మెయన్ ఫీచర్

అసత్యాలు, అపోహలే ప్రచారంలో కీలకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇపుడు సమాచారం మనసు కన్నా వేగంగా, గరికపోచ కన్నా తేలికగా మారింది. పార్టీకో మీ డియా సంస్థ పుట్టుకొచ్చి ‘సత్యాసత్యాలను’ సగ్గుబియ్యం ఉప్మా అంత మెత్తగావండి వార్చేస్తున్నాయి. గతంలో సిద్ధాంతాల ప్రాతిపదికన చెలరేగిన మీడియా ఇపుడు పార్టీల జెండాలను, నాయకుల ఎజెండాలను భుజంపై మోసి మోసి కాయగాసిపోతున్నది. రాజకీయ పార్టీల వారు మీడియాను ఎంత పెట్టి మేపి తమ పెరట్లో కట్టేసుకుంటున్నారో ఆలోచించాలి. ఇక సోషల్ మీడియా వేగాన్ని అందుకోవాలన్న దుగ్ధతో ప్రధాన స్రవంతి మీడియా చేస్తున్న హడావుడి ఇంతా అంతా కాదు. తెలుగునాట ఎలాంటి సామాజిక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న ‘చానళ్ల చాదస్తం’ మాఫియాలా తయారైంది. ఈ క్రమంలో ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో- అవాస్తవాలు, అర్ధసత్యాలు, అపోహలు, దుష్ప్రచారాలు వార్తలుగా మారిపోవడం మన మాధ్యమ రంగానికి పట్టిన దారిద్య్రం. నిర్థారణనో, నిరూపణనో లేదా కనీసం న్యాయ నిర్ణయం చేసే విధానం లేకుండా ‘పాత్రికేయం’ ఘనుల్ని దుష్టులుగాను, దుష్టులను ఘనులుగా మార్చేస్తున్నది. దీంతో సగటు భారతీయుడు వార్తకు, సమాచారానికి, ప్రకటనకు తేడా తెలియని స్థితిలోకి వెళ్తున్నాడు.
ఈనెల 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్మారక ప్రాంగణంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సందర్భంగా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ప్రియాంకా వాద్రా ప్రసంగం కాస్త పరిశీలించాలి. హర్యానా భూముల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న తన భర్త రాబర్ట్ వాద్రాను రక్షించుకునేందుకు ప్రియాంక రంగంలోకి దిగిందన్నది జగమెరిగిన సత్యం. కానీ, మీడియా ఆమె వేషధారణను ఇందిరతో పోల్చింది. ఆమెకు లేని రాజకీయ మెరుగులు దిద్దింది. ‘ప్రతి వ్యక్తి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తానన్న మోదీ హామీ గురించి చెప్పిన వాళ్లను నిలదీయండి’ అని ర్యాలీలో ఆమె అన్న మాటలకు మాధ్యమాలు విస్తృత ప్రాచుర్యం కల్పించాయి. అంత పెద్దపార్టీలో ముఖ్యమైన నేత అన్న మాటలకు పత్రికలు ప్రధాన శీర్షికగా పెట్టడం ఎంత వరకు సబబు? మోదీ 2014 ఎన్నికల సభల్లో ఎక్కడైనా ఇలాంటి మాట అన్నారా? అని అడిగేవారు లేరు. ఇపుడు ఆ నిజానిజాలు తెలియనివాళ్ళు అది నిజమే..! అనుకునే ప్రమాదం ఉంది కదా? ఇదొక అవాస్తవ ఘటనకు రూపం కల్పించడం కాదా?
రాజకీయ నాయకుల నాలుకకు నరం ఉండదని అం టారు. వాళ్లు మాట్లాడిన విషయాల్లోని ‘బాడీ లాం గ్వేజ్’ను అద్భుతమైన కెమెరాలున్న మన మీడియా ఎందుకు పసిగట్టలేకపోతుంది? గతంలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఒసామా బిన్ లాడెన్‌ను ‘ఒసామాజీ’ అన్నారు. పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ మంత్రి సిద్ధూ వెళ్లి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకున్నాడు. రాహుల్ గాంధీ ‘మసూద్ అజర్’ను అజార్‌జీ అన్నాడు. దీనిపై విమర్శలు రాగానే రాహుల్ వ్యంగ్యంగా అన్నాడని కాం గ్రెస్ పార్టీ బుకాయించింది. ఇందులో వ్యంగ్యం, ధ్వని, ద్వంద్వార్థం ఏది ఉందో తెలుసుకోలేని స్థితిలో భారతీయ మీడియా కొట్టుమిట్టాడుతోందా? ‘అజార్‌జీ’ అని అన్నందుకు రాహుల్‌ను వేలెత్తి చూపగానే, నవాజ్ షరీఫ్ ఇంటికి మోదీ వెళ్లాడని ప్రతివిమర్శ చేస్తారు. షరీఫ్‌తో మోదీ మంతనాలు జరుపకపోతే సెక్యులర్ మేధావులు మోదీకి యుద్ధం తప్ప సంధి విషయాలు తెలియవంటారు కదా?
