మెయిన్ ఫీచర్

రాతిగట్టుపై వటవృక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటిన ఒక్కో మొక్కను కాపాడుకునేందుకు మహిళలు గుట్టకు దిగువన ఉన్న మంజీర నది నుండి బిందెలతో నీరు తీసుకువచ్చి పోసి పెంచి పోషించారు. ఇప్పుడు ఆ గట్టు ప్రాంతమంతా పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది.

కష్ట్ఫేలి అని పెద్దలు ఊరికే అనలేదు. శ్రమకు తగ్గ ఫలితం తప్పకుండా వస్తుందనేది జగమెరిగిన సత్యం. అలాంటి ఎన్నో సత్యాలకు అక్షరూపం దాల్చుతూ డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) ఆధ్వర్యంలోని మహిళా సంఘాలు యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయన్నట్లుగా, గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల్లోనే చైతన్యం తీసుకురావచ్చని నిరూపించాయి ఈ మహిళా సంఘాలు. మూడు దశాబ్దాల క్రితం ఏర్పాటైన డీడీఎస్ అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, పురస్కారాలను అందుకుని తనకుతానే సాటిగా నిలిచింది. ఐక్యరాజ్య సమితి అందించే పర్యావరణ పురస్కారానికి 2018-19 సంవత్సరానికి ఎంపికై ఎన్నో ప్రశంసలు అందుకుంటుందీ సంస్థ. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఝరాసంగం, జహీరాబాద్, న్యాల్‌కల్, రాయికోడ్ తదితర మండలాల పరిధిలో డీడీఎస్ సంఘాలను విస్తరించింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా వ్యవసాయ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం, రసాయనిక ఎరువులు, ప్రాణాంతకమైన క్రిమిసంహారక మందులను విచ్చలవిడిగా ఉపయోగిస్తుండటంతో భూసారం తగ్గిపోయి పంటల దిగుబడి తగ్గిపోతున్న తరుణంలో డీడీఎస్ సంఘాల సభ్యులు మాత్రం రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల జోలికి వెళ్లకుండా సేంద్రీయ పద్దతుల్లో పంటలను సాగు చేస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం వరకు పత్తి సాగు అంటే ఏమిటో తెలియని రైతులంతా ఇప్పుడు అదే మోజు కనబరుస్తూ ఆహార పంటలను పూర్తిగా విస్మరిస్తున్నారు. డీడీఎస్ ఆధ్వర్యంలోని రైతులు మాత్రం ఆరోగ్య పరిరక్షణకు పనికొచ్చే కొర్ర, సజ్జ, రాగులు, పెసలు, కందులు, మినుములు, తెల్లకుసుమ, అవుశలు, మిర్చి, మంచి బెల్లం తదితర వాటిని ఉత్పత్తి చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అంతరించిపోతున్న ఆహార పంటలను కాపాడుకుంటూనే పర్యావరణ పరిరక్షణకు దోహదపడే చెట్లను విస్తారంగా పెంచి పోషిస్తున్నారు. రాయికోడ్ మండలం ఇందూర్ గ్రామం మంజీర నదీ పరివాహకానికి అత్యంత సమీపంలో ఉండగా, సింగూర్ ప్రాజెక్టు నిర్మాణంతో ఈ గ్రామం నీట మునిగిపోయింది. ప్రభుత్వం పునరావాసం కల్పించగా కొద్ది కొద్దిగా భూమి ఉన్న రైతులకు మాత్రం వ్యవసాయం లేకుండాపోయింది. ఇందూర్ గ్రామ శివారులో రాళ్లూరప్పలతో కూడిన సుమారు వంద ఎకరాలతో కూడిన గట్టు ప్రదేశం ఉంది. పచ్చదనం కోసమని డీడీఎస్ మొక్కల పెంపకంలో భాగంగా 1994 సంవత్సరంలో ఇందూర్ గ్రామానికి చెందిన మొత్తం 30 మంది మహిళలను సభ్యులుగా చేర్చుకుని రాళ్లతో కూడిన గుట్టపై చెట్ల పెంపకాన్ని సాహసోపేతంగా చేపట్టారు. గుట్టపై మొక్కలు నాటేందుకు గునపంతో తవ్వితే నిప్పు రవ్వలు ఎగిసిపడినా మొక్కవోని ధైర్యంతో మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వేప, చింత, అల్లనేరేడు, రావి, మర్రి, మామిడి, సుబాబుల్ తదితర రకాలకు చెందిన సుమారు 70 ఎకరాల్లో 58 వేల మొక్కలను నాటించారు. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఔషధ గుణాలు ఉన్న మొక్కలను కూడా పెంచడం విశేషం. మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా అనేక అడ్డంకులు సృష్టించడంతో పాటు రాతి గుట్టపై మొక్కలను ఎలా పెంచిపోషిస్తారంటూ అవహేలన చేసిన సందర్భాలు లేకపోలేదు. నాటిన ఒక్కో మొక్కను కాపాడుకునేందుకు మహిళలు గుట్టకు దిగువన ఉన్న మంజీర నది నుండి బిందెలతో నీరు తీసుకువచ్చి పోసి పెంచి పోషించారు. ఇప్పుడు ఆ గట్టు ప్రాంతమంతా పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. చెట్లను పెంచి పోషించిన మహిళలకే చెట్టు, పట్టా అంటూ కలెక్టర్ సర్ట్ఫికెట్లు సైతం అందజేసారు. నాటిన చెట్లకు కాసే కాపును, అవసరమైనప్పుడు నరికి అమ్ముకునే అర్హతను ఆ మహిళలే కలిగివున్నారు. కాగా గ్రామస్తులు కొంత మంది స్వప్రయోజనాల కోసం ఎవరి అనుమతి లేకుండానే అడ్డదిడ్డంగా చెట్లను నరికివేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీడీఎస్‌కు చెందిన చాలామంది మహిళా సభ్యులు అనేక దేశాల్లో పర్యటించి అక్కడి వాతావరణ పరిస్థితులు, పర్యావరణ సమతుల్యత, పంటల సాగు విధానంపై అద్యయనం చేసి వచ్చారు. సంఘాల సభ్యులను ఎప్పుడూ వెన్నంటి ప్రోత్సహిస్తున్న డీడీఎస్ అధినేత పి.వి. సతీష్‌కు మహిళలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో నిర్వహించే కార్యక్రమంలో అత్యున్నత పురస్కారాన్ని సతీష్‌తో పాటు సంఘానికి చెందిన ఒకరిద్దరు మహిళల చేతుల మీదుగా అందుకోనున్నారు.
20 లక్షల మొక్కలు నాటించా : అనసూయమ్మ
ఇంట్లోవాళ్లు వద్దని వారించినా యుక్త వయస్సులోనే డీడీఎస్‌లో సభ్యురాలిగా చేరి 25 సంవత్సరాల్లో దాదాపు 20 లక్షల మొక్కలు నాటించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేశాను. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎండా, వానను లెక్కచేయకుండా, కాలినడకన గ్రామాలకు చేరుకుని సంఘాల సభ్యులను జాగృతం చేసాం. డీడీఎస్ వ్యవస్థాపకుడైన సతీష్ మార్గనిర్దేశంతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తూ ముందుకు వెళుతున్నాం. నాకున్న ఎకరం పొలంలో సేంద్రీయ పద్దతిలో వాము, కంది, జొన్న, మినుములు, పెసలు, కొర్ర, సజ్జ, రాగులు తదితర పంటలను సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. దేశ విదేశాలు ఎన్ని తిరిగి వచ్చినా మన ప్రాంతానికి ఉన్నంత ప్రాముఖ్యత ఎక్కడా కనిపించలేదు. రాయికోడ్ మండలం ఇందూర్, మనూర్ మండలం బోరంచల్లో లక్షకుపైగానే మొక్కలను నాటించి వాటిని పెంచిపోషించామన్న సంతృప్తి కలిగింది. మహిళలంతా సమిష్టిగా పనిచేసి వృక్ష సంపదను కాపాడుకోవడం ఆనందంగా ఉంది. వృక్షాలు ఇచ్చే ఫలాలతో పాటు వంట కలప, సుబాబుల్ చెట్లు పెరిగిన అనంతరం నరికి అమ్ముకోవడం ద్వారా మహిళలు ఆర్థికంగా లాభపడుతున్నారు. జీవిత కాలమంతా పర్యావరణ పరిరక్షణకు అవసరమైన మొక్కల పెంపకానికే అధిక ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు సాగుతా.
