మెయిన్ ఫీచర్

సమానత్వంతోనే అన్నీ సాధ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది మహిళలు కలలు కనే
అద్భుత ప్రపంచం..
సమానత్వం పరిమళించే
సమసమాజం..
ఇది ఎవరో ఇచ్చింది కాదు.. సృష్టించిందీ కాదు.. మహిళలకోసం మహిళలే పోరాడి తెచ్చుకుంది.. వివరాల్లోకి వెళితే..
అది ఐరోపాలోని చిన్న ద్వీపమైన ఐస్‌ల్యాండ్. ఎటు చూసినా సరస్సులు, జలపాతాలు, వేడిబుగ్గల అందాలతో కనువిందు చేస్తుంది. అక్కడక్కడా మహిళల పోరాటాలకు ప్రతీకలుగా ఉన్న అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయి. ఇవి చరిత్రకు సంకేతంగా, నేటి చైతన్యానికి ప్రతిబింబాలుగా కనిపిస్తాయి. ఈ ప్రకృతి రమణీయ ప్రాంతం పడతుల స్వర్గంగా ఎలా మారిందో తెలియాలంటే నాలుగు దశాబ్దాలు వెనక్కి వెళ్లాలి.
సమానత్వ సాధనకు అడ్డంకులుగా ఉన్న సమస్యలన్నీ ఆ దేశంలో కూడా వేళ్లూనాయి. మహిళలంటే చిన్నచూపు, అధికారానికి వారిని దూరంగా ఉంచడం, పురుషుడి కన్నా తక్కువ జీతం ఇవ్వడం, ఉద్యోగంతో పాటు ఇంటిపనుల బాధ్యత, పనిచేసే చోట లైంగిక వేధింపులు, ఇళ్లల్లో హింస... అన్నీ ఇక్కడా చోటుచేసుకున్నాయి. మహిళను శక్తి స్వరూపిణిగా కీర్తించే పురాణాలు స్ర్తిలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అక్కర్లేదని చెప్పే స్మృతులూ వారికీ ఉన్నాయి. మరి తేడా ఏమిటీ అంటే.. అక్కడి మహిళలు త్వరగా మేల్కొన్నారు. 1850లోనే మహిళలకు పురుషులతో సమానంగా వారసత్వ హక్కు ఇచ్చింది. దాన్ని సమానత్వం తమ హక్కని గుర్తించారు ఐస్‌లాండ్ మహిళలు. దానే్న ప్రశ్నించారు, పోరాడారు.. ఇదే ఐస్‌లాండ్ ప్రత్యేకత. సమానత్వం దిశగా ఆ దేశం సాధించిన ప్రగతి గురించి తెలియాలంటే అభివృద్ధి పథంలో ఐస్‌లాండ్ చేసిన పోరాటం గురించి తెలుసుకోవాలి. 1975 అక్టోబర్ 24న సమ్మె అంటే ఎలా ఉంటుందో ఆ దేశానికి తొలిసారి అనుభవంలోకి వచ్చింది. దుకాణాలు, హోటళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బడులు, కాలేజీలు, రేడియో స్టేషన్లతో సహా దాదాపుగా అన్నీ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆ రోజంతా తినడానికి ఏమీ దొరకలేదు. పూర్తిగా కర్ఫ్యూ విధించిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ దేశంలోని మహిళలంతా సమ్మె చేశారు. పొద్దునే్న ఇంటిపని, వంటపని, పిల్లలు, భర్త.. ఇలా అన్నింటినీ సమన్వయపరుచుకునే మహిళలు ఆ రోజు ఏ పనినీ ముట్టుకోలేదు. అన్ని పనులను బంద్ చేశారు. సమ్మె అంటే సమ్మే.. చిన్నపిల్లలకు అన్నం పెట్టాలని, వృద్ధులైన అత్తమామల్ని చూడాలనే సాకులు ఎవ్వరూ చెప్పలేదు. అందరూ మాటపై నిలబడి సమ్మెలో పాల్గొన్నారు. తెల్లవారుతూనే ధర్నాచౌక్‌కి వెళ్లిపోయారు. 3సమాన గౌరవం, సమాన వేతనం2 అంటూ తమ హక్కులను నినదిస్తూ రాత్రి దాకా అక్కడే ఉండిపోయారు. దేశంలో నూటికి తొంభై శాతం మహిళలు సమ్మెచేయడం ప్రపంచ చరిత్రలోనే అదే ప్రథమం. సగం జనాభా సమ్మె చేస్తే ఏమవుతుందో ప్రపంచం చూసింది అప్పుడే.. 3విమెన్స్ డే ఆఫ్2గా ఐస్‌లాండ్ చరిత్రలో నిలిచిపోయిన ఆ రోజు గురించి నేటి తరం కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది.
