మెయిన్ ఫీచర్

కవులూ.. అంతర్ముఖులుకండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మన్యూనత వ్యక్తి బలహీనతకు పరాకాష్ఠ. ఇట్టివారికి ఆత్మసాంత్వన మొక భ్రమాతర్పణము తప్ప మార్గాంతరము లేదు. మన వారెంత చెప్పినను విపరీతముగనే స్వీకరింతురు. పాశ్చాత్యులు దీనిని డళచి డ్య్ఘషళగా చెప్పిరి గనుక దానిని శిరసావహించి పరిష్కారముగా అక్షరముల నావిష్కరించుచున్నారు. తత్ఫలితమే కవులయి కట్టుబోతులగుట. కవులెందుకో ఈ మార్గమునెంచుకొనుచున్నారో; అదెట్లు పరిష్కారమో తెలియదు. కవిత్వమున వ్యక్తిగత ద్వేషాసూయలకు చోటు పెట్టరాదు. మహాకవులందుకే కృత్వారంభమున ‘‘కుకవినింద’’యను పేర ఒక పద్యమును మాత్రము వ్రాసెడివారు. అంతకుమించి విషయ ప్రస్తావన యుండదు. కవిత్వంలో కవితాభివ్యక్తే వుంటుంది కానీ అభిప్రాయాలంటూ పొడిపొడి మాటలుండే అవకాశం వుండదు. అట్టిదే కావలయునన్న అది కవిత్వమనరాదు. కవిత్వమంటే బింబాత్మక భాష. ప్రతీకాత్మక భావప్రతీకలు, బింబాలు అలంకారాల వున్నప్పుడే అది కవిత్వం. వ్యక్తిగతమైన విషయాలు కవితాభివ్యక్తికి ఆక్షేపణకరమైన విషయం మాత్రం కాకపోయినా- భావప్రకటనలో అది ఆక్షేపణే. పైగా కవిత్వానికి వర్గీకృత నామధేయాలు చేయటం అసాహిత్య ప్రక్రియ. ఇటువంటివాటిని నీచంగానే చూడాలి. ఎందుకంటే తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా వర్తమానాంధ్ర కవిత్వంలో సాహిత్యంకంటే అజ్ఞానం ఎక్కువగా వుంది. ఈమధ్యనొక పూర్వాచార్యుడు- ఒక విశ్వవిద్యాలయ ఉపకులపతి (పై అతగాడొక రచయితట) గోదావరి గట్టున గొంతు చించుకు అరిచాడు. ‘‘్భషను గురించి పట్టించుకోకండి. తోచింది వ్రాసేయండ’’ని. తెలుగునాట ఈ క్షుద్ర కీటకాలు చాలానే వున్నాయి.
ఈ కీటకాన్ని భుజానికెత్తుకోవాల్సిన దుర్గతి తెలుగుజాతికి పట్టిందని దుఃఖించటంలో నిజాయతీ లేదు. అదొక సాహిత్య వ్యాపారం. ఈ తెలుగుదేశ వాతావరణం ఎలా అయిపోయిందంటే 50-60 ఏళ్ళనాడు ప్రవేశించిన సాహిత్య ముఖ రాజకీయ వాదులు, వాళ్ళ బానిసలు, భజనపరులు సాహిత్యరంగంలో ప్రవేశించి అసలు సాహిత్యరంగపు నిర్వీర్య వైజ్ఞానిక వర్గ ఉపేక్షచేత- అపేక్ష చేత ఇప్పుడు శిఖర స్థానాలెక్కి కూర్చున్నారు. ఇప్పుడు సేచ్ఛావాది కవి (నిజమైన కవి) కేవలం వ్యక్తిగతంగా నిల్చుని ఈ ముఠాల్ని ఎదుర్కొనటం, ఎదుర్కొని నిలవటం కష్టతరమైంది. పొట్టపొడిచినా అక్షరమ్ముక్క బైటికి రానివాడు భాష గురించి ఏం మాట్లాడతాడు? పత్రికల్ని-ఇతర ప్రసా(చా)ర సాధనాల్ని జేబులో వేసుకోవటం తప్ప. రాజకీయ పలుకుబడితో రాక్షస విహారక్రీడకు కవిత్వమని (సాహిత్యమని) పేరుపెట్టుకోవటంలో సఫలుడయ్యాడు వీడు. గమనించారో లేదో నినాదంగాళ్ళ చేతుల్లో వున్న సామాజిక చైతన్యం నిజానికి నీచ రాజకీయ చైతన్యం. వీరిని సాహిత్యప్పొలిమేరల వరకు రానివ్వటమే ప్రజాస్వామ్యమైంది. ఈ ప్రజాస్వామ్యానికి ‘శీలపృక్త్భావ’మసలు వుండదు. అదియున్నూ ప్రజాస్వామ్యమే. ‘శీలపృక్త్భావ’మనేది ఆత్మకళనుంచి దర్శించతగిన పరమ ముఖ్యాంశము. అంటే ఎవడైతే ‘బాహ్యభ్యంతర’ ప్రయాణ విద్యాభ్యాస చరిత్రలో పడిపోతాడో వాడు సుఖదుఃఖాల వౌలికవస్తు రహస్యమొకటేనని గ్రహిస్తాడు. ‘బాహ్యభ్యంతరశ్శుచిః’ అనే తత్త్వార్థాన్ని ఆచమిస్తాడు. తామరాకు మీద నీటిబొట్టు చందమై ఆకళింపుకొస్తాడు. కనుకనే కవిగా లోక ప్రసిద్ధుడౌతాడు. ఇప్పుడే కన్నీళ్లు విషాదానికే కాదు సంతోషానికి కూడా ప్రతీకలవుతాయి. అప్పుడు మాత్రమే కవి స్వకీయ ఆత్మజలాల్లో స్నానమాడుతూ వుంటాడు. ఏ జలాల్లో సమస్త జీవనసత్యాలు అనిముషతత్త్వాలుగా మజ్జనాలాడుతాయో అది సమగ్రంగా తెలుసుకుంటాడు. సాకల్య సద్యఃస్ఫూర్తిని సాక్షాత్కరింపచేస్తాడు. వీరి కవిత్వంలో ఆత్మశిక్షణ పొందిన అంతఃశ్శుద్ధి మాత్రమే శాఖోపశాఖలుగా విస్తరించగలదు. ఇలా శాఖోపశాఖలుగా విస్తరించిన కవిత్వంలోనే కవి జగత్తుతో తాదాత్మ్యం చెందినట్లు గమనించగలం. ఇదే కవి బహిర్లక్షణం, అవసరమున్నూ. ఆత్మాశ్రయమన్నా ఆనుశీలనాత్మకమన్నా ఇక్కడే దొరుకుతుంది. ఇది కవికి ఎందుకు అవసరం అంటే ఇందులోంచే కవిత్వానికి గర్భస్థానమైన చూపు (జఒజ్యశ) వస్తుంది.
ఏ చూపు కవిత్వాన్ని పుట్టిస్తుందో ఆ చూపుయొక్క అభివ్యక్తే కవిత్వం. అందుకనే ‘కీట్సు’ అనే కవి ‘్జశక ఘ ఔ్యళౄ ష్ఘశ ళష్యూజూ ఆ్దళ జూళ్ఘౄ’’ అని అంటాడు. కవి నామక కరపత్ర రచయితా-- నీకు ‘‘పొయెట్రీ’’ అన్నా- ‘‘డ్రీం’’అన్నా సరిపడని వస్తువులు కదా, కనుకనే నువ్వు కవిత్వం జోలికిరాకు- కలలుకనొద్దు. కానీ సర్వదేశాల, సర్వకాలాల ద్రష్టల ఊపిరి, సాహిత్యకారుల ఉనికి ప్రకారం కవిత్వానికి జన్మద్రవ్యాలవే. కనుకనే ఆత్మకళాసిద్ధిలో కవి ఒక అసాధారణ విశిష్ట స్థితిలో వుంటాడు. ఆ స్థితి అరణి. మధిస్తే వస్తుంది అగ్నివంటి కవిత్వం. ‘‘తతఃపశ్వతి ధర్మాత్మా తత్సర్వం యోగ మాస్థితః పురాయత్ తత్ర నిర్వృత్తం పాణవామలకం యథా’’అంటాడు వాల్మీకి తన స్థితిని చెపుతూ. (బా.కాం.3.6) ఇక్కడ ‘‘యోగ మాస్థితః’’ ఆ తరువాతి శ్లోకంలోని ‘‘తత్త్వతో దృష్ట్వా’’ అనే మాటల్ని అర్థంచేసుకోగల చదువుండాలి. తత్త్వ దృష్టి జ్ఞాన చక్షువు- అది యోగస్థితి వల్లనే ఉపలభ్యం. ఈ తపసువల్లనే కదా సర్వం పాణనామలకం (అరచేతిలో ఉసిరికాయ) అవుతుంది. అలా వీలుకుదరనప్పుడు మీకు కేటాయించిన పాపిష్ఠి పదవులుంటాయి. వాటిని పట్టుకు వ్రేలాడుతూ జీవితాన్ని వెళ్ళమార్చుకోండి. దానె్నవరూ తప్పుపట్టరు. వచ్చిన చిక్కల్లా వీళ్ళంతా కవిత్వాన్ని ఆశ్రయించటం. చదువుకున్నవాడు ముక్కున వేలేసుకుంటున్నాడు; కవిత్వం ఇంత చులకన అయిందా అని. ఒక విషయం యేమంటే ఏమీచెయ్యటానికి దొరకనప్పుడు కవి అవటానికి సాహసిస్తున్నాడు. ఈ సాహసానికి పెట్టుబడి లేదని తెలుసుకుని- అమలుపరుస్తున్నాడు.
