మెయిన్ ఫీచర్

శ్రీ సిద్ధ కుంజికా మహాకాల శాంతియాగ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టి ఆవిర్భావానికి మూలకారణమైన జ్యోతిర్మయుడైన పరమాత్మ నుండి ఉద్భవించిన కాలాన్ని, శక్తిని ఆధారంగా చేసుకొని శ్రీసిద్ధకుంజికా మహాకాల విశ్వరూపాన్ని శ్రీ మహాకాల మందిరంలోప్రతిష్టింప చేశారు.
తాను ఏ రూపాన్ని తన అంతరంగమందు దర్శించారో ఆ రూపాన్ని సమాజానికి దర్శింపజేయాలనే తపనతో లోక కళ్యాణార్థం బ్రహ్మశ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతిగారు జ్యోతిర్మయ మహాపీఠంలో శ్రీమహాకాల మందిరాన్ని స్థాపించారు.
నిరంతరం ధర్మరక్షణకు, లోకకళ్యాణానికి విశ్వశాంతినే కాంక్షించే సిద్ధాంతిగారు ఈ వికారి నామ సంవత్సరంలో ఏర్పడే షడ్గ్రహకూటమి యొక్క దుష్ప్రభావం తొలగించుటకు ‘‘శ్రీసిద్ధ కుంజికా మహాకాల శాంతియాగాన్ని’’ సంకల్పించారు. సృష్టికి మూలమైన కాలం, శక్తి రెండింటి సమ్మేళన స్వరూపమైన శ్రీసిద్ధకుంజికా మహాకాల శాంతి యాగమొక్కటే మనల్ని రక్షిస్తుందనే ప్రగాఢమైన విశ్వాసంతో దైవ ప్రేరణతో జగద్గురువుల మహాత్ముల, స్వామీజీల, పూర్వీకుల దివ్యాశీస్సులతో, ఆత్మీయప్రోత్సాహంతో అభిమానులందరి సహకారంతో ఈ మహాయాగానికి ఈనెల 8 వ తేదీ సోమవారం అంకురార్పణ గావించారు. మత త్రయాలకు అతీతంగా మూర్తిత్రయాలనే ప్రధానంగా చేసుకొని, యాగశాల నిర్మాణం , మూడు రోజుల విధానాన్ని నిర్ణయించారు. సువిశాలమైన యాగశాలలో ముగ్గురమ్మల అంటే శ్రీమహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతులను నిలువెత్తు మూర్తులకు చూపరులను ఆకట్టుకొనేట్లుగా అలంకరించారు. మధ్యలో వృత్తాకార విశేష కుండంతో పాటు వాయవ్య , ఈశాన్య భాగాల్లో చతురస్ర కుండాలను కలిపి మొత్తం 3 కుండాలతో 33మంది వేదపండితులైన ఋత్విజులతో యాగం జరిపించారు.
యాగాన్ని నిర్వహించే సమయంలో ప్రతిరోజు ఋత్విజులతోపాటు యజమానులకు కూడా ఏ రోజు కా రంగు దీక్షావస్త్రాలను ధరింపచేశారు. సోమవారంనాడు పసుపురంగు, మంగళవారం ఎరుపు, బుధవారం నాడు తెలుపురంగువస్త్రాలను ధరించారు. శ్రీఅష్టకాల రాంమోహనశర్మజ్యోతి ప్రజ్వలన గావించి యాగాన్ని ప్రారంభించారు.
మొదటి రోజు అంటే ఏప్రెల్ 8వతేది శ్రీమహాకాల మందిరంలోని మండపంలో శ్రీగణపతి పూజ, పుణ్యాహవాచనత, ఋత్త్విగ్వరణం, దీక్షాధారణం, అఖండ దీపస్థాపనం, గోపూజ, మంగళ వాయిద్యాలతో యాగశాల ప్రవేశం చేశారు. ఈ ప్రారంభోత్సవ సమయంలో శ్రీగాయత్రీ పీఠం అన్నోజీగూడ వ్యవస్థాపకులు శ్రీగాయత్రీ తత్త్వానంద ఋషి దంపతులు, మరకత శ్రీలక్ష్మీగణపతి దేవాలయ వ్యవస్థాపకులు శ్రీమోత్కూరి సత్యనారాయణ శాస్ర్తీ దంపతులు, ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు శ్రీదైవజ్ఞ శర్మ, తెలంగాణ పత్రిక సంపాదకులు శ్రీ అష్టకాల రాంమోహన్ శర్మ, శ్రీసాయిధామం నిర్వాహకులు శ్రీరామయోగి, ఆత్మీయులు దర్శనమ్ సంపాదకులు శ్రీ ఎం. వేంకటరమణ శర్మఅభిమానులు శ్రీ పి. సురేందర్ రెడ్డి దంపతులు, స్థానికులు ఇంకా వేలమంది భక్తులు ఈ యాగాన్ని చూడడానికి తరలి వచ్చారు.
