మెయిన్ ఫీచర్

పిల్లలను సంసిద్ధం చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి సెలవులు అయిపోయాయి. బడి తెరిచే సమయం ఆసన్నమైంది. వేసవి సెలవుల్లో సమయమనేదే లేకుండా ఆడేస్తోన్న చిచ్చర పిడుగుల స్వేచ్ఛకు కళ్లెం పడబోతోంది. కారణం ఎల్లుండి నుంచి స్కూళ్లు మొదలవబోతున్నాయి. ఇన్నాళ్లూ ఆటలతో, పాటలతో ఆనందించిన చిన్నారులను మళ్లీ బడిబాట పట్టించాలంటే కాస్త కష్టమైన విషయమే.. కానీ ముందునుంచీ వారిని సిద్ధం చేయించడం వల్ల బడికి వెళ్లే సమయానికి ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. సెలవుల్లో పిల్లలు సమయం అంటూ లేకుండా నిద్రలేస్తూ ఉంటారు. బడి తెరుస్తున్నారంటే మరింతసేపు పడుకోవాలనే చూస్తారు. మరి ఇలాగైతే స్కూలుకు తయారవడంలో వారిపై ఒత్తిడి ఎక్కువవుతుంది. అందుకే పిల్లల దినచర్య ఎప్పుడూ ఓ ప్రణాళిక ప్రకారం ఉండేలా చూడటం మంచిది.
* ఉదయం పిల్లలు తొందరగా నిద్రలేచేలా చూడాలి. లేచిన వెంటనే బద్ధకంగా కూర్చోకుండా చకచకా పనులు పూర్తిచేసుకోమని చెప్పాలి.
* రాత్రిపూట ఎంత ఆడుకున్నా, టీవీ చూసినా సరే.. త్వరగా పడుకునేలా చూడాలి.
* ఇన్ని రోజులు సెలవుల నెపంతో ఇంత సమయం అనేది లేకుండా టీవీలు చూస్తూనే గడిపి ఉంటారు. ఇకనుండి టీవీ చూసే సమయాన్ని కుదించాలి.
* ఇంతవరకూ తల్లులు భోజనం తినిపించడమో, లేకపోతే పెట్టిన భోజనం కబుర్లలో పడి చాలాసేపు తినడమో చేస్తూ ఉంటారు పిల్లలు. అలాకాకుండా పిల్లలకు సమయాన్ని ముందే చెప్పి, ఆ సమయంలోగా భోజనం ముగించమని చెప్పాలి. లేకపోతే బడి తెరిచినప్పుడు లంచ్‌బ్రేక్ సమయంలో భోజనం చేయడానికి ఇబ్బంది పడతారు.
* బడి తెరుస్తున్నారు అని తెలియగానే కొంతమంది పిల్లల్లో ఆందోళన మొదలవుతుంది. తల్లిదండ్రులు అది గమనించకుండా పిల్లల్ని మరికాస్త బెదరకొడతారు. బడి తెరుస్తున్నారు అని తెలియగానే పిల్లల్లో కలిగే మార్పులను గమనించి వారి సమస్యను తెలుసుకోవాలి. నెమ్మదిగా మంచి మాటలతో వారి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి.
* బడి తెరిచే పదిరోజుల ముందు నుంచే వారి పుస్తకాలు, నోటుబుక్కులకు అట్టలు వేయడం, పుస్తకాల బ్యాగు రెడీ చేయడం వంటివి చేయాలి.
* అలాగే గత సంవత్సరం తాలూకు పుస్తకాలు.. లెక్కలు, తెలుగు, ఇంగ్లీషు వంటివి ఒకసారి తిరగేసి, గుర్తుచేసుకోమనాలి. వారు బద్ధకంగా చదవనని విసుక్కుంటే మనమే ఆడుతూ పాడుతూ వారితో మననం చేయించాలి తప్ప బలవంతంగా వారిని చదవమని ఒత్తిడి తేకూడదు.
* పిల్లల స్కూలు డ్రెస్సులు, బాక్సులు, షూస్, సాక్సులు వంటివాటిని ముందే సిద్ధం చేసుకోవాలి. లేకపోతే ఆరోజు హడావుడిలో ఒత్తిడి పెరిగిపోతుంది.
* పిల్లలకు సమయం విలువను నేర్పించాలి.
* క్రమమైన నిద్ర మంచి ఆరోగ్యాన్ని, ఆలోచనలను పెంచుతుంది. అంతేకాకుండా సరైనన్ని గంటల నిద్ర పిల్లలకు అవసరం. ఇది వాళ్ల స్లీప్ సైకిల్‌ను క్రమబద్దీకరించడమే కాకుండా పిల్లలను మరింత శక్తివంతంగా తయారుచేస్తుంది. సమయానుసారంగా పడుకోవడం, లేవడం వంటివి చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్లకు కూడా మంచిది. పెద్దలు సమయానుసారంగా పని చేస్తే పిల్లలు కూడా దాన్ని ఆచరిస్తారు.
* పిల్లలతో చర్చింది ముందుగానే వారి సమయం ప్రణాళికను సిద్ధం చేయాలి. అంటే వాళ్లు రోజూ చదువుకు కేటాయించే సమయం మొదలు నిద్రాహార వేళలు, మిగిలిన అంశాలు, ఆసక్తులు వంటివి గమనించి, పిల్లలతో చర్చింది దినచర్యను తయారుచేయాలి. అందులో ఆటలకు తగిన సమయం తప్పనిసరిగా ఉండాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు సమయానికి అనుగుణంగా మానసికంగా సిద్ధమవుతారు. ఆ ప్రకారం నడుచుకుంటారు. క్రమం తప్పకుండా చదువుతారు కాబట్టి ఒత్తిడి సమస్య కూడా అదుపులో ఉంటుంది. అన్నింటినీ సమన్వయం చేసుకోగలుగుతారు. చదువులో రాణిస్తారు.
* కొంతమంది పిల్లలు స్కూలుకు వెళ్లనని మారాం చేస్తూ ఉంటారు. ఇన్ని రోజుల సెలవుల తర్వాత మళ్లీ బడి అంటే ఎంత కష్టంగా భావిస్తారో చెప్పనవసరం లేదు. ఆ భావన వారిలో రాకుండా ఉండాలంటే పిల్లలకు నచ్చే అంశాలెన్నో స్కూల్లో ఉన్నాయనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయాలి.
* గతంలో స్కూల్లో పిల్లలను చేర్పించాలంటే కనీసం ఐదేళ్లు నిండాలి. కానీ ఈ కాలంలో పిల్లలకు రెండున్నరేళ్లు నిండగానే స్కూల్లో చేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. దాంతో చిన్నప్పటి నుంచే చదువుల వేట మొదలైపోతుంది. ఇంట్లో తల్లి బతిమలాడి నోట్లో పెడితే కానీ ఆహారం తినని పిల్లలు, స్కూల్లో తినడం సరిగా రాక పంపించిన బాక్స్ అలాగే వెనక్కు తెచ్చేస్తారు. దాంతో పిల్లల్లో పోషకాహారలోపం, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి పిల్లలకు ఇంట్లోనే పోషకాలతో కూడిన ఆహారాన్ని ఓపిగ్గా తినిపించాలి.
* అలాగే బాక్సుల్లో కూడా వారు తేలిగ్గా, ఇష్టంగా తినే పోషకాహారాన్ని పెట్టడం వల్ల వారు చకచకా ఆహారాన్ని తినేస్తారు.
*