కవి కాగోరినవాడు మొదట అనుభూతిని కళగా అభ్యాసం చేయాలి. ఆత్మని కళావేదికగా మార్చుకోగలగాలి. దీనికి కూడా అభ్యాసమే ఆధారం. అభివ్యక్తినీ అభ్యసించాలి. ఈ అవిచ్ఛిన్న అభ్యాసతంత్రం లోబడి జీవితమంతా ఒక తపస్సయి కావ్యతంత్రంగా మారిపోతుంది. కవిత్వం ముందు ఒక జీవన విధాన, అంతేకాని కేవల శబ్దరచనా వ్యాపారం కాదని తెలుసుకోవాలి. ఈ పరిజ్ఞానం కలగకపోతే జన్మతః వచ్చిన అవలక్షణానుభవాలే అక్షరరూపం దాలుస్తాయి. ఈ అనుభవాలు ద్వేష అసూయా జనితాలు ఏవం విధా అది జీవన గమనం ఔతుంది. అంటే అసూయాద్వేషజాలైన జీవనగమనాలు సుఖం వెతుక్కునే ప్రయత్నాన్ని బలంగా చేస్తాయి. సహ జాతులను తృప్తిపరచటంలో మనిషి ఎన్నో కల్పితమార్గాల్ని ఎన్నుకుంటాడు. అయితే వీటినుంచి వ్యాకులత వస్తుంది. ఈ వ్యాకులతని ఎదిరించటానికి ళయ సమర్ధంగా వ్యవహరింఛాలి. కానీ ళయ ఇక్కఢే సమర్ధతని కోల్పోతుంది. అసలు సమస్యేలేదని తమనుతాము మభ్యపెట్టుకుంటానికే చూస్తారు. వాస్తవాన్ని అవాస్తవంగా వక్రంగా నిరూపించటానికి చూస్తారు.
కవిత్వంలోకి శబ్దరూపంలో గాని- భావరూపంలో కానీ దుర్గంధం ప్రవేశించరాదు. ఇది ‘కవి’ సాధించిన సంస్కార పరిణతిని బట్టే వుంటుంది. ఈ సంస్కారబలం చేతనే కవి శబ్దాల జన్మ -వంశం - వృత్తి వాతావరణం తెలుసుకోగలుగుతాడు. శబ్దాల యోగ్యతల్లోని తారతమ్యాలు గ్రహించగలుగుతారు. తదనంతరమే వాటి స్థానాలు నిర్ణయిస్తాడు. వాక్యంలో ఈ సంస్కారం ఉచితానుచితజ్ఞతచేత నీతి చేత సిద్ధిస్తుంది. అనుభవ, అధ్యయనాలు ఉచితానుచితాన్నియిస్తాయి. ఎన్నో అనౌచిత్య దోషాల్ని ఎత్తిచూపిన క్షేమేంద్రుడు- అందులో శబ్దార్థ దోషాలను కూడా ఘంటాపథంగా చెప్పాడు- తెలియకపోతే తెలుసుకోవాలి.
