మెయన్ ఫీచర్

నిండు జాబిలి ఒకవైపు.. చుక్కలు ఒకవైపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా రెండు నెలల నుండి ఉత్కంఠ రేపుతున్న సార్వత్రిక ఎన్నికల అంతిమ ఫలి తం నిర్ణయమైంది. 2014లో ఒక ‘వేవ్’గా వచ్చిన నరేంద్ర మోదీ 2019లో మరోసారి సింహాసనం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో 282 స్థానాలు గెలిచిన భారతీయ జనతాపార్టీ ఇపుడు మరింతగా మెరుగైన ఫలితాలను సాధించడం ఓ కీలక ఘట్టం. 2014లో మోదీ ఎన్నికయ్యాక పార్లమెంట్ మెట్లకు ప్రణామం చేసి లోక్‌సభలో కాలుపెట్టారు. ‘ఈ దేశానికి నేను అధినేతను కాదు.. సేవకుడిని. 24 గంటలూ ప్రజల కోసం పనిచేసే వ్యక్తిన’ని ప్రకటించాడు. అదేమాట ప్రకారం నేటి వరకు ఒక్కరోజు విశ్రాంతి తీసుకోకుండా పనిచేసిన మోదీ తన పని తాను చేసుకుపోయాడు. తనపై వేసిన ముద్రను లెక్కపెట్టకుండా, ‘నేను 135 కోట్ల భారతీయుల ప్రతినిధిని’ అని చాటుకొన్నాడు. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడూ ‘తినని తిట్లు’ మోదీ తిన్నాడు.
మతపరంగా, కులపరంగా, ప్రాంత పరంగా రాజకీయాలు నడిపే అన్ని పార్టీలూ మోదీకి వ్యతిరేకంగా భుజం భుజం కలిపాయి. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పరం కత్తులు దూసుకొని ఎన్నికల తర్వాత కాంగ్రెస్- జెడిఎస్‌తో పొత్తు పెట్టుకుంది. భాజపాను అధికారంలోకి రానివ్వకూడదన్న దుగ్ధతో కలిసిపోయిన ఈ ‘సంకర కూటమి’ బొటాబొటీగా గెలిచింది. అయినా చంద్రబాబు లాంటి వారి కుటిల పన్నాగాలతో కర్ణాటక ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించి, అర్ధరాత్రి కోర్టులు తెరిపించి, జడ్జీలను బ్లాక్‌మెయిల్ చేసి తమకు అనుకూలంగా తీర్పుతెచ్చుకున్నారు. దాంతో కుమారస్వామి ప్రమాణ స్వీకార వేదిక విపక్షాలను కలిపింది. ఆ సందర్భంగా పాల్గొన్న నాయకులకు జెండా, ఎజెండా మోదీని గద్దె దింపడమే.
2018 ఫిబ్రవరిలో భాజపాతో విడిపోయిన చంద్రబాబు మోదీపై విషం కక్కడం మొదలుపెట్టాడు. రాజకీయాల్లో శత్రుత్వం హద్దుమీరడం మంచిది కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించారు. చంద్రబాబు ఏపీలో ఉనికిలో లేని భాజపాపై చేసిన టార్గెట్ హద్దులు మీరింది. అది వికటించి ఆంధ్రలో వైకాపాకు మేలు చేసింది. చంద్రబాబు ప్రత్యేక హోదా సమస్యను ఏదో కశ్మీర్ సమస్యలా భావిస్తూ దేశమంతా వికృత రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. మాట్లాడితే ‘నేను నలభైఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నానని, మోదీ నాకంటే తక్కువని’ ప్రచారం మొదలుపెట్టాడు. ముఖ్యంగా తెలుగు మీడియాను అడ్డుగా పెట్టుకొని రోజూ విషప్రచారం చంద్రబాబు తీవ్రం చేయడం తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అమిత్ షా తిరుమల దర్శనానికి వస్తే తెలుగుదేశం కార్యకర్తల చేత ఆయన కాన్వాయ్‌పై దాడి చేయించారు. మోదీపై నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత దూషణకు దిగాడు. అసభ్యకర భాషను వాడాడు. దేశ ప్రధానిగా వున్న మోదీని ఆంధ్రలో కా లుపెట్టవద్దని చంద్రబాబు ఫ్లెక్సీలు పెట్టించాడు. శివాజీ అనే సైడ్ ఆర్టిస్టును ముందుపెట్టి ‘రహస్యాలు- ఆపరేషన్ గరుడ’ పేరుతో లేనిపోనివి తెరమీదకు తెచ్చి మోదీపై బురదజల్లాలని ‘చంద్రబాబు అండ్ కో’ ప్రయత్నం చేసింది. చంద్రబాబు తెలుగుదేశం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మోదీని గద్దెదింపాలని కాంగ్రెస్‌తో చేతులు కలిపాడు. ఆయా రాష్ట్రాల్లోని పరస్పర విరుద్ధ పార్టీల నేతను ‘మిక్స్‌డ్ ఫ్రూట్’గా మార్చాలని బాబు ప్రయత్నించాడు. జాతీయ స్థాయిలో నాయకులు ఆయనను పూర్తిగా నమ్మలేదు. కాని బాబు పట్టువదలని విక్రమార్కుడిలా నిన్నటివరకూ తన కుటిల ప్రయత్నాలు కొనసాగించడం ప్రజలు హర్షించలేదు.
