మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చట అంతఃపురంలో సునందతో కలిసి ఉన్న దమయంతిని చూచాడు. పొగదొంతరలతో మిళితమైన అగ్నిదీప్తి వలె, నల్లని మబ్బులచేత ఆవరింపబడిన చంద్రునివలె, పెను బురదలో మునిగి ఉన్న తామరతూడువలె అణిగిఉండి గుర్తించటానికి వీలుగాక ఉన్న దమయంతిని చూచాడు. ఆమె తప్పక దమయంతే అయి వుంటుందని తనలోతాను అనుకున్నాడు.
‘‘ఈమె రూపాన్ని చూస్తే పూర్వం నేను చూచిన రూపంలాగానే కనిపిస్తుంది. లక్ష్మిదేవి వలెనున్న ఈమెను చూసి నేను కృతార్థుడనయ్యాను. పున్నమి చంద్రుని వంటి ముఖము, శ్యామవర్ణ కలిగి ఈమె భర్తనుండి విడివడి నీటిపారుదల ఎండిపోయిన ఏరువలె, పద్మాలులేని తామర తీగవలె, మామిడిచెట్టు లేని వనసీమవలె శోభించకుండా ఉండిగూడా తన పాతివ్రత్య మహిమచేత ప్రకాశిస్తూఉన్నది. విదర్భ అనే సరోవరంనుండి అదృష్టహీనతవలన పైకి తీయబడిన పద్మమువలెనున్నది. భర్తృశోకంతో వ్యాకులమనస్కయైయున్నది. ఆడువారికి పతిభక్తియే గొప్ప భూషణములలో గొప్ప భూషణము. పాతివ్రత్యానికి సరితూగే ఆభరణం ఆడువారికి మరొకటి లేదు. అట్టివారినుండి పతిభక్తిని అపహరించ వీలుబడదు.
అలంకారాలకు యోగ్యురాలైనా అలంకరించుకోలేదు. ఇష్టమైన కామభోగాలు, బంధువులు లేక భర్తను చూడాలనే ప్రగాఢమైన కోరికతో మాత్రమే దేహాన్ని ధరించియున్నది. శోభకలదైనా ఇప్పుడు పతిలేక శోభించడంలేదు. ఆభరణాలు లేకపోయినా స్ర్తికి భర్తయే శ్రేష్టమైన ఆభరణం. ఈమె దుఃఖం ఎప్పుడు తీరుతుందోగదా? రాజ్యభ్రష్ఠుడైన నలమహారాజు ఈమెను తిరిగి పొందటంవలన రాజ్యాన్నిగూడా తిరిగి పొందినంత సంతోషాన్ని పొందగలడు. శీలవతియైన దమయంతిని పొందటానికి పరాక్రమవంతుడైన నలునికి తగినది అని భావిస్తూ సుదేవుడు దమయంతి దగ్గరకు వచ్చాడు. దమయంతిని చూచి
‘‘అమ్మా! దమయంతీ! నేను సుదేవుడను అనే బ్రాహ్మణుడను. మీ అన్నగారికి మిత్రుడను. మీ తండ్రిగారైన భీమరాజుయొక్క ఆదేశంపై నిన్ను వెదకటానికిలా వచ్చాను.
‘‘అమ్మా! నీ తల్లిదండ్రులు, నీ సంతానం, నీ బంధువులు, అందరూ క్షేమంగానే ఉన్నారు. చాలామంది బ్రాహ్మణులు నీకోసం వెదకుతూ దేశాలన్నీ తిరుగుచున్నారు. నేనిచటికి వచ్చాను. నా సుకృత విశేషంవలన నిన్ను చూడగలిగాను’’అని అన్నాడు.
దమయంతి సుదేవుని గుర్తించింది. తన అన్నగారికి ఇష్టుడైన సుదేవుని చూచి ఏడ్చింది. క్రమంగా తనవారి గురించి, మిత్రుల గురించి సుదేవుని అడిగి తెలిసికొన్నది. ఏకాంత ప్రదేశంలో సుదేవునితో జరిగిన విషయాన్నంతా వివరించి చెపుతూ ఏడుస్తున్న సైరంధ్రిని చూచి సునందగూడా శోకసంతప్తురాలైంది. బ్రాహ్మణుని చెంత సైరంధ్రి రోదిస్తున్న విషయాన్నంతా సునంద త్వరగా పోయి తన తల్లికి చెప్పింది. విషయాన్ని తెలిసికొనాలని అనిపిస్తే వచ్చి ఆమె గురించి తెలుసుకోమని తల్లితో అన్నది. సునంద చెప్పినదంతా విన్న రాజమాత అంతఃపురాన్నుండి బ్రాహ్మణునితోపాటు సైరంధ్రి ఉన్న ప్రదేశానికి వచ్చింది. తరువాత సుదేవుని పిలిపించి అతనితో
‘‘విప్రోత్తమా! ఈమె ఎవరి కూతురు? ఎవని భార్య? ఏ కారణంవలన భర్తను, బంధువులను ఎడబాసి పుణ్యప్రదమైన నోములు నోస్తున్నది? ఏ విధంగా జ్ఞాతులవలన, భర్తవలన నష్టాన్ని పొందింది? అసలు ఈమె సంగతి నీకెలా తెలిసింది? ఈమె పేరేమిటి? మీనుంచి ఈమెను గురించిన విషయాన్నంతా సమగ్రంగా వినాలని కోరుచున్నాను! దివ్య రూపవతి అయిన ఈమె గురించి యదార్థాన్ని చెప్పండి? అని అడిగింది. సుదేవుడు
‘‘రాజమాతా! విదర్భరాజు ఎంతో ధర్మాత్ముడు. భీముడు అనే పేరుగల తేజశ్శాలి. ఈమె అట్టి విదర్భరాజు ప్రియపుత్రిక. పేరు దమయంతి.
- ఇంకాఉంది