మెయిన్ ఫీచర్

నలచరిత్రలో అంతరార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చిన పెద్దమనిషితో ధర్మరాజు తన కష్టాలు చెప్పుకోగా, ఆ మహర్షి నవ్వి, ‘‘నలమహారాజు నీకంటే ఎక్కువ కష్టాలు పడ్డాడయ్యా. అతడు అశ్వహృదయ విద్య తెలిసిన వాడైనా కూడా, కలిదోషానికి పాలై, అక్షహృదయాన్ని కూడా సంపాదించి, ఈ రెండు విద్యల బలంవల్ల కలి సంహారకుడయ్యాడు’’అంటూ మొదలుపెట్టి, నలచరిత్ర అంతా వివరించి, చివరిగా ‘‘కర్కోటకస్య నాగస్య’’అనే కలిదోష నివారక మంత్రాన్ని కూడా ఉపదేశించాడు.
బృహదశ్వుడు అక్కడితో ఆగలేదు. ‘‘్ధర్మరాజు! దుర్యోధనుడు నిన్ను మళ్ళీ ద్యూతానికి పిలిచి, మళ్ళీ ఓడిస్తాడేమోనని నీకు సందేహంగా వుందేమో! నా దగ్గర అక్షహృదయ విద్య, అశ్వహృదయ విద్యా కూడా వున్నాయి. ఆ రెండూ నీకు ఉపదేశిస్తాను. నీ కష్టాలన్నీ తీరుతాయి’’ అని చెప్పి ఆ రెండు మంత్రాలూ ఉపదేశించి, వెళ్ళిపోయాడు.
మహాభారతంలో, వనపర్వంలో, 79వ అధ్యాయంలో, ఈ విద్యాద్వయోపదేశంతో నల చరిత్ర ముగింపుకు వచ్చింది.
కథారహస్య సూచికలు:
ఇప్పుడు ఉపక్రమోప సంహారాలను సమన్వయించి చూడండి.
ధర్మరాజు భీముడిలోని కలిదోషాలను చూసి, బాధపడుతూ వున్నారు. ఆ సమయంలో అక్కడికి బృహదశ్వమహర్షి వచ్చాడు. ఉపనిషత్ పరిభాషలో ‘‘బృహత్’’అంటే పరబ్రహ్మ. ‘‘అశ్వము’’ అంటే ఇంద్రియము. (ఇంద్రియాణి హయానాహుః- కఠోపనిషత్తు.) పరిబ్రహ్మమయమైన ఇంద్రియాలు కలవాడు ‘‘బృహదశ్వుడు.’’
ఈ మహర్షి వచ్చి ఉపదేశించిన విద్యల పేర్లు ‘‘అక్షహృదయము’’ మరియు ‘‘అశ్వహృదయము.’’
‘‘అక్ష హృదయము’’అంటే, పైకి కనిపించే అర్థం పాచికల విద్య. కానీ, ఉపనిషత్ పరిభాషలో ‘‘అక్షము’’అంటే అకారాది క్షకారాంత మాతృకావర్ణ మాలిక. కాగా అక్షవిద్య అంటే, సమస్త బీజాక్షరమయమైన, ఓంకారాత్మకమైన, బ్రహ్మవిద్య. దీని బహిరంగరూపమే తత్త్వ సంఖ్యాగణన పూర్వకమైన సాంఖ్యా విద్య.
అక్షమంటే మరో అర్థం ఇరుసు. భూమియొక్క దక్షిణ- ఉత్తర ధ్రువాలను కలిపే రేఖ పేరు అక్షరేఖ. మానవ శరీరంలో అధోభాగం దక్షిణం. తల వైపు భాగం ఉత్తరం. (ఉత్+తరం.) ఈ రెంటినీ కలిపే వెనె్నముకే మానవుడి అక్షం. దాని ద్వారా కుండలినీ శక్తిని స్వాధీనపరిచే యోగవిద్య పేరే అక్షవిద్య. అది ఆత్మవిద్యకు మార్గదర్శిక.
ఇక ‘‘అశ్వహృదయము’’అంటే, - ‘‘గుఱ్ఱాల విద్య’’అని పైకి కనిపించే అర్థం. ఉపనిషత్ పరిభాషలో ఇంద్రియ జయవిద్య అనీ, ‘‘అ-శ్వ’’ రేపటి గురించి ఆలోచించని ‘‘వైరాగ్య విద్య’’-అనీ, లోపలి అర్థాలు.
ఈ విద్యల యొక్క అంతరార్థాలను మనం గ్రహించినప్పుడు, ఇవి కలిదోష సంహారకాలు అవుతాయని నిరూపించటానికి వేరే ప్రయత్నం అవసరం వుండదు. ఈ విద్యల యొక్క మహిమను కీర్తించడంకోసమే బృహదశ్వమహర్షి కృతయుగంలోని కల్యంశ ప్రాంతంలో అనగా, వేనచక్రవర్తి తరువాత అనతి దూరకాల ప్రాంతాలలో, జరిగిన నల చరిత్రను వివరించి చెప్పాడు.

- ఇంకాఉంది

- కుప్పా వేంకటకృష్ణమూర్తి