మెయిన్ ఫీచర్

పుస్తకం నమస్త్భ్యుం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పుస్తకం హస్త్భూషణం’ అన్నారు. ఒంటరిగా ఉన్నపుడు పుస్తకమే ఓ మంచి నేస్తం. పుస్తకం చదవడంవల్ల ఒత్తిడిని జయించవచ్చు. అందుకే పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా సమాజంలో స్థిరపరచేందుకు యునెస్కో ఏటా ఏప్రిల్ 23న అంతర్జాతీయ పుస్తక దినోత్సవం నిర్వహిస్తుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో దేనికీ అంత ప్రాధాన్యత లేదు కానీ పుస్తకాలకు ఉంది. పుస్తకం ప్రపంచాన్ని పరిచయచం చేస్తుంది. ఉన్నచోటునుంచే ఇతర ప్రాంతాల పరిస్థితులు, ఆచారాలు, వ్యవహారాలు, చరిత్ర, వర్తమానం తెలుసుకునే వీలు కల్పిస్తుంది. మనిషి విజ్ఞానం పెంపొందించుకునేందుకు పుస్తకం ఎంతగానో దోహదం చేస్తుంది. పుస్తకాలు చదవడంవల్ల భాషాభివృద్ధి చెందుతుంది. మన ఆలోచనా విధానం, సృజనాత్మకత పెరుగుతుంది. విఖ్యాత రచయిత మిగుయేల్ డి సెర్వాంటిస్ ఏప్రిల్ 23న మృతి చెందాడు. ఆయన గౌరవార్థం పుస్తక దినోత్సవం నిర్వహించాలని పుస్తక రచయితల హక్కు కోసం పోరాడిన స్పెయిన్ రచయిత విసెంటే క్లావెల్ ఆండ్రోస్ 1923లో ప్రతిపాదించారు. ఆ మేరకు యునెస్కో మొదటిసారి 1995 ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక కాపీరైట్ దినోత్సవం జరిపింది. 1564లో ఏప్రిల్ 23నాడు పుట్టిన విఖ్యాత రచయిత షేక్‌స్పియర్ 1616లో సరిగ్గా ఇదే రోజున మరణించారు. మరో ప్రముఖ రచయిత గార్సిలసోడిలా వెగా వర్థంతి సైతం ఏప్రిల్ 23 కావడంతో ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని అదే రోజు జరపడానికి యునెస్కో మొగ్గుచూపింది.
పుస్తకం గత చరిత్రనూ, వర్తమానాన్ని నిక్షిప్తం చేసుకుని భవిష్యత్తులోకి తీసుకువెళ్ళే విజ్ఞాన గని. అందుకే మంచి పుస్తకం వందమంది మిత్రులతో సమానమంటారు. ‘‘మంచి పుస్తకాలు మన దగ్గరుంటే మంచి మిత్రుడు దగ్గరలేని లోటు తీర్చుతుందని’’ గాంధీజీ అన్నారు. పుస్తకంవల్ల కాలక్షేపంతోపాటు వినోదాన్ని విజ్ఞానాన్ని పెంచుతుంది. పుస్తక పఠనంలో విజ్ఞానాన్ని సంపాదించి ఎందరో ఉన్నత శిఖరాలు చేరిన దాఖలాలు ఉన్నాయి. పుస్తకాల అధ్యయనం ఒక తపన. తీరని విజ్ఞానదాహం. మనిషికి మరణం ఉండవచ్చు. కానీ పుస్తకానికి, దాని ద్వారా ఆర్జించిన విజ్ఞానానికి మరణం లేదు. పుస్తక అధ్యయనం వికాసాన్ని, విజ్ఞానాన్ని ఈ సమాజానికి అందిస్తుంది. వివిధ భాషలపై పట్టును పెంచుతుంది. కానీ నేడు పుస్తక స్థానాన్ని స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్స్‌లు వచ్చి చేరాయి. సామాజిక మాధ్యమాల్లో తక్షణమే చదివి ఆనందించవచ్చు కానీ అది తాత్కాలికమైన అనుభూతి మాత్రమే. కానీ పుస్తకం చదివితే వచ్చే అనుభూతి శాశ్వతమైంది. పుస్తకాలు మంచి పౌరుల్ని, మంచి పౌర సమాజాన్ని నిర్మించడానికి దోహదపడుతాయి. మనిషికి ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది పుస్తకమే. అందుకే పుస్తకానికి మరణం లేదు. అజేయమై వర్థిల్లేది పుస్తకం మాత్రమే.
