మెయిన్ ఫీచర్

కోటీశ్వరురాలైన కిచిడీ కాకూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్నటివరకూ ఆమె సాధారణ ఆయా.. ప్రభుత్వ పాఠశాల్లో పిల్లలకు మధ్యాహ్నం పూట కిచిడీ వండటం ఆమె పని.. దాదాపు 450 కడుపులు నింపుతాయి ఆ చేతులు. ఇందుకు ఆమెకు వచ్చే నెల జీతం కేవలం 1500 రూపాయలు మాత్రమే.. జీవితంలో ఆమెకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా తన పోరాటాన్ని వీడలేదు ఆమె. ఆమె పేరు బబితా థాడే.. బుల్లితెరపై బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా నిర్వహించే ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ క్విజ్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. సరస్వతి కటాక్షంతో కుబేరులుగా మారడానికి చక్కని వేదిక ఇది. 2000 సంవత్సరంలో మొదలైన ఈ షో ఇప్పటికే చాలా సంచలనాలను సృష్టించింది. బబితాకు, ఈ షోకు సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదూ.. వివరాల్లోకి వెళితే..
బబితా థాడే ది మహారాష్ట్ర. బబిత తండ్రి ప్రభుత్వోద్యోగి. తల్లి గృహిణి. వీరికి ఎనిమిది సంతాంనం. వారిలో బబిత ఒకరు. కొన్ని సంవత్సరాల క్రితమే బబిత తండ్రి చనిపోయాడు. బబిత బీఏ చదివింది. బబిత భర్త పేరు శుభాత్. అతను చదివింది ఇంటర్. కానీ ఓ ప్రభుత్వ పాఠశాలలో ఫ్యూన్‌గా పనిచేస్తున్నాడు. భర్త పనిచేస్తున్నా బబిత ఖాళీగా కూర్చోలేదు. ఏదో ఒక పనిచేసి తన కాళ్లపై తను నిలబడాలనుకుంది. కానీ ఇంతలోనే పిల్లలు. వారు కొద్దిగా పెద్దగా అయ్యేంతవరకు పిల్లలతోనే సరిపోయింది బబితకు. పిల్లలు పెద్దగా అయ్యాక చిన్న ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఓసారి ఆమె భర్త పనిచేసే స్కూలుకు వెళ్లింది. ఎల్‌కేజీ పిల్లలకు టీచర్‌గా పనిచేసే అవకాశం ఇచ్చినా చాలానుకుంది. అదే అడిగితే.. టీచర్లు చాలామంది ఉన్నారు. పిల్లలకు మధ్యాహ్నం పూట వండిపెట్టే ఆయా ఉద్యోగం ఒక్కటే ఖాళీగా ఉంది. ఆ అవకాశం నీకు ఇస్తాం.. చేస్తావా? అని అడిగారు బబితను. ‘చేస్తున్న పని ఎంత చిన్నదైనా సరే.. చేయడానికి సిగ్గుపడకూడదు.. ఏ పనిలోనైనా బాగా కష్టపడితే గుర్తింపు అదే వస్తుంది..’ అని చెప్పి పెంచిన తండ్రి మాటలు గుర్తుకు తెచ్చుకున్న ఆమె.. క్షణం ఆలస్యం చేయకుండా పనిలో చేరిపోయింది. అప్పుడు 2002వ సంవత్సరం. అప్పటి నుంచి ఆయాగా పనిచేస్తూనే ఉంది. అప్పుడు మధ్యాహ్నం భోజనం చేసే పిల్లల సంఖ్య ముప్ఫై మాత్రమే.. వాళ్లకు మాత్రమే ఆమె కిచిడీ చేసి పెట్టేది. తక్కువమంది కావడంతో ఆ పని ఆమెకు కష్టం అనిపించలేదు. పోనుపోనూ సంఖ్య పెరిగింది. ఇప్పుడా స్కూల్లో దాదాపు నాలుగువందలా యాభై మంది మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారందరికీ వండి పెడుతోంది బబిత.