‘‘పదవాక్య బ్రందార్థేగుణే లంకరణేరసే’’...అని యిరవై ఏడు కావ్య మర్మస్థానాలు చెప్పి ఆ చోట్ల అనౌచిత్య దోషాలు రాకుండా జాగరూకత వహించాలని హెచ్చరిస్తాడు. సాహిత్యంలో ఔచిత్యమతం నిజంగా దోష బహిష్కార మతం. అంటే ఒక విధంగా ఔచిత్యమతం రసవిచ్ఛిత్తి విషయంలో దోషానికి కేంద్రస్థానమే యిచ్చింది. కనుక ఇక్కడ ఉచితానుచిత వివేకం కావ్యశీలంలో మర్మస్థానీయమన్నమాట. ‘ఉచితానుచిత వివేకోవ్యుత్పత్తి’ అంటాడు రాజశేఖరుడు. ఐతే ఆధునిక తార్కిక చక్రవర్తి ‘‘జీవితంలో దుర్గంధం వుంది. కవిత్వంలో ఎలా పరిహరిస్తావ్- ఎందుకు పరిహరించాలి...?’’అని ప్రశ్నా కశ్మలాన్ని పైకెత్తుకుంటాడు. హైదరాబాద్ అత్తరునుంచి బెంగుళూరు గులాబీ తోటల వరకు ఈ కశ్మలాన్ని చప్పరిస్తూపోతాడు, వీలయితే మెత్తుకుంటూ. సాహిత్య శృంగాలు ధరించిన రాజకీయ జీర్ణతృణోపజీవులీ ప్రశ్నల్ని సంధిస్తారు. పదవి వీరి ఆసనం కనుక కాలు కదపకుండానే ప్రదేశాలన్నీ చుట్టివస్తారు. గమనించారో లేదో ఇక్కడ సాహిత్య ప్రయోజనంకంటె స్వప్రయోజనమే ముఖ్యం. బహుశః ఈ ‘దుర్గంధం’ కూడా సాహిత్యపరంగా వీరి కవసరమై వుందేమో.
మనం దేనిని నోటితో ఉచ్ఛరించటానికి వెనుకాడుతామో అది ‘‘దుర్గంధ’మేనని ఒక కొండ గుర్తుపెట్టుకుంటాము. ఈ దుర్గంధాన్ని మనం ఎందుచేత అప్రయత్నంగానే మరిచిపోతున్నామంటే మన శరీరము-మనస్సు- ధ్యాస-మన సంస్కారం. మన జీవనాభిరుచి అన్నీ కలసి దాన్ని వెగటుగా భావిస్తాము కనుక. ఆ మరుపు సహజమైపోతుంది కనుక. మన ‘ఖర్మ’ కాలి ఇట్టిదే కవిత్వంలోకి ప్రవేశిస్తే అంటురోగాల బారిపడిపోమా? ఈ కవిత్వంలో ప్రయోగ బాహ్యమైన దుర్గంధాలు సదా వీరి మనన విషయాలవుతున్నాయి.
మరీముఖ్యంగా గుర్తించవలసిన విలువైన సూక్ష్మరహస్యం ఒక్కటే. అనుభూతి ఆత్మచైతన్యాన్ని జాగృతం చేయటంలో ఎటువంటి ‘‘దుర్గంధాన్ని’’ సహాయమర్ధించదని. అనుభూతి శీల సంపృక్తమైన సూక్ష్మాంశగా బైజికమై వికసించి- విస్తృతుంచి విహృతించి జడ పదార్థపు జాడ్యాన్ని వదిలిస్తుంది. మనిషిని మారుస్తుంది. దృగ్విశేషాన్ని అందిస్తుంది. ఆధునికాంధ్ర కవుల్లో ఈ విషయ వికాస నైసర్గికం పూర్తిగా అడుగంటిందని చెప్పటమే ఒక హెచ్చరిక.
ఆత్మ అనే చైతన్య మహోదధి ఏదైతే వుందో దాని క్రియాత్మక చర్యలే యావన్మానవీయ నిర్మాణాలు. కవిత్వం ఆ నిర్మాణాల్లో పరాంకోటికి చెందింది. కనుకనే దుర్గంధం దరికి రాకూడదన్నది. ఈ అంతర్గత చైతన్య సాగరఘోష వినడమే కవి చేయవలసిన సాధన. చేతనాంభోది రహస్యానికి తాళపుచెవి అనుభూతి అయితే; కవికి కావలసిన తాళపుచెవి రూపకానుభూతి. అంటే ‘‘సచేతనంగా-సబుద్ధికంగా- సంకల్ప సహితంగా జీవితాన్ని ఆచమనం చెయ్యటం; అనే అనుభూతి యిక్కడ కావాలి. అంటే కవి పాండిత్య సముజ్వలిత అనుభూతి-అనుభూతి ప్రజ్వలిత పాండిత్యము అనే మిధునానికి జన్మించిన వాడన్నమాట. కావ్యమీమాంస కర్త ఈమాటే అంటాడు. ‘‘ప్రతిభా వ్యుత్పత్తీ మిధః సమవేతేశ్రేయసౌ’’ ఇలా ప్రతిభ వ్యుత్పత్తుల పరస్పర ప్రజ్వలనచేత ఉత్పన్నుడైన ‘కవి’ మామూలు మానవునికంటే ఖిన్నుడు- విశిష్టుడున్నూ. ఈ తలనొప్పి అంతా ఎవడు పడతాడు అనుకున్నప్పుడు. మనసునావరించుకుపోయిన మకిలి (దుర్గంధం) మొత్తం కాగితంమీదికి ప్రవహిస్తుంది. కవి జన్మ ఎత్తడానికి ఇంత కఠోరమైన దీక్షా పరతంత్రత కావాల్సినప్పుడు ఏవో పొట్టివో- పొడుగువో నాలుగు వాక్యాలు లేని వాటికేవో దిక్కుమాలిన పేర్లు తగిలించి- సార్వభౌమాధికారత్వం సాగిస్తానంటే చెల్లదు. ఆ చొప్పదంటు వ్యవహారం కట్టిపెట్టాలి.
ఎందుకంటే ఈనాడు వర్తమాన ఆంధ్ర నిరక్షరాస్య ముఠా సిద్ధాంతం చేత కేవల కథనమాత్ర వచన రచన తయారవుతోంది. అదికూడా కవిత్వ జ్ఘఇళ తగిలించుకుని దాని ఏకైక అనివార్య ఫలితం ‘ఉన్నదున్నట్లు చెప్పటమనే అకవిత. ఈ భావనే్న వక్రోత్తి మతప్రవర్తకుడైన ‘కుంతకుడు’ చెప్పిన వాక్యం చదవండి. ‘గిరః కవీనాం జీవంతి న కథామాత్ర మాశ్రీతాః’ కవుల మాటలు కేవలం కథనాన్నిశ్రయించి మాత్రమే బ్రతకవు. మరి ఎలా వుండాలి..? ఎలా బ్రతకాలి? దానికి ఆయనే (కుంతకుడు) సమాధానం చెప్పాడు. అవి ఎప్పుడు ‘‘నిరంతర రసోదాగర గర్భ సందర్భ నిర్భరాః’’ అవుతాయో అప్పుడే. కవిత్వం కావాలంటే-వాటికో విశిష్ట లక్షణ పదప్రయోగ ఔచితి వుండి తీరాలి. ఏ విశిష్ట లక్షణం చేత కవిత్వ భాష సాధారణ వ్యవహార భాష నుండి విభిన్నం కాబడుతుందో ఆ విశిష్ట లక్షణం రసమో, చమత్కారమో, శిల్పమో- ధ్వనో ఏదోఒకటి ఉండి తీరాలి. ‘నహి చమత్కార విరహితస్య కవేః కవిత్వం’. చమత్కారం లేకపోతే కవులకు కవిత్వమే లేదు అంటాడు కవి కంఠాభరణకర్త. కనుక ఉన్నదున్నట్లు చెప్పటమనే రోగంనుంచి నేటి తెలుగు కవిత్వాన్ని రక్షించాలి. ఇప్పుడొక పద్యం గుర్తుకొస్తోంది...
‘‘కవితాలతాంగికి కర్ణ భూషణమైన
కలువ మీచేబడి నలిగిపోవు
మీ కృతి కన్యకలకీ కుందనపు తళ్కు
నగలు కైసేయు పుణ్యంబు గలదె
ఈ వలిగాడ్పు మిమ్మావహంచిన దవ
జ్వాల లీనుగాని సౌఖ్యమిడదు
తీయని ఈ గండు కోయిల గానమ్ము
వెగటాయె కాదెమీ వీనుగవకు
ఈ తుషార జలమ్ము మీ చేతులంటి
మలినమైపోయె గొనకున్న మానె పొండు
సుకవి భోగ్యమ్ములిచట వస్తువులు వీని
నలిపివేయకు డటునిటు కలచివైచి...’’

- సాంధ్యశ్రీ, 8106897404