సారవంతమైన ఎరువు : సునందమ్మ
రాతిగట్టుపై ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పెంచి పెద్ద చేసిన చెట్ల ఆకులతో సారవంతమైన ఎరువు లభిస్తోంది. ఇలాంటి సారమైన ఎరువును ఒకచోట ప్రోగుచేసుకుని వ్యవసాయ పొలాలకు తరలిస్తే రసాయన ఎరువులన్నీ దిగదుడుపే.. మంచి పంట దిగుబడితో పాటు భూసారం కూడా పెరుగుతోంది. చింత, మామిడి చెట్ల ఖాతలను విక్రయించుకుని సంఘ సభ్యులం నగదు రూపేణ లబ్దిపొందుతున్నాం. సుబాబుల్ చెట్లను అమ్మితే లక్ష రూపాయలు వచ్చాయి. ఎదిగిన చెట్ల విత్తులు నేలపై పడటంతో మొక్కలుగా పెరిగి పెద్దగా పెరుగుతున్నాయి. గ్రామస్తులు కొంత మంది విచ్చల విడిగా చెట్లను నరుకుతూ పర్యావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.
భూ పట్టాలు ఇవ్వాలి : భాగమ్మ
ప్రభుత్వ బంజరు భూమిలో రేయింబవళ్లు కష్టపడి పెంచిన చెట్లపై చెట్టు పట్టా అంటూ సర్ట్ఫికెట్లు ఇచ్చారు. కానీ భూమి లేని తమలాంటి నిరుపేదలకు ఈ ప్రభుత్వ భూమిని అసైన్డ్ చేస్తే మరింతగా అభివృద్ధి చెందుతాం. ఈ విషయంలో అనేక మంది అధికారులను సంప్రదించినా ఎవరు పట్టించుకోవడం లేదు. భూమిలేని దళిత నిరుపేదలకు ప్రభుత్వం మూడెకరాల భూమిని ఇస్తామని చెప్పినట్లుగానే కబ్జాలో ఉన్న తమకు వృక్ష సంపదను మరింతగా పెంచిపోషించుకునేందుకు పక్కా పట్టా చేయాల్సిన అవసరం ఉంది.
ఈ విజయం అందరిదీ : డీడీఎస్ సారథి సతీష్
ఐక్యరాజ్య సమితి ప్రకటించిన పర్యావరణ పురస్కారంలో డీడీఎస్‌కు చెందిన ప్రతి ఒక్క సభ్యులకు భాగస్వామ్యం ఉంటుంది. మూడు దశాబ్దాల కాలంగా మహిళలంతా సమిష్టిగా పనిచేస్తూ పాత పంటలను పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. రైతులపై ఎంతో విశ్వాసంతో తాము చేపట్టిన యజ్ఞం సఫలీకృతమైంది. పత్తి పంటతో భూములన్నీ చౌడుభారపోతున్నాయి. భూసారం కోల్పోయి భవిషత్తులో పంటలు పండించలేని దుస్థితి దాపురిస్తోంది. పత్తిని నిలువరించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆహార పంటల ఉత్పత్తికి రైతులను ప్రోత్సహించి, సేంద్రీయ వ్యవసాయానికి అలవాటుపడేలా చేయాలి. డీడీఎస్ ఆధ్వర్యంలో అనేక మంది శాస్తవ్రేత్తలను తీసుకువచ్చి సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఉద్యోగ రిత్య ఓ రైతును కలిసినప్పుడు, ఆ రైతు చెప్పిన మాటలకు ఆకర్షించి వ్యవసాయాభివృద్ధి కోసం డీడీఎస్ సంస్థను నెలకొల్పాం. అనుకున్న లక్ష్యాలను సాధించడంలో సంఘాల సభ్యులు అందిస్తున్న సహకారం ఎనలేనిది.

-తమ్మలి మురళీధర్ 9989507333