మొదటిరోజు యాగశాలలో శ్రీసిద్దకుంజికా మహాకాల మూలమంత్ర జపాలు, హవనాలతో పాటుగా విశేష రుద్ర హవనం జరిపించారు. ఇవే కాక మహాలింగార్చన ప్రదోషసమయం నుంచి రాత్రివరకు చేశారు. మహానీరాజనం, మంత్రపుపుష్పం, తీర్థప్రసాద వితరణలు చేశారు. ఈ మహాలింగార్చన జరుగుతున్నపుడు నాసిక్ త్రయంబకేశ్వర్ నుంచి వేదపండితులు వచ్చి పాల్గొన్నారు.
రెండవరోజు అంటే ఏప్రిల్ 9వ తేది అవాహిత, స్థాపిత దేవతాపూజలు, అమ్మవారికి ప్రత్యేకంగా పూలు, గాజులతో అర్చనలు చేశారు. శ్రీ నవచండీ హవనాన్ని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీదేశయి మహేశ్వరశర్మ జరిపించారు. ఈ యాగ వీక్షణకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన ప్రజా సంబంధాల అధికారి శ్రీవనం జ్వాలా నరసింహారావు దంపతులు విచ్చేశారు. ఆరోజున ప్రత్యేక లలితా సహస్రనామపారాయణలు, యాగశాలలో చండీ హోమాలు జరిగాయి. ఇదే సమయంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి అనుగ్రహం కోసం శ్రీమాధవాచార్య పవమాన హోమం నిర్వహించారు. గీతాప్రెస్ తెలుగు విభాగ నిర్వాహకులు శ్రీ మదునూరి వేంకట్రామశర్మ దంపతులు, శ్రీ ఎం. రామానందశర్మ దంపతులు, శ్రీపీఠం పత్రికా సంపాదకులు శ్రీ ఐ.వి.ఆర్.కృష్ణారావు షిర్డిలోని శ్రీపంచముఖ విష్ణు గణపతి దేవాలయ చైర్మన్ శ్రీరాంమోహన్‌రావు,. వైదిక బ్రాహ్మణ పరిషత్ సభ్యులు శ్రీగోమారం రఘురామశర్మ దంపతులు, శ్రీసంతోషిమాత ఉపాసకులు శ్రీ వేదాటి రామన్న పంతులు పాల్గొన్నారు. మధ్యాహ్నం ప్రాంతీయ విద్వత్సమేళన సభ వైభవంగా జరిగింది. ఈ యాగ నిర్వహణాకాలంలోనే డా. శ్రీసాగి కమలాకరశర్మ పర్యవేక్షణలో తొలిసారిగా రూపొందించిన శ్రీవికారి నామసం॥ ‘వాతావరణ పంచాంగం’ డ్రాప్ట్ కాపీలను ఆవిష్కరించారు. రెండవ రోజు సంగీత నృత్యార్చనలు కూడా ఈ యాగశాలలో నిర్వహించారు. ఇందులో చి గౌరీభట్ల అభిజ్ఞ చే జరిగిన నృత్యార్చన యాగ వీక్షణకు వచ్చిన వారినందరినీ ఆకట్టుకొంది. సంగీత దర్శకులు, ఆధ్యాపకులైన శ్రీ కె. రామాచారి బృందంతో స్వరార్చన కూడా జరిగింది. వచ్చిన అతిథులందరూ శ్రీ మహాకాల మందిర వ్యవస్థాపకులు యాగనిర్వాహకులైన శ్రీ సిద్ధాంతిగారి దివ్యాశీస్సులు అందుకున్నారు.
