఇక ఆ పార్టీతో పొత్తు ఉండదని ప్రకటించారు. మరో వంక ఆయన కూడా బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.
శివసేన ఎన్ని చిందులు వేసినా, శివ తాండవమే చేసినా బీజేపీ చేయి వదిలితే మనుగడ సాగించడం కష్టం అనే విషయం తెలియనిది కాదు. బీజేపీకి శివసేన అవసరం ఎంతుందో... శివసేనకు బీజేపే అవసరం అంతే ఉంది. ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన ముందుకు వస్తే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ (కర్ణాటకలో కుమారస్వామికి ఇచ్చినట్లు కావచ్చు) ప్రకటించినా, ఉద్ధవ్ థాకరే తొందరపడటం లేదు. ఓ వంక బీజీపీ పై వత్తిడి పెంచే ప్రయత్నాలు సాగిస్తూనే మరో వంక పొత్తు చెడకుండా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. ఉద్ధవ్ మెల్ల మెల్లగా మెత్తపడుతునట్లుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో పట్టుపట్టబోమని సంకేతాలు ఇచ్చారు. మరో వంక, థాకరే ఫ్యామిలీ నుంచి చట్టసభలో అడుగుపెతున్న తొలి ఎమ్మెల్యే, కాలం కలిసొస్తే ఏకంగా ముఖ్యమంత్రి పదవికే ఎగబాకాలని ఆరాటపడుతున్న ఆదిత్య థాకరే.. ప్రభుత్వం ఏర్పాటు విషయాన్ని తన తండ్రి ఉద్ధవ్ థాకరే చూసుకుంటారని తప్పించుకున్నారు. అదే సమయంలో సంజయ్ రౌత్ మాత్రం- తాను లేస్తే మనిషిని కాదన్న విధంగా వ్యవహరిస్తున్నారు. అదుపుతప్పి ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక వ్యూహం ప్రకారం శివసేన ఆడుతున్న నాటకమని అం దరికీ తెలిసిపోయింది. అందుకే బీజేపీ కూల్‌గా ఫడ్నవిస్‌ను తమ పార్టీ శాసన సభా పక్ష నేతగా ప్రకటించి, బంతిని శివసేన కోర్టులో వదిలింది. ఇప్పుడు అటో ఇటో తేల్చుకోవలసిన బాధ్యత శివసేనపైనే ఉంది.
శివసేనకు మద్దతు ఇవ్వడానికి కాం గ్రెస్ అధిష్ఠానం ఓకే చెప్పగానే పార్టీలో చిచ్చు మొదలైంది. శివసేన ఎమ్మె ల్యేలలో కూడా సగం మంది కంటే ఎక్కువ మంది కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు ససేమిరా అంటున్నారు. మరోవంక ఎన్సీపీ అధినేత శరద్ పవార్- ప్రజాతీర్పును గౌరవించి ప్రతిపక్షంలో కూర్చుంటామని కుండబద్దలు కొట్టారు. పవార్ మాట మార్చరని కాదు. కానీ, మొన్నటి ఎన్నికల్లో ఒక విధంగా పునర్జన్మ ఎత్తిన ఎన్సీపీ ఇంతలోనే తప్పుడు నిర్ణయం తీసుకుని మళ్ళీ మరోసారి మనుగడ కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటుందని, పవార్ లాంటి ఉద్ధండ పిండం అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటారని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే అవుతుంది. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే, ఏదైనా జరవచ్చును.
సోనియా నాయకత్వాన్ని ప్రశ్నించి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్న పవార్ అదే కాంగ్రెస్‌తో జట్టు కట్టారు. పొత్తులు ఉండవని పంచముడిలో మడి కట్టుకున్నది కాంగ్రెస్ పార్టీనే. రాజకీయాలలో అంటరానితనం పనికిరాదని సంకీర్ణ సర్కార్ స్టీరింగ్ పుచ్చుకుంది. ఎన్ని వంకర్లు పోయినా చివరకు అన్ని పాపాలను పునీతం చేసే రాజకీయాలలో శాశ్వత శత్రువులు. శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి ఎటూ ఉండనే ఉంది. మహా నాటకంలో రేపు ఏమైనా జరగవచ్చు. కొయ్య గుర్రం ఎగరావచ్చు.. కాదంటే.. ప్రస్తుత అసెంబ్లీ గడవు ముగిసే 8 వ తేదీ నాటికీ ఇదే ప్రతిష్టంభన కొనసాగితే.. రాష్ట్రపతి పాలన అనివార్యం అవుతుంది. ఏదైనా మరో మూడు నాలుగు రోజుల్లో మహా నాటకానికి శుభం కార్డు పడుతుంది.

-రాజనాల బాలకృష్ణ 99852 29722