మెయిన్ ఫీచర్

నిద్ర లేవగానే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యంపై అవగాహన, బాధ్యతను కలిగి ఉండాలి. ఆరోగ్యంగా ఉండటానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. అందుకు యోగా బాగా ఉపయోగపడుతుంది. యోగాను మొదలుపెట్టి ఒక నెలో, రెండు నెలలో ప్రాక్టీస్ చేసి ఆపేస్తుంటారు. తర్వాత ఐదు, ఆరు నెలలు బ్రేక్ తీసుకుని తిరిగి ప్రారంభిస్తుంటారు. రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే పరగడుపున యోగాను ప్రాక్టీస్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రోజూ యోగసాధన చేయడం వల్ల శరీరంలో చాలా రకాల మార్పులు వస్తాయి. యోగ అనేది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు, దీనివల్ల ఆస్త్మా, వెన్నునొప్పి, ఇతర శ్వాస సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. అందుకే నిద్ర లేచిన వెంటనే కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల రోజంతా చాలా ఆనందంగా ఉండి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. అవేంటో తెలుసుకుందాం..
నటరాజ ఆసనం
ఇది స్పైనల్ ఫ్లెక్సిబులిటీకి, జీర్ణవ్యవస్థకు చాలా మంచి ఆసనం. నిద్ర లేచిన వెంటనే చేయాల్సిన ఆసనం ఇది. అద్భుతమైన నాట్యంతో తాండవం చేసే శివునికి మరో పేరు నటరాజు. అలాంటి నాట్య ముద్రలను పోలి ఉంటుంది కాబట్టే ఈ ఆసనానికి నటరాజాసనం అన్న పేరు వచ్చింది. ముందుగా చాపపై వెల్లకిలా పడుకోవాలి. తరువాత రెండు కాళ్ళను నెమ్మదిగా మడవాలి. పాదాలు హిప్ వరకు వచ్చే వరకూ మోకాళ్లు మడవాలి. తర్వాత రెండు చేతులను ఎంతవరకు సాధ్యమైతే అంతవరకూ చాపాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుని.. నెమ్మదిగా బయటకు వదలాలి. తలను ఎడమవైపుకు తిప్పినప్పుడు కుడి భుజం చూడాలి. తలను ఎడమవైపునకు తిప్పినప్పుడు కుడి భుజం చూడాలి. ఇలా ఎన్నిసార్లయనా తీసుకోవచ్చు. ఇది ఊపిరితిత్తులకు మంచి వ్యాయామం. పెద్దపేగులకు మంచి ప్రయోజనం. పరగడుపున చేయడం జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మెదడు, శరీరం రెండూ విశ్రాంతిని పొందుతాయి. తద్వారా రోజంతా చురుగ్గా ఉండగలుగుతారు.
సుఖాసనం
సుఖాసనం అన్నిటికన్నా తేలికైన ఆసనం. పేరులోనే ఇది ఎంత ఇష్టమైన ఆసనమో తెలుస్తుంది. దీనిని ఏ వయసు వారైనా వేయవచ్చు. సుఖాసన యోగా భంగిమ చాలా సులభంగా కూర్చునే భంగిమ. ఈ భంగిమలో చాపపై కూర్చుని కాళ్ళను తిన్నగా ముందుకు చాపాలి. తరువాత కాళ్ళను మడిచి భోజనం చేసే పద్ధతిలో కూర్చుని వెనె్నముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఓపికను అనుసరించి ఎంతసేపైనా ఈ ఆసనం వేయవచ్చు. భుజాలను చక్కగా ఉంచి సౌకర్యంగా ఉన్నంతసేపు ఈ భంగిమలో కూర్చోవాలి. ఇది మనసుకు ఉపశమాన్ని కలిగిస్తుంది. శరీర కదలికలను మెరుగు పరుస్తుంది.
నది శోధన ప్రాణాయామం
ఆల్టర్నేట్ నాజల్ బ్రీతింగ్ ప్రాణాయామం వల్ల శ్వాస సంబంధ సమస్యలను దూరం చేసుకోవచ్చు. శరీరంలోని కండరాలకు, ఊపిరితిత్తులకు మంచి శక్తి లభిస్తుంది. ఈ ఆసనం శరీరాన్ని ఉత్తేజపరచడమే కాకుండా నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పద్మాసనంలో కూర్చుని శ్వాసపై ఏకాగ్రత పెట్టాలి. కొన్ని నిముషాలు సాధారణ శ్వాస తీసుకోవాలి. తర్వాత గయన్ ముద్రతో కుడి లేదా ఎడమ చేయి చూపుడు వేలుతో బొటనవేలును కలుపుతూ మిగిలిన వేళ్లు దూరం ఉంచి ముక్కును పట్టుకోవాలి. రెండు ముక్కు రంధ్రాల నుండి ఒకదాని తర్వాత ఒకటి గాఢంగా శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి. అయితే ఒక రంధ్రం తెరుచుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా రెండవదాన్ని మూసేయాలి. ఇలా తీసుకున్న శ్వాసను కాసేపు అలాగే ఉంచి పొట్టను బిగపట్టాలి. తరువాత నెమ్మదిగా శ్వాసను వదలాలి. ఇలా చేయడం వల్ల శ్వాస వ్యవస్థ చాలా ఆరోగ్యంగా ఉంటుంది.
బాలాసనం
ఆ ఆసనం వల్ల శరీరంలోని ఒత్తిడి చిటికెలో బయటకు వెళ్లిపోతుంది. నేలపై కూర్చుని నడుమును వెనక్కు నెట్టి కూర్చోవాలి. తరువాత రెండు చేతులను ముందుకు పూర్తిగా చాపాలి. ఈ దశలో శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి తీసుకోనివ్వాలి. శ్వాసపైనే ఏకాగ్రతను ఉంచాలి. ఈ భంగిమలో కొన్ని నిముషాల పాటు ఉండాలి. ఈ ఆసనం ఒత్తిడిని దూరం చేయడమే కాకుండా నడుము, తొడలు, చీలమండలంను కొద్దిగా సాగదీసి, మెదడును శాంత పరిచి, అలసటను దూరం చేస్తుంది. రక్తప్రసరణ కూడా బాగా మెరుగుపడుతుంది.
భుజంగాసనం
భుజంగం అంటే పాము. ఈ ఆసనం పాము పడగ విప్పడానికి పైకి లేచినప్పుడు ఉండే ఆకారాన్ని పోలి ఉంటుంది. రెండు కాళ్ళను దగ్గరగా వెనక్కి చాపి బోర్లా పడుకోవాలి. చేతులను ఛాతి దగ్గర ఉంచి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వీలైనంత వరకూ నడుము భాగం వరకు శరీరాన్ని పైకి లేపి వెనక్కి వంచాలి. ఇప్పుడు సాధారణ శ్వాసతో ప్రశాంతంగా వెన్నుపై దృష్టి పెట్టి ఈ స్థితిలో 20 సెకన్లు ఉండాలి. ఆ తర్వాత శ్వాస వదులుతూ నెమ్మదిగా ఛాతి, తల నేలకు ఆనించి పూర్వస్థితికి రావాలి. ఇది వెన్నునొప్పితో సహా ఇతర నడుము నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. నాడీ మండలం ఉత్తేజితమై స్ట్రెస్ దూరమవుతుంది. ఛాతి కండరాలు, వెన్ను బలంగా ఉంటాయి. కాలేయం, కిడ్నీ, ఊపిరితిత్తులు సమర్థవంతంగా పనిచేస్తాయి.

-ఎస్.ఎన్.