యాగశాలలో సర్వతోభద్ర, లింగతోభద్ర, యోగినీ, క్షేత్ర పాలక, వాస్తు, మండపాలను ఆవాహన చేసి, అరణి మథనంతో అగ్ని ప్రత్ఠిః గావించారు. సిద్ద కుంజికా యాగాన్ని చూడడానికి శ్రీయాదాద్రి దేవసాతన వంశపారంపర్య ధర్మకర్త శ్రీ నర్సింహ మూర్తిగాను. దేవస్థాన ప్రధాన పురోహితులు శ్రీగౌరీ భట్ల సత్యనారాయణ శర్మగారు, సిద్దిపేట వాస్తవ్యులు శ్రీగౌరీ భట్ల నర్సింహ స్వామి, చేర్యాల వాస్తవ్యులు శ్రీ ఎం. రామచంద్రమూర్తి, సంగారెడ్డి వాస్తవ్యులు శ్రీదేశాయి పేట రాజవౌళి శర్మ దంపతులు, ధర్మపురి వాస్తవ్యులు శ్రీకాశావఝల శివరరామశర్మ దంపతులు శ్రీపాండురంగాశ్రమం నుంచి శ్రీఅప్పాల విట్ట్ల శఠ్మ మొదలైనవారు విచ్చేశారు. విచ్చేసిన దంపతులందరూ దంపతీ పూజలు, సువాసినీ పూజలు యాగ నిర్వాహకులైన శ్రీ గౌరీభట్ల రామకృష్ణ శర్మ సిద్ధాంతి దంపతులు నిర్వహించారు.
శ్రీ సిద్ధకుంజికాదేవీ యాగం జరుగుతుండగా శ్రీసాంబశివశాస్ర్తీ గారు వచ్చి శ్రీ చక్రాన్ని, శ్రీ అవధూతల చిత్రాలను సిద్ధాంతిగారికి బహూకరించారు.
ఇక మూడవ రోజు యాగ పరిసమాప్తి జరిగే సమయంలో అవాహిత దేవతా, స్థాపిత దేవతా పూజలు, జపాలు, పారాయణలు, హవనాలతో పాటు యాగ సంరక్షకుడైన శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం హవనం, శ్రీ సుదర్శన హోమం నిర్వహించారు. ఈ యాగ నిర్వహణకు జగన్నాథ మఠం, సీతారాంబాగ్ పీఠాధీశ్వరులు శ్రీ వ్రతధర శ్రీనివాస రామనుజ జీయర్ స్వామి, వేంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి శ్రీశ్రీనివాస రాజు శ్రీస్వామి వారి ప్రసాదాన్ని తీసుకొని వచ్చి సిద్ధాంతిగారికి ఇచ్చి స్వామి ఆశీస్సులను అందచేశారు.
యాగ పూర్ణాహుతి సమయంలో సర్వార్థ సంక్షేమ సమితి వ్యవస్థాపకులు, శ్రీపి.వి. మనోహర్‌రావు దంపతులు, తెలంగాణ ఫైనాన్స్ కమీషన్ చైర్మన్ శ్రీజి. రాజేశం గౌడ్ దంపతులు శ్రీనక్కా ప్రభాకర్ గౌడ్ పూరాణహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సిద్ధాంతి బాల్యమిత్రుడైన కృష్ణయోగి గారిని పీఠం తరఫున సన్మానించారు. చివరగా దివ్యజ్ఞాన సిద్ధాంతిగారు ఇష్టదేవతారాధనను ప్రార్థనతోను, జపం, ధ్యానం వీటిల్లో ఏరూపంగానైనా ప్రతిక్షణం చేయాలని, ధార్మిక, ఆధ్యాత్మిక సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలని, శక్త్యానుసారం లోకకళ్యార్థ యజ్ఞయాగాది క్రతు నిర్వహణల్లో పాల్గొనాలని విశ్వశాంతిని కోరుకుంటూ పరమాత్మను జ్యోతిర్మయ మహాపీఠం ద్వారా సర్వేజనా సుఖినోభవన్తు అని ప్రజలందరికీ దివ్యాశీస్సులను అందచేశారు.

-రామకృష్ణ