మెయిన్ ఫీచర్

మారుతున్న ‘ఖిలవాడీ’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో ‘అమ్మాయి వద్దు, అబ్బాయే ముద్దు’ అని కోరుకునేవారు చాలామందే ఉంటారు. కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ తెగలో ఆడపిల్ల పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంబరాలు చేసుకుంటారు. కానీ ఈ సంబరాలు మంచి పనికోసం కాదు. మధ్యప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో నివసించే బచ్చారా తెగ అని ఒకటుంది.. ఈ తెగలోని కుటుంబాల్లో పుట్టిన అమ్మాయిని పది, పనె్నండేళ్ల వయసు వచ్చేసరికి వ్యభిచారంలోకి దింపుతారు. ఈ ఆచారం శతాబ్దాల నుంచి కొనసాగుతోంది. ఈ అమ్మాయికి వయసు అయిపోగానే ఆమె సోదరిని వృత్తిలోకి లాగుతారు. తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది.
వ్యభిచారం ద్వారా ఈ మహిళలు సంపాదించిన డబ్బుతోనే కుటుంబంలోని పురుషులు తమ జీవితం గడుపుతారు. కొన్నిచోట్ల ఈ అమ్మాయిల తండ్రి లేదా సోదరులే విటులను తీసుకువచ్చే పని కూడా చేస్తారు. అంటే బ్రోకర్ పని కూడా చేస్తారు. ఈ తెగలో పెళ్లిళ్లు కూడా వింతగా జరుగుతాయి. అమ్మాయి కుటుంబం భారీ వరకట్నాన్ని కోరుకుంటుంది. సంచారా జాతికి చెందిన ఈ బచ్చారా తెగ ప్రజలు చాలా పేదరికంలో ఉంటారు. సాధారణంగా వీరు గ్రామీణ ప్రాంతాల్లోను, హైవేల పక్కన ట్రక్కు డ్రైవర్లు ఆగేచోట నివసిస్తుంటారు. ఈ తెగలోని కుటుంబాల ఆర్థికస్థితి మహిళలపైనే ఆధారపడి ఉంటుంది.
ఖిలవాడి (ఆడుకునేవారు) అని పిలుచుకునే ఈ తెగలోని బాలికలు ఒంటరిగా లేదా బృందాలుగా నులకమంచాలపై కూర్చుని అబ్బాయిల కోసం ఎదురుచూస్తుంటారు. వీరికి సంబంధించిన వ్యవహారాలు చూసేందుకు దగ్గరలోనే ఉన్న ఓ చిన్న దుకాణాల వద్ద కుటుంబ సభ్యుడెవరో ఒకరు ఉంటారు. వీరితోనే విటులు తమ సంభాషణలు జరుపుతారు. సాధారణంగా ఒక్కొక్కరి నుంచి వీరికి వచ్చే రూ. 100 నుంచి రూ. 200 ఉంటుంది. కన్యగా ఉండే బాలికలైతే ఎక్కువ డబ్బులు అంటే దాదాపు రూ. 5000 వరకూ కూడా ఇవ్వడానికి సిద్ధపడతారని కొందరు స్థానికులు చెబుతున్నారు. ఈ వృత్తిలోని కొందరు ఖిలవాడీలకు పిల్లలు కూడా పుడుతున్నారు.
భారతదేశంలోని చాలా కుటుంబాల్లో మగసంతానమే కావాలని కోరుకోవడం వల్ల స్ర్తి, పురుష నిష్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. కానీ ఇక్కడ సమస్య మరొకటి. ఈ తెగలో దాదాపు 33000 మంది జనాభా ఉంటే వీరిలో 65 శాతం మంది మహిళలే ఉన్నారు. ఈ ప్రాంతానికి బాలికల అక్రమ రవాణా కూడా ఇక్కడ మహిళల జనాభా ఎక్కువ ఉండటానికి ఓ కారణం. బచ్చారాల్లో వ్యభిచారాన్ని అరికట్టేందుకు 1993లో జబాలి అనే ఓ పథకాన్ని ప్రారంభించారు. కానీ ఇది ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. జబాలి పథకం ముఖ్యంగా ఈ మహిళలకు విద్య, ఆరోగ్యంపై అవగాహన కల్పించి వారికి పునరావాసం కల్పించడంపై ప్రధానంగా దృష్టిసారిస్తుంది. అయితే ప్రభుత్వం సాయం చేసినా, చెయ్యకపోయినా మార్పైతే నెమ్మదిగా జరుగుతుంది. 12 సంవత్సరాల్లోపు బాలికలపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించేలా ఇటీవలే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అలాగే 18 ఏళ్ల లోపువారితో లైంగిక సంబంధం పెట్టుకునేవారికి జైలుశిక్షను పనెంచుతూ కూడా నిర్ణయం తీసుకుంది. కానీ ఇవేమీ తగిన ఫలితాలనివ్వడం లేదు.
