మెయిన్ ఫీచర్

ప్రకృతి హననం.. భవిత భయానకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి సహజ వనరులను అభివృద్ధి, నాగరిక జీవనం కోసం శృతిమించి కొల్లగొట్టడం నేటి ప్రభుత్వాలు- సమాజం ప్రగతి, పురోగతి సాధించే కర్తవ్యంగా భావిస్తున్నాయ. నేల, గాలి, నీరు ప్రధానంగా జీవనావసరాలు విపరీత కాలుష్యంతో, మనిషి మనుగడను మృత్యుముఖం వైపు నడిపిస్తున్నాయి. అధిక ఆహారోత్పత్తి కోసం రసాయనక వ్యవసాయం, వాయు, జల కాలుష్యలతో బతుకు ప్రశ్నార్థకమవుతోంది. మన దేశంలో మహానగరాలు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్య సంపద ప్రసాదించే ఆహారం, తాగటానికి నీరు లేక సామాన్య జనావళి నిరంతర జీవన సంక్షోభం ఎదుర్కొంటున్నారు. సృష్టి, స్థితి, లయ ఆదినుంచి అధునాతనం వరకు జీవన విధానం క్రమేపీ గతి తప్పి భూగోళం వేడెక్కి మనుగడ భీతావహం అవుతోంది. వా తావరణ దుష్పరిణామాలను అరికట్టని పక్షంలో మనం నివశిస్తున్న భూమి కూడా శుక్రగ్రహంలా మృత్యుబీభత్స కోరలలో చిక్కుకొని విలయాన్ని ఆహ్వానించక తప్పదని ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్ర మేధావి స్టీఫెన్ హాకింగ్ ఇటీవల హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి ఆదేశానుసారం, 195 దేశాలు పారిస్ ఒప్పందం 2015పై సంతకాలు చేసి భూతాపం క్షీణింపజేసే తక్షణ చర్యలు చేపట్టడానికి నిర్ణయించాయి. భూమి ఉపరితల ఉష్ణోగ్రతల ప్రజ్వలనం మనం ఈ వేసవిలో కూడా అనుభవిస్తున్నాం. గడచిన 8 లక్షల సంవత్సరాలలో ఎన్నడూ కనివినీ ఎరుగనంత గరిష్ట పరిమాణంలో భూమిమీద మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ విషవాయు ఉద్గారాలు వాతావరణంలో భీకర దుష్పరిణామాలకు కారణం అవుతున్నాయి. పర్యావరణ వినాశనం కారణంగా, ప్రకృతి వైపరీత్యాల మహోత్పాతాలు లక్షలాది ప్రాణాలు హరించటమే కాకుండా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి మనిషి బతుకు నిరంతర ప్రమాదభరితం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ధి అభివృద్ధి లక్ష్యాలలో పర్యావరణ పరిరక్షణ అత్యంత ప్రధాన కీలక అంశంగా గుర్తించి హెచ్చరిస్తున్నా, 2010-2020 దశాబ్దం జీవన వైవిధ్య దశాబ్దంగా ప్రకటించినా ప్రపంచంలోని అగ్ర సంపన్న దేశాలు వికృత నిర్జీవ సమాజాన్ని ఆహ్వానిస్తున్నాయి.
ప్రకృతి విధ్వంసం నుంచి నాగరిక వ్యామోహం
100 సంవత్సరాలలోపు ఆయువు కలిగిన ప్రస్తుత నాగరికునికి తన జీవిత కాలంలో భౌతికంగా సుఖంగా బతకటమే తప్ప రానున్న భవిష్యత్ తరాల తమ పిల్లల స్థితిగతుల గురించి ఆలోచనల కార్యాచరణకు అవకాశాలుండవు. తిండి, నీరు, ఇల్లు మనిషి జీవించటానికి అత్యవసరమైన ప్రాథమిక అవసరాలను సమకూర్చటానికి ప్రభుత్వాలు తలమునకలవుతుంటాయి. అదే అభివృద్ధి చెందుతున్న దేశాల లక్ష్యం. యధేచ్చగా విచ్చలవిడిగా ప్రకృతి ప్రసాదించిన వనరులను సాధ్యమైనంత వరకు కొల్లగొట్టి పరిశ్రమలు, గృహాలు ఇతర నగరీకరణ, స్వేచ్ఛగా ప్రవహించే నదీ జలాలపై ప్రాజెక్టుల నిర్మాణం, బొగ్గు వంటి భూగర్భ ఇంధనాల ద్వారా విద్యుచ్ఛక్తి వంటి ఖనిజోత్పత్తులు సంక్షేమ శ్రేయోరాజ్యంలో మానవ మనుగడకు అత్యంత ఆవశ్యకం. విపరీత భూసేకరణ దృష్ట్యా చెట్లు, అడవుల విధ్వంసం, విద్యుదుత్పత్తికి బొగ్గు వంటి శిలాజ ఇంధనాలు తవ్వి వెలికితీయటం, వ్యవసాయ, మత్స్య రంగాల అభివృద్ధి సృష్టించే జల వాయు కాలుష్యం, పరిశ్రమలు సృష్టించే జల కాలుష్యం, అభివృద్ధి పొందుతున్న దేశాలకు అనివార్యం అవుతోంది. భూమి, గాలి, నేల, నీరు మనకు పూర్వీకులు వారసత్వంగా సంక్రమించకపోయినా, వాటిని ఋణంగా అనుభవించి యధాతధంగా భవిష్యత్ తరానికి స్వాధీనం చేయగల సత్తా ప్రస్తుత సమాజానికి లోపించటంతో, విధ్వంసమే చేసి తాత్కాలికంగా అనుభవించి బతుకుతున్నాం. ఫాన్‌ల స్థానంలో ఎసిలువచ్చాయి. కుటీరాలు, పేదల పూరిళ్లు స్థానంలో కాంక్రీట్ ఇళ్లు నిర్మిస్తున్నాం. భూగర్భ జలాలు ఇంకిపోయి కనుమరుగవటంతో, పొలాలకు భారీ పంప్ సెట్లు లేదా ఎత్తిపోతల పథకాలు, రసాయనిక ఎరువులు సరఫరాపై ఆధారపడవలసివస్తోంది. నిరుపేదల బతుకులలో ఆకలి, అనారోగ్యం తాండవించని ఆధునిక సమాజ నిర్మాణానికి ఇవన్నీ తప్పించుకోలేనివి.. 21వ శతాబ్దం మూడవ దశకంలోకి అడుగుపెడుతున్న భారతీయ సమాజం, స్వాతంత్య్రానంతరం పల్లెలు పట్టణాలలో, పట్టణాలు నగరాలలో కలిసి బతికే వికృత జీవనం సంతరించుకొంది.
గ్రీన్ క్లైమేట్ ఫండ్
సుమారు 12,000 సంవత్సరాల కాలగర్భంలో భారీ స్థాయిలో ఆఖరి ఐస్ శకం అంతం అయినట్టు ప్రపంచ శాస్తజ్ఞ్రులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో పారిశ్రామిక విప్లవారంభ దశలో 280 పార్ట్స్ పెర్ మిలియన్ (పిపిఎమ్) వుండే కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు, ప్రస్తుత ప్రపంచం నియంత్రించలేని దశకు చేరుకోవటంతో డేంజర్ జోన్‌లోకి అడుగుపెట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాతావరణ దుష్పరిణమాలు కేవలం ఊహాజనితాలుగా కొట్టిపారేసి పారిస్ ఒప్పందం అమలుకు విఘాతం కల్పించాడు. చమురు, బొగ్గు వంటి ఎగుమతి, దిగుమతుల సంపన్న రాజ్యాలైన టర్కీ, సిరియా, ఇరాన్ వంటి దేశాలు, పారిస్ ఒప్పందం అమలుకు సుముఖంగా వ్యవహరించటం లేదు. ట్రంప్ అధ్యక్షునిగా బొగ్గు, చమురు వెలికితీసే శిలాజ ఇంధన పరిశ్రమల వల్లనే నిరుద్యోగ, ఉపాధి సంబంధిత సమస్యల పరిష్కారం సాధ్యమని, అసలు భూతాపం వల్ల సంభవించే దుష్పరిణామాలు పరిహారం తమాషాగా వ్యయభరితమంటున్నాడు. పారిశ్రామిక విప్లవం ముందుశకం నుండి ఇప్పటికే భూతాపం 0.8 డిగ్రీల సెంటీగ్రేడ్ సగటుకు పెరిగింది. ప్రపంచ దేశాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నా, అమెరికా అహంకార ఆధిపత్యంతో మానవాళి సర్వ విలయ మృత్యు సంక్షోభాన్ని మొండిగా ఆహ్వానిస్తోంది. 550 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రపంచ స్వరూపం మళ్లీ సౌభాగ్యవంతంగా సాధించాలంటే ఏడాదికి 100 బిలియన్ డాలర్ల అంచనా ఆర్థిక సహాయం అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రత్యామ్నాయ ఇంధన వినియోగ సహకారంగా అందించాలి. ఏడేళ్ళ క్రితం కోపెన్‌హాగన్ అంతర్జాతీయ సదస్సు ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఏర్పాటు నిర్ణయించింది. 2050 నాటికి ఆ నిధులను 500 బిలియన్ డాలర్లకు సహాయంగా అందించాలి. అంతర్జాతీయ ప్రపంచ పర్యావరణ శాస్తవ్రేత్తలు 2019 ఏప్రిల్ 19న సైన్స్ అడ్వాన్స్డ్ జర్నల్ ప్రచురింపజేసిన ‘గ్లోబల్ డీల్ ఫర్ నేచర్’ (జిడిఎన్) అయిదు లక్ష్యాల పాలసీ డాక్యుమెంట్‌ను, అగ్రదేశాలు చిత్తశుద్ధితో అమలుపరచవలసినదే.

-జయసూర్య 94406 64630