మెయిన్ ఫీచర్

సంపూర్ణ వ్యాయామం సూర్యనమస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సకల ప్రాణకోటికి సూర్యుడే జీవనాధారం. సూర్యుడు వెలుతురుకు, శక్తికి మూలం. కాబట్టి ఈ ఆసనాలతో సూర్యభగవానున్ని భక్తి పూర్వకంగా స్మరిస్తూ సూర్య నమస్కారాలు చేసే పద్ధతి యోగా ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. యోగాసనాలు, ప్రాణాయామం కలిపి చేసేదే సూర్య నమస్కారం. సూర్య నమస్కారాలు చేయడం వల్ల అనేక సత్ఫలితాలు ఉంటాయి. సూర్యనమస్కారాలు ఉదయం, సాయంత్రం కానీ చేయవచ్చు. ఆసనాలు వేయడానికి ముందు సూర్యనమస్కారం చేయడం వల్ల శరీరానికి ఉత్తేజం కలిగి ఇతర ఆసనాలు వేయడానికి శరీరాన్ని తయారుచేస్తుంది. ఆసన సమయంలో ప్రాణవాయువు కూడా ఎక్కువగా అందుతుంది. ఇవి మొత్తం 12 ఆసనాలతో కూడా ఆవృత్తి. సూర్య నమస్కారాలలో ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో చేయాలి. ఈ ఆవృత్తాలను రోజుకు మూడు నుంచి పనె్నండు సార్లు చేయవచ్చు.
సూర్యనమస్కారాలు ఇలా చేయాలి..
నమస్కార ముద్ర
మొదట తూర్పు దిశ వైపు చాపపై నిలబడి చేతులు రెండూ ఛాతికెదురుగా నమస్కార ముద్రలో ఉంచాలి. కాళ్ళు రెండూ దగ్గరకు చేర్చి ఉంచాలి. ఈ సమయంలో శ్వాస సాధారణంగా ఉండాలి.
హస్త ఉత్థనాసనము
ఇందులో శ్వాసను గాఢంగా లోనికి తీసుకుంటూ రెండు చేతులు పైకెత్తి కాళ్లను వంచకుండా వెనుకకు వంగాలి.
పాదహస్తాసనము
ఇప్పుడు శ్వాసను వదులుతూ కాళ్ళు వంచకుండా ముందుకు వంగి, చేతులు, కాళ్ల పక్కన నేలకు చేతులను ఆనించాలి. తలను మోకాళ్లకు ఆనించాలి.
అశ్వసంచాలాసనము
ఇప్పుడు మరలా శ్వాస తీసుకుంటూ ఎడమకాలిని వెనుకకు చాచాలి. కుడికాలును రెండు పక్కల చేతులు ఆనించి తలను నేరుగా ఉంచాలి.
అశ్వసంచలనాసనము
ఇప్పుడు కుడి కాలును వెనుకకు చాచుతూ రెండు కాళ్ళు ఒకచోటికి చేర్చి ఉంచాలి. ఈ సమయంలో శరీరం భూమి మీద ఆనకుండా తల నుండి కాలు వరకు శరీరాన్ని నిటారుగా ఉంచాలి. ఈ సమయంలో శ్వాసను అదిమి ఉంచాలి.
అష్టాంగ నమస్కారం
నెమ్మదిగా శ్వాసను వదులుతూ చేతులు కదపకుండా నెమ్మదిగా శరీరాన్ని చాప పైకి తీసుకుని వచ్చేటప్పుడు తల, ఛాతి, మోకాళ్లు చాపకు తగిలేట్టు ఉంచాలి. ఈ భంగిమలో పిరుదులను పైకెత్తి ఉంచాలి. అష్టాంగములు అంటే రెండు అరచేతులు, రెండు పాదాలు, రెండు మోకాళ్ళు, ఛాతి, నుదురు మాత్రమే చాపను తాకాలి.
భుజంగాసనము
ఇప్పుడు మరలా శ్వాస తీసుకుంటూ తల, ఛాతిని చాపపై నుండి పైకి లేపాలి. పొత్తి కడుపు చాపపై ఉండాలి.
