మెయిన్ ఫీచర్

మానసిక దృఢత్వం ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి సంతోషంగా జీవించడానికి, ఆనందంగా గడపడానికి మానసికంగా దృఢత్వాన్ని ఏర్పరచుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలిపించడానికి ‘వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్’ సంస్థ అక్టోబర్ 10,1992న ఆవిర్భవించింది. ఈ సంస్థ పిలుపుమేరకు అనేక దేశాల్లో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని అక్టోబర్ 10న పాటిస్తున్నాం. ‘కలసి నడుద్దాం ఆత్మహత్యలను నివారిద్దాం’ అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో సంవత్సరానికి 8 లక్షల మంది పైగా, ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్య చేసుకొంటున్నారు. ఇండియాలోఏటా 1,31,663 ఆత్మహత్యలు, తెలుగు రాష్ట్రాలలో 13వేల పై చిలుకు మంది ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపుగా రెండు దశాబ్దాల నుండి ఆత్మహత్యల రేటు పెరుగుతుండడం ఆందోళనకరమైన అంశం.
ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నవారిలో 40 సంవత్సరాలలోపు 80% మంది, ప్రతి 20 మందిలో ఒకరు చనిపోతున్నారని, విషం ద్వారా 36.6% మంది, ఉరివేసుకోవడం ద్వారా 32.1%, ఇతర మార్గాల ద్వారా 7.9% మంది, నేడు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ యువత, ఉద్యోగులు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గణాంకాలు తెలియచేస్తున్నాయి.
ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను చూస్తే ఎవరికైనా విస్మయం కలిగిస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులున్నవారు సైతం ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్, ‘కాఫీ డే’ వ్యవస్థాపకుడు సిద్ధార్థ ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హైదరాబాద్‌లో నడిరోడ్డుపై దారుణ హత్యలు, కత్తులతో దాడులు, తొమ్మిదవ తరగతిలోనే ప్రేమలు చిగురించడం, హత్యలు, ఆత్మహత్యలు, అఘాయిత్యాలు, దారుణాలు, లైంగిక దాడులు, ప్రేమోన్మాదం ఇలా ప్రతి రోజు ఏదో ఒక సంఘటనను మీడియాలో చూస్తూనే ఉన్నాము.
జీవితంలో తిరిగి పొందలేనివి రెండే రెండు అవే ఒకటి కాలం, రెండోది ప్రాణం. క్షణికావేశంతో తీసుకొనే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఆత్మహత్యలకు పురిగొల్పుతాయి. మనపై ఆధారపడిన, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిలించడం భావ్యమా? జీవితంపై సరైన అవగాహన, దృక్పథం లేకపోవడం మూలంగా ఆత్మహత్య ఆలోచనలు మదిని తొలచివేస్తూ ఉంటాయి. సమస్యలకు పరిష్కారమే లేదని భావిస్తున్నారు. ఒక్క క్షణం సానుకూలంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం కళ్లముందు కనిపిస్తుంది.
ఆత్మహత్య భావన కలగడానికి కారణాలు
ఆత్మహత్యలకు ఎన్నో కారణాలు ప్రధానంగా మారుతున్న కాలానుగుణంగా మారలేకపోవడం, తనపై తనకు నమ్మకం సన్నగిల్లడం, ఆత్మన్యూనత, జీవితంలో ఎదురయ్యే సంఘటనలు ఎదుర్కోవాలనే ఆలోచనలు తక్కువ కావడం, ప్రతి దానికి ఇతరులతో తమనుతాము పోల్చుకుని ఆత్మన్యూనతతో భావనలను కలిగి ఉండడం, ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించి అతిగా ఆలోచిస్తూ బాధపడడం, కొన్ని సంఘటనలు జరుగుతాయని భావించి అనవసరమైన విషయాలను ఊహించుకుని భయపడడం, సామాజిక అంశాలు కూడా ఒక్కోసారి ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంటాయి. ఆత్మహత్యలకు పాల్పడే వారిలో ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరిగిన ఆర్థిక నష్టం భరించలేక, ఉద్యోగం సాధించటంలో వైఫల్యం పొందినవారు, భౌతిక, లైంగిక వేధింపులకు గురికావడం, కుటుంబ సామాజిక సంబంధాల లోపం, సమాజంలో స్థాయికోంస శక్తికి మించి పనులు చేయడం, వృద్ధాప్యంలో నిరాదరణకు గురికావడం, ప్రేమలో వైఫల్యం పొందడం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, మానసిక వేదనతో, ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు అనిపించినవారు, సమాజంలో పరువుపోతుందన్న భయంతో బాధపడుతున్నవారు, చదువులో వెనుకబడినవారు, తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చలేక పోతున్నామనుకునేవారు, మత్తుమందులు, మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారు బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నవారు, పెద్దవారిలో అయితే కుటుంబ, ఆస్తి తగాదాల కారణంగా వివాహేతర సంబంధాలున్నవారు, దంపతుల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం లేక అనుమానించుకునే వారు, లక్ష్యనిర్దేశనలో వైఫల్యం ఇలా పలు కారణాలు ఉన్నాయి.

