మెయిన్ ఫీచర్

ఎం-ఆటో యాప్.. ఆడవారికి మాత్రమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్ధరాత్రి కాదు, పట్టపగలే మహిళలకు రక్షణ లేదు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంటే భయం.. కాస్త చీకట్లో ఒంటరిగా ప్రయాణించాలంటే భయం.. ఆటో ఎక్కాలంటే భయం.. క్యాబ్ ఎక్కాలంటే భయం.. ఇలా మహిళ ఒంటరిగా ఎక్కడికి వెళ్లాలన్నా భయమే.. అందుకే నేడు మహిళల రక్షణకోసం వివిధ రకాల యాప్‌లు ముందుకొస్తున్నాయి. అలాగే షీ కాబ్స్‌తో పాటు వివిధ రకాల సంస్థలు వినూత్న పరిష్కారాలతో ముందుకొస్తున్నాయి. ఈ కోవకు చెందినదే ‘ఎం. ఆటో యాప్’. మహిళలకు ఉపాధితోపాటు రక్షణ కూడా ఏకకాలంలో కల్పించేదే ఈ యాప్. తమిళనాడులో మొదలైన ఈ యాప్ చాలా పాపులర్ అయ్యింది. ప్రత్యేకంగా మహిళలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టింది. ఈ ఎం. ఆటో గ్రూప్ సంస్థలను స్థాపించింది మన్సూర్ అలీఖాన్ అనే వ్యక్తి. ఈ యాప్‌లో ఎం అంటే మస్కల్ అని అర్థం. మస్కల్ అంటే ప్రజలు అని అర్థం. ప్రస్తుతం ఈ యాప్ తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూర్, మధురై, తిరుచ్చి వంటి ప్రధాన నగరాల్లో సేవలు అందుబాటులోకి రావడంతో పాటు చాలా పాపులర్ అయిపోయాయి. అందుకు కారణం ఇందులో ఎం. ఆటో రైడ్ అనే ఆప్షన్‌ను పొందుపరచడమే. దీనిద్వారా ప్రయాణికులు మహిళా పైలెట్ లేక ట్రాన్స్‌జెండర్ పైలెట్‌ను ఎన్నుకోవచ్చు. అంతేకాక అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు ‘పానిక్ బటన్’ అంటే ఎమర్జెన్సీ అలారాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు ప్రయాణ సమాచారాన్ని అందించే ‘ట్రాకింగ్ సిస్టమ్’ కూడా ఇందులో ఉంది. ఒకవేళ ఎంచుకునే ఆప్షన్‌లో అనుకున్న సమయానికే మహిళా పైలెట్ లేనట్లయితే ఐదు నుంచి పది నిముషాల వ్యవధిలోనే మహిళా పైలెట్‌ను ఏర్పాటు చేసే వీలు కల్పిస్తోంది ఈ సంస్థ. మరికొన్ని రోజుల్లోనే చాలా ప్రాంతాల్లోకి ఈ యాప్ అందుబాటులోకి తీసుకురానున్నారు.
మహిళాసాధికారికత కోసం నడుం బిగించిన క్రమంలో ఆయన మస్తిష్కం నుండి పుట్టిన ఆలోచనే ఇది. ఇందులో దాదాపు 330 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఈ 330 మంది మహిళల్లో ముస్లిం యువతులు కూడా ఆటోస్టీరింగ్ పట్టుకుంటున్నారు. ఇందులో ఐదు మంది ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నారు. తమిళనాడుకు చెందిన ‘బోర్న్ టు విన్’ అనే స్వచ్చంధ సంస్థ ట్రాన్స్‌జెండర్లకి విద్యతో పాటు ఉపాధిని కూడా కల్పిస్తోంది. ఈ క్రమంలో ఎవరికైతే ఆటో పైలెట్‌గా చేరడానికి ఆసక్తి ఉందో వారికి శిక్షణ ఇప్పించి ఎం. ఆటో సంస్థలో చేర్పిస్తోంది. అలా ఇప్పటివరకు బోర్న్ టు విన్ సంస్థ నుండి ఐదు మంది ట్రాన్స్‌జెండర్లు ఎం. ఆటోలో పైలెట్స్‌గా మారారు.
ఆటో నడిపేవారిని మన్సూర్ పైలెట్లు అని సంభోదిస్తున్నాడు. కారణం ఈ మహిళలందరూ డ్రైవర్లుగా మారక మునుపు ఇంటి పనులు చేసుకుంటూ, టిఫిన్ బండ్లను నడుపుకుంటూనో జీవనం సాగించేవారే. అలాంటి ఈ మహిళలందరూ కష్టపడి ఆటో నేర్చుకున్నారు. వారు ఎంచుకున్న వృత్తికి విలువ, గౌరవం చేకూర్చడానికి డ్రైవర్ అని కాకుండా ప్రత్యేకంగా వారిని ‘పైలెట్లు’ అని సంభోదించాలని మన్సూర్ నిర్ణయించుకున్నాడు. మహిళాసాధికారికత ఇలాంటి చిన్న విషయాల నుంచే ప్రారంభమవుతుంది. *