మెయిన్ ఫీచర్

తొలిచూపులోనే మంచి మార్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనా సరే మనం మొదటిసారి చూడగానే ఓ అభిప్రాయం మన మనసుల్లో ముద్రించుకుపోతుంది. అందుకే ‘్ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్’ అంటారు. ఎంత మంచి మనస్తత్వం వున్నవారైనా ఒక్కోసారి వారి మాటలు, ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్ రీత్యా వ్యతిరేక అభిప్రాయాన్ని ఇతరుల్లో కలిగిస్తారు. అందుకే ప్రపథమంగా ఎవరైనా పరిచయం చేసుకునేప్పుడు- మూడో వ్యక్తి ఎవరైనా మిమ్మల్ని పరిచయం చేసుటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
ఎవరిమీదైనా సరే ఓ అభిప్రాయం ఏర్పడటానికి కేవలం 30 సెకండ్లు చాలు. ఎటికెట్ నిపుణులు కూడా ఇదే అంటారు. అందుకే ఆ 30 సెకండ్లు పరిచయానికి ఎంతో ముఖ్యం.. అత్యంత కీలకం.
హ్యాండ్‌షేక్
అవతలి వ్యక్తిని పరిచయం చేసిన వెంటనే కుడి చేతిని ముందుకు చాపి ఎదుటివారి చేయి అందుకుని పదిలంగా పట్టుకుని మృదువుగా షేక్‌హ్యాండ్ ఇవ్వాలి. మీరిచ్చే హ్యాండ్‌షేక్ ఓ రకమైన చేరువ భావాన్ని ఆప్యాయతనూ ప్రతిఫలించాలి. మీ అరచేయి నేలకు సరిగ్గా సమాంతరంగా ఉండాలి. అలా కాకుండా వేళ్లు క్రిందికి చూస్తున్నట్లుగా ఇచ్చే షేక్‌హ్యాండ్ అణిగిమణిగి పడి వుండే దుర్బల వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.
సమయస్ఫూర్తి అవసరం
మీరు కొత్తగా పరిచయం అయిన వారితో మాట్లాడుతున్నపుడు కాసేపు వారిని గమనించడం ముఖ్యం. సంభాషణల్లో హఠాత్తుగా జోక్యం చేసుకోకుండా మెల్ల మెల్లగా మాటలను కలుపుతూ ముందుకు సాగాలి.
సందర్భానుసారమైన ఉదాహరణలు హాస్యోక్తులు.. మంచి పుస్తకాల గురించి ఎదుటివారి అర్హతలను బట్టి.. సుహృద్భావపూరితమైన మాటలు కలిపి పరిచయం ముందుకు పోవాలి. మీ మాటలు మిమ్మల్ని ప్రత్యేక వ్యక్తిగా చూపుతాయి.
మొక్కుబడిగా కాకుండా..
మీ పరిచయం మొక్కుబడిగా కాకుండా కొనసాగింపుగా ఉండాలి. మీరు వారినుంచి వీడ్కోలు తీసుకోబోయే ముందు మళ్లీ అంతే ఆప్యాయతను ప్రదర్శించాలి. షేక్‌హ్యాండ్ ఇవ్వడంతోపాటు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపే చక్కని మాట కూడా ఉండాలి. మీ మాట గుర్తుండిపోయేలా ప్రతిఫలించేలా ఉండాలి.
కేవలం ‘్థంక్స్’ అని అనేయకుండా మీరెలా ఎంజాయ్ చేసారు.. మీకెలాంటి ఆహ్లాదకరమైన అభిప్రాయం కలిగిందీ వివరిస్తూ ఓ చిన్న వాక్యం చెప్పి ఆ తర్వాత చెప్పే ‘్థ్యంక్స్’కు విలువ ఎక్కువ. మీపై ఎదుటివారికి మంచి అభిప్రాయం ఏర్పడేలా, గట్టి స్నేహం ముడిపడేలా ఆత్మీయత పెంచేలా చేస్తుంది.
నమస్కారం
తెలుగు సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా కనపరచాలంటే షేక్‌హ్యాండ్ బదులు రెండు చేతులు జోడించి హృదయపూర్వక ‘నమస్కారం’ చేయాలి. పెద్దలకు ఈ నమస్కారం అవసరం. ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు, మహిళామణులకు, పెద్ద తరహా వ్యక్తులకు పెట్టే ఈ నమస్కారం మీ సంస్కారం అవుతుంది.

- కంచర్ల సుబ్బానాయుడు 94926 66660