మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షాకాల మందలి మేఘ గర్జనలవలె గంభీరంగా వినిపిస్తున్న నలుని రథఘోషను దమయంతి కూడా విన్నది. ఆ మహాధ్వనిని విన్న దమయంతి ఆశ్చర్యాన్ని పొందింది. నలుడు గతంలో తన గుర్రాలను పూన్చి రథాన్ని నడుపుతున్నప్పుడు వచ్చిన రథ ఘోషతో సమానమైన రథ ఘోషను విన్నది. తన మనస్సులో
‘‘నిషధేశుడు, విశ్వజనీన చరితుడు, పుణ్య శ్లోకుడు లోకోపకారి, పరాక్రమోపేతుడు అయిన నలుని నేను చూడగలుగుతాను. ఈ రథధ్వని నా మనస్సుకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నది. అతడు తప్పక నల మహారాజే! సందేహం లేదు.! నలుని చూడకపోతే నేను బ్రతకటము దుర్లభమే. అతడి స్పర్శననుభవింపకపోతే నేను బ్రతుకుట కష్టము. అట్లుగానిచో అగ్నిప్రవేశం చేస్తాను. నలుని వియోగంచే కల్గిన శోకం నన్ను రాత్రింబవళ్ళు నా హృదయాన్ని బ్రద్దలుచేస్తున్నది’’అని పరితపించింది.
అలా భావించిన దమయంతి నలుని చూడాలనే కోరికతో మేడపైకి ఎక్కింది. వార్‌ష్ణేయుని, బాహుకునితోసహా రథంపైనున్న ఋతుపర్ణ మహారాజును మేడపైగల మధ్య కక్షంనుండి చూచింది. వార్‌ష్ణేయుడు, బాహుకుడు రథం దిగారు. రథంలో కూర్చొనియున్న ఋతుపర్ణుడు రథం దిగి భీమమహారాజు సమీపానికి వచ్చాడు. భీమమహారాజు సగౌరవంగా ఎదురేగి ఋతుపర్ణుని సత్కరించాడు. ఋతుపర్ణుడు భీమరాజు సత్కారాలను స్వీకరించాడు.
కుండిన నగరాన్ని చేరిన ఋతుపర్ణునికి అక్కడ స్వయంవరానికి సంబంధించిన విశేషాలేమీ కన్పించలేదు. భీమరాజును కలిసినప్పుడు కూడా స్వయంవర వార్త ప్రస్తావించబడలేదు. ఋతుపర్ణునికి స్వాగతం పలికిన భీమరాజు అతడితో తానేమి చేయవలెనో అడిగాడు.
నిజానికి భీమరాజుకు తన కుమార్తెయొక్క స్వయంవరానికి ఋతుపర్ణుడు వచ్చినట్లు తెలియదు. బుద్ధిమంతుడు, పరాక్రమశాలి, సత్యసంధుడు అయిన ఋతుపర్ణుడు కూడా దమయంతి స్వయంవరాన్ని గురించి ప్రస్తావించలేదు. రాజుగానీ, రాజకుమారులుగానీ కనిపించలేదు. స్వయంవర ప్రసక్తిలేదు. బ్రాహ్మణుల కోలాహలమూ లేదు.
విదర్భరాజు పుత్రిక అయిన దమయంతి మరొక మగని వరించేటంత అధర్మ ప్రవర్తనకలదా?’’అని తలపోసిన ఋతుపర్ణుడు.
‘‘మీకు నమస్కరించటానికై వచ్చాను’’అని భీమరాజుతో అన్నాడు. అయితే భీమరాజు ఆశ్చర్యపడి ఆలోచించి అన్ని యోజనాలు ప్రయాణించి, అన్ని గ్రామాలు దాటి ఋతుపర్ణుడు వచ్చిన కారణమేమిటో గ్రహించలేకపోయాడు.
‘‘ఋతుపర్ణుడు చాలా చిన్న కారణాన్ని చెపుతున్నాడు. అసలు కారణమేమిటో తరువాత తెలుస్తుందిలే! ఈయన చెపుతున్నది అసలు కారణంగాదు!’’అని మనస్సులో అనుకొని ఋతుపర్ణునితో. ‘మీరెంతగానో అలసిపోయారు. విశ్రాంతి తీసుకోండి’’అని భీమరాజు పదే పదే అన్నాడు.
ఋతుపర్ణుడు ఎంతగానో సంతోషపడ్డాడు. తదుపరి ‘ఋతుపర్ణుడు వార్‌ష్ణేయునితో కలిసి భీమరాజు నిర్దేశించిన విడిది గృహానికి వెళ్ళాడు. బాహుకుడు రథాన్ని తీసికొని రథశాలకు వెళ్ళాడు. రథం మీదనే కూర్చున్నాడు.
దుఃఖార్తి అయిన దమయంతి ఋతుపర్ణుని, వార్‌ష్ణేయుని, బాహుకుని చూచిమరి రథధ్వని ఎవరిదై ఉంటుంది అని తర్కించుకొన్నది.
‘‘ఆ మహాధ్వని నలమహారాజుది గానే ఉన్నది. కానీ నలుడు కనిపించలేదు. నలుని వలన వార్‌ష్ణేయుడు ఆ విద్యను నేర్చుకొన్నాడా? అందువలన నలుని రథఘోష పోలియున్నది. ఋతుపర్ణుడు కూడా నలుని వంటి మహారాజే! అందువల్ల అతడి రథఘోష కూడా నలుని రథఘోషవలె నున్నదా?’’అని అనేక విధాల దమయంతి తలంచింది.
తదుపరి దమయంతి నలుని వెదకటానికి నిశ్చయించుకొన్నది. ఒక దూతను పంపాలనుకొన్నది. తనవద్ద ఉన్న ‘‘కేశిని’’అనే దాసిని పిలిచింది. ఆ దాసితో-
- ఇంకాఉంది