ముందుగా గుర్తించగలమా?
ఆత్మహత్యకు పాల్పడే ముందుగా వీరిలో కొన్ని మార్పులు గమనించవచ్చు. ఒంటరితనానికి ఇష్టపడటం, మద్యం అతిగా సేవించటం, ప్రతీకారం తీర్చుకోవడం గురించి ఎక్కువగా మాట్లాడటం, తీవ్ర మానసిక ఒత్తిడిని ప్రదర్శించడం, అతిగా నిద్రపోవడం, రాత్రి సమయంలో నిద్రపోకుండా అతిగా ఆలోచించడం, అనవసర విషయాల పట్ల అతిగా స్పందించటం, అసలు స్పందించక పోవటం, చనిపోతున్నానని ముందుగానే పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి చేష్టలను ముందుగానే స్నేహితులు, కుటుంబ సభ్యులు పరిశీలించి సైకాలజిస్ట్‌ను సంప్రదించడం ద్వారా కౌనె్సలింగ్, సైకాలజికల్ థెరపీ ద్వారా కొంతవరకు ఆత్మహత్య ఆలోచనలను నివారించవచ్చు.
భారత్‌దే అగ్రస్థానం
ఆత్మహత్యల్లో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతీ 40 సెకన్లకు ఒక ఆత్మహత్య జరుగుతుండగా, మన దేశంలో ప్రతి రెండు నిమిషాలకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో 15 నుంచి 29 ఏళ్లలోపు వారే ఎక్కువ కావడం, మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి.

సామాజిక చైతన్యం తీసుకువద్దాం
ఆత్మహత్యను అడ్డుకోవడంలో కలిసి పనిచేయడం చాలా కీలకమైంది. ఆత్మహత్య ఆలోచనలను అడ్డుకోవడం, ఆత్మహత్యల నివారణలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు, సమాజంలోని విద్యావేత్తలు, మత నాయకులు, ఆరోగ్య నిపుణులు, రాజకీయ నాయకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషి చాలా అవసరం.
సామాజిక బాధ్యతగా గుర్తించాలి
ఆత్మహత్యకు బాధపడుతున్న వారు స్వయంగా సహాయం కోరుకునే అవకాశం లేదు, కాబట్టి తల్లిదండ్రులు, ఇంటి ఆవరణలోని మిత్రులు, పాఠశాల లేదా కాలేజి ఉపాధ్యాయులు, బంధువులు, సహచరులు ఆత్మహత్యకు హెచ్చరిక సూచనలు గ్రహించి ముందుగా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆత్మహత్యకు పాల్పడే చర్యలను గుర్తించినపుడు వారికోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం. చావు ద్వారానే సమస్యకు పరిష్కారం అసాధ్యమనే విషయాన్ని గుర్తింపచేయాలి. జీవిత విలువలను గుర్తింపచేసే విధంగా ప్రేరణ కల్పించాలి. అభయ హస్తం అందించాలి. ఒంటరిగా ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి సంభాషణను కొనసాగించేలా చర్యలు ఉండాలి. సైకాలజిస్ట్‌ను కూడా స్నేహితులుగా గుర్తించి తగు సలహాలు సూచనలు తీసుకొనే విధంగా ప్రోత్సహించాలి.

-డా. ఆట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321