అర్ధముక్తాసనము
శ్వాస నెమ్మదిగా వదులుతూ కాళ్ళు, చేతులు కదిలించకుండా తలను నడుమును పైకెత్తి తలను నేలవైపుగా తీసుకురావాలి. పాదాలు మాత్రం నేలకు తాకి స్థిరంగా ఉంచాలి. శరీరాన్ని ఇంగ్లీషు అక్షరం ‘ఎ’ ఆకారంలో ఉంచాలి.
అశ్వసంచాలాసనము
శ్వాసను తీసుకుంటూ చేతులు కదపకుండా కుడికాలును ముందుకు తీసుకువచ్చి రెండు చేతుల మధ్యలో నుండి తలను పైకెత్తాలి.
పాదహస్తాసనము
శ్వాస వదులుతూ ఎడమకాలును కుడి కాలి పక్కన రెండు చేతుల మధ్య చేర్చాలి. నుదురు మోకాళ్ళకు తాకించాలి. రెండు చేతులు, రెండు కాళ్ళు నిటారుగా ఉండాలి.
హస్తతానాసనము
ఇప్పుడు శ్వాస తీసుకుంటూ చేతులు తల పైకెత్తి నిటారుగా నిలబడి వెనుకకు శరీరం సహకరించినంత వంగాలి.
ప్రణామాసనము
నిటారుగా నిలబడి రెండు చేతులు ఛాతికెదురుగా నమస్కార ముద్రలో ఉంచాలి. రెండవసారి సూర్యనమస్కారం చేసేటప్పుడు కాళ్ళు భంగిమలో ఎడమ కాలుకు బదులు కుడికాలును ఉపయోగించాలి.
లాభాలు
ఈ సంపూర్ణమైన వ్యాయామం వల్ల శరీర భాగాలన్నీ పుష్టిగా ఉండి అనారోగ్యం పారిపోతుంది. కడుపు, జీర్ణాశయం, హృదయం, చిన్న ప్రేగులు, కాలేయం దృఢంగా ఉంటుంది. వెన్నుపాము, నడుములోని ఎముకలు సరిగ్గా, బలంగా ఉంటాయి. రక్తప్రసరణ బాగా జరిగి రక్తంలోని చెడు మలినాలు వెళ్లిపోతాయి. చర్మవ్యాధులు రావు. చేతులు, భుజాలు, కాళ్ళు, తొడల కండరాలు, మెడ ఎముకలు గట్టిపడతాయి. మనశ్శాంతి, మానసిక దృఢత్వం కలుగుతుంది. మధుమేహం తగ్గిపోతుంది. పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. ఈ పనె్నండు ఆసనాలు వేయడం వల్ల శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విష పదార్థాలను సహజసిద్ధంగా తొలగించగల ప్రక్రియలివి. హార్మోనుల అసమతుల్యం కూడా ఈ ఆసనాల వల్ల సరిగ్గా అవుతుంది. పనె్నండు ఆసనాలను వేయడం వల్ల శరీరం బిగుతుతనాన్ని సంతరించుకుంటుంది. దేహ కదలికలు సులువు కావడం, కీళ్ళు వదులవడం జరిగి నరాల కండరాల వ్యవస్థ సమతుల్యంగా ఉంటుంది. దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు పెరుగుతాయి. అంతేకాక వ్యాధి నిరోధక శక్తి పెరిగి శరీరం తేలిగ్గా, తేజోవంతంగా, శక్తివంతంగా తయారవుతుంది. దేహంలోని వ్యవస్థలన్నీ మెరుగుపడి మలిన రహితమై శక్తివంతమవుతాయి. సూర్యాసనాల ప్రక్రియ వల్ల మనస్సు స్థిమితంగా ఉండి జ్ఞాపకశక్తి పెరిగి, ఆలోచనలో స్పష్టత, భావ వ్యక్తీకరణలు, ప్రజ్ఞ కలుగుతాయి. ఈ ఆసనాల వల్ల శరీరం ఒక విధమైన విశ్రాంతిని పొందుతుంది. ఈ ఆసనాలవల్ల శరీర కదలికలు ఏడు ప్రధాన చక్రాలను చైతన్యవంతం చేస్తాయి. ఈ ప్రక్రియలో గుర్తుంచుకోవలసిన అంశాలు రుండు. వేసే ప్రతి ఆసనంలోనూ శరీరంలోని వివిధ భాగాల కదలికలు గమనించడం మొదటిది. శ్వాస యుక్తలయను కదలికలతో అనుసంధానించడం రెండోది.