మొదటి నుండి మోదీని వ్యతిరేకించే వామపక్షాల్లా రాహుల్ గాంధీ రోజుకోసారి రాఫెల్ గురించి పదే పదే చెప్పిన విషయాలను ప్రజలు పట్టించుకోలేదు. అపరిపక్వంగా రాహుల్ పార్లమెంట్‌లో మోదీని కౌగిలించుకోవడం, కన్నుకొట్టడం ప్రజలు అతణ్ణి ‘సీరియస్ నాయకుల జాబితా’ నుండి తప్పించాయి. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఎలాంటి కుంభకోణాలు చేయలేదు. అక్రమాలకు పాల్పడే స్వచ్ఛంద సంస్థలను కట్టడి చేసి దేశ వ్యతిరేక శక్తుల నోళ్లు కట్టేశాడు. లక్షలాది ‘షెల్ కంపెనీలు’ మూసివేసి నల్లధనానికి నెలవైన స్థానాలను దెబ్బకొట్టాడు. ఐటీ, ఈడిల ద్వారా పన్ను ఎగవేతదారుల భరతం పట్టించాడు. నోట్ల రద్దు, జియస్టీ ద్వారా ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. దానివల్ల తాత్కాలికంగా కలిగిన పరిణామాలను ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రచారం చేయడం వారికే తిప్పికొట్టింది. ఉజ్జ్వల, ఆత్మగౌరవ గృహాల నిర్మాణంతో పేద ప్రజల మనసు గెలుచుకున్నాడు. స్వచ్ఛ్భారత్ లాంటి సామాజిక కార్యక్రమాలను ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. మోదీ ఏనాడూ మతపరమైన విభజనతో మాట్లాడకున్నా ప్రతిపక్షాలు ప్రతిరోజూ మోదీని టార్గెట్ చేసాయి. దేశంలో ఎక్కడో జరిగిన ప్రతి సమస్యను మోదీ మెడకు చుట్టే ప్రయ్నం చేశారు. అఖ్లాక్ హత్య, గౌరీలంకేశ్ హత్య, కథువా ఘటన, రోహిత్ వేముల ఆత్మహత్య మోదీ మెడకు చుట్టే ప్రయత్నం వికటించింది. పాకిస్తాన్ చేసే సీమాంతర ఉగ్రవాదం దేశంలోని ఏ ప్రాంతానికి విస్తరించకుండా, కశ్మీరు దాటకుండా కాపాడే వ్యక్తిగా మోదీని ప్రజలు భావించారు. యువశక్తి ఎక్కువగా వున్న మన దేశంలో రెండుసార్లు మోదీ పాక్‌పై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ గొప్ప భరోసా కల్పించాయి. మోదీ అంతర్జాతీయంగా తన వ్యూహాలతో విశ్వనేతగా ఎదిగారు. తన కుటుంబం కోసం వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనం కలిగించలేదు. కాని మోదీని వ్యితిరేకించే శక్తులన్నీ రోజూ ‘నకారాత్మక ప్రచారం’ మొదలుపెట్టాయి. ఇదంతా మోదీకి బాగా కలిసివచ్చింది. మైనారిటీ ఓట్లకోసం ఆరాటపడే అన్ని పార్టీలు ఏదిపడితే అది మాట్లాడటం దేశ ప్రజల్లో ‘నిశ్శబ్ద విప్లవం’ తెచ్చింది.
