మెయిన్ ఫీచర్

ఇంటి నుండే భూ పరిరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44, 45 డిగ్రీల సెల్సియస్ దాటిపోతున్నాయి. జూన్ ఐదో తేదీ రాగానే ప్రపంచ పర్యావరణ దినోత్సవాలను జరుపుకుంటాం. కానీ చిన్న చిన్న పద్ధతులను అవలంబించి భూతాపాన్ని తగ్గించుకునే దిశగా కృషి మాత్రం చేయం. వాతావరణ సమాచారం అందించే వెబ్‌సైట్ వెల్లడించిన గణాంకాల ప్రకారం భూగోళంపైనే అత్యధిక వేడి ప్రాంతంగా సెంట్రల్ ఇండియా పేరు నమోదైంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నగరాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. అందుకు కారణం నగరాల్లో చోటు చేసుకుంటున్న మార్పులే అని నిపుణులు అంటున్నారు. అందుకే మధ్య భారతదేశంలోని కొన్ని పట్టణాలు ప్రపంచంలోని పదిహేను అత్యంత వేడి పట్టణాల జాబితాలో చేరాయి. భూమిపై అంతకంతకూ ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి ప్రపంచం వేగంగా స్పందించాలి. కానీ ప్రపంచం అంటే మరెవరో కాదు మనమే..
భూతాపం తగ్గించడం మనవల్లే సాధ్యం అంటున్నారు నిపుణులు. దీనికి సింపుల్‌గా ఐదు పద్ధతులు పాటిస్తే చాలు గ్లోబల్ వార్మింగ్ ప్రమాదకర స్థాయికి చేరకుండా పరిమితం చేయవచ్చు అంటున్నారు. భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రపంచంలోని చాలామంది ప్రముఖ పర్యావరణవేత్తలు ఇలాంటి హెచ్చరికలే చేస్తున్నారు. వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తున్న ఐక్యరాజ్యసమితి ‘ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్’ భూమి ఉపరితల ఉష్ణోగ్రత 12 ఏళ్లలో పారిశ్రామిక విప్లవం ముందు ఉన్నప్పటి దానికంటే 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ పెరగవచ్చని తెలిపింది. భూతాపం ఆ స్థాయికి పెరిగితే అది తీవ్రమైన కరువు, కార్చిచ్చు, వరదలు వంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాదిమందికి ఆహార కొరత ఏర్పడేలా చేస్తుంది. భూమి ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరుకోకుండా ఉండాలంటే ప్రపంచంలో అందరూ ఎక్కువకాలం పాటు ఉండే మార్పులు ఇప్పటి నుంచే చేయడం అవసరం. భూమిపై ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటకుండా దానిని వేగంగా అదుపుచేయడంలో పౌరులు, వినియోగదారులు కీలకమైన పాత్ర పోషిస్తారు. రోజువారీ కార్యకలాపాల్లో చేసే కొన్ని చిన్న చిన్న మార్పుల ద్వారా రాబోయే తరాలకు మెరుగైన, సురక్షితమైన భవిష్యత్తును అందజేయొచ్చు. అవేంటో చూద్దాం..
ప్రజారవాణా
* కారు ఉపయోగించకుండా నడిచి వెళ్లడం, సైకిల్‌పై వెళ్లడం.. అదీ కుదరకపోతే ప్రజారవాణాను ఉపయోగించడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మనం ఫిట్‌గా ఉండటంతోపాటు కర్బన ఉద్గారాలు విడుదల కావడం తగ్గుతుంది.
* నగరాల్లో ఎక్కడికి, ఎలా వెళ్లాలో కూడా మనమే ఎంచుకోవచ్చు. ఒకవేళ కచ్చితంగా సొంత వాహనంలో వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించవచ్చు.
* దూర ప్రయాణాలకు విమానాల బదులు రైళ్లను ఎంచుకోవచ్చు.
* వ్యాపార పర్యటనలు రద్దు చేసుకోవడానికి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండాలి. దీనికి బదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ పనులు పూర్తి చేసుకోవచ్చు.
విద్యుత్ ఆదా
* శిలాజ ఇంధనాలను, విద్యుత్తును ఆదా చేయాలి.
* బట్టలు ఆరేయడానికి వాషింగ్ మెషిన్ డ్రయ్యర్‌ను ఉపయోగించడం కంటే ఒక తాడుపై బట్టలను పిండి ఆరేయడం ఉత్తమం.
* చల్లబడడానికి ఏసీని ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం, వేడెక్కడానికి హీటర్లను తక్కువ ఉష్ణోగ్రతలో ఉపయోగించడం వల్ల కూడా చాలా విద్యుత్ ఆదా అవుతుంది.
* చలికాలంలో ఇంట్లో వేడిని కోల్పోకుండా పై కప్పుకు ఫైబర్ లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి వాటితో మరింత రక్షణ కల్పించడం మంచిది. దానివల్ల విద్యుత్ ఉపకరణాలపై ఆధారపడడం తగ్గుతుంది.
* ఏవైనా విద్యుత్ పరికరాలను ఉపయోగించినప్పుడు వాటిని స్విచ్ ఆఫ్ చేయండి. ప్లగ్ నుంచి తీసివేయండి. ఇవి మీకు చిన్న చిన్న మార్పుల్లాగే కనిపించవచ్చు. కానీ విద్యుత్ ఆదాకు ఇవి సమర్థంగా పనిచేస్తాయి.
* ఈసారి బయట ఏదైనా విద్యుత్ పరికరం కొంటున్నప్పుడు దాని ‘ఎనర్జీ ఎఫిషియన్సీ’ చెక్ చేయండి.
* కొన్ని అవసరాల కోసం సోలార్ వాటర్ హీటర్, సోలార్ గీజర్ వంటి పునరుత్పాదక శక్తి వనరులు కూడా ఉపయోగించవచ్చు.
శాకాహారం
* పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యాల ఉత్పత్తి కంటే మాంసం ఉత్పత్తి వల్ల గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువగా విడుదల అవుతాయి.
* ప్యారిస్ పర్యావరణ సదస్సులో వ్యవసాయ రంగంలో ఉద్గారాలు తగ్గిస్తామని 119 దేశాలు ప్రమాణం చేశాయి. కానీ ఎలా చేస్తామనే విషయం మాత్రం అవి చెప్పలేదు. కానీ దానికి మీరు కూడా సాయం చేయవచ్చు.
* మాంసం తినడం తగ్గించాలి. దానికి బదులు మరిన్ని కూరగాయలు, పండ్లు తినాలి.
* పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడాన్ని తగ్గించడం వల్ల వీగన్‌గా మారడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి.
* పాల ఉత్పత్తుల తయారీ వల్ల, వాటిని సుదూర ప్రాంతాలకు రవాణా చేయడం వల్ల గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలవుతున్నాయి.
* పాల ఉత్పత్తులకు బదులు స్థానికంగా ఆయా కాలాలను బట్టి దొరికే ఆహార పదార్థాలను ఎంచుకోవడం మంచిది.
నీళ్లు
* నీళ్లను రీసైక్లింగ్ చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనకు తెలుసు. కానీ రీసైకిల్ చేసే పదార్థాలను రవాణా చేయడం, వాటిని ప్రాసెసింగ్ చేయడం అనే ప్రక్రియతో కూడా కర్బన ఉద్గారాలు విడుదలవుతాయి.
* ఒక ఉత్పత్తిని ముడిపదార్థాల నుంచి చేయడం కంటే దానిని రీసైకిల్ చేయడానికి చాలా తక్కువ విద్యుత్‌ను వినియోగించవచ్చు.
* ఇలా ఉత్పత్తి తగ్గించి వస్తువులను మళ్లీ మళ్లీ ఉపయోగించడం వల్ల వనరుల నష్టం తగ్గించడానికి సాయం చేయవచ్చు. నీళ్లకు కూడా ఇది వర్తిస్తుంది.
* మనం వర్షపు నీటిని సేకరించాలి అనుకున్నప్పుడు వాటిని కచ్చితంగా సంరక్షించాలి. మళ్లీ మళ్లీ వినియోగించాలి.
చైతన్యం
* ప్రపంచంలో పర్యావరణ మార్పుల గురించి, భూతాపం గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి.
* ఒక స్థిరమైన జీవితం గడిపేలా అందరూ కలిసి చర్చించుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలి.
* పంటల పద్ధతులు, విద్యుత్ ఆదా చిట్కాలు, రీసైకిల్ ప్రయోజనాలు వంటివి అందరికీ తెలిసేలా ‘షేర్డ్ నెట్‌వర్క్’ గ్రూపులను ఏర్పాటు చేయాలి.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు ఇలాంటి చిన్న చిన్న మార్పులు ప్రతిరోజూ పాటిస్తే.. అది వారి సంక్షేమంపై చాలా ప్రభావం చూపిస్తుంది. అభివృద్ధి స్థిరంగా ఉండేలా చేస్తుంది. భూతాపం తగ్గించడానికి, రాబోవు తరాలకు మెరుగైన, సురక్షితమైన భవిష్యత్తు అందించడానికి సాయం అవుతుంది.

- సన్నిధి