మిగతా దేశాల్లానే ఐస్‌లాండ్‌లోనూ చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం నామమాత్రంగానే ఉండేది. అలాంటిది సమ్మె తర్వాత పరిస్థితులు మారాయి. మహిళలు సంఘటితమై సమావేశాలు, చర్చలు కొనసాగించారు. అన్ని సమావేశాల తీర్మానం ఒకటే.. అదే రాజకీయాధికారం. రాజకీయాల్లో తమ భాగస్వామ్యం పెరిగితే కానీ స్ర్తిలకు ఉపయోగకరమైన విధానాలు అందుబాటులోకి రావని భావించారు. పురుషులతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించి అన్ని పార్టీల్లోనూ తమ ఉనికిని చాటారు. దానితో నెమ్మదిగా స్థానాలు పెరుగుతూ వచ్చాయి. సమ్మె తరువాత ఐదేళ్లకు చట్టసభల్లో వారి శాతం ఐదుకి పెరిగింది. అయితే ఊహించనివిధంగా విగ్దిస్ ఫిస్‌బొగాడొట్టిర్ ఐస్‌లాండ్‌కి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యారు. నిజానికి గెలుస్తానని ఆమె అనుకోలేదట. ఆమె గెలుపు ఐరోపా ఖండంలోనే సంచలనమైంది. తర్వాత మూడేళ్లకు 3మహిళల రాజకీయ పార్టీ2 ఏర్పడి మహిళా చైతన్యాన్ని మరింత ప్రభావితం చేసింది. పదహారేళ్ల పాటు ప్రజాదరణ పొందిన నాయకురాలిగా విగ్దిస్ కొనసాగడం మహిళల పార్టీ ఏర్పడడం రాజకీయాల్లో మహిళల ప్రవేశాన్ని వేగవంతం చేశాయి. చట్టసభల్లో మహిళల శాతం ఐదు నుంచి యాభైకి పెరిగింది. ఇప్పుడు అయితే పార్లమెంటులో ఏకంగా 53 శాతం మహిళలే.. ఇలా చట్టసభలో మహిళల సంఖ్య పెరగడం క్రమంగా పురుషుల దృక్పథంలో మార్పుకు దారితీసింది. గత రెండు దశాబ్దాల్లో ఐస్‌లాండ్‌లో చాలా చట్టాలు చేశారు. వాటిని అక్కడివారు స్ర్తి వాద చట్టాలంటారు. ఎందుకంటే మహిళలు చట్టసభలకు రాకముందు ఇవేవీ అక్కడ ముఖ్యమైన విషయాలు కాదు. మహిళా పార్టీ ప్రభావంతో గెలిచినవారు తొలి కీలక సంస్కరణ ఏంటంటే.. రెండేళ్లు నిండిన పిల్లలకోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం. ఇది మహిళలు వృత్తి ఉద్యోగాల్లో కొనసాగడానికి ఎంతో తోడ్పడింది. స్ర్తి, పురుషులకు సమాన హోదా, సమాన హక్కులను కల్పిస్తూ 2000 సంవత్సరంలో మరో కీలక చట్టం చేశారు. సంపూర్ణ సమానత్వమే లక్ష్యంగా రూపొందిన ఈ చట్టం లింగవివక్ష సంఘటనలతో మొదలుపెట్టి భాషలో లైంగికతకు