మెయిన్ ఫీచర్

మొదటిసారి కాలేజీకా..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలేజీలో మొదటిసారిగా అడుగుపెట్టినప్పుడు కలిగే అనుభూతిని ఎవరూ తమ జీవితంలో మరిచిపోలేరు. అక్కడ చేరాకే అన్నీ తెలుసుకుంటాం. నేర్చుకుంటాం. ఊర్ల నుంచి పట్టణాలకు చదువుకోసం వచ్చే అమ్మాయిలు ఆ అనుభూతుల్ని పదిలపరుచుకోవాలంటే.. వాళ్లు అధిగమించాల్సిన సమస్యలేంటో, వాటికి పరిష్కారాలేంటో తెలుసుకుందాం.
* చదువు, భాష, ఆహార్యం.. ఇలా ఏదైనా సరే అనుకుంటే సాధించవచ్చు.
* చదువు సమస్య అయితే.. ఏయే సబ్జెక్టులో మీరు బలహీనంగా ఉన్నారో ఒక చోట రాసుకోవాలి. ఆంగ్లం మాట్లాడటమే ఇబ్బంది అయితే తరచుగా స్నేహితులతో కలిసి మాట్లాడటం, ఆంగ్ల పత్రికలు చదవడం, మాట్లాడే ఆంగ్ల తరగతులకు వెళ్లడం వల్ల ఆత్మవిశ్వాసం వస్తుంది.
* నలుగురిలో ధైర్యంగా మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉందా? అయితే భిన్న ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. వారినే గమనించాలి. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో వాళ్ల నుంచే నేర్చుకోవచ్చు. వీలైనంతవరకూ అందరితో నవ్వుతూ, ఎంతలో ఉండాలో అంతలో ఉంటూ కలిసిపోవాలి.
* కేవలం చదువు మాత్రమే ప్రపంచం అనుకోకుండా.. స్నేహితులు, సరదాలు, ఆటలు, ఇతర అభిరుచుల్లో కూడా భాగం కావాలి. అయితే విద్యార్థులందరి అంతిమ లక్ష్యం మాత్రం చదువులో గొప్పగా రాణించడమే.
* ఇబ్బందికరమైన విషయాలను అమ్మానాన్నలు, తోబుట్టువులతో పంచుకోవాలి. సమస్య తలెత్తగానే.. అది చిన్నదా, పెద్దదా అని కాకుండా దాన్ని మొదట సన్నిహితులతో పంచుకోవాలి. వారి సలహాలు తీసుకోవాలి.
* నగరం, ఊరు పరిస్థితుల్లో చాలా తేడా ఉంటుంది. దానితో అమ్మాయిలు కల్చర్ షాక్‌కు గురవుతారు. అలాంటప్పుడు కొన్ని ఆకర్షణలకు కూడా ప్రభావితం కావచ్చు. అలాంటప్పుడు జాగ్రత్తగా లేకపోతే సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.
* స్నేహం చేసే గ్రూపు సభ్యులతో సర్దుకుపోవాలి. అయితే వారి చర్యలు శృతి మించితే కాలేజీలో ఫిర్యాదు చేయాలి. స్వేచ్ఛ లభించింది కదాని దుర్వినియోగం చేయకూడదు. దానివల్ల మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
* అమ్మానాన్నలతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండాలి. వారాంతాల్లో ఇంటికి వెళ్లి వస్తుంటే వారిపై బెంగ ఉండకూడదు. అప్పుడప్పుడూ వారినే కాలేజీకి రమ్మనమని చెప్పాలి.
* కాలేజీలో ఎవ్వరితోనూ పోల్చుకోకూడదు. ఉన్నతమైన వ్యక్తిత్వానికే ప్రాధాన్యం ఇవ్వాలి. తెలియనివారితో బయటకు వెళ్లడం, వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వంటివి చేయకూడదు.
* తోటివారి గురించి పూర్తిగా తెలియకుండా వారితో కలిసి సినిమాలకు, షికార్లకు వెళ్లడం చేయకూడదు.
*