చాలామందికి ఈ వృత్తి వల్ల వ్యాధులు సోకే ప్రమాదం ఎప్పుడూ పొంచే ఉంటుంది. ఇలా వచ్చే ఆరోగ్య సమస్యలపై 2000 సంవత్సరంలో ‘ది హిందూ’ ఓ కథనం రాసింది. ఈ తెగకు చెందిన 5500 మంది రక్త నమూనాలను పరీక్షిస్తూ వాటిలో 15 శాతం మందికి హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలిందని ఆ కథనంలో పేర్కొంది. ఈ సామాజిక ఆచారం ఎలా మొదలైందనే దానిపై ఎన్నో సిద్ధాంతాలున్నాయి. ఈ సంచార జాతి డబ్బులు సంపాదించడానికి ఎన్నో ఇబ్బందులు పడి చివరికి వ్యభిచారాన్ని దానికి పరిష్కారంగా ఎంచుకుంది అనేది వాటిలో ఒకటి. ఈ ఆచారంతో విసిగిపోయిన హీనా ఓ స్థానిక ఎన్జీఓ సాయంతో ఈ ఆచారంపై పోరాటం చేస్తోంది. హీనా అనే అమ్మాయి కూడా ఎన్జీఓ సంస్థలో ఓ భాగమే.. హీనా పుట్టినప్పటి నుంచే తనను తమ తెగ ఆచారాన్ని దృష్టిలో ఉంచుకుని పెంచారు. మైనర్‌గా ఉండగానే ఆమెను వ్యభిచార వృత్తిలోకి దింపారు. ‘నన్ను బలవంతంగా పడుపు వృత్తిలోకి దింపేనాటికి నా వయసు పదిహేను సంవత్సరాలు. చదువు మానేసి మా అమ్మ, అమ్మమ్మల మార్గంలోనే నేనూ బతుకుతున్నా. ప్రతిరోజూ గ్రామాల్లో నివసించే ధనవంతుల దగ్గర నుంచి ట్రక్కు డైవర్ల వరకూ ఎందరో విటులు ఆమె దగ్గరకు వస్తుంటారు. పద్దెనిమిదేళ్లు వచ్చేసరికి నేను చేస్తున్నది ఎంత తప్పుడు పనో అర్థమైంది. చాలా కోపం వచ్చింది. కానీ నాకిప్పుడు ఏం అవకాశాలున్నాయి? వ్యభిచారం ద్వారా డబ్బు సంపాదించకపోతే నా కుటుంబం ఎలా బతుకుతుంది? ఈ వృత్తిలో ఉన్నవారిలో మూడొంతుల్లో ఒకవంతు మైనర్లే.. పగటివేళ రోజుకు నలుగురైదుగురు పురుషులు వస్తారు. రాత్రివేళల్లో మేమే దగ్గరలోని హోటళ్లకో, మరో ప్రదేశానికో వెళ్తాం. ఈ వృత్తిలోని కొందరు ఖిలవాడీలకు పిల్లలు కూడా పుడుతున్నారు. అలా కొన్నిసంవత్సరాల్లోనే నేను కూడా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చాను. తర్వాత నేను మరింత కష్టపడి పనిచేయమని ఒత్తిడి పెరిగింది. చాలామంది అమ్మాయిలు పిల్లలు పుట్టాక కూడా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. పిల్లల పోషణ కోసం మరింతగా కష్టపడాలంటూ వీరిపై ఒత్తిడి పెరుగుతోంది. సెక్స్‌వర్కర్‌గా ఉంటూ తమ తెగలోని అబ్బాయిని పెళ్లిచేసుకోవడం ఇక్కడ నిషేధం. ఈ దురాచారానికి బలైన అమ్మాయి మాత్రమే దీనిలోని బాధను అర్థం చేసుకోగలదు. అదెలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. ఈ ఆచారాన్ని అంతం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా..’ అని చెబుతోంది హీనా.
ఈ తెగలోని కొందరు యువతీయువకులు తమ తెగ సంప్రదాయాన్ని పక్కకునెట్టి వేరే ప్రదేశాల్లో విద్య, ఉద్యోగావకాశాలను వెతుక్కుంటున్నారు. స్థానికంగా ఉన్న కొన్ని సంస్థలు కూడా వారికి కొంత సహాయాన్నందిస్తున్నాయి. ఇక్కడ మైనర్లకు చదువు చెప్పేందుకు ఎన్జీఓ స్థానికంగా ఓ శిక్షణా కేంద్రాన్ని కూడా నడుపుతోంది. ముందు ముందు తల్లిదండ్రులు కూడా తెగ సంప్రదాయం అంటూ ఆడపిల్లలను ఈ నీచమైన వృత్తిలోకి దించకుండా చదివించి ప్రయోజకులను చేయాలని ఆశిస్తోంది సమాజం, ప్రభుత్వం.

-మహి