ఇక, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖామంత్రి లోకేశ్ పది నిమిషాలు తెలుగులో మాట్లాడితే అందులో వంద తప్పులున్నాయని సోషల్ మీడియా మొత్తం జోకులేస్తుంది. అదే లోకేశ్ బాబును తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టే అభినవ శాతకర్ణిగా ప్రధాన స్రవంతి మీడియా ఎక్స్‌పోజ్ చేస్తుంది. బందరు పోర్టును కేసీఆర్ హైద్రాబాద్‌కు తరలించుకుపోతాడా? మోదీ, అమిత్‌షాలు ‘కోడి కత్తిడ్రామా’లు ఆడుతున్నారా? ముం పు మండలాలను కేసీఆర్ వెనక్కి తీసుకెళ్తాడా? ఇందులో సాధికారికత ఉందా? తెలుగువారి ఆత్మగౌరవంలో తెలుగు భాష ఉంటుందా? ఉండదా? తేల్చాల్సిన బాధ్యత ఎవరిది?
రోజూ మేధావుల పేరుతో పుచ్చలపల్లి సుందరయ్య వారసుడిగా శాలువా భుజంపై వేసుకొని టీవీలో మాట్లాడే చలసాని శ్రీనివాస్ ఇటీవల ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు- ‘‘14 కోట్ల తెలుగు ప్రజలకు ఓ కేంద్ర మంత్రి లేడు’’ అని! పరకాల ప్రభాకర్ టీడీపీ ప్రభుత్వంలో మొన్నటివరకు సలహాదారుగా పనిచేశాడు. ఆయన భార్య నిర్మలా సీతారామన్ తెలుగువారి కోడలు కాదా? సెంటిమెంటును రెచ్చగొట్టేందుకు ఈ విషయం వాడుకోవడం దురదృష్టం కాదా? కడప జిల్లాలో తెదేపా తరఫున ప్రచారం నిర్వహించేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ వృద్ధ నేత ఫరూఖ్ అబ్దుల్లా వచ్చాడు. ముస్లింల ఓట్లను కొల్లగొట్టాలని చంద్రబాబు ఫరూక్‌ను ఏపీకి రప్పించాడు. ‘స్వాతంత్య్ర పోరాటంలో మతాలకతీతంగా అందరూ కలిసి పోరాడారని.. ఇపుడు ముస్లిములు, దళితులను ఇతర వర్గాలుగా విభజించి పాలిస్తున్నారని, ఇది దేశానికి ప్రమాదకరమని’’ ఫరూఖ్ పేర్కొన్నారు. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే కదూ! కశ్మీర్ అనే ఇస్లామిక్ స్టేట్ ఎవరి కుటుంబం వల్ల ఏర్పడింది? కశ్మీర్ సమస్య ఈ రోజు హిందూ ముస్లింల మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు తెచ్చింది? ఫరూఖ్ తాను నమ్మే అల్లా సాక్షిగా చెప్పగలరా? ఇపుడు దళితులతో ముస్లింలతో కలిపి మాట్లాడుతున్న ఫరూఖ్ 1957లో కాశ్మీర్‌లో సఫాయి కోసం వలసవచ్చిన దళిత కుటుంబాలను, వారి స్థితిగతులను ఏనాడైనా పట్టించుకొన్నారా? ఫరూఖ్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లా కాశ్మీరులోని దళిత కుటుంబాలను పౌరసత్వం ఇవ్వకుండా రాజ్యాంగం ద్వారా చేసిన దుర్మార్గం గురించి మీడియా అడగాల్సింది కదా! నాలుగు లక్షలమంది కాశ్మీరీ పండిట్లు వలసవెళ్లడానికి కారణం ఈ అబ్దుల్లాలు కాదా? హిందూ ఉపాధ్యాయుడిని ఆ పాఠశాలలోని విద్యార్థులే ఉరితీసినపుడు ఈ అబ్దుల్లా ఎక్కడ స్వర్గసుఖాలు అనుభవిస్తున్నాడు! రాజకీయాల్లో నయాపైసా విలువ చేయని ఇలాం టి నాయకులు హిందూ ముస్లింల ఐక్యత గురించి ప్రచారం చేస్తుండడం ఆంధ్ర ప్రజల దౌర్భాగ్యం కాక ఇంకేమిటి?
