మెయిన్ ఫీచర్

గుర్తించాల్సింది పెద్దలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది పిల్లలు లైంగిక వేధింపులపై తల్లిదండ్రుల దగ్గర నోరువిప్పరు. ఒకవేళ చెప్పినా తల్లిదండ్రులు ఎలా స్వీకరిస్తారో, ఏమంటారో తెలియక ఇలాంటి సమస్యల్ని వౌనంగా భరిస్తారు. పక్కంటివారు, దగ్గరి బంధువులు, తల్లిదండ్రుల స్నేహితులు, తెలిసినవారి నుంయి లైంగిక వేధింపులకు గురవుతున్నారు పిల్లలు. ఈ సమస్య చాలా సున్నితమైనది. ఎందుకంటే పిల్లలకు ఇలాంటి సమస్య ఒకటి ఉంటుందనీ, దాన్ని ఫలానా విధంగా గుర్తించాలని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో కూడా తెలియదు చిన్నారులకు.. తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు ఇలాంటి సమస్యల గురించి చర్చించరు. ఫలితంగా తమ పిల్లలకు ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయో వారికి తెలియదు. అందుకని పిల్లల్లో ఉన్నట్లుండి అనుకోని మార్పులు సంభవిస్తే వారి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.
* ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు.. ముఖ్యంగా సమస్యకు కారణమైన వ్యక్తి వస్తే.. పిల్లలు వారి ముందుకు రావడానికి ఇష్టపడరు.
* కొందరు పిల్లలు బాగా భయపడిపోతారు. ఎంతగా అంటే.. వారికి తెలియకుండానే పక్క తడిపేసేంతగా..
* బాగా చదివే పిల్లలు ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు వెనుకబడిపోతారు.
* మరికొంతమంది చిన్నారులు ఎప్పుడూ లేంది తమ రహస్య భాగాలను అదే పనిగా తాకి చూసుకునేందుకు ప్రయత్నిస్తారు.
ఇలాంటి లక్షణాలు వారు లైంగిక వేధింపులకు గురయ్యారు లేదా గురవుతున్నారు అనే దానికి సంకేతం. ఇలాంటప్పుడు పెద్దవాళ్లు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు.
* సమస్య ఎదురు కాకుండానే పిల్లలను నెమ్మదిగా దగ్గరకు తీసుకుని బుజ్జగిస్తూ సమస్యను అడిగి తెలుసుకోవాలి. అలాగే వారిని అప్రమత్తం చేయడం కూడా తల్లిదండ్రుల ప్రాథమిక బాధ్యతే..
* చిన్నారులకు మూడు, నాలుగేళ్ల వయస్సు నుంచీ మంచి, చెడు స్పర్శకు సంబంధించిన తేడాను వారికి తెలియజేయాలి.
* ఏయే భాగాల్లో తాకితే ఎలా జాగ్రత్తపడాలి.. ఈ విషయాల్ని వెంటనే అమ్మకో, నాన్నకో వెంటనే చెప్పాలనే విషయాన్ని స్పష్టం చేయాలి. అలాగే అడ్వెర్స్ చైల్డ్‌హుడ్ ఈవెంట్స్ అధ్యయనం ప్రకారం పిల్లలకు ఎనిమిది ప్రశ్నలు వేస్తే.. అందులో నాలుగింటికి ఎస్ అనే సమాధానం వస్తే.. వారు లైంగిక వేధింపులకు గురయ్యారని గుర్తించాలి.
* చాలామంది పిల్లలు ఈ విషయాన్ని మర్చిపోతారనుకుంటారు. కానీ వాళ్లు ఈ విషయాల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అది వాళ్ల మనసుపైనే కాదు, వ్యక్తిత్వం, చదువు, కెరీర్‌పైనా ప్రభావం చూపిస్తుంది. కొన్నిసార్లు తల్లిదండ్రుల సమస్య పెద్దది కాలేదు కాబట్టి గోప్యంగా ఉంచడమే పరిష్కారం అనుకుంటారు. పిల్లలకూ ఇదే విషయాన్ని చెబుతారు. కానీ ఇది సరైనది కాదు. పరిష్కారం దిశగా ఆలోచించాలి.
* కొందరు తల్లిదండ్రులైతే ‘అసలు నువ్వెందుకు వెళ్లావు..’ అంటూ ముందు పిల్లలపైనే కోప్పడతారు. లేదా కొడతారు. అలా అడగడం వల్ల అమ్మానాన్నలు తాము చెప్పేది వినడం లేదనే నిర్ణయానికి వచ్చేస్తారు పిల్లలు.
* ప్రతిరోజూ కాసేపు పిల్లలతో మాట్లాడాలి. పిల్లలు ఏది చెబుతున్నా వినాలి. వాళ్ల మాటల్ని నమ్మాలి. అప్పుడే అమ్మానాన్నలు తాము చెప్పేది వింటున్నారనే నమ్మకం వారిలో వస్తుంది. అది వారిలో భద్రతనిస్తుంది.
* చిన్నారులు మరీ కోపంగా మారడం, నలుగురిలోకి రాకపోవడం, అకారణంగా ఏడవడం, అతిగా ప్రవర్తించడం వంటివి చేస్తుంటే బిహేవియర్ థెరపీ చేయించాలి.
* ఏమీ చేయకుండా, బయటికి తెలుస్తుందని భయపడితే పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. పిల్లల విషయంలో సమస్య తెలిసిన వెంటనే చాలా త్వరగా పరిష్కారం ఆలోచించాలి. అదే వారి బంగారు భవిష్యత్తుకు మంచిది. *