మెయిన్ ఫీచర్

మాఫియాను మట్టికరిపించిన ముగ్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె ఏం చేసినా సంచలనమే..
ఆమెలోని సిన్సియారిటీ, సమర్థత వల్ల పదేళ్లలో పదమూడు బదిలీలను బహుమతులుగా అందుకుంది..
ఆర్నెల్లలోనే అరవై ఏళ్ల పాలనా సంస్కరణలు తెచ్చిన వనిత..
ఫలితంగా మాఫియా బెదిరింపులు.. మందుపాతరలు.. అయినా ముగ్ధ సిన్హా బెదర్లేదు.. వెనకడుగు వేయలేదు. ఐ.ఎ.ఎస్. ఎందుకు కావాలనుకుందో ఆ లక్ష్యం కోసమే అహరహము పనిచేస్తోంది. ముగ్ధ ఎప్పుడూ సామాన్యుల పక్షమే.. రాజస్థాన్ కేడర్‌కు చెందిన ముగ్ధ ప్రస్తుతం రాజస్థాన్, ఢిల్లీ మధ్య పాలనా వ్యవహారాల్లో కీలక బాధ్యతలను నిర్వహిస్తోంది. వివరాల్లోకి వెళితే..
ముగ్ధ తండ్రి పేరు గురు స్వరూప్ సిన్హా.. అతను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలెట్‌గా పనిచేసేవాడు. చైనాతో, ఆ తర్వాత 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. 1978లో విమాన ప్రమాదంలో మరణించాడు గురు స్వరూప్ సిన్హా. అప్పుడు ముగ్ధ వయస్సు నాలుగేళ్లు. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు. ముగ్ధ తల్లి కమలా సిన్హా కష్టపడి పిల్లల్ని పెంచి, పెద్ద చేసింది. భర్త చనిపోయాక ఆమె పిల్లల్ని తీసుకుని ఆగ్రా వెళ్లింది. పాఠశాల విద్యను అక్కడే పూర్తిచేసింది ముగ్ధ. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో హిస్టరీ హానర్స్ చదివింది ముగ్ధ. కాలేజీలో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేది ముగ్ధ. యూనివర్శిటీ థర్డ్ ర్యాంకర్. ఆమె ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఎం.ఏ. చేసింది. సమాజాన్ని సంస్కరించడం కోసం ముగ్ధాకు ఐ.ఎ.ఎస్. లక్ష్యాన్ని నిర్దేశించింది తల్లి కమల. తల్లి కోరికను నెరవేర్చేందుకు సెకండ్ అటెంప్ట్‌లోనే ఐ.ఎ.ఎస్. సాధించింది ముగ్ధ. సివిల్స్‌లో ఆమెది ఇండియాలో ఎనిమిదో ర్యాంకు. జైపూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ ముగ్ధనే.. రెండేళ్ల పాటు రాజస్థాన్‌లో సి.ఎం. ఆఫీసులో పనిచేసింది. తరువాత 2005లో జిల్లా కలెక్టర్‌గా మొదటిసారి నియమితురాలైంది. సివిల్ సర్వీస్ అనేది ఆమె దృష్టిలో ఉద్యోగం కాదు.. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. 3నిజంగా ప్రజా సేవే.. ఇది సామాన్యుల సంక్షేమం కోసం చేసే సేవ. మనం చేసిన మంచి పనులే తర్వాతి తరాల వాళ్లకు అందే వారసత్వం.. ఆ పనులే ప్రజల హృదయాల్లో మనకు సుస్థిర స్థానం కల్పిస్తాయి2 అంటారు ముగ్ధా సిన్హా.
