మెయిన్ ఫీచర్

ప్రకృతి పండుగ ఓనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతితో ప్రేమలో పడని వారెవరుంటారు? బహుశా మనం ప్రకృతిలో భాగం కావటమే దానికి కారణం కావచ్చు. ఎన్నో సౌకర్యాల మధ్య జీవిస్తున్న మనలో పెరుగుతున్న అసహనానికి కారణం ప్రకృతికి దూరంగా జరుగుతుండడమే. ప్రకృతి ప్రస్తావన వచ్చిందంటే చాలు.. మనదేశంలోని ఒక ప్రాంతాన్ని అప్రయత్నంగా తలచుకుంటాం. అవును.. అది కేరళ. ఈ రాష్ట్రం ప్రకృతిని ఆవాహన చేసుకున్నట్టుంటుంది. ఇది చిన్న రాష్ట్రం. భారతదేశంలో జనాభా గణాంకాల ప్రకారం ఇది పనె్నండో స్థానంలో ఉంది. దక్షిణ భారతంలో కేరళ రాష్ట్రం ప్రకృతి అందాల విషయంలో కాశ్మీరుతో పోలుస్తారు. ఇది వందశాతం అక్షరాస్యత సాధించిన ప్రాంతం. ఇక్కడ శిశు మరణాల రేటు కూడా అతి తక్కువగా చెబుతారు. కేరళ పండుగల గురించి చెప్పాలంటే ఆగస్టు నెల రెండవ వారం నుండి సెప్టెంబర్ రెండవ వారం మధ్య కాలంలో ఓ పది రోజుల పాటు జరుపుకునే ఓనం పండుగ ప్రముఖమైనది. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పండుగ. ఇక్కడ అన్ని వయస్సుల ప్రజలు ఆనందోత్సాహంతో ఈ పండుగలో పాల్గొంటారు. ఈ పండుగను మలయాళీలు కొల్ల వర్షంలో చింగం నెల సమయంలో జరుపుకుంటారు. ఓనం కార్నివాల్ నాలుగు నుంచి పది రోజుల వరకు ఉంటుంది. ఈ కొద్ది రోజుల్లో కేరళ ప్రజలు, సంస్కృతి, సాంప్రదాయం మరియు ఆచారాలను ఉత్తమమైన రూపంలోకి తెస్తారు. అందంగా అలంకరించిన పుక్కలం, ఆంబ్రోసియల్ ఒనసడియ, ఉత్తేజకరమైన బోట్ రేస్, అందమైన, సొగసైన నృత్య రూజం, ఓనమ్ స్పెషల్ అడ పాయసం భలేగా ఉంటాయి.
ఒనకలికల్, అయ్యంకాళి, అటకాళం మొదలైన వాటిలో ఓనం కూడా ప్రసిద్ధి చెందింది. ప్రియమైన రాజు మహాబలిని తిరిగి సంతోషపెట్టడానికి కేరళ ప్రజలు ఓనంను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం కేరళను శక్తివంతమైన, దృఢమైన రాక్షసుడు మహాబలి పాలించాడు. కేరళను మహాబలి పరిపాలించినప్పుడు ప్రజల్లో ఒకరు కూడా అసంతృప్తిగా లేరట. దాదాపు ప్రతి ఒక్కరూ సుసంపన్నంగా, సంతోషంగా జీవించారట. అందుకనే వారు మహాబలిని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఓనం పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.
విష్ణువు బలి చక్రవర్తిని పరీక్షించదలిచాడు. విష్ణువు వామనావతారంలో నిస్సహాయ బ్రాహ్మణుడి వేషంలో బలి చక్రవర్తి దగ్గరకు వస్తాడు. బ్రాహ్మణునికి కావలసిన భూమిని ఇవ్వడానికి రాజు ఎంతో ఉత్సాహం చూపిస్తాడు. బ్రాహ్మణుడు మూడు అడుగులను అడుగుతాడు. అందుకుని మహాబలి సంతోషంగా ఒప్పుకుంటాడు. వామనుడు ఇంతింతై పెరిగి ఒక అడుగు భూమిపై మరో అడుగు ఆకాశంపై వేసి.. మరో అడుగుకు స్థలాన్ని చూపమంటాడు. అప్పుడు బలి తన తలను చూపిస్తాడు. వామనావతారంలో పాతాళంలోకి బలిచక్రవర్తిని నెట్టిన విష్ణుమూర్తి, బలిచక్రవర్తి కోరిక మేరకు ఏడాదికి ఒకసారి తన ప్రజలను చూసేందుకు వచ్చేలా వరమిచ్చాడు. దీంతో ప్రతి ఏడాది బలిచక్రవర్తి తమ ఇళ్లకు వచ్చి ప్రజల సంతోషాన్ని చూస్తాడన్నది కేరళీయుల నమ్మకం. ఈ రోజునే ఓనం పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా కేరళలో ఎక్కడ చూసినా ఏనుగుల స్వారీలు, అందమైన తెల్ల చీరలతో మగువలు.. కోలాహలంగా ఉంటుంది. చిత్తిర, చోతి, విశాగం, అనిళ, థ్రికెత్త, మూలం, పూరాడం, ఉత్రాడం అంటూ చివరగా తిరుఓనమ్‌తో సంబరాలు ముగుస్తాయి. పండుగ మొత్తంలో తిరు ఓనమ్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున మలయాళీలు నిర్వహించే ఓనసద్యా అనే విందు చాలా ముఖ్యమైనది. ఇందులో తప్పకుండా పాల్గొనాలనే ఆచారం వారికి ఉంది. మలయాళీయులకు ప్రీతిపాత్రమైన రెండు పండుగల్లో ఒకటి కొత్త సంవత్సరాదిగా పిలుచుకునే విషు, రెండోది శ్రవణోత్సవంగా పిలువబడే తిరుఓనమ్. పంట కోతకు వచ్చి ఇంటి సిరుల పంట వచ్చే తరుణంలో ఓనం వస్తుంది. ఇంటి ముందు రకరకాల పూలతో రంగురంగుల రంగవల్లులతో ప్రతి ఇల్లూ ఎంతో అందంగా కోలాహలంగా ఉంటుంది. ఇలా ప్రకృతితో ముడిపడిన ఈ పండుగ కేరళ అందాలకు మరింత వనె్నను చేకూరుస్తుంది.