మెయిన్ ఫీచర్

ఇంట్లోనే కాదు.. అంతరిక్షంలోనూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటివరకు 221
స్పేస్‌వాక్‌లు జరగ్గా ఇది మొట్టమొదటి మహిళా స్పేస్‌వాక్. ఈ స్పేస్‌వాక్‌ను
విజయవంతంగా చేసి, చరిత్ర సృష్టించినందుకు క్రిస్టీనా, జెస్సికాలను
ప్రపంచం మొత్తం పొగడ్తలతో ముంచెత్తుతోంది.

మహిళ అంటే..
ఇంటికి మహాలక్ష్మి.. ఇంటిని అందంగా తీర్చిదిద్దుతుంది.. పిల్లల్ని కంటుంది.. ప్రేమగా పెంచుతుంది.. అంతేకాదు.. అందమైన మోడల్‌గా మారుతుంది.. ఉద్యోగ బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తుంది.. అంతరిక్షానికి వెళుతుంది.. స్పేస్ వాక్ చేస్తుంది.. పురుషునితో సమానంగా అన్ని పనులను చేస్తుంది.. రాజకీయాల్లోనూ, ఆర్థిక విషయాల్లోనూ.. ఇలా ఒకటేమిటి.. అన్నింటిలోనూ పురుషుడితో సమానంగా ముందడుగు వేస్తుంది. అలాంటి మహిళ నేడు మరో అడుగు ముందుకేసి చంద్రమండలంలో స్పేస్‌వాక్ చేసి చరిత్రాత్మకం చేశారు. వారే క్రిస్టీనా కోచ్, జెస్సికా మెయిర్. వీరిద్దరూ మహిళా వ్యోమగాములు. క్రిస్టీనా కోచ్‌కు నలభై సంవత్సరాలు. జెస్సికా మెయిర్‌కు 42 సంవత్సరాలు. వయసులో జెస్సికా పెద్దదే అయినా అనుభవం మాత్రం క్రిస్టీనాకే ఎక్కువ. ఇదివరకు సోయుజ్ వ్యోమనౌకలో నాలుగుసార్లు అంతరిక్ష యాత్రలు చేసి పురుషులతో కలిసి స్పేస్‌వాక్‌లోనూ పాల్గొన్న అనుభవం ఉంది క్రిస్టీనాకు. జెస్సికాకు మాత్రం ఇదే మొదటి స్పేస్‌వాక్. వీరిద్దరిదీ అమెరికానే. ఇద్దరూ 2013లో నాసాకు ఎంపికయ్యారు. క్రిస్టీనా నార్త్ కెరోలినా స్టేట్ యూనివర్శిటీలో ఉన్నత చదువును పూర్తిచేసింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఫిజిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ చదివింది. తన తోటి వ్యోమగామి రాబర్ట్ కోచ్‌ను వివాహం చేసుకుంది. జెస్సికా బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి ఫిజియాలజిస్ట్‌గా డిగ్రీ అందుకుంది. ఈమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. రోదసీ అంటే మరీ పిచ్చి. అందుకే ఆ వైపు అడుగులు వేసి ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్శిటీ నుంచి స్పేస్ స్టడీస్‌లో పీజీ పూర్తిచేసింది. సముద్ర విజ్ఞానానికి సంబంధించి స్క్రివ్స్ ఇనిస్టిట్యూట్ నుంచి మెరైన్ బయాలజీలో డాక్టరేట్ పట్టా కూడా పొందింది జెస్సికా.
గత శుక్రవారం నాసా చేపట్టిన మొదటి ‘ఆల్ విమెన్ స్పేస్ వాక్’లో పాల్గొన్నారు వీరు. ఇంట్లోలాగే అంతరిక్షంలో అయినా మనిషి లేకుండా యంత్రాలు నడవాలంటే విద్యుత్ అవసరం. స్పేస్ స్టేషన్‌లోని సిస్టమ్స్ ఏవైనా కూడా సౌర విద్యుత్‌తోనే నడుస్తుంటాయి. వీటికి మూలాధారం డిశ్చార్జ్ యూనిట్‌లోని లిథియమ్ అయాన్ బ్యాటరీలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉపరితలంపై ఈ బ్యాటరీలతో కూడిన డిశ్చార్జి యూనిట్ ఉంటుంది. ఈ అక్టోబర్ 11న కొత్త లిథియమ్ బ్యాటరీలను అమర్చగా వాటిలో ఒకటి చెడిపోయింది. దీనివల్ల ఇప్పటికప్పుడు వచ్చిన నష్టమేమీలేకపోయినా.. చెడిపోయిన బ్యాటరీ మిగతా వాటిపై ప్రభావాన్ని చూపి భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందిగా మారవచ్చు. అందుకనే దీన్ని ఉన్నపళంగా మార్చాల్సి వచ్చింది. ఇందుకు క్రిస్టీనా, జెస్సికా అంతరిక్ష కేంద్రం నుండి బయటకు వచ్చి కేవలం అయిదున్నర గంటల్లో పని పూర్తి చేశారు. ఈ ఏడాది మార్చి నుంచి వారు అక్కడే ఉన్నారు. ఈ వీడియోని నాసా ప్రత్యక్ష ప్రసారం కూడా చేసింది. చెప్పడానికి, చూడటానికి ఇది చాలా ఈజీగా అనిపించినా స్వీయ నియంత్రణ ఉండని అంతరిక్షంలో స్పేస్ వాక్ చేయడం అంత సులభంగా కాదని తెలిసిన విషయమే.. మరమ్మతు చేస్తున్నంతసేపూ ఎటువంటి ప్రమాదం ఎదురవుతుందో తెలియదు.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అలాగే మరమ్మతు చేస్తున్నంత సేపూ.. అంటే ఐదున్నర గంటలకు పైగా వీళ్లిద్దరూ ఐఎన్‌ఎన్‌కు బలమైన కెరాబైనర్స్‌తో అనుసంధానమై వేలాడారు.
చాలామంది వ్యోమగాములు స్పేస్‌వాక్ అనేది ఫిజికల్‌గా ఎంతో సవాలుతో కూడుకున్నదని చెబుతారు. కారణం ఇందులో ఏమాత్రం పొరపాటు జరిగినా విగతజీవిగా మారిపోవాల్సిందే.. ఇప్పటివరకు 221 స్పేస్‌వాక్‌లు జరగ్గా ఇది మొదటి మహిళా స్పేస్‌వాక్. అందుకే మొదటి మహిళా స్పేస్‌వాక్‌ను విజయవంతంగా చేసినందుకు ఈ ఇద్దరు అతివలను ప్రపంచం మొత్తం పొగడ్తలతో ముంచెత్తుతోంది. వాస్తవానికి మహిళలతో స్పేస్‌వాక్ ప్రాజెక్ట్ చేయించాలని నాసా ముందస్తు ప్రణాళిక రచించలేదు. పురుష వ్యోమగాములకు ఏమాత్రం తీసిపోని విధంగా మహిళలు కూడా ప్రతిభ చూపుతుండడంతో స్పేస్ స్టేషన్‌లో డిశ్చార్జి యూనిట్ మరమ్మతుకు వారికే ఎందుకు పంపించకూడదు? అనే ఆలోచన నాసా అధికారులకు కలిగిందట. అందుకే భావితరాల మహిళా వ్యోమగాములకు స్ఫూర్తిగా విమిన్ స్పేస్‌వాక్ ప్రాజెక్టును ప్రారంభించి దిగ్విజయంగా ముగించింది నాసా. చరిత్రను తిరగరాసింది.