అది రాజస్థాన్‌లోని ఝన్‌ఝను జిల్లా.. ఆ జిల్లాలోని పల్లెల్లో.. చట్టబద్ధమైన అనుమతి, అంగీకారం లేకుండా యథేచ్ఛగా మైనింగ్ జరుగుతోంది. అక్కడ అగ్రకులాల వాళ్లు ఏది చెబితే అదే చట్టం.. ఏం చేస్తే అదే న్యాయం. మైనింగ్ మాఫియా, బోర్‌వెల్స్, గ్యాస్ సిలిండర్స్, బ్లాక్ మార్కెటింగ్.. ఇలా ఎన్నో.. ఒకసారి ఓ గ్రామంలో మైనింగ్ కోసం పేలుడు పదార్థాలు పెట్టారు. ధనార్జనే ధ్యేయంగా, కూలీల ప్రాణాలను లెక్కచేయలేదు. ఫలితంగా ఆ పేలుడికి కొంతమంది ప్రాణాలు గాల్లో కలిశాయి. ఎక్కడ చూసినా తెగిపడిన అవయవ అవశేషాలే.. ఊరంతా వణికిపోయింది. దానికి బాధ్యులు ఎవరో తెలిసి కూడా ఎవ్వరూ నోరు మెదపలేదు. స్థానిక మైనింగ్ కంపెనీలు తమకేమీ తెలీనట్లు నోరు మెదపలేదు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్నిచ్చే బాధ్యతను కూడా తీసుకోలేదు. చివరకు ఈ మరణాలకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించింది. కానీ ఆ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తోన్న ముగ్ధా సిన్హా మాత్రం వౌనం వహించలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఆ జిల్లా కలెక్టర్స్‌గా పనిచేసిన పురుష ఐ.ఏ.ఎస్. అధికారులే భయపడుతుంటే ఓ మహిళా ఐ.ఏ.ఎస్. నోరు తెరవడం అక్కడ ఎవరూ ఊహించని విషయం. కానీ ముగ్ధ మాత్రం ఎలాగైనా ఆ మైనింగ్ సంస్థను మూయించాలనుకుంది. ఫలితంగా కొన్ని నెలల పోరాటం, బెదిరింపులు, బదిలీలు.. ఇలా చాలా జరిగాయి. అన్నీ జరిగాక చివరకు న్యాయమే గెలిచింది. మైనింగ్ సంస్థ మూతపడింది. ఇదంతా ముగ్ధ సాధించిన విజయం. అలా ఆ జిల్లాకు వచ్చిన మొదటి మహిళా కలెక్టర్‌గానే కాదు.. ఆ జిల్లాను ఓ దారిలో ఐ.ఏ.ఎస్.గా కూడా చరిత్ర సృష్టించింది. నిజానికి నలభై లక్షల జనాభా ఉన్న పెద్ద జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసిన ముగ్ధ ఝన్‌ఝనుకు బదిలీ అవ్వగానే.. చిన్న జిల్లా హాయిగా పనిచేసుకోవచ్చని ఊపిరి పీల్చుకుందట ముగ్ధ. తీరా అక్కడికి వచ్చాక పరిస్థితి తెలుసుకుని ఎదుర్కోవాల్సిన ఛాలెంజెస్ పెద్దవని తెలుసుకుని, ఏమాత్రం బెదరకుండా ఎదురొడ్డింది. పైగా బ్యూరోక్రాట్స్‌లో నాలుగు రకాలుంటారు. ఒకటి.. నిజాయితీగా, సమర్థవంతంగా పనిచేసేవారు. రెండు.. నిజాయితీగా ఉన్నా సామర్థ్యం లేనివాళ్లు. మూడు.. సామర్థ్యం ఉన్నా నిజాయితీ లేని వాళ్లు. నాలుగు.. అవినీతి, అసమర్థులైన ఆఫీసర్లు.. ఇన్ని తెలిసిన ముగ్ధ తను నిజాయితీగా ఉండాలి, సమర్థవంతంగా పనిచేయాలి అనుకుంది. ఆ సూత్రాన్ని నమ్మే ఆ జిల్లాలోని పరిస్థితులకు వెరవలేదట. