మెయన్ ఫీచర్

ఎధురులేని ‘నరేంద్ర జాలం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వోట్ల సునామీ, తుపాను, జన ప్రభంజనం.. వీటన్నింటికీ నిదర్శనంగా తాజా సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ 350 సీట్లు సాధించింది. కాంగ్రెస్ శిబిరంలో తొమ్మిది మంది మాజీ ముఖ్యమంత్రులు ఓడిపోయారు. సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీలో భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించి రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించనున్న నరేంద్ర మోదీని ప్రపంచ దేశాల నేతలు అభినందించారు. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి మొదటిగా మోదీకి ఫోన్ చేసి శుభాభినందనలు తెలిపారు.
ఇజ్రాయిల్‌కు, ఇండియాకు కొన్ని సామ్యాలున్నాయి. దాదాపు రెండువేల సంవత్సరాల పాటు తమకంటూ ఒక మాతృభూమి లేకుండా దేశ దిమ్మరులై ఇజ్రాయిలీలు తిరిగారు. 1948లో వారికొక స్వతంత్ర రాజ్యం ఏర్పడింది. చుట్టూ పధ్నాలుగు తోడేళ్ల రాజ్యాలున్నాయి. ఐనా పలువురు నేతల నేతృత్వంలో ఇజ్రాయిల్ తన అస్తిత్వాన్ని నిరూపించుకున్నది. ప్రపంచ ప్రఖ్యాత నియంత అడాల్ఫ్ హిట్లర్ యూదు జాతీయులను గ్యాస్ చాంబర్లలోకి నెట్టి సామూహిక హత్యలు చేయించాడు. షైలాక్ వంటి పాత్రలను క్రైస్తవ రచయితలు సృష్టించి యూదులను అవమానించారు. ఐనా యూదులు తమ జాతీయతను కాపాడుకున్నారు. సరిగ్గా భారతీయుల గతీ అలాగే అయింది. వేయి సంవత్సరాల పాటు అరబ్బులు, మొగలులు, బ్రిటీషువారు, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు వంటి జాతుల పాలనలో ఇండియా తన అస్తిత్వాన్ని కోల్పోయింది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఎమర్జెన్సీ పెట్టి ప్రాథమిక హక్కులు హరించిన పాలకులు వచ్చారు. మన దేశంలో సోనియా గాంధీ రూపంలో మళ్లీ ఇటలీ రాజ్యం వచ్చింది.
***
2014లో ‘్భరత జాతీయవాదం’ అధికారంలోకి వ చ్చింది. ఈ త్యాగశీలుర సమూహానికి గుజరాత్‌కు చెందిన నరేంద్ర మోదీ నాయకత్వం వహించాడు. ఐదేళ్ల పాలనలో ఆయన చాలా ఒడుదుడుకులను ఎదుర్కొన్నాడు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ (వస్తుసేవా పన్ను) వంటి ఆయన కఠోర నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో- 2004లోనే మోదీని హత్యచేయడానికి కొంతమంది ప్రముఖ నాయకులు ఇషత్ జహానా అనే మహిళ నేతృత్వంలో ఉగ్రవాద బృందాన్ని అహ్మదాబాదుకు పంపారు. మోదీ ప్రధాని అయిన తర్వాత జిగ్నేష్ మెమన్, రోనా విల్సన్ వంటి చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు ఆయనను హత్యచేసేందుకు పూణెలో రూపకల్పన చేశారు. ఇలాంటి కుట్రలన్నింటినీ తట్టుకొన్న మోదీ తాజా ఎన్నికల్లో మరోసారి అద్భుతం సాధించారు.
కాగా, మోదీని ‘ప్రమాదకరమైన కాషాయ ఉగ్రవాది’గా కాంగ్రెస్ నేతలు మణిశంకర అయ్యర్, దిగ్విజయ్ సింగ్, సుశీల్‌కుమార్ షిండే, మనీష్ తివారీ, శశిథరూర్ వంటి వారు ముద్ర వేశారు. మోదీ గెలిస్తే తాను బెంగళూరు వదిలిపెట్టి వెళ్లిపోతానని కమ్యూనిస్టు రచయిత యుఆర్ అనంతమూర్తి అన్నారు. కానీ మోదీ గెలిచాడు. అనంతమూర్తి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు.
