మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘బాహుకా! నాకు దమయంతి స్వయంవరాన్ని చూడాలని ఉన్నది. విదర్భకు వెళ్ళాలని అనుకొంటున్నాను. నీవా అశ్వహృదయాన్ని తెలిసినవాడవు, ఒకరోజు సమయమని తెలుసుగదా? ఇప్పుడు సమయం వచ్చింది. నీ అశ్వశిక్షా చాతుర్యం వెలుగొందచేయుము’’అని అన్నాడు.
‘‘అలాగే చేస్తాను మహారాజా!’’అని అన్నాడు బాహుకుడు.
ఋతుపర్ణుని మాటలు విన్న నలునకు హృదయం దుఃఖంతో కోత కోసినట్లయింది. మిక్కిలి పరితపించాడు. మనసు పరిపరివిధాల భావించాడు.
‘‘దమయంతి ఈ విధంగా చెప్పి ఉంటుందా? ఆనాడు అడవిలో తనను ఎడబాసి వెళ్ళాను అనిగదా ఆమె నాపై కోపం పూనింది. కాకుంటే ఈ విధంగా రెండవ స్వయంవరానికి పూనుకొంటుందా? కాదుకాదు నా ఊహ తప్పేమో? నన్ను రక్షించడానికై ఇదే ఉపాయమని తలంచి ఉంటుంది. కాదు. తానేమి చేసినా వనితలు తమనే ప్రేమిస్తుంటారని నమ్మే పురుషులు అవివేకులుగదా?’’అని కొంతసేపు వౌనం వహించి కుమిలిపోయాడు. మళ్ళీ
‘‘దమయంతి పతివ్రతా తిలకం. నాపట్ల అనురాగంకలది. నాపట్ల అనురాగంగల పిల్లలుగూడా ఉన్నారు. దమయంతి భర్తనే తలంచుకొంటూ కాలం గడిపే తపస్విని. నేనా క్షుద్రుడను. పాపబుద్ధికలవాడను. నావల్లనే ఈ విధంగా జరిగింది. నేను పెద్ద తప్పుచేశాను. ‘‘కాదు. స్ర్తిలు చంచలమైన స్వభావంగలవారు. ఏ సమయంలో ఏ రకంగా మారుతారో తెలియదుగదా? దమయంతి ఎంతో అనుకూలమైందేగదా? ఇప్పుడు నాయందు ఉన్న గాఢమైన ప్రేమను విడిచిందేమో?
‘‘ఈ విధంగా రెండవ స్వయంవరానికి పాల్పడుతుందా? ఇది పరిశీలించవలసిన అంశం కాబట్టి నేను ఋతుపర్ణుడితో విదర్భకు వెళ్ళి సత్యాసత్యాలను అక్కడే తెలిసికొంటాను.
సంతానవతి అయిన దమయంతి ఇలా చేస్తుందా? విదర్భకువెళ్ళి నా ప్రయోజనం గూడా నెరవేర్చుకొంటాను.’’
నలమహారాజు మానవుడే! అయితే సామాన్య మానవుని లాంటివాడు కాదు. యజ్ఞయాగాదులను చేశాడు. దేవతలను మెప్పించాడు. తృప్తిపరచాడు. ఇంద్రయమాగ్ని వరుణులయిన దిక్పాలకులు స్వయంగా ప్రత్యక్షమైనారు. తనను తమపక్షాన రాయబారిగా దమయంతివద్దకు పంపారు. దేవతల దర్శనం చేసుకొన్న పుణ్యాత్ముడుగదా? అంతేగాక వేదవేదాంగాలను అధ్యయనం చేసినవాడు. వీరుడు, దానపరుడు, ప్రజలమెప్పును బడసినవాడు. మామూలు మానవునికన్నా గొప్పవాడు. అలాంటి నలుడు గూడా సామాన్యమానవుని వలనే ఆలోచించాడు. భార్య విషయంలో అనుమానానికి లోనయ్యాడు. తాను చేసిన పొరపాటునకు చింతించినా, ఒక స్ర్తిని, అందునా అబలను రాత్రివేళ కారడివిలో విడిచివెళ్ళి ఇపుడు చింతించి ఏమి లాభము. కష్టమైనా తనతోనే ఉండనివ్వవలసినది. కానీ అలా జరుగలేదుగదా? ఎంత గొప్పవానికైనా కష్టాలు వచ్చినప్పుడు సామాన్య మానవునిలాగే ప్రవర్తిస్తారన్నది నలుని విషయంలో కూడా గ్రహించవచ్చును.
అని బాహుకుడు ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాడు. దైన్యంతో అంజలి బద్ధుడై
‘‘మహారాజా! మీ మాట ప్రకారం ఒక్కరోజులోనే విదర్భ నగరాన్ని చేరగలము’’అని విన్నవించాడు.
తదుపరి బాహుకుడు అశ్వశాలకు వెళ్ళాడు. ఋతుపర్ణుని అజ్ఞానుసారం అశ్వాలను పరీక్షించాడు. ఉత్తమాశ్వాలను గుర్తింపదలచి పలుమార్లు ఆలోచించాడు. దుర్బలంగా కనిపిస్తున్నా వేగంగా ప్రయాణించగల అశ్వాలను చూచాడు. తేజస్సు, బలము కలిగి, ఉత్తమ జాతిలో పుట్టిన, హీన లక్షణాలులేని పెద్ద ముక్కు రంధ్రాలుకల గుర్రాలను ఎంచుకొన్నాడు.అయితే మునుపు వార్‌ష్ణేయుడు నలుని రథాన్ని, గుర్రాలనూ నలుని సంతానాన్ని విదర్భలో వదలిన తర్వాత అయోధ్యకు తెచ్చి ఉంచాడు.
- ఇంకాఉంది