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాక, మైన్స్ మూసేశాక ముగ్ధను బెదిరిస్తూ చాలా ఫోన్‌కాల్స్ వచ్చాయట. 3మళ్లీ మా మైన్స్ ఎప్పుడు తెరుస్తున్నారు2 అంటూ ఒకటే ఫోన్లు. అలా ఫోన్ చేసిన వాళ్లెవరూ నిజమైన యజమానులు కారట. యజమానులు ఫోన్ చేయించిన మధ్యవర్తులు. అలాంటి ఏ ఒత్తిళ్లకూ తలొగ్గలేదు ముగ్ధ. ఝన్‌ఝనులో జరుగుతున్న ఇతర అరాచకాలకూ ఆమె అడ్డుకట్ట వేసింది. మైనింగ్ తర్వాత ఆ రేంజ్‌లోనే ఉన్న గ్యాస్ సిలెండర్ల బ్లాక్ మార్కెట్‌నూ బ్లాక్ చేసేసింది. అలాగే అనుమతి లేకుండా వేస్తున్న బోర్‌వెల్స్‌ను పూడ్చేయించింది. హర్యానా నుంచి బోర్‌వెల్ మెషీన్స్ వచ్చేవి. వాటన్నిటినీ సీజ్ చేయించింది. ఝన్‌ఝనూను పట్టి పీడిస్తున్న మరో రుగ్మత అయిన అగ్రకుల అహంకారాన్ని తుంగలో తొక్కింది ముగ్ధ. సామాన్యులు తమ బాధలు చెప్పుకోవడానికి కలెక్టర్ ఆఫీసు ముందు వరుస కడితే.. వాళ్ల ముందు అగ్ర కులస్థుల సమూహం ఉండేది. అగ్రకులస్థులు కలెక్టర్‌ను కలిసి మాట్లాడిన తరువాతే నిమ్నకులస్థులు కలవాలి. ఇదీ అక్కడి ఆనవాయితీ. ఈ సంప్రదాయాన్ని అస్సలు పట్టించుకోలేదు ముగ్ధ. అసలు ఎవరూ తన ఆఫీసు ముందు క్యూ కట్టకముందే గ్రామాల్లోకి వెళ్లిపోయి ప్రత్యక్షంగా సామాన్య ప్రజలను ఆమె కలిసేది. వాళ్ల అర్జీలు, దరఖాస్తులు తీసుకునేవారు. సత్వర పరిష్కారం కోసం అంతే శ్రమించేది. ఆఫీస్ పనివేళలు అయిపోయి, పని మిగిలిపోతే ఆ ఫైల్స్ పట్టుకుని ఇంటికి వెళ్లేది. రాత్రంతా కూర్చుని ఫైల్స్ చెక్ చేసిన తరువాత ఆమె ప్రశాంతంగా నిద్రపోయేది. ఆమె నిజాయితీ, సామాన్యులకు అండగా ఉన్న తీరు మైనింగ్ మాఫియా, బ్లాక్ మార్కెటింగ్‌పై ఆమె ఉక్కుపాదం మోపడం.. ఇలాంటివన్నీ గిట్టని పెద్దలు ఆరు నెలల్లోనే ముగ్ధకు ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ ఇప్పించేశారు. ఆ ఆర్డర్ తీసుకునే ముందే.. ఆరావళి పర్వత సాణువుల్లోని మైన్స్‌లో ఇల్లీగల్ మైనింగ్ కోసం పేలుడు పదార్థాల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కులన్నిటినీ ముగ్ధ సీజ్ చేయించింది. ఇది జరిగి దాదాపు తొమ్మిది సంవత్సరాలు అయ్యింది. ఇప్పటి కూడా ఆ మైన్స్ తెరచుకోలేదు. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఎవరూ చేయట్లేదు. అడ్మినిస్ట్రేషన్‌లో ముగ్ధ వేసిన ముద్ర ఇది.. *