చిన్నప్పటి నుంచీ బబితకు లోకజ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడమంటే విపరీతమైన ఆసక్తి. రోజూ పేపర్ చదివేది. తప్పనిసరిగా టీవీలో వార్తలు చూసేది. ఖాళీ దొరికినప్పడల్లా చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, ఇతర పుస్తకాలు చదువుతూనే ఉండేది. చరిత్ర అంటే బబితకు చాలా ఇష్టం. చరిత్రకు సంబంధించిన అన్ని విషయాలూ తెలుసుకోవాలనుకుంటూ ఉంటుంది. కౌన్ బనేగా కరోర్‌పతి కార్యక్రమం కూడా బబిత తప్పకుండా ఫాలో అవుతుంది. ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలనుకుందట. చాలాసార్లు ప్రయత్నించింది కూడా.. కానీ కుదరలేదట. ఈసారి అవకాశం వదులుకోదలచుకోలేదు. దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తిచేసింది. ఇంటర్వ్యూకి వెళ్లింది. ఆ తరువాత మరో విడత ఇంటర్వ్యూలను కూడా పూర్తిచేశాక ఎంపికైనట్లు లెటర్ రాసి, దానితో పాటు టికెట్లను కూడా పంపారట. అలా ఆమె మొదటిసారిగా తనకిష్టమైన కౌన్ బనేగా కరోర్‌పతి ప్రోగ్రామ్‌కు వచ్చింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కి ఎదురుగా కూర్చుంది. మెగా క్విజ్ షో మొదలైంది. ఆ షోలో ఆమెకు ఎన్నో కఠిన ప్రశ్నలు ఎదురయ్యాయి. బతుకుబాటలో నిత్యం గెలుస్తోన్న ఆమెకు ఆ ప్రశ్నలు కష్టంగా తోచలేదు. ఏమాత్రం తొట్రుపాటూ లేకుండా ఒక్కొక్క ప్రశ్నకూ ప్రశాంతంగా సమాధానమిస్తూ ఒక్కొక్క రౌండును దాటేసింది. చివరిగా కోటి రూపాయల ప్రశ్న ఎదురైంది. ఆ క్షణంలో ఆమెతో పాటు ఆ షోలో ఉన్న ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకోలేదు. నరాలు తెగే ఉత్కంఠ.. అందరి గుండె చప్పుడు పైకి వినిపిస్తోంది.. ఒక్కరు కూడా కనీసం గుటక మింగలేదు. అయినా బబిత ఏమాత్రం బెదరలేదు. కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పింది. షో అంతా నిశ్శబ్దం. బిగ్ బి స్పందనకై అందరి చూపులు.. బిగ్ బి ఒక్కసారిగా ‘కరెక్ట్ ఆన్సర్.. ఏక్ క్రోర్..’ అనడంతో అందరిలోనూ ఆనందం. బబిత కళ్లలో మాటలకందని భావాలు. నెలకు కేవలం 1500 రూపాయలు సంపాదించే ఆమె ఇప్పుడు కోటీశ్వరురాలైంది. కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది. బబిత ఎపిసోడ్ ఇంకా టీవీల్లో ప్రసారం కాలేదు. టీవీల్లో వచ్చిన ప్రోమో విడుదలైన క్షణం నుంచి ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమె పేరు దేశంలో మారుమోగిపోతోంది. ‘ఈ డబ్బులు ఏం చేస్తారు?’ అని బిగ్ బి అడగ్గానే.. ‘మా ఇంట్లో అందరికీ కలిపి ఒకటే ఫోన్.. ముందుగా ఫోన్ కొనుక్కుంటాను’ అని బబిత సమాధానమిచ్చింది. వెంటనే బిగ్ బి లేసి ఆమెకు ఒక స్మార్ట్ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. అలా బబితా థాడే సామాజిక మాధ్యమాల్లో కూడా స్టార్‌గా మారిపోయింది. సామాజిక మాధ్యమాల్లో ‘ఆమె విజయం అద్భుతం.. స్ఫూర్తిదాయకం’ ఒకటే కామెంట్లు.. ఏదిఏమైనా భారత యువతకు స్ఫూర్తిగా నిలుస్తోన్న కోటీశ్వరురాలైన బబితకు హాట్సాఫ్ చెప్పాల్సిందే..