మెయిన్ ఫీచర్

విజయానికి ధైర్యం అవసరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధైర్యం కూడా ఒక నైపుణ్యమే. మీరు ధైర్యాన్ని ఎప్పుడైతే పెంచుకోవాలని ప్రయత్నిస్తారో మీ మనసులో ధైర్యం మరింత గట్టిగా నిలిచి వుండటం ప్రారంభిస్తుంది. మీరు మీ సౌకర్యవంతమైన స్థితినుంచి ముందుకు జరిగి ఎప్పుడైతే ముందుకు అడుగులు వేస్తారో అప్పుడే ధైర్యం మీలోపల మరింత పదును ఎక్కుతుంది.
ప్రేమించటానికి, ప్రేమించబడటానికి, ఎదగటానికి, మాట్లాడటానికి, జీవితంలోని అన్నిరకాల వ్యవహారాలకు ధైర్యం అవసరం. ఒక పనిని సాహసించి చేయటంలో ఎంత ప్రమాదం ఉండవచ్చో, అసలేమీ చేయకపోవటంలో అంతకంటే ఎక్కువ ప్రమాదం ఉండొచ్చు. పని చేయకపోవటంవల్ల వచ్చే పర్యవసానాలని సరిగా చూడగలిగితేనే పనిచేసే ధైర్యం మనలో మొలకెత్తుతుంది. ఏ సమస్య కూడా మనం ఊహించినంత పెద్దదేమీ కాదు. మనలో వున్న ధైర్యాన్ని నిద్రలేపగలిగితే చాలు.
మిమ్మల్ని మీరు ఒకసారిలా ప్రశ్నించుకోండి. నాలో నిజంగా ధైర్యం ఉంటే నేనే చేసేవాడినని, అలా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోండి. ఈ ప్రశ్న మీదే మనస్సు లగ్నం చేయండి. మీరిలా చేస్తేమీలో అంతర్గతంగా దాగివున్న అన్ని వనరులతో కూడిన ధైర్యవంతమైన హృదయముందని కనుగొంటారు. అది చిన్నదవని, పెద్దదవని, కదిలించేదవని, సరిపోకపోనిదైనా పర్వాలేదు.
మనం మన జీవిత గమ్యాన్ని చేరుకోవటానికి, మన కలల్ని సాకారం చేసుకోవటానికి, భయం చేతిలో చిక్కకుండా ఉండటానికి గమ్యంవైపు ముందుకు సాగాలి. అలాగని మనం గమ్యాన్ని ఒక్క రోజులోనే చేరుకోవాలని అర్థం కాదు. మనం వేసే తప్పటడుగులు, బుడిబుడి అడుగులు, మనల్ని ఉత్సాహపరచి కొత్త అనుభవాలను, కొత్త అవకాశాలను, మన మనసులో అనుకున్నదానికంటే ఎక్కువగానే సాధిస్తాం. మనమీద మనకు సందేహం ఉంటే మనకి మనం పరిధి గీసుకుంటాం. ఎప్పుడైతే మనం ధైర్యంగా మనలోవున్న సామర్థ్యాన్ని వెలికితీయగలమో, అప్పుడే ప్రపంచంలో మన ప్రత్యేక నైపుణ్యలను పంచుకోగలుగుతాం.
పనిలో మీ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు మీరు మీ శక్తిని వినియోగించి తద్వారా తగిన ఫలితాన్ని పొందినప్పుడే వృత్తిలో గెలుపును పొందినవారికి, పొందనివారికి మధ్య ఆలోచనా ధోరణిలో రెండు రకాల తేడాలుంటాయి. వీటిలో మొదటిది ఆపదకు దూరంగా ఉండటం, రెండవది అపాయాన్ని ఉపాయంగా, గెలుపునకు పునాదిగా మలచుకోవటం. మొదటిదంటే భయపడే ధోరణి, రెండవది ఆరుపదులను ధైర్యంగా ఎదుర్కొనే ధోరణి. ఒకటి భయంతో వున్నది కోల్పోతాం అనే ధోరణి, మరొకటి కొత్తది పొందుతాం అనే ఆశతోధైర్యంగా ముందుకు వెళ్ళే ధోరణి.