సంబంధించిన ఒక్కో పదం వాడుక వరకూ ఎన్నో అంశాలను చాలా నిశితంగా పరిశీలిస్తుంది. అక్కడ ఏ విషయంలో స్ర్తి అనీ, పురుషుడు అనీ విడదీసి చూడరు. మనిషిని మనిషిగా చూస్తారే తప్ప వారి లైంగికతకు ప్రాధాన్యం ఇవ్వరు. అందుకే స్వలింగ సంపర్కురాలు ప్రధానమంత్రి అయిన తొలిదేశంగా ఐస్‌లాండ్ చరిత్ర సృష్టించింది. సమానత్వం సాధించాలంటే మొత్తంగా సమాజం దృక్పథంలో మార్పు రావాలి. ఆ దిశగానే పలు కొత్త చట్టాలను చేసింది ఐస్‌లాండ్. చట్టసభల్లో సగం మహిళలే ఉండడం వల్ల చట్టాలను ఆమోదింపచేసుకోవడం, అమలు చేయడమూ సులువైంది.
ఆ దేశంలో అమలుచేసే మరికొన్ని విధానాలు..
* ప్రపంచమంతా మాతృత్వ, పితృత్వ సెలవులు అంటుంటే ఐస్‌లాండ్‌లో పేరెంటల్ (తల్లిదండ్రుల) సెలవు విధానాన్ని తెచ్చింది. అక్కడ తల్లితో సమానంగా తండ్రీ పిల్లల్ని చూసుకోవాలి. కాన్పు అయిన తొలి ఐదునెలలు తల్లి తర్వాత ఐదు నెలలు తండ్రి సెలవు పెట్టాలి.
* స్ర్తిలకు తక్కువ జీతం ఇస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తేవాలనే ఆ రోజు వారంతా నిరసన ప్రదర్శన జరిపారు. దాంతో ప్రతి సంస్థా స్ర్తి, పురుషులకు సమాన వేతనం ఇస్తున్నట్లు నిరూపించుకోవాలని కొత్త ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం.
* 50 మంది ఉద్యోగులున్న ప్రతి కంపెనీ బోర్డులోనూ తప్పనిసరిగా నలభై శాతం మహిళలు ఉండాలంటూ చట్టం చేసింది. మహిళలను వెనక్కి నెడితే దేశ ఆర్థిక వ్యవస్థ వెనక్కే వెళ్తుందని గట్టిగా నమ్మే దేశం ఐస్‌లాండ్.
సమానత్వం ఒక్కటి సాధిస్తే చాలు, అదే అన్ని రంగాల్లోనూ ప్రగతికి బాటలు వేస్తుందనడానికి నిదర్శనం ఐస్‌లాండ్. ఒకప్పటి అతి పేద దేశం ఇప్పుడు ఐరోపాలోని సుసంపన్న దేశాల్లో ఒకటి. మానవాభివృద్ధి నివేదికలో ప్రపంచంలోనే తొమ్మిదోస్థానంలో నిలుస్తోంది. తీరప్రాంత సైన్యం తప్ప సైన్యం అనేది లేక ఈ దేశం గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో ప్రథమస్థానంలో ఉంది. సమానత్వం ఒక్కటి సాధించుకుంటే చాలు.. అన్నింటిలోనూ ఉన్నతంగా ఉంటాం అని నిరూపించింది ఈ చిన్న దేశం. మరి పెద్ద దేశంలో ఉన్న మనం సమానత్వం సాధించేది ఎప్పుడో..?

-మహి