మెయన్ ఫీచర్

‘కొవ్వొత్తుల ర్యాలీ’.. కొందరికేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం దుర్గమారణ్యాలతో నిండి ఉంటుంది. ఇక్కడ అనాదిగా ఆదివాసీలు జీవిస్తున్నారు. క్రైస్తవ మిషనరీలు మత పరివర్తనలకు ఇలాంటి ప్రాంతాలనే ఎంచుకున్నాయి. చైనా ప్రేరేపిత ఉగ్రవాదులకు ఈ అడవులపై మంచి పట్టు ఉంది. దంతెవాడ, సుకుమా వంటి ప్రాంతాల్లో వేలకొద్ది మావోయిస్టులు ఉన్నారు. ఇక్కడ రహస్యంగా గంజాయి సాగు జరుగుతూ ఉంటుంది. అక్రమ మైనింగ్, నకిలీ నోట్లు, దోపిడీ చేసిన డబ్బుతో మావోయిస్టులు తమకు కావాల్సిన అన్ని వనరులు సమకూర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ అభివృద్ధి శూన్యం. రోడ్లువేసి వంతెనలు నిర్మిస్తే వాటిని మావోయిస్టులు పేల్చివేస్తూ ఉంటారు. రమణసింగ్ నేతృత్వంలో భాజపా ఇక్కడ ప్రభుత్వాన్ని మొన్నటి వరకూ సుదీర్ఘకాలం పాటు నడిపింది. 2018 డిసెంబర్‌లో కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో భీమ్ మాండవీ అనే బిజెపి శాసనసభ్యుడు ఎన్నికల ప్రచారానికి బయలుదేరాడు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో మాండవీ ప్రచారానికి వెళ్లాడు. మార్గమధ్యంలో మావోలు అమర్చిన మందుపాతర పేలి మాం డవీ, అతని అంగరక్షకుడు, నలుగురు జవాన్లు హతులైనారు. ‘ప్రజాస్వామ్యం బూటకం, ఎన్నికలు నాటకం. అందుకని వాటిని బహిష్కరించండి’ అని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఐతే తమ ఆజ్ఞ ధిక్కరించినందుకు ప్రజాప్రతినిధిని వారు చంపివేశారు. ఇలాంటి సంఘటనలు ఛత్తీస్‌గఢ్‌లో జరగటం కొత్తకాదు. లోగడ 74 మంది సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లను మందుపాతర పేల్చి హతం చేశారు. రోడ్లు నిర్మిస్తున్న ఇంజనీర్లను హతమార్చి, పొక్లెయిన్లను తగులబెట్టారు. విశాఖ ఏజెన్సీలోని అరకు వద్ద తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సవేరి సోమును మావోయిస్టులు గత ఏడాది కాల్చి చంపారు. ఇన్‌ఫార్మర్ల పేరుతో అమాయక గిరిజనులను, పోలీసు అధికారులను మావోలు హతమార్చారు. ఈ విధ్వంసం అంతా చైనా చేయిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ఆయుధాలు, ధనం సమకూరుస్తున్నదన్న ఆరోపణలున్నాయి. అంటే చైనా అంతర్గత యుద్ధాన్ని భారతదేశంలో దశాబ్దాలుగా సాగిస్తున్నది.
భారత్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ఇటు చైనా, అటు పాకిస్తాన్, మరొకవైపు అమెరికా ప్రేరేపిత క్రైస్తవ మిషనరీలు అహోరాత్రులు కృషి చేస్తున్నాయి. తమ లక్ష్యసాధనకు రాజ్యాంగేతర, ప్రజాస్వామ్యేతర మార్గాలను తీవ్రవాదులు ఎంచుకున్నారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుందనేది వారి మూలసిద్ధాంతం. అందుకని ఎన్నికల ప్రక్రియలో వారు పాల్గొనరు, ఎవరినీ పాల్గొననివ్వరు.
***
ఇక జాతీయవాదం ఎక్కడ ఉన్నా దానిని కాంగ్రెస్ వారు వ్యతిరేకిస్తున్నారు. నూరేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ పుట్టింది భారత జాతీయ పునరుజ్జీవనం కోసం. కాని ఇపుడు ఆ పార్టీలో జాతీయవాదులెవరూ లేరు. ‘మనది ముస్లిముల పార్టీ’ అని బహిరంగంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, కాంగ్రెస్ అండతో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న హెచ్‌డి కుమారస్వామి బహిరంగంగా ప్రకటించారు. మహారాష్టల్రోని భీం-కోరేగాం అల్లర్ల సందర్భంగా దొరికిన ఆడియోల ద్వారా రోనా విల్సన్ సందేశాలలో ముఖ్యాంశాలు ఏమంటే.. ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన మంత్రివర్గ సహచరులను ఎన్నికల సమయంలో రోడ్‌షోల సందర్భంగా తిరుగుతున్నప్పుడు మందుపాతరలు పేల్చి హత్య చేయాలి. ఇందుకు ఛత్తీస్‌గఢ్‌లో భాజపా ఎమ్మెల్యేను హతమార్చడం ఉదాహరణ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కూడా తమిళనాడులో ఎన్నికల ప్రచార సందర్భంలోనే జరిగింది. బిజెపి కార్యకర్తలను, నాయకులను హత్యచేయడానికి ఆయుధాలు, ధనం, ఇతర వనరులను కాంగ్రెస్ వారే సమకూరుస్తున్నారనే ప్రచారం ఉంది. చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు బస్తర్ మీదుగా జాఫ్నా (శ్రీలంక)వరకు రెడ్ కారిడార్ నిర్మాణం పూర్తిచేశారు. బస్తర్ అడవులలోని ఉగ్రవాదులు హత్యాకాండలకు పాల్పడిన తర్వాత ఇటు ఉత్తర తెలంగాణ, అటు శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాల్లోకి పారిపోతున్నారు. 2014లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం నడిచినప్పుడు అందులో కొందరు మావోయిస్టులు సైతం పాల్గొన్నారు. రైల్వేస్టేషన్‌లను తగులబెట్టడం, కొన్ని చోట్ల ప్రముఖుల విగ్రహాలను ధ్వంసం చేయడం వంటి పనులను వీరు చేశారు. వీరికి కొన్ని ప్రజా సంఘాల, పౌరహక్కుల సంఘాల నేతలు, మేధావులు, విద్యార్థి సంఘాల నేతలు మద్దతు పలికారు. తెలంగాణను మరొక ఛత్తీస్‌గఢ్‌గా మార్చాలనేది వీరి వ్యూహం.
ఒకవైపు జిహాదీ ఉగ్రవాదులు కశ్మీరులో బీభత్సం సృష్టిస్తుంటే, చైనా ప్రేరణతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్ వంటి ప్రాంతాలను మావోయిస్టులు తమ విచ్ఛిన్న కార్యకలాపాలకు స్థావరాలుగా ఎంచుకున్నారు. వీరిపై సంబంధిత రాష్ట్రా ప్రభుత్వాల అదుపులేదు. వీరికి భారత రాజ్యాంగం వర్తించదు. కశ్మీరులో ఇటీవల చంద్రకాంత శర్మ అనే సేవాతత్పరుడైన వ్యక్తిని జీహాదీ ఉగ్రవాదులు హతమార్చారు. అందుకు వారు చూపిన కారణం ఇతడు హిందూ సామాజిక సేవాసంస్థలలో సభ్యుడు అని. కశ్మీరులో హిందువులు ఉండకూడదనేది జిహాదీల అంతిమ లక్ష్యం. ‘్భమిమీద కుర్దులు, యూదులు, క్రైస్తవులు, హిందువులకు జీవించే అధికారం లేదు’ అని సిరియాకు చెందిన ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థ మరణ శాసనం ప్రకటించింది.
ఇంత జరుగుతున్నా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చిత్తగిస్తున్నాయి. మావోయిస్టులు మారణహోమం సృష్టించినపుడల్లా- ‘ఇది పిరికిపంద చర్య’ అంటూ ప్రభుత్వాలు బులెటిన్‌లు విడుదల చేస్తూనే ఉన్నాయి. ఎవరు పిరికివారు? చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు కాదు, నిస్సందేహంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పిరికితనంతో విలవిలలాడుతున్నాయి. అఖిల భారత విద్యార్థి పరిషత్, బజరంగదళ్, విహెచ్‌పి వంటి సంస్థల పరాక్రమం ఏమైంది? ఇక్కడ గమనింపవలసిన మరో అంశం పౌరహక్కుల, మానవ హక్కుల సంఘాల పాత్ర, సూడో సెక్యులరిస్టుల ద్విపాత్రాభినయం. కర్ణాటకలో శివలింగం మీద మూత్రం పోయండని ప్రకటించి బసవేశ్వరుని భక్తులను నిందించిన కలబురిగి అనే వ్యక్తిని ఎవరో చంపితే దానిని అంతర్జాతీయంగా ప్రచారం చేశారు. జర్నలిస్టు గౌరీలంకేశ్ అనే ఉగ్రవాద సానుభూతిపరురాలు హత్యకు గురైతే దేశవ్యాప్తంగా పౌరహక్కుల సంఘాల వారు కొవ్వొత్తులు పట్టుకొని ఊరేగింపులు జరిపారు. మహారాష్టల్రో దభోల్కర్ అనే వ్యక్తిని ఎవరో చంపితే అల్లర్లు చెలరేగాయి. హైదరాబాదులో వేముల రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే దానిని ఎన్‌ఐఏకు నివేదించారు. ‘నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు. నేనే మానసిక వ్యధతో చనిపోతున్నాను’ అని వేముల ఒక లేఖలో పేర్కొన్నాడు కూడా.
కశ్మీరులో చంద్రకాంత శర్మ జిహాదీ ఉగ్రవాదుల చేతిలో హతుడైనప్పుడు ఒక్క కొవ్వొత్తి ర్యాలీ కూడా జరగలేదేమిటి? ఛత్తీస్‌గఢ్‌లో ప్రజాప్రతినిధి భీం మాండవీ దారుణంగా హత్యకు గురైనపుడు ఒక్క రాజకీయ పార్టీ కూడా సానుభూతి సందేశం విడుదల చేయలేదేమిటి? ఈ దేశంలో ప్రస్తుతం ఆటవిక న్యాయం నడుస్తున్నదని సా రాంశం. దీనికి చైనాను నిందించి ప్రయోజనం లేదు. మన మేధావులవి బానిస బుద్ధులు. వీరిని ఇటలీ, బీజింగ్, సౌదీ అరేబియా, అమెరికాలు పరిపాలించాలి. వీరిని చూస్తే భారతీయులు స్వాతంత్య్రానికి అనర్హులు అనాల్సి వస్తుంది.
***
తిరుమల తిరుపతి దేవస్థానం సంపదలో భాగమైన శేషాచలం అడవులలోని ఎర్రచందనం భారీగా చైనాకు తరలిపోతోంది. ఎర్ర చందనం దుంగలు కావేరీ నది మీదుగా శ్రీలంకకు, అక్కడి నుండి మరపడవల మీద చైనాకు చేరుతున్నాయి. ఈ అక్రమ రవాణాను మన నిఘా విభాగం ఎందుకు నిరోధించలేక పోతున్నది?
ఇండియా నుండి సాంస్కృతిక బృందాల పేరుతో ఉగ్రవాద రచయితలను చైనా ఆహ్వానిస్తున్నది. వీరిలో విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్లు, కవులు, సినీకళాకారులు కూడా ఉన్నారు. పాకిస్తాన్, ఉత్తర కొరియాలకు అణ్వస్త్ర ఉత్పత్తులను చైనా ఎగుమతి చేస్తున్నది. భారతదేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో చైనా ప్రత్యక్ష జోక్యం చేసుకుంటున్నది. హిమాలయ సానువులలోని టిబెట్, నేపాల్ వంటి రాజ్యాలను చైనా కబళించింది. ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురవేయడానికి చైనా భారతీయ పౌరులనే సాధనాలుగా వాడుకుంటున్నది.
***
‘డబ్బుకు లోకం దాసోహం’అని సూక్తి. మానవుడు బలహీనుడు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పశువుల దాణా కొనుగోళ్లలో నిధులను మింగి జైలుకువెళ్లాడు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమలనాథ్ పసిపిల్లల కోసం నిర్దేశించిన పౌష్టికాహారం నిధులను కాజేసినట్టు ఆరోపణలున్నాయి. దాదాపు 281 కోట్ల రూపాయల అవినీతి డబ్బు న్యూఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లో పట్టుబడింది. తుగ్లక్ రోడ్‌లో కమల్‌నాథ్, ఆయన సలహాదారు రాజేంద్రకుమార్ మిగ్లాని, కార్యదర్శి ప్రవీణ్ కక్కర్‌ల నివాసాలున్నాయి.
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకూ వేల లీటర్ల మద్యం, వేల కోట్ల డబ్బు తనిఖీల్లో దొరికాయి. రాజకీయ ప్రత్యర్థులపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. గుంటూరు ఎం.పి. గల్లా జయదేవ్‌కు చెందిన గుర్రప్పనాయుడు (ఆడిటర్) ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. ఇంకా మరికొంత మంది ప్రముఖ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగితే ఇదంతా రాజకీయ కక్షసాధింపు చర్య అంటున్నారు. లోక్‌సభ తొలి విడత, రెండో విడత పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల హింస చెలరేగింది. ప్రభుత్వం కానీ, ఎన్నికల సంఘం కానీ ఈ పరిణామాలను ఎందుకు నిలువరించలేక పోయాయి.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్