మెయిన్ ఫీచర్

ఆదివాసీ పల్లెల్లో అక్షర కాంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరక్షరాస్యత వల్లనే గిరిజనులు మోసపోతున్నారని నినోక్ష డిసిల్వా గమనించారు. వయోజనులకు అక్షరాలు నేర్పేందుకు రాత్రిబడులను
ప్రారంభించారు. ఈ బడులకు తల్లిదండ్రుల్ని తీసుకువచ్చే బాధ్యతను పిల్లలకు అప్పగించారు. ఆమె నిర్ణయం మంచి ఫలితాలను ఇచ్చింది.
పిల్లల తల్లిదండ్రుల్లోనూ అక్షరాస్యత శాతం పెరిగింది. స్వతంత్రంగా వ్యవహరించడం, సంపాదనలో మెళకువలు, వంచనకు గురికాకుండా
ఉండడం వంటి అంశాలపై ఆమె గిరిజనులకు శిక్షణ ఇచ్చారు. పెద్దలు తాము నేర్చుకున్న అక్షరాలను మరచిపోకుండా పుస్తకాలు
చదివేందుకు వీలుగా గ్రామంలో గ్రంథాలయాన్ని నిర్మించారు. ఇందుకోసం తన స్నేహితుల నుంచి విరాళాలు సేకరించారు.

గోవాకు చెందిన నినోక్ష డిసిల్వా
వెనుకబడిన ఒడిశా రాష్ట్రంలో పేద,
అనాథ పిల్లలకు చదువు నేర్పుతూ
అక్షర దీపాలు వెలిగిస్తున్నారు. సమాజం కోసం చేతనైనంత సాయం చేయాలని ఆమె డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే
భావించేవారు. ఓ వైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు పేదవర్గాలు నివసించే ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లి ఆమె
తరగతులు నిర్వహించేవారు. ముంబయిలోని సోఫియా కాలేజీలో డిగ్రీ చదువుతుండగా, భారతీయ స్టేట్ బ్యాంకు
ప్రకటించిన ‘యూత్ ఫెలోషిప్’ కు
ఆమె ఎంపికయ్యారు.

‘్ధ్యయం పవిత్రమైనది అయితే సరిపోదు.. దాన్ని నెరవేర్చుకునే మార్గం కూడా పవిత్రమైనది కావాలి..’- అంటూ జాతిపిత గాంధీజీ చెప్పిన మాటలను అక్షరాలా ఆచరిస్తూ ఆమె పేదవర్గాల పాలిట ఆశాజ్యోతిలా మారారు. గోవాకు చెందిన నినోక్ష డిసిల్వా వెనుకబడిన ఒడిశా రాష్ట్రంలో పేద, అనాథ పిల్లలకు చదువు నేర్పుతూ అక్షర దీపాలు వెలిగిస్తున్నారు. సమాజం కోసం చేతనైనంత సాయం చేయాలని ఆమె డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే భావించేవారు. ఓ వైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు పేదవర్గాలు నివసించే ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లి ఆమె తరగతులు నిర్వహించేవారు. ముంబయిలోని సోఫియా కాలేజీలో డిగ్రీ చదువుతుండగా, భారతీయ స్టేట్ బ్యాంకు ప్రకటించిన ‘యూత్ ఫెలోషిప్’కు ఆమె ఎంపికయ్యారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గజపతి జిల్లా (ఒడిశా) లోని కొయిన్‌పూర్ అనే గిరిజన గ్రామానికి వెళ్లారు. అక్కడి ప్రజలకు ఒరియా, సవర భాషలు తప్ప మరే ఇతర భాషలూ తెలియవు. వారికి చేరువయ్యేందుకు ఆమె ఒరియా, సవర భాషలు నేర్చుకున్నారు.
‘లంజియా సవర’ అనే గిరిజన తెగ ప్రజల కోసం ‘గ్రామ్ వికాస్’ సంస్థ నిర్వహిస్తున్న మహేంద్రతనయ ఆశ్రమ పాఠశాలలో తన సేవలను నినోక్ష ప్రారంభించారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో కూడా తరగతులు బోధించేవారు.
చిన్న చిన్న నాటికలు, కథలు, ఆటపాటల ద్వారా పిల్లలకు పాఠ్యాంశాలను సులభ పద్ధతుల్లో బోధించేవారు. దీంతో పలువురు పిల్లలు బడికి వచ్చేందుకు ఆసక్తి చూపడం ప్రారంభించారు. పిల్లల్ని కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం చేయకుండా మ్యూజిక్, కథల సీడీలను ఆమె వినియోగించేవారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, టీమ్ వర్క్ పెరిగేందుకు వర్క్‌షాపులను నిర్వహించారు. వారిలో దాగివున్న సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించేవారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పిల్లలు కూడా నినోక్ష నిర్వహిస్తున్న పాఠశాలకు రాసాగారు.
నిరక్షరాస్యత వల్లనే గిరిజనులు మోసపోతున్నారని ఆమె గమనించారు. వయోజనులకు అక్షరాలు నేర్పేందుకు రాత్రిబడులను ప్రారంభించారు. ఈ బడులకు తల్లిదండ్రుల్ని తీసుకువచ్చే బాధ్యతను పిల్లలకు అప్పగించారు. ఆమె నిర్ణయం మంచి ఫలితాలను ఇచ్చింది. పిల్లల తల్లిదండ్రుల్లోనూ అక్షరాస్యత శాతం పెరిగింది.
స్వతంత్రంగా వ్యవహరించడం, సంపాదనలో మెళకువలు, వంచనకు గురికాకుండా ఉండడం వంటి అంశాలపై ఆమె గిరిజనులకు శిక్షణ ఇచ్చారు. పెద్దలు తాము నేర్చుకున్న అక్షరాలను మరచిపోకుండా పుస్తకాలు చదివేందుకు వీలుగా గ్రామంలో గ్రంథాలయాన్ని నిర్మించారు. ఇందుకోసం తన స్నేహితుల నుంచి విరాళాలు సేకరించారు. ప్రస్తుతం నినోక్ష నిర్వహిస్తున్న మహేంద్రతనయ ఆశ్రమ పాఠశాలలో 220 మంది విద్యార్థులు ఉన్నారు.
హస్తకళతో అరుదైన ఆకృతులు సృష్టించడం, పక్షుల మాదిరిగా అరవడం వంటి విద్యలెన్నో ఇక్కడి పిల్లలకు తెలుసునని నినోక్ష చెబుతుంటారు. నాగరికత గురించి తెలియనప్పటికీ, పలు విషయాలలో వీరు మిగతావారికంటే మిన్నగా వ్యవహరిస్తారని ఆమె ప్రశంసిస్తుంటారు. మోసం చేయడం వీరికి తెలియదని, ప్రేమను ఇతరులతో పంచుకోవడం అనే విషయాన్ని తాను వీరి నుంచే తాను నేర్చుకొన్నానని నినోక్ష చెబుతారు.

-పి.హైమావతి