‘నరేంద్ర మోదీని దేశం నుండి తరిమికొట్టండి’ అని పిలుపునిచ్చింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పార్టీ భారీగా నష్టపోయింది. మోదీని కోల్‌కతలో తిరగనివ్వనని మమత భీషణ ప్రతిజ్ఞలు చేసింది. కానీ ఇప్పుడామె సగర్వంగా బెంగాల్‌లో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధాని హోదాలో మోదీ విజయవాడ వస్తే నల్లజెండాలతో ప్రదర్శన చేయించి, దిష్టిబొమ్మలు తగలబెట్టించాడు చంద్రబాబు. ఎన్టీఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ పుట్టింది. కానీ నేడు తెదేపాను హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌కు చంద్రబాబు తాకట్టు పెట్టాడు. ఫలితంగా ఆయన రాజకీయ జీవితానికి తెలుగు ప్రజలు కనీవినీ ఎరగని రీతిలో ‘చెక్’ పెట్టారు. మహోన్నత ఆశయాలతో ‘తెలుగువారి ఆత్మాభిమానం’ పేరుతో ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి చంద్రబాబు వల్ల ఇపుడు దుర్గతి పట్టింది.
‘హిందూ నాయకులను హత్యచేసి ఉప్పుబస్తాల్లో కుక్కి కాలువల్లో పడేయండి’ అన్నాడు సీపీఎం నేత, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, త్రిపుర, కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో కమ్యూనిస్టులకు ప్రజలే ఉప్పుపాతర వేశారు. దేశాన్ని ముక్కలు ముక్కలు చేయండని పిలుపునిచ్చిన జెఎన్‌యు విద్యార్థి సంఘ నాయకుడు కన్నయకుమార్‌కు ఎన్నికల రణరంగంలో ప్రజలు ఓడించారు. హిందువుల పార్టీని బొందపెట్టండని మజ్లిస్ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు. ఆయన కలలు పగటి కలలుగానే మిగిలిపోయాయి. తన కుమార్తె కవితను నిజామాబాద్ నుండి ఎంపీగా ఆయన గెలిపించుకోలేకపోయాడు. ‘నాది షేర్వాణీ కల్చర్, నాది బిర్యానీ కల్చర్’అని రజాకార్ల భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న నాయకునికి ప్రజలు ఈ ఎన్నికలలో బుద్ధి చెప్పారు.
***
దేశవ్యాప్తంగా భాజపా గాలి బలంగా వీచడంతో ఇక పేకమేడల వలె కర్నాటక, న్యూఢిల్లీ, మధ్యప్రదేశ్, బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోనున్నాయి. ఇది నరేంద్ర మోదీ సాధించబోయే విజయానికి సంకేతం. ఆనాడు ఒక నరేంద్రుడు (వివేకానంద స్వామి) అమెరికాలో అత్యద్భుత ప్రసంగం చేసి విజయం సాధించాడు. ఈనాడు మరొక నరేంద్రుడు చైనా, పాకిస్తాన్‌లపై రాజకీయ విజయం సాధించాడు. ఇది భారత జాతీయ సాంస్కృతిక పునరుజ్జీవన యుగం. ఈ ప్రభంజనంలో హేమాహేమీలైన విపక్ష నాయకులు దూదిపింజల వలె కొట్టుకుపోయారు. అమేథీలో తన సోదరుడు రాహుల్ గాంధీ కోసం ప్రియాంకా గాంధీ రాత్రింబవళ్లు ప్రచారం చేసినప్పటికీ భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ సంచలన విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లో గుణ నియోజకవర్గం నుంచి రాజవంశానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సిందియాకు ఓటమి తప్పలేదు. ఇలాంటి అనూహ్య ఘటనలెన్నో ఈ ఎన్నికల్లో చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై సర్జికల్ స్ట్రైక్ జరిగిననాడే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నాడని నిర్ణయమైపోయింది.
***
‘సారు-కారు-పదహారు’ అంటూ తెలంగాణలో కేసీఆర్ పార్టీ తెరాస ఎంతగా ప్రచారం చేసినా ఏడు స్థానాల్లో అపజయం తప్పలేదు. ఇది కూడా అనూహ్యం కాదు. ఇంటర్ విద్యార్థులు భారీ సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నప్పుడే తెలంగాణ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో నెలల తరబడి వైఎస్ జగన్ పాదయాత్ర చేసినపుడు వచ్చిన జన సమూహాలను చూచినప్పుడే తెదేపాకు గడ్డురోజులు ప్రారంభమయ్యాయని చంద్రబాబు గ్రహించి ఉండవలసింది. కాంగ్రెస్‌తో దోస్తీ చేయడం, మోదీని వ్యక్తిగతంగా నిందించడం, ఎమ్మెల్యేల్లో అవినీతిని అరికట్టలేకపోవడం వంటివి చంద్రబాబుకు చెడ్డపేరు తెచ్చాయి. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఏపీలో ఇపుడు కమ్మ సామాజిక వర్గంపై రెడ్డి వర్గం ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కుమారుడు లోకేశ్ సహా చాలామంది మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఇప్పట్లో తెలుగుదేశం రాజకీయ పార్టీగా నిలబడటం చాలా కష్టం. ఇదంతా చంద్రబాబు స్వయం కృతాపరాధమే.
కాగా, ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ చంద్రబాబు, మమతా బెనర్జీ వంటివారు ఖాళీగా కూ ర్చోరు. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు మళ్లీ ఏవో కొత్తకొత్త వ్యూహాలు రచిస్తారు. కొన్ని పొరుగు దేశాలు కూడా మోదీని ఇబ్బందుల పాలు చేసేందుకు యత్నిస్తాయి. చైనా, పాకిస్తాన్,బ్రిటన్, సౌదీ అరేబియా వంటి దేశాలు కొత్త సమస్యలు సృష్టిస్తాయి. అందుకని మోదీ ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉండాలి.
***
ఎన్నికల్లో మోదీకి మంచి మెజారిటీ లభించింది. కొన్ని చిరకాల సమస్యలపై ఆయన ఇకనైనా కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. అయోధ్యలో రామాలయం, మధురలో కృష్ణాలయం నిర్మించే విషయమై ఆయన చర్యలు ప్రారంభించాలి. రాజ్యాంగంలోని 370, 36ఎ అధికరణలను రద్దుచేసి కశ్మీరును భారతదేశంలో అంతర్భాగమని ప్రకటించాలి. ఆక్రమిత కశ్మీరు ప్రాంతానికి పాకిస్తాన్ నుండి విముక్తి కలిగించాలి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి ఐదు కోట్ల తెలుగు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ముస్లిం మతోన్మాద పార్టీలను, సంస్థలను నిషేధించాలి. దేశంలో నేటికీ సగం మంది యువతకు ఉద్యోగాలు లేవు. తినడానికి తిండి లేదు. గనుక ఉపాధి కల్పించే ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది. చైనాతో వ్యాపార, దౌత్య సంబంధాలను కేంద్ర ప్రభుత్వం తెగతెంపులు చేసుకోవాలి. చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర ప్రాంతాల్లో మావోయిస్టుల బీభత్సాన్ని అరికట్టాలి. ఆర్థిక నేరాలు చేసి బెయిల్‌పై తిరుగుతున్న రాజకీయ నాయకులపై, వాణిజ్య ప్రముఖులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వీరిపై న్యాయస్థానాల్లో కేసులను త్వరితగతిన విచారించాలి. ఆర్థిక నేరగాళ్లు విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని ఇండియాకు తెప్పించండి.
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా విజయం వెనుక పది కోట్ల మంది కార్యకర్తల తపస్సు ఉంది. వందలాది కార్యకర్తల బలిదానాలున్నాయి. ఒక్క బెంగాల్‌లోనే దాదాపు వందమంది భాజపా కార్యకర్తలు తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు జరిపిన దాడుల్లో మరణించారు. భాజపాకు చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులను చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు.
***
గతంలో ‘మెగాస్టార్’ చిరంజీవి, నేడు పవన్‌కల్యాణ్, ప్రకాశ్‌రాజ్, శతృఘ్న సిన్హా, కమలహాసన్ తదితర సినీనటులు పొందిన పరాజయాలు అనూహ్యం కాకపోయినా అవమానకరమైనవి. గాజువాక, భీమవరం రెండుచోట్లా జనసేన అధినాయకుడు పవన్‌కల్యాణ్ ఎందుకు ఓటమి చెందాడు? సినీ గ్లామర్ కన్నా రాజకీయాలపై అవగాహన ఉంటే తప్ప వీరు రాణించలేరు. ఈ దేశంలో ‘మెజారిటీ’ వర్గమైన హిందువులు వివక్షకు గురవుతున్నారు. అన్ని మతాలు, కులాలు కలసి మెలసి జీవించడమే భారతీయ సనాతన విధానం. దేశంలో అనువంశిక రాజకీయ యుగం ముగిసింది. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’.. ఇదే స్వామి వివేకానందుడు ఆశించిన భారతదేశం. మరోమాటలో చెప్పాలంటే తాజా ఎన్నికల్లో అఖండ భారతదేశాన్ని ఆశించే ప్రజలు ఓటువేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నైతిక బాధ్యత అంటూ రాహుల్ గాంధీ వంటివారు రాజీనామాలకు సిద్ధపడడం సరికాదు. రాజీనామాలే పరిష్కారమైతే ఉభయ కమ్యూనిస్టు నాయకులు ఏనాడో పదవులను వదులుకొని రాజకీయాల నుంచి తప్పుకోవల్సి ఉంది. తాజా ఎన్నికల్లో పరాభవం ఎదురైనందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, జనసేన పార్టీ నేత పవన్ కల్యాణ్ వంటివారు తమ దుకాణాలను మూసుకోవాలి. కేరళ సీఎం పినరయి విజయన్ తన పదవికి రాజీనామా చేసి ఉండాలి. ఓటమికి నైతిక బాధ్యత వహించి ప్రభుత్వ పదవులను త్యాగం చేసే నాయకులు ఈ కాలంలో ఉంటారా?

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్ 9603612246