సహజంగా కొంతమంది మనుషులు మిగిలిన వారికంటే ఎక్కువ సాహసవంతులై ఉంటారు. ఎన్నో యేళ్ళ పరిశోధనలు మనకు సాహసం చేయగల శక్తినిచ్చే ధైర్యాన్ని నేర్చుకుని, అభ్యాసం చేసి మనలో నిలుపుకోవచ్చని తెలియజేస్తున్నాయి. తెలియని దెయ్యంకంటే తెలిసిన దెయ్యం మంచిదని కొందరంటారు. అంటే తెలియనిదానికోసం కష్టపడి నిరుత్సాహపడటం కంటే తెలిసినదానిని నమ్ముకోవటంమంచిది.
అయితే దీని అమలులో మనం మనస్ఫూర్తిగా జీవితాన్ని ఆనందించలేం. ప్రతి మార్పు, అది మంచి మార్పు అయినా సరే అసౌకర్యంగానే ఉంటుంది. ఎందుకంటే అనిశ్చితమైన భవిష్యత్తుకోసం వర్తమానంలో మనకున్నది వదులుకోవలసి వస్తుంది కదా! అందుచేత చాలామంది తాము గీసుకున్న పరిధి నుంచి బయటకు రావటానికి ఇష్టపడరు. వాళ్ళని ఒంటరి చేసే సంబంధాలని, చెత్త ఉద్యోగాలని వదులుకోరు. దీనిని నిరాశతో ప్రశాంతంగా జీవించడమంటారు కొంతమంది పెద్దలు.
మంచి మార్పు ఎప్పటికీ సాధ్యం కాదని భావిస్తూ, పరిస్థితులు ముందుకంటే మరింత ఘోరంగా మారతాయేమోనని భయపడుతుంటారు చాలామంది. మన జీవితంలో రాబోయే మంచికోసం మనము దానిని వదులుకోవటానికి ఇష్టపడకపోతే మార్పులు అతి తక్కువగా జరుగుతాయి. మీరు కోరుకున్నదానికంటే లభించినది తక్కువైనా దానితోనే బతకాలి అనుకుంటున్నారు. అంటే భయం మిమ్మల్ని లొంగదీసుకుందని అర్థం. దానివలన కలలు కల్లలు అవుతాయి. ఉత్సాహం నీరుకారిపోతుంది. తలుపులు మూసుకుపోతాయి. నైపుణ్యాలు నిద్రపోతాయి. జీవితం నిరాశగా గడిచిపోతుంది. ఇదే అన్నింటికంటే గొప్ప విషాదం.
మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత అలక్ష్యానికి, అనుకున్న లక్ష్యానికి ఇప్పుడున్న స్థితికి మధ్య వున్న దూరాన్ని చూసి ఆశ్చర్యంలో తలమునకలవుతాం. అందువల్లనే మనం కన్న కల ఎంత సాహసంతో కూడుకున్నది, ఎంత పెద్దది అయినా కూడా మనం దానిని చిన్న చిన్న లక్ష్యాల కింద ముక్కలు చేయాలి. మనం చేయగలిగినంత పనికి అనుగుణంగా మన పనిని విభజించుకోవాలి. ‘‘మనం మొత్తం మెట్ల వరుసనంతా చూడనక్కర్లేదు. మొదటి మెట్టును చూస్తే చాలు’’ అంటారు మార్టిన్ లూథర్ కింగ్.
మీరు పొందాలనుకున్న స్థితికి, ఉన్న స్థితికి వ్యత్యాసాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉండకుండా మరుసటి రోజు, తర్వాత వారమో చేయాలనుకున్న పనిని అనుకున్న సమయానికి పూర్తిచేయండి. భయాన్ని పారద్రోలటానికి పనిలో నిమగ్నమవటం చాలా శక్తివంతమైన మందు. అలాగే ధైర్యంగా జీవించడమంటే భయాన్ని దాని మూలం వరకూ అనుభూతి చెందటం. తర్వాత దానికి ఎదురుగా నిలబడి గట్టిగా ఊపిరి పీల్చి, దాని ఎదురుగానే ముందుకు కదిలి వెళ్లిపోవటం. అప్పటికిగాని మీకు ఎప్పుడూ భయపడనవసరంలేదన్న విషయం తెలుసుకోలేరు. మన జీవితం మనకన్నా ధైర్యాన్ని బట్టి విస్తరిస్తుంది. లేదా కృశించిపోతుంది. ధైర్యంగా ఉండండి. మీరనుకున్నదానికన్నా ఎక్కువ సాధించగలరు.

- పి.ఎం. సుందరరావు 9490657416