పుస్తకం సృష్టించిన విప్లవం, మానవ సమాజంపై అంతా ఇంతా కాదు. పుస్తకాల్లో నిక్షిప్తమైన గ్రీకు తత్వవేత్త సోక్రటీస్, ప్లేట్, అరిస్టాటిల్‌ల ఆలోచనలు ప్రపంచ గతినే మార్చేశాయి. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్‌ల రచనలు భాతీయ సమాజంపై కనబరచిన ప్రభావం అంతా ఇంతా కాదు. భారత స్వాతంత్రోద్యమానికి ఆలోచనాత్మక గ్రంథాలే ఊపిరిపోశాయి. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు ఉన్నత విద్యకోసం బ్రిటన్ బాట పట్టారు. న్యాయశాస్త్రాన్ని అభ్యసించటంతోపాటు వారు ఎన్నో గ్రంథాలు రచించారు. విస్తృతంగా అధ్యయనం చేశారు. తత్వవేత్తల సిద్ధాంతాలపట్ల ఆకర్షితులయ్యారు. నిజానికి మానవాళిలో చైతన్యం రగిలించి అభివృద్ధివైపు నడిపించే శక్తి మంచి పుస్తకాలకు ఉంది. పుస్తకం హస్త్భూషణం అన్న భావన విరివిగా వ్యాప్తిచెందినపుడే ఇలాంటి ఉత్సవాలకు అర్థం పరమార్థం. నిజానికి చదువు మహాసముద్రం లాంటిది. ఎంత చదివినా ఇంకా ఎంతోకొంత మిగిలే ఉంటుంది. ముగింపు ఉండదు. పరీక్షకోసం చదివే పుస్తకాలను ప్రయాణంలో, ఇంటిలో చదివే పుస్తకాలను బుక్స్ ఆఫ్ అవర్స్ అంటారు. ఆదిమకాలంనుంచి అంతరిక్ష యుగం దాకా మానవ మేధస్సు సృష్టించిన, సృజించిన మహత్తర అంశాలన్నీ పుస్తకాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. అందుకే బాపూజీగారు విలువైన వజ్రాలకన్నా పుస్తకాల విలువే ఎక్కువన్నారు. పుస్తకాలు చదువటంవల్ల పిల్లలు కూడా ఏటా నాలుగువేల నుండి పనె్నండువేల వరకు కొత్త పదాలు నేర్చుకుంటారు. పుస్తకం వికాసానికి చిహ్నం. ఇంటర్నెట్ మూలంగా కళ్ళు పాడవటం, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయి. పుస్తక పఠనంవల్ల ఇరవైమూడు నెలల జీవితకాలం పెరుగుతుందని ఒక అధ్యయనంలో తేలింది. భారతీయులు వారానికి సగటున 10.4 గంటలపాటు చదువుతారు. ఇంటర్నెట్ చదివే పిల్లల్లో సహజ ఎదుగుదల మందగిస్తుంది. పుస్తకాలు ఎక్కువగా చదివేది బెంగుళూరువాసులేనట. పుస్తకంలోని కథనం, అందులోని పాత్రలలో పూర్తిగా లీనమవడం కూడా మనిషి జీవితకాలం పెరుగుదల ఆధారపడి ఉంటుందని పరిశోధనలో తేలింది. అందుకే ‘బొకేలు వద్దు - పుస్తకాలే ముద్దు’ అని పుస్తకాలు ఇచ్చిపుచ్చుకునే విధానానికి అలవాటుపడాలి. ఇటీవల ‘డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ పేరిట భారతీయ సాహిత్యాన్నంతా ఇ-రూపంలో తీసుకొచ్చేందుకు ఒక ఉద్యమంలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పుస్తక పఠనాన్ని ప్రోత్సహిద్దాం - పుస్తక దినోత్సవ సందర్భంగా ప్రజల్లో చైతన్యం విల్లివిరియగలదదని ఆశిద్దాం.

- కె. రామ్మోహన్‌రావు 94414 35912