మెయిన్ ఫీచర్

బుజ్జాయికి బొజ్జనిండుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసిపిల్లలకు ఏ సమయంలో ఏం పెట్టాలి.. ఏం పెట్టకూడదు అనే విషయంలో తల్లులకు బోలెడు సందేహాలు ఉంటాయి. పిల్లలకు పెట్టే ఆహారం సరైనది కాకపోతే చిన్నారుల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే వారికి ఆరునెలల నుండి ఏడాది నిండేవరకు వారికి ఎప్పుడు ఎలాంటి ఆహారం అందివ్వాలో తెలుసుకుంటే తల్లికి ఎటువంటి టెన్షన్ ఉండదు.
* పసిపిల్లలకు ఆరునెలలపాటు తప్పనిసరిగా పూర్తిస్థాయిలో తల్లిపాలను ఇవ్వాలి. ఒకవేళ తల్లిపాలు లేనప్పుడు ప్రత్యామ్నాయంగా వైద్యుని సలహాతో పోతపాలను వాడొచ్చు.
* ఆరునెలల తరువాత పిల్లలకు ఘన పదార్థాలను ఇవ్వడం మొదలుపెట్టాలి. మొదటగా బియ్యం జావను అలవాటు చేయాలి. ఇది తేలిగ్గా అరుగుతుంది. దీన్ని ఎలా తయారుచేయాలంటే.. ముందుగా బియ్యాన్ని ఓ ఆరుగంటలపాటు నానబెట్టి.. తరువాత నీడలో ఆరబెట్టి పొడిచేయాలి. ఈ పొడిలో నీళ్లను కలిపి జావలా కాయాలి. ఇది ఎంత పలుచగా ఉంటే అంత మంచిది. బియ్యం నానబెట్టి పొడి కొట్టడం వల్ల పిల్లలకు చాలా తేలిగ్గా అరుగుతుంది.
* పిల్లలకు ఉగ్గు ఎనిమిది నెలల తరువాత పట్టాలి.
* ఎనిమిది నెలల వయసులో పిల్లలకు ప్రత్యేక ఆహారాన్ని ఇవ్వాలి. ఇందుకోసం మూడు కప్పుల బియ్యానికి కప్పు పప్పు తీసుకోవాలి. వీటిని రాత్రంతా నానబెట్టి ఆ తరువాత ఆరబెట్టి పొడి చేసుకోవాలి. దీన్ని ఉడికించి పిల్లలకు పెట్టొచ్చు.
* ఈ ఆహారంతో పాటు పిల్లలకు రాగులు చాలా మంచివి. వీటిని మొలకలు కట్టించి, కాస్త వేయించి పొడి చేసి జల్లించాలి. దీన్ని జావలా చేసి పిల్లలకు అందివ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల పిల్లలకు ఆకలిని పెంచే ఏఆర్‌ఎస్ అనే ఎంజైము జీర్ణాశయంలో విడుదలవుతుంది.
* ఈ వయసు చిన్నారులకు ఏ చిరుధాన్యాలు పెట్టినా ఇలానే మొలకలు కట్టించి ఇవ్వాలి. అన్నింటినీ ఒకేసారి కాకుండా ఒకదాని తరువాత మరొకటి పెంచుకుంటే మంచిది.
* అలాగే ఎనిమిదో నెల నుంచి పొట్టుతీసి సన్నగా తురిమిన బంగాళాదుంప, క్యారెట్ వంటివి ఉడకబెట్టి, మెత్తగా చేసి జావలో కలిపి ఇవ్వొచ్చు.
* బాగా పండిన అరటి, సపోట, బొప్పాయి వంటివి మంచివి. ఏడో నెల నుంచి ఈ పండ్లను అలవాటు చేయొచ్చు.
* యాపిల్ పండు తొక్కతీసి ఉడికించాలి. ఉడికిన తరువాత మెత్తగా చేసి పిల్లలకు తినిపించాలి
* తొమ్మిదో నెల రాగానే చిన్నారులకు ఉడికించిన గుడ్డులోని పసుపు సొనను పెట్టాలి. మొదటిసారి పెట్టేటప్పుడు రెండు చెంచాలు మాత్రం చాలు. ఇది వారికి పడుతుందో, లేదో రెండు, మూడు రోజులు గమనించాలి. పనె్నండు నెలలు పూర్తయ్యాక పూర్తిగా గుడ్డు పెట్టొచ్చు. అలానే చేపలు కూడా ఏడాది నిండిన తరువాతే అలవాటు చేయాలి.
* తల్లిపాలు తాగే పిల్లలకు ఆరు నెలల వరకు నీళ్లు తాగించాల్సిన అవసరం లేదు. పోత పాల పిల్లలకు మాత్రం కాచి చల్లార్చిన నీళ్లను మధ్యమధ్యలో తాపుతూ ఉండాలి. ఏడోనెల నుంచి పిల్లలకు పప్పులు, కూరగాయలు ఉడికించిన నీళ్లు తాగించడం అలవాటు చేయాలి. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. పిల్లలు వీటిని అంత త్వరగా ఇష్టపడరు కానీ వీటిని పిల్లలకు తప్పనిసరిగా తాగించాలి.
* పిల్లలకు పది నెలల వయస్సు నుంచీ అన్నాన్ని తినిపించాలి. మొదట్లో అన్నం పావు కప్పు పెడితే సరిపోతుంది. ఇందులో పప్పు కూడా కలిపి పెట్టినా మంచిదే..
* మధ్యాహ్నం పనె్నండు గంటలకు, రాత్రి ఏడు గంటల లోపు అన్నం తినిపించడం ఉత్తమం. ఏడు దాటాక వారికి అన్నం అరగకపోవచ్చు.
* పదినెలలు నిండిన తరువాత ఆకుకూరల్ని సన్నగా తరిగి, ఉడికించిన అన్నంతో పాటు మెత్తగా చేసి తినిపించాలి. ఇలా చేయడం వల్ల విటమిన్లు, పోషకాలు శరీరంలో తగ్గకుండా ఉంటాయి. పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు.
* చిన్నారులకు ఏడో నెల దాటినప్పటి నుంచీ క్రమంగా ఉప్పు, కారం, పులుపులను అలవాటు చేయడం మంచిది.
* చాలామంది పిల్లలు లావు కావట్లేదని, బలంగా లేరని ఎండు ఫలాలను పెడుతుంటారు. ఇవి త్వరగా అరగవు. ఇది తెలియక చాలామంది అన్నం పేస్ట్‌లోనో, పండు పేస్ట్‌లోనో కలిపి పెడుతుంటారు. వీటిలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. నిజానికి పిల్లలకు అంత ప్రొటీన్ అవసరం లేదు. ఇలా చిన్నారులకు ఏది కావాలో, ఏది వద్దో తెలుసుకుని అలవాటు చేయాలి. పిల్లలకు కొత్తగా ఏది అలవాటు చేయాలనుకున్నా కొద్ది మోతాదులో ముందుగా రెండు రోజుల పాటు పెట్టాలి. ఏదైనా తేడా చేసిందేమో చూసుకోవాలి. ఏ తేడా జరగకపోతే వారికి దాన్ని ఇవ్వొచ్చు అని అర్థం. ఇలా పిల్లలకు జాగ్రత్తగా ఏ ఆహారం ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు అని చూసుకుని పెట్టడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. *