మెయిన్ ఫీచర్

జయజయహే జగదంబే!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సురవర వర్షిణి, దుర్ధరధర్షిణి, దుర్ముఖిమర్షిణి హర్షరతే, త్రిభువన పోషిణి శంకర తోషిణి, కల్మషమోచని ఘోరరతే దనుజ నిరోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధునుతే... జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే...’’- మహిషాసుర మర్దినీ నమస్తే నమస్తే అంటూ అందరిచేత స్తుతించబడే అమ్మనే సర్వశక్తిమయ. సర్వమూ శక్తి మయమే అని అమ్మను దుర్గమ్మగా శరన్నరాత్రులలోని మహాపర్వదినాలలో శక్తి ఉపాసనచేస్తారు. అందులో త్రిరాత్రవ్రతమని సరస్వతి పూజను సప్తమినాడు, అష్టమి నాడు దుర్గను, నవమి నాడు లలితా పరమేశ్వరి, రాజరాజేశ్వరి దేవిని పూజిస్తారు. అష్టమి తిథినాడు దుర్గమాలను అధిగమింపచేసి దుష్కర్మలనుంచి రక్షించి దుఃఖాలను దరి చేర కుండా చూసే దుఃఖహంత్రి అయన ఆది పరాశక్తిని దుర్గగా పూజిస్తారు. ఈ అష్టమిని దుర్గాష్టమీగా కీర్తిస్తారు. దురాచారాల బారిన పడ కుండా దుర్నీతికి పాల్పడకుండా సదా రక్షించే అమ్మ నే దుర్గమ్మ. నవవిధబాధలనుంచి రక్షిస్తుంది కనుక త్రిపురసుందరీగాను, లోకోత్తరమైన సౌందర్యంతో అలరారుతూ ఎల్లపుడూ చిరునవ్వును చిందిస్తూ భక్తుల మనస్సును ఆహ్లదపరుస్తుంది కనుక లలితా పరమేశ్వరీ గాను పూజించడం సదాచారం. మహర్న మినాడు అమ్మను స్తుతించినవారికి సకల వ్యాధుల బారినుండి కాపాడి సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది, అపమృత్యువును పోగొడుతుంది, పరిపుష్టికరమైన ఆహారాన్నిస్తుంది, ఆధ్యాత్మిక విజ్ఞానాన్నిచ్చి, మనిషిలోని దైవీశక్తిని పెంపొందిస్తుంది. దశవిధ దురాచారాలను దుర్వ సనాలను దూరం చేసి అన్నింటా విజయాన్నిస్తుంది కనుక అపరాజితా దేవిగా కూడా అమ్మను పూజిస్తారు. అందులో భాగంగా విజయదశమి రోజు సీమోల్లంఘనం అనే కార్యక్రమాన్ని చేస్తుంటారు. దీనికి ముందు అపరాహ్ణంలో గ్రామానికి ఈశాన్య దిక్కుగా వెళ్లి, అచట పరిశుభ్రమైన ప్రదేశం ఎంచుకొని భూమిని అలికి చందనాదులతో అష్టదళ పద్మం వేసి- ‘‘మమ సకుటుంబస్య క్షేమ సిద్ధ్యర్థం అపరాజితా పూజనం కరిష్యే’’ అంటూ సంకల్పం చేసుకొని ఆ పద్మం మధ్యలో ‘అపరాజితాయై నమః’ అంటూ ఆ దేవిని ఆవాహనం చేసి ఆమెకు దక్షిణంగా ‘క్రియా శకె్తై నమః’ అని జయాదేవి నీ మాయై నమః అని విజయాదేవిని ఆవాహనం చేసి, ‘అపరాజితాయై నమః జయాయై నమః, విజయాయై నమః’ అను మంత్రములతో పూజలు చేస్తారు.
పూజాదులు చేయలేకపోయినవారు పై నామాలు చదివినా శుభం కల్గుతుందని శాస్త్రం. ప్రయాణ సమయాలలో ఈ నామాలు పఠించినచో విజయం లభిస్తుంది. ఈ అపరాజితాదేవిని క్షత్రియులు దశమినాడు పూజించుట ఆచారమని శాస్త్ర ప్రవచనం. ‘‘నవమీ శేషం యుక్త- దశమ్యామ పరాజితా
దదాతి విజయం దేవీ- పూజితా జయవర్థనీ’’ అని పురాణ సముచ్చయంలో ఉంది. పూర్తి నవమినాడుగానీ, నవమీ శేషంగల దశమినాడుగాని అపరాజితను పూజించడం వలన విజయం సిద్ధింపగలదని భావం. ఈ దేవిని ప్రార్థించి పసుపు గుడ్డ పేలికలో గరిక- ఆవాలు కట్టి- గుండ్రంగా ఉంచి, ఓ దేవీ! నీవు లతలో ఉత్తమ సంజాతవు. సకలార్థ సిద్ధికోసం నిన్ను ధరించుచున్నానంటూ దీనిని శరీరానికి కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల సుసంపన్నమైన ఆరోగ్యం లభిస్తుందని అంటారు. అంతేకాక చేసే అన్ని మంచిపనులకు సత్ఫలితాలు ఏర్పడుతాయని కూడా పెద్దలు చెబుతారు. కనుక ఏదోఒక విధంగా శరన్నవరాత్రుల్లో అమ్మను తలవడం, స్మరించడం, మానత్వాన్ని పెంచుకోవడం చేస్తే అమ్మ అపారమైన కరుణ అందరిపైన వర్షిస్తుంది. అందుకే అమ్మనామ పారాయణాప్రీత కనుక అమ్మను తలుద్దాం.అమ్మ కరుణకు పాత్రులమవుదాం.

- చివుకుల రామమోహన్