ఏపీ ఎన్నికల్లో పవన్ క ల్యాణ్ ఓవైపు కేసీఆర్ కుటుంబంతో తనకు సాన్నిహిత్యం ఉందని చెబుతూనే మరోవైపు కేసిఆర్ దుర్మార్గుడు అన్నట్లు మాట్లాడ్డం ద్వంద్వ ప్రమాణం కాదా? ‘తెలంగాణ ఏమైనా పాకిస్తానా?’ అంటున్న పవన్‌ను మీడియా ప్రశ్నించాలి కదా? సినీనటుడు పోసాని కృష్ణమురళి ఈ విషయంపై మాట్లాడినా మీడియా మాత్రం అదేదో గొప్ప డైలాగని ప్రసారం చేస్తుందా? అలాగే సీఎం అభ్యర్థిగా చెప్పుకొంటున్న వ్యక్తి పవన్‌కళ్యాణ్ ‘తాట తీస్తా’, ‘గుడ్డలూడదీస్తా’ అంటుంటే ఇదేదో దానవీరశూరకర్ణ డైలాగులా తెలుగు ప్రజానీకానికి విన్పిస్తారా?
ఇక కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ- ‘‘ముస్లింలు కేసిఆర్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్లే’’ అనడం రాజ్యాంగ వ్యతిరేకం కాదా? రాజకీయ పండితుడైన జైపాల్‌రెడ్డి ఓ మతం వారిపేరు పెట్టి ఓట్లు అడగడం, ఇంకొరిని బూచిగా చూపడం సరి కాదని మన శుద్ధ సెక్యులర్ మీడియా ఎందుకు ఆయనకు చెప్పదు? చంద్రబాబు ‘‘మోదీ త్రిపుల్ తలాక్ చట్టం తెచ్చి ముస్లింలను ఇబ్బంది పెడుతున్నాడని’’ అనడం నలభై ఏళ్ళ ఇండస్ట్రీ విలువేనా? పార్లమెంటులో చర్చ జరిగిన చట్టంపై రాజకీయ పేలాలు ఏరడం విజ్ఞతనా? అని మాధ్యమాలు ప్రశ్నించకుండా, ఇదేదో పెద్దసంస్కర్త మాటల్లా ప్రసారం చేయడం ఆత్మవంచన కాదా? గత ఏడాది కాలంగా ‘మోదీ దుర్మార్గుడు, వ్యవస్థల్ని నాశనం చేసాడ’ని రోజూ చంద్రబాబు తిడుతున్నా ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గాత్రకచేరిలా వింటున్న మీడియా ఇంతకీ మోదీ ఏంచేశాడని ఒక్కనాడైనా ప్రశ్నించిందా? ‘జగన్‌ను మోదీ కాపాడుతున్నాడు, మోదీ, జగన్, కేసిఆర్ కలిసి మాపై యుద్ధానికి వస్తున్నారని ఓవైపు, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయరని మరోవైపు చంద్రబాబు ప్రచారం చేస్తుంటే మీడియా వౌనంగా వింటుంటడం...?! నవీన్ పట్నాయక్, నితీశ్‌కుమార్ ముఖ్యమంత్రులైనా వారి వారి ప్రత్యర్థులపై ఇంత ఘాటు విమర్శలు చేయడం రాజకీయం అని అనుకోవడం లేదు కదా! సీబిఐ, ఈడి వంటి సంస్థల్లో కేంద్రం జోక్యం చేసుకోకుండా చంద్రబాబు జోక్యం చేసుకుంటాడా? కేంద్ర ప్రభుత్వం ప్రజలచేత ఎన్నుకోబడలేదా? ప్రధానికి, కేంద్రానికి ఎలాంటి హక్కులుండవా? కేవలం టీడిపికి మాత్రమే హక్కులు ఉంటాయా? కేసిఆర్ ఈ రోజు వరకు నోరు తెరచి ఒక్కమాట మాట్లాడలేదు. అయినా రోజూ కేసిఆర్‌ను తెదేపా అధినేత తిడుతుంటే అదేదో విష్ణుసహస్రనామంలా తెలుగు ప్రజలకు వినిపించే ‘్ఫర్త్ ఎస్టేట్’ అధర్మంగా ప్రవర్తించడం కాదా?
కేసిఆర్ హిందువులను, రామజన్మభూమిని బూతులు తిడుతుంటే మురిసిపోయిన సెక్యులర్ పత్రికలు- తాటికాయంత అక్షరాలతో హెడ్డింగులు పెట్టి హిందువులను మరింత అవమానిస్తారా? అది తప్పని ఒక్క లైవ్ ప్రోగ్రామ్ పెట్టరు? ఎందుకు? కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతూ రోజూ యుద్ధం చేస్తుంటే అదో పెద్ద వినోద కార్యక్రమంలా ప్రజలు తిలకించేటట్లు చేయడం పారిశ్రామిక పత్రికలకు తగునా? లేని సంబంధాలను నిర్భీతిగా అంటగడుతున్నా పత్రికలు, మాధ్యమాలు ప్రