మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘బాహుకా! ఒక స్ర్తికి సంబంధించిన మాటలను చెపుతూ ఇంతకుముందు ఒక బ్రాహ్మణుడు అయోధ్య నగరానికి వచ్చాడు. అక్కడ అతడు ‘‘అడవిలో అలనాడు కనికరం లేకుండా తనమీదనే ప్రాణాలు పెట్టుకొని తనతోపాటు అడవికి వచ్చిన ప్రియ అర్థాంగిని విడిచి వెళ్ళిపోయావుగదా? అనురాగంగల ప్రేయసిని నేను నిద్రిస్తున్న సమయాన ఒక వంచకునివలె నార చీరెను సగం చింపుకొని నన్ను అరణ్యంలో విడిచి ఎక్కడికి వెళ్ళావు? ఆమె నీవు ఆశించిన స్థితిలోనే అదే విధంగా ఎదురుచూస్తున్నది! ఆనాటి సగం చీరనే తనకు కట్టుపుట్టంగా ధరించి ఉన్నదే? అహోరాత్రులు వియోగాగ్నిచే దహింపబడుచున్నది. ఆమె కేవలం నలుని కథను మాత్రమే విన దలిచింది’’అని అన్నాడు అని కేశిని నలునితో అనగా
నలుడు ఏమియు మాట్లాడకుండా ఊరకుండినాడు. కేశిని మరలా నలునితో
‘‘బాహుకా! ఇంతకు పూర్వము అయోధ్యకు వచ్చిన బ్రాహ్మణునికి చెప్పిన సమాధానానే్న నేను ఇప్పుడు మీ ముఖతః విన్నాను దమయంతి మరలా ఆ మాటలు వినదలిచింది’’ అని అన్నది.
అలా కేశిని మాట్లాడగా నలుని కన్నుల వెంట ఎడతెగని కన్నీటి వెల్లువ పెల్లుబికి వచ్చింది. తన కన్నీరు కేశినికి కనబడకుండా తన వదనాన్ని వంచి వేరొకవైపుకు చూడసాగాడు. వేదనచే దహింపబడుచున్న తన దుఃఖాన్ని నిగ్రహించుకొని గద్గద స్వరంతో
‘‘కష్టాలు కలిగిన విషమ స్థితిలో కూడా కుల స్ర్తిలు ఇతరులకు తెలియనీక తనలోనే దాచుకుంటారు. అలాంటివారు స్వర్గాన్ని జయించిన వారే! ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఉత్తమ స్ర్తిలు భర్తలు విడనాడిన సమయాల్లోకూడా ఎన్నడూ కోపాన్ని పొందరు. సంకట స్థితిలో ఉన్న ఆ భర్త భార్యను విడిచిపెట్టి ఉండవచ్చును. అతని విషయంలో కోపగించటం తగినది కాదు. ప్రాణాలు నిలుపుకొనటానికి ప్రయత్నిస్తూ పక్షులచే వస్త్రాలు అపహరించబడి మనోవ్యధలో ఉన్న ఆ భర్త విషయంలో భార్య కోపగించటం భావ్యంగాదు. భర్త తనను గౌరవించినా, గౌరవించకపోయినా, రాజ్యభ్రష్టుడైనా, దరిద్రుడైనా, ఆర్తుడైనా, వ్యసనపరుడైనాసరే భార్య అతనిపై కోపాన్ని చూపరాదు.’’అని మాట్లాడుతూనే కన్నీరు ఆపుకోలేకపోయాడు.
అదంతా గమనించిన కేశిని అక్కడినుండి వెళ్ళిపోయింది. అతడి చేష్టలతో సహా అక్కడ జరిగినదంతా దమయంతికి తెలియజేసింది.
***
కేశిని చెప్పిన మాటలు విన్న తరువాత దమయంతి బాహుకుడే నలుడు కావచ్చునని సందేహించి ఇంకనూ అతడిని పరీక్షించదలిచింది. కేశినీ!
‘‘అతడు ఋతుపర్ణుని వంటలవాడని చెపుతారు. వంట చేసేటప్పుడు అతడి ప్రవర్తనను సంపూర్ణంగా పరిశీలించి రమ్ము. అతడిలో దైవమానుష సంబంధమైన చర్యలేవైనా చేస్తే వెంటనే వాటిని నాకు తెలియపరచవలెను. ఇవిగాక మరేమైనా విశేషాలను నీవు గమనిస్తే వాటినిగూడా తెలుపుము’’ అని చెప్పి మరలా కేశినిని అక్కడికి పంపించింది.
కేశిని వెంటనే వెళ్ళింది. బాహుకుని చెంతన ఉండి అతని విలక్షణమైన పనులన్నిటినీ గ్రహించింది. లోకాతీతాలు, మనుజ సహజాలైన కారణ విశేషాలుగల అద్భుత విషయాలను పరిశీలించి ఆశ్చర్యచకితురాలైంది. తిరిగి వచ్చిన కేశిని దమయంతితో‘‘అమ్మా! దమయంతీ! ఆ బాహుకుడి చర్య వర్ణనాతీతం. అతడి శక్తి లోకోత్తరం, మానవాతీతం. ప్రయాస లేనిది. పూర్వం ఇటువంటిది జరిగినట్లుగా ఎవరూ చూడలేదు. వినలేదు. అయినప్పటికీ పరమసత్యమైనది. అతడు ఒక దేవతలనవచ్చు.
‘‘పారిశుద్ధ్యాన్ని పాటించే విషయంలో అతనికున్నంత పట్టుదల మానవుల్లో ఎక్కడా కనలేదు. అతడు పొట్టిగానున్న ద్వారంవద్ద తల వంచడు. అతడు దానిని చూచినప్పుడు అదియే అతనికి సరిపడేటట్లు పైకి లేస్తుంది. అతడు ఏ కష్టంలేకుండా దానిని దాటుతాడు.
- ఇంకాఉంది