మెయిన్ ఫీచర్

సరికొత్తగా వస్తారట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీజన్ కొద్దీ సినిమా -అన్న నానుడి ఎలాగూ ఉంది కనుక -ప్రస్తుతం పెద్ద హీరోలంతా ‘వైవిధ్యాన్ని’ ప్రదర్శించేందుకు తహతహలాడుతున్నారన్న విషయం వాళ్లు ఎంపిక చేసుకుంటున్న కథలు, వాటి కాంబినేషన్లను చూస్తే అర్థమవుతుంది. అలాగే, పండుగనో పబ్బాన్నో టార్గెట్ చేసుకుని వచ్చే సినిమాలకూ పెద్ద హీరోలు ఫుల్‌స్టాప్ పెట్టేశారు. ఒకరి సినిమా మరొకరికి పోటీకాకుండా, పక్కా ప్లాన్‌తో సినిమాలు చేస్తుండటం గమనార్హం. అందుకే
-ఈ దసరాకు పెద్ద హీరోలు థియేటర్ల వద్ద పోటీలు పడే పరిస్థితి కనిపించడం లేదు.

ఒడుపు తెలిసిన ఆటగాడే -గెలుపునకు దగ్గరగా ఉంటాడు. ప్రేక్షకుడి పల్స్ పట్టిన హీరోయే -నాలుగు కాలాలపాటు కథానాయకుడిగా నిలబడగలుగుతాడు. ఈ సూత్రాన్ని తెలుగు హీరోలు బాగానే వంటబట్టించుకున్నారు. అందుకే -పాత్రల్లో ఒడుపుని, ప్యాన్స్ నాడిని పట్టిచూసి మరీ సినిమాలు ఎంపిక చేస్తున్నారు. సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇమేజ్‌కు తగ్గట్టుగా వస్తున్న అన్ని అవకాశాలూ వాడేసుకోవాలన్న ఆలోచనలు -ప్రస్తుతం హీరోల్లో కనిపించడం లేదు. కాస్త ఆలస్యమైనా -కథలో కొత్తదనం, పోషించే పాత్రలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటున్నారు. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేసే అవకాశం ఉన్న హీరోలు సైతం -తొందరపాటును ప్రదర్శించకుండా ఆచితూచి అడుగులేస్తున్న వైనం పరిశ్రమలో కనిపిస్తోంది.
****
సీజన్ కొద్దీ సినిమా పరిశ్రమ -అన్న నానుడి ఎలాగూ ఉంది కనుక -ప్రస్తుతం పెద్ద హీరోలంతా ‘వైవిధ్యాన్ని’ ప్రదర్శించేందుకు తహతహలాడుతున్నారన్న విషయం వాళ్లు ఎంపిక చేసుకుంటున్న కథలు, వాటి కాంబినేషన్లను చూస్తే అర్థమవుతుంది. అలాగే, పండుగనో పబ్బాన్నో టార్గెట్ చేసుకుని వచ్చే సినిమాలకూ పెద్ద హీరోలు ఫుల్‌స్టాప్ పెట్టేశారు. ఒకరి సినిమా మరొకరికి పోటీకాకుండా, పక్కా ప్లాన్‌తో సినిమాలు చేస్తుండటం ఇక్కడ గమనార్హం. అందుకే -ఈ దసరాకు పెద్ద హీరోలు థియేటర్ల వద్ద పోటీలు పడే పరిస్థితి కనిపించడం లేదు. పైగా -ఈ ఏడాది దాటేవరకూ పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యే అవకాశం కూడా లేదు. 2016లో విడుదల కావాల్సిన పెద్ద సినిమాలన్నీ దాదాపు పూరె్తైపోవడంతో -మెగా క్యాంపస్ హీరో రామ్‌చరణ్ ‘ధ్రువ’ తప్ప మరే పెద్ద సినిమా ఈ సీజన్‌లో థియేటర్ల వద్ద సందడి చేసే చాన్స్ లేదన్నది వాస్తవం. షూటింగులతో బిజీగా వున్న పెద్ద సినిమాలన్నీ -ఇక వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. అంటే -2017 పెద్ద పండుగ నుంచి వేసవి సీజన్ వరకూ పెద్ద హీరోల సినిమాలన్నీ థియేటర్ల వద్ద క్యూగట్టే అవకాశం ఉందన్న మాట.