‘సర్జికల్ స్ట్రైక్’ను అనుమానిస్తూ, అవమానిస్తూ మాట్లాడిన మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లో అరాచకం సృష్టిస్తూ భాజపాను, జాతీయవాద శక్తులను ముప్పతిప్పలు పెట్టారు. అమిత్ షా సభలకు, ఆఖరుకు ఆర్‌ఎస్‌ఎస్ సభలకు ఆటంకం కల్పించారు. ఆఖరుకు అమిత్‌షా ర్యాలీపై దాడి చేయించారు. శారద, నారద కుంభకోణం, రోజ్‌వ్యాలీ కుంభకోణంలో సిట్ అధికారిగా కొన్ని దస్త్రాలను మాయం చేసిన రాజీవ్ కుమార్‌ను సుప్రీం కోర్టు అనుమతితో అరెస్టు చేసేందుకు సిబిఐ బెంగాల్‌కు వెళ్లింది. కానీ అప్రజాస్వామికంగా మమత తన పోలీసులతో సీబిఐ అధికారులను అరెస్టు చేయించింది. ఇదంతా అరాచకం అయినా ‘మేమే ప్రజాస్వామ్యవాదులం’ అంటూ మరోవైపు దేశాన్ని నమ్మించాలని చూసారు. ఇదంతా ప్రజలను ప్రతిపక్షాల నుండి దూరం చేశాయి. ఆఖరుకు సంతుష్టీకరణకు అనుగుణంగా జాతీయ పౌర రిజిస్టర్‌ను వ్యతిరేకించడం, దేశంలో ఎక్కడో గోసంరక్షకులు స్థానికంగా చేసే గొడవను మోదీకి అంటగట్టడం, కశ్మీర్‌లో రాళ్లు రువ్వే గ్యాంగులను మరింత రెచ్చిపోయేట్లుగా విపక్ష నేతలు వ్యాఖ్యానించారు.
కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక్కటై కన్పించిన ప్రతిపక్షాలు మోదీకి వ్యతిరేకంగా తమ తమ సిద్ధాంతాలను విస్మరించాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీని రాహుల్ గాంధీ ముందు- ‘్ఫర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ గల చంద్రబాబు పాదాక్రాంతం చేశాడు. కేజ్రీవాల్‌కు కాంగ్రెస్‌తో సరిపడకున్నా మోదీని గద్దెదించాలని రాహుల్‌తో కలిసాడు. కుటుంబ పార్టీలైన బిఎస్పీ, ఎస్పీ కూడా మోదీకి వ్యతిరేకంగా జతకట్టాయి. దేవెగౌడ తన కుటుంబాన్ని అధికారంలో ఉంచేందుకు అవకాశవాదంతో కాంగ్రెస్‌తో జతగట్టారు. ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటివాళ్లు ఏకమై, తమతో వేర్పాటువాదులను కలుపుకొని కాంగ్రెస్ కూటమి పక్కన నిలిచారు. ఇదంతా తప్పుడు ‘తడకల కూటమి’గా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. వీరందరికీ భిన్నంగా మోదీని ఈ దేశ ప్రజలు భావించారు. మహాకూటమి పేరుతో చంద్రబాబు, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ చేసిన ప్రయత్నాలను ప్రజలు విఫలం చేశారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో మీడియా గురించి విశేషంగా చెప్పాలి. తెలుగు మీడియాలో ముఖ్యంగా కొన్ని టీవీ చానళ్ళు 2018 ఫిబ్రవరి నుండి మోదీని తిట్టడమే పనిగా పెట్టుకొన్నాయి. సాక్షాత్తూ ప్రధానిని బూతులు తిట్టేందుకే రోజూ ‘ప్రైమ్‌టైమ్ షో’లు ఏర్పాటు చేయడం చంద్రబాబు ఓటమికి ప్రధాన కారణం. ఇన్ని విష ప్రచారాల మధ్య మోదీ విజయం సాధించడం పెద్ద సాహసమే. ఇప్పటికైనా ప్రతిపక్షాలు, కుహనా లౌకికవాదులు, ఏకపక్షపాత మీడియా ప్రజల తీర్పు గౌరవించకపోతే- అది ప్రజాస్వామ్య హననమే అవుతుంది.
తప్పుడు మాటలు మాట్లాడకుండా, ‘నేను 135 కోట్ల భారతీయుల ప్రతినిధిని’ అంటూ పార్లమెంటు మెట్లకు మొక్కి ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన మోదీపై చేసిన కుట్రలను ప్రజలు ఛేదించారు. చుక్కలన్నీ ఒకవైపు వుంటే నిండు చంద్రుడు మరోవైపు అన్నట్లు ‘మోదీ ఎగరేసిన విజయకేతనం’ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ మైలురాయి. *

-శ్రీకౌస్త్భు