మెయిన్ ఫీచర్

జీవితానికి ఎదురీదుతూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో విపత్కర పరిస్థితులు ఎదురైనా.. ఆత్మవిశ్వాసంతో వాటిని తనకి అనుకూలంగా మార్చుకుని విజయపథాన దూసుకెళ్లేవారు అరుదుగా ఉంటారు. జీవితమే సవాలు చేస్తున్నా.. పక్షవాతం పీడిస్తున్నా.. లెక్కచేయక అంచెలంచెలుగా ఎదిగి రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి నామినేట్ అయ్యింది దీపామాలిక్. దీప జీవితాన్ని ఒకసారి పరికిస్తే..
దీపామాలిక్ హరియాణాలో జన్మించింది. తండ్రి ఆర్మీ అధికారి. ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు దీపకు వెనె్నముకపై చిన్న కణితి వచ్చింది. తల్లిదండ్రులు మూడు సంవత్సరాలు వివిధ ఆసుపత్రుల్లో దీపకు రకరకాల చికిత్సలు చేయించారు. వాటికి వెరవలేదు దీప. ఎంతో కఠినమైన ఫిజియోథెరపీలు చేయించుకుంటున్నా ముఖంపై చిరునవ్వును చెరగనిచ్చేది కాదు. అంత అనారోగ్యంలో కూడా ఆమె చాలా చురుగ్గా ఉండేది. ఆమెకు చిన్నప్పటి నుంచీ ఆటలన్నా, బైక్ రైడింగ్ అన్నా చెప్పలేనంత పిచ్చి. అలా ఆమె ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఆటలు ఆడేది. దీపామాలిక్‌కు ఇరవై సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఓ ఆర్మీ అధికారికిచ్చి పెళ్లి చేశారు. అతను దీప పరిస్థితిని అర్థం చేసుకుని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేవాడు. తరువాత దీపకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. వారితో ఆమె జీవితం ఆనందంగా గడిచిపోతుంది. ఇంతలోనే అనుకోని ఉపద్రవం వచ్చిపడింది. వెనె్నముకపై ఉన్న కణితి సమస్య పెరిగిపోయింది. ఆసుపత్రుల చుట్టూ తిరిగితే.. ‘కణితి తొలగించుకోవాలి.. లేకపోతే కేన్సర్ బారినపడే మరణించే అవకాశం ఉంది.. ఒకవేళ ఆపరేషన్ చేయించుకుని కణితి తొలగించుకుంటే పక్షవాతం బారినపడి జీవితాంతం వీల్‌ఛైర్‌కే పరిమితం అయ్యే అవకాశం ఉందని’ వైద్యులు తేల్చేశారు. దీంతో అందరిలో ఆవేదన. ఆపరేషన్ చేయించుకోవడానికి ఎవరూ అనుమతించలేదు. కణితి తొలగించుకోవద్దు అని చెప్పారు. కానీ దీప వినలేదు. నిర్ణయం తీసేసుకుంది. ఆపరేషన్ వైపే మొగ్గు చూపింది. కణితిని తొలగించుకోవడానికి వైద్యులు మొత్తం మూడు ఆపరేషన్లు చేశారు. 183 కుట్లు పడ్డాయి. అప్పటి నుంచి ఆమె శరీరంలోని కింది భాగం మొత్తం పక్షవాతానికి గురైంది. అప్పటివరకూ భర్త, పిల్లలతో ఆనందంగా, ఆడుతూ పాడుతూ గడిపిన ఆమె, తన నిర్ణయంతో అచేతనంగా మారిపోయింది. అయినా ఆమె ఏమాత్రం బెదరలేదు. ఆరు సంవత్సరాల పాటు ఫిజియోథెరపీ చేయించుకుంది. ఆ సమయంలో తన ఒంట్లోని శక్తినంతా కూడగట్టుకుని జీవితంలో నిలబడాలన్న తపన, పట్టుదలతో ఉండేది. ఆ స్థితిలో ఆమె పెద్ద కూతురు హెమీప్లెగియాతో బాధపడుతుంటే ఆ పాప ఆలనాపాలనా ఆమే చూసుకునేది. ఇంత జరుగుతున్నా ఆమె ఆటలను మాత్రం మానలేదు.
దివ్యాంగురాలైన దీప రైడింగ్‌లో శిక్షణ తీసుకుని లైసెన్స్ సాధించింది. ఫలితంగా రైడింగ్ సాధించిన మొట్టమొదటి దివ్యాంగురాలిగా రికార్డు సాధించింది. పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయురాలిగా కూడా దీపామాలిక్ చరిత్ర సృష్టిస్తుంది. 2009లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎనిమిది రోజుల్లో 17 వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి 18 వేల అడుగుల ఎత్తుకు చేరి హిమాలయాల రైడ్ పూర్తిచేసింది. రైడింగ్ శిక్షణలో భాగంగా ఆమె ఈత కూడా నేర్చుకుంది. చెన్నై నుంచి దిల్లీ వరకు 3, 278 కిలోమీటర్లు ప్రయాణించి మొదటి పారాప్లెగిక్ మహిళగా నిలిచింది. గత సంవత్సరం దుబాయ్‌లో జరిగిన ఎఫ్ 53/54 జావెలిన్ స్పోర్ట్ అథ్లెటిక్ గ్రాండ్ ప్రిక్స్‌లో బంగారు పతకం సాధించింది. దీపామాలిక్ ఇప్పటి వరకు ఈత, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, షార్ట్‌పుట్ గేమ్‌లో, రైడర్‌గా.. ఇలా అన్నింటిలో కలిపి 23 అంతర్జాతీయ పతకాలు, 68 రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలు సాధించింది.
దివ్యామాలిక్ దివ్యాంగుల కోసం వీలింగ్ హ్యాపీనెస్ ఫౌండేషన్‌ను నిర్వహిస్తోంది. వారికి మోటార్ స్పోర్ట్స్, అడ్వెంచరస్ గేమ్స్‌లో శిక్షణ కూడా ఇస్తోంది. అంతేకాదండోయ్.. త్వరలో దీపామాలిక్‌పై బయోపిక్ రానుంది. దీన్ని ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్నారు. మునుపు దీప భారత ప్రభుత్వ ప్రతిషాఠత్మక అవాఠ్డులైన అర్జున, పద్మశ్రీలను సొంతం చేసుకుంది. ఏది ఏమైనా అంతులేని ఆత్మవిశ్వాసంతో వైకల్యాన్ని పక్కకి నెట్టి జీవితాన్ని గెలిచిన దీపామాలిక్‌కు హాట్సాఫ్ చెప్పాల్సిందే.