మెయిన్ ఫీచర్

అబ్బూరి ఛాయాదేవి వ్యక్తిత్వం అబ్బురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాట మెత్తగా..
మనసు మెత్తగా..
చేత గట్టిగా..
ఈ మూడు కోణాలు కలిపితే అబ్బూరి ఛాయాదేవి ప్రఖ్యాత రచయిత్రి స్వభావం. స్వతహాగా మితభాషి. స్నేహం కలిస్తే హాస్యంతో నవ్వులు పండిస్తుంది. మాట్లాడుతూన్నంతేపు నవ్వులే. అందుకే ఆమె స్నేహం ఆనందంగా అనిపిస్తుంది. ఏది చెబుతుందో అదే చేస్తుంది. కథలు వేరూ, జీవితం వేరూ కాదు ఆమెకు. అన్ని కథలూ ఆమె అనుభూతే కాదు, కానీ ఆమె చూసిన ప్రతి కోణంలోంచి విషయ పరిశీలన చేసి, ఆ విషయానే్న కథలని ఉత్తమ పురుషలోనే రాస్తుంది. అందుకే అవి మనసుకు పట్టే అంశాలవుతాయి. అంత సహజంగా అనిపిస్తాయి. నాతో ఆమె ఎంతో ఆత్మీయంగా మాట్లాడేవారు. రచయిత్రిగా ఒక ప్రక్క, మరోవైపునుంచి ఒక పెద్దక్క, పిన్ని.. ఇలా దగ్గరివారు పలకరిస్తూన్నట్టుండేది ఆమె తీరు. ఆమెకి స్వతంత్ర భావాలు ఎక్కువ. తన పని తనే చేసుకోవాలి, ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. అది ఆమె సిద్ధాంతం. అలాగే తన వంట తను చేసుకునేది రాజేశ్వర్రావుగారు పోయిన తరువాత కూడా. ఒకసారి వాళ్ళింట్లో పిల్లి నాలుగు పిల్లల్ని పెట్టింది. తెల్లగా ముద్దుగా అవి తిరుగాడుతూ వుంటే, ఆమె ముచ్చటగా వాటికి పాలు తాగించింది. అంతే ఇంక అవి అక్కడే తిష్టవేసి ఆమె చుట్టూ తిరుగుతూ వుండేవి. అవే ఆమె పిల్లలు! వాటికోసం ప్రాణం పెట్టేది. మరో చక్కటి ప్రక్రియ గుడ్డ బొమ్మలు చెయ్యడం. చక్కగా కళ్లూ, కాళ్ళూ పెట్టి, ముక్కు, నోరూ దిద్ది, తిలకం బొట్టుపెట్టి, జుట్టు, నగలూ అన్నీ వేసి, ముచ్చటగా పట్టుచీరలు, రవికెలు తొడిగి, మగ బొమ్మలైతే పంచెకట్టు, షర్టూ- ఇలా తీర్చి ఎంతో అందంగా ముస్తాబు చేసేది. ఇంటికి వెళ్లిన వాళ్లకు అదొక ప్రత్యేక ఆకర్షణ. ఆమె సనాతన కుటుంబంలో పుట్టింది. తండ్రి మహా స్ట్రిక్కు, ఆయన మాటే వేదం ఇంట్లో. ఒక కొడుకు గోపాల్ వుండగా, మరో కొడుకుకోసం సూర్క నమస్కారాలు చేస్తే, కూతురు పుట్టిందట. సూర్యుని భార్య పేరు ఛాయ కదా, అందుకే ఆమెకు ఛాయాదేవి అని పేరు పెట్టినా, పరికిణీ చొక్కాలు వేసుకోనియ్యకుండా నగా నట్రా లేకుండా మగ పిల్లాడిలాగానే పెంచారట. తండ్రితో చనువు లేదు భయమే. అయితే ఆమె తెలివితేటలు, చదువులో గొప్పదనం చూసి, చిన్నప్పుడే పెళ్లిచేసెయ్యకుండా హైదరాబాద్‌లో వున్న కొడుకూ కోడలు దగ్గర వుంచి నిజాం కాలేజీలో ఎం.ఏ వరకూ చదివించారు. వొదినగారు కథలు రాస్తూ వుండేవారట. అది ఆమెకు తనూ రాయాలనే స్ఫూర్తినిచ్చిందని చెబుతూ వుండేవారు. వాళ్ళాయనలోనూ ఇంచుమించు అదే తత్వం చవిచూశారామె. అయితే తేడా తండ్రిలా కర్కశంగా కాక, వరద రాజేశ్వరావుగారు ప్రేమగా చెప్పి తన మాటే నెగ్గించుకునేవారు. ఈ చట్రంలో తాను వుండడం, ఇతర స్ర్తిలు కూడా ఇలాగే పురుషుల చేతుల్లో కీలుబొమ్మల్లా బతకం ఆమెకు కలిచివేస్తూ వుండడంతో, ఆ విషయాలలోనే జీవిస్తూ వాటినే కథా వస్తువులుగా చిత్రించారామె. అలా ఆమె స్ర్తివాది, స్ర్తిపక్షపాతిగా ఎదిగారు. ఆడవాళ్లకి వాక్‌స్వాతంత్య్రం, విద్యా, వినయాలతోపాటు, ఆర్థిక స్వాతంత్య్రం లేకనే ఆమె మూగిగా పడుండేదారోజుల్లో! ఒక చీర కొనుక్కునే స్వాతంత్య్రం ఆమెకుండేది కాదు.. ఆ స్థితి మారాలి’’ అని ఆమె మనసారా కోరుకుకున్నారు. ఆమె అలాగే జీవించారు. అలా అని ఆమెది తిరుగుబాటు తత్వం కాదు. అన్నా వదిన, చెల్లెలూ ఇటు ఎలాగో, అత్తా మామ, ఆడపడుచులూ, మరుదులూ వారినీ అలాగే చూసుకుని, మన సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో క్షుణ్ణంగా పరిశీలించి, పాటించిన వ్యక్తి ఛాయాదేవిగారు.
బ్రతికినంతసేపూ అంతా నాదేనని బ్రతికి, పోయేరోజు వచ్చాక ఏదీ నీది కాదనుకుని నిశ్చితంగా వెళ్లిపోయిన మహామనిషి ఛాయాదేవిగారు.
నా కథలను కొన్నింటిని సుప్రసిద్ధ అనువాదకులు శ్రీ గోవిందరాజుల రామకృష్ణారావుగారు ఆంగ్లంలోకి ‘ది పెరెన్నియల్ లైట్’ అని అనువదించగా ఆనాటి సభలో డా. సి.నారాయణరెడ్డిగారు ఆవిష్కరించగా, ఆ గ్రంథాన్ని స్నేహపూర్వకంగా అబ్బూరి ఛాయాదేవిగారికి అంకితం ఇచ్చాను. ఆ తీపి గుర్తులతో, ఆమె ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ అర్పిస్తున్నానీ అక్షరాంజలి.

శారదా అశోకవర్థన్, 040-27803666