****
గత ఐదేళ్లుగా సరైన హిట్టులేక అల్లాడిపోతున్న జూనియర్ ఎన్టీఆర్ -ఈ ఏడాది రెండు ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత జనవరి పెద్ద పండుగను టార్గెట్ చేస్తూ ‘నాన్నకు ప్రేమతో’ అంటే, ఈ సెప్టెంబర్‌లో ‘జనతా గ్యారేజ్’ అంటూ ఆడియన్స్‌ను అలరించే ప్రయత్నం చేశాడు. రోటీన్ క్యారెక్టర్లతో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న జూనియర్ -ఈసారి భిన్నమైన పాత్రలతోనే రెండు ప్రాజెక్టులు చేసి ‘ఓకే’ అనిపించుకున్నాడు. నాన్నకు ప్రేమతో చిత్రంలో ఫ్యామిలీ సెంటిమెంట్‌ను ఆశ్రయిస్తే, జనతా గ్యారేజ్‌లో సామాజిక జాగరూకతను ప్రదర్శించి వైవిధ్యంగా కనిపించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడిక కొత్త ప్రాజెక్టుకు ఇంతవరకూ ఓకే చెప్పకున్నా -వైవిధ్యమున్న కథ, పాత్ర దొరికే వరకూ ప్రాజెక్టులకు దూరంగా ఉండాలన్న ఆలోచనతోనే ఉన్నట్టు తెలుస్తోంది. యాక్షన్ ఎలిమెంట్‌కు కొంతకాలం గ్యాప్ ఇచ్చి, ప్యామిలీ డ్రామా, లవ్ ఎంటర్‌టైనర్స్‌పైనే దృష్టి పెడుతున్నట్టు సమాచారం.
మగధీర తరువాత అంతటి హిట్టు అందుకోవాలని ఆశపడిన రామ్‌చరణ్‌కు -వరుసగా రచ్చ, నాయక్, ఎవడు చిత్రాలు మనశ్శాంతి లేకుండా చేశాయి. మెగా ప్యాన్స్‌ను పూర్తిగా నిరుత్సాహపర్చాయి. మధ్యలో బాలీవుడ్ ప్రయత్నంగా జంజీర్ చేసినా, ఇటు వెరైటీ మాస్ పాత్రగా ‘బ్రూస్లీ’ చేసినా సరైన ఫలితం అందలేదు. వెరసి నిరాశనే మిగల్చడంతో -తాజాగా ‘ధ్రువ’పైనే చరణ్ ఆశలు పెట్టుకున్నాడు. ప్రతి ప్రాజెక్టులోనూ వైవిధ్యమైన పాత్రేనని చెబుతున్నా -ధ్రువ మాత్రం రొటీన్‌కు కాస్త భిన్నంగా ఉండొచ్చన్న అంచనాలు లేకపోలేదు. అనుకున్నట్టుగా ఈ అక్టోబర్‌లో ధ్రువ ప్రేక్షకుడి ముందుకొచ్చేస్తే -ఆ తరువాత ఈ ఏడాది ఒక్క పెద్ద సినిమా కూడా లేనట్టే. అంటే బాక్సాఫీస్ దగ్గర సందడి చేసే అవకాశం మీడియం, చిన్న సినిమాలకు దక్కినట్టన్న మాట. సరైన స్లాట్ దొరికింది కనుక, చిన్న సినిమాలకూ హిట్లు అందుతున్నాయి కనుక -ఈ సీజన్‌లో ఉన్న చిన్న, మీడియం సినిమాలన్నీ దులిపేయాలన్న ప్రయత్నాల్లో నిర్మాతలు, దర్శకులు ఉన్నట్టుగా పరిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. వీటిలో శరవేగంగా షూటింగులు జరుపుకుంటున్నవి కొన్నయితే, పోస్ట్ ప్రొడక్షన్ వర్కులు సైతం పూర్తి చేసేసుకుని ముహూర్తాలు వెతుక్కుంటున్న సినిమాలు ఇంకొన్ని. ఈ ఏడాది చివరి సీజన్ సినిమాలుగా విష్ణు ‘సరదా’, నాగాభరణం, నాని ‘మజ్ను’, సునీల్ ‘ఈడు గోల్డెహె’, కల్యాణ్‌రాం ‘ఇజం’, రామ్ ‘హైపర్’ చిత్రాలు విడుదలయ్యే అవకాశాలున్నాయ. మధ్యలో అవకాశం మేరకు ‘నిర్మలా కానె్వంట్’లాంటి చిన్న సినిమాలూ సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. అలాగని -బాక్సాఫీస్ దగ్గర సినిమా శోభ తగ్గిందనుకోడానికి వీల్లేదు. ఏటా రెండో మూడో చిన్న, మధ్యస్థ సినిమాలూ హిట్లు కొడుతూనే ఉన్నాయి. ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది మధ్యస్థంలో ‘క్షణం’, మొన్నటి ‘పెళ్లిచూపులు’ ఆడియన్స్‌లో ఆసక్తిని రేకెత్తించినవే. సో..-చిన్న సినిమాలూ కొత్త ఊపిర్లూదుతున్న తరుణంలో రాబోయే చిన్న, మీడియం సినిమాల విషయంలోనూ ఆడియన్స్ ఆసక్తిగానే కనిపిస్తున్నారు.
***
ఇక పెద్ద హీరోల సినిమాలన్నీ వచ్చే ఏడాదే స్క్రీన్‌కు రావాలి. మరో మార్గం లేదు. పవన్ కల్యాణ్‌ను తీసుకుంటే -వరుసగా మూడు ప్లాపులు ఎదుర్కొని, పడిలేచిన కెరటంలా వరుసగా మూడు హిట్లు అందుకున్న పవన్ -చివరిగా సర్దార్ గబ్బర్‌సింగ్‌తో డిజాస్టర్‌ను చవిచూశాడు. పాలిటిక్స్ చేస్తూనే ప్రాజెక్టులు ప్లాన్ చేస్తానని ప్రకటిస్తున్న పవన్ -తాజాగా ‘కాటమరాయుడు’పై (వర్కింగ్ టైటిల్) దృష్టి పెట్టాడు. వచ్చే ఏడాదే తొలి రెండు నెలల్లోనే ‘కాటమరాయుడు’ స్క్రీన్‌కు రావొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక మెగా బ్రదర్ -చిరంజీవి 150వ చిత్రం ‘కత్తిలాంటోడు’ కూడా వచ్చే ఏడాదే స్క్రీన్‌కు రావాలి. చాలా గ్యాప్ తరువాత రామ్‌చరణ్ ‘బ్రూస్లీ’లో టెస్ట్ అప్పియరెన్స్‌గా స్క్రీన్‌కు వచ్చిన చిరంజీవి -తమిళ రీమేక్‌తో 150వ చిత్రం పూర్తి చేయబోతున్నాడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఇతివృత్తం కారణంగా ‘కత్తి’నే ఎంచుకున్న చిరంజీవి -చాలాకాలం తరువాత ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్‌తో ఎలా మెప్పిస్తాడన్న ఆతృత ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది. ఇక బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’పైనా అంచనాలు పెరుగుతున్నాయి. మొన్నటిమొన్న డిక్టేటర్‌తో సందడి చేసిన బాలకృష్ణ -వందో చిత్రాన్ని ఎంపిక చేసుకోవడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఎలాంటి చిత్రంతో మెప్పించాలన్న సవాలక్ష ఆలోచనల అనంతరం క్రిష్ సారథ్యానికి ఒటేసిన బాలకృష్ణ -గౌతమీపుత్ర శాతకర్ణిగా రాబోతున్నాడు. అటు చిరంజీవి, ఇటు బాలకృష్ణ.. ఇద్దరి ప్రాజెక్టులు వేగంగా షూటింగులు జరుపుకుంటున్నాయి. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోనే ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ‘బాహుబలి’ ప్రాజెక్టుకే పరిమితమైపోయిన ప్రభాస్ -చాలాకాలంగా ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరుస్తున్నాడు. బాహుబలి -ది బిగినింగ్ విడుదల తరువాత ఏ ప్రాజెక్టు చేయకుండా ఉండిపోయిన ప్రభాస్, మళ్లీ బాహుబలి -ది కన్‌క్లూజన్‌లో మునిగిపోయాడు. ఇదీ వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ఆ తరువాతగానీ ప్రభాస్ చేపట్టేబోయే కొత్త ప్రాజెక్టులు కొలిక్కివచ్చే అవకాశం లేదు. మాస్‌ని మెప్పించే స్టైల్‌లో ఆరితేరిపోయిన అల్లు అర్జున్ -వరుసగా మంచి ప్రాజెక్టుల్లోనే కనిపిస్తూ హీరోగా టాప్ రేటింగ్‌కే చేరుకున్నాడు. రేసుగుర్రం లాంటి టైమింగ్ మూవీ తరువాత, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి చిత్రాల్లో వైవిధ్యమున్న పాత్రలు చేసిన బన్నీ -సరైనోడుతో ఊరమాస్‌కు ఊపునిచ్చాడు. తదుపరి ప్రాజెక్టు విషయంలోనూ వైవిధ్యాన్ని కోరుకుంటున్న అల్లువారబ్బాయ -ఈసారి మళ్లీ ఫ్యామిలీ డ్రామా సబ్జెక్టునే ఎంచుకునే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఫ్లాపులు, హిట్టుల్ని ఈక్వల్ రేషియోలో అందుకుంటూ వస్తున్న మహేష్‌బాబు, శ్రీమంతుడితో గెలిచి బ్రహ్మోత్సవంతో నిరుత్సాహపర్చాడు. తదుపరి ప్రాజెక్టుతో మళ్లీ కెరీర్ గ్రాఫ్‌ను పైకి లేపే వైవిధ్యమైన ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. ఇక దృశ్యంతో మెప్పించి బాబు బంగారంతో చతికిలపడి.. తాజాగా ‘సాలా ఖండూస్’ రీమేక్‌తో మెప్పించే ప్రయత్నం చేయబోతున్న వెంకటేష్, సోగ్గాడే చిన్నినాయినా, ఊపిరిలాంటి వైవిధ్యమైన ప్రాజెక్టులతో హిట్లుకొట్టి.. సాహసోపేత ప్రయోగాత్మక చిత్రంలో ‘నమో వెంకటేశాయ’ అనబోతున్న నాగార్జున... వీళ్లంతా ఆన్ స్క్రీన్‌మీద కనిపించేది వచ్చే ఏడాదే. వైవిధ్యమైన కథలు, పాత్రలతోనే మళ్లీ తెరపై కనిపించే ఆలోచనలోవున్న పెద్ద హీరోలు -వచ్చే ఏడాదిలో సినీ ప్రేక్షకులకు ఎలాంటి ఆనందాన్ని పంచుతారో వేచి చూద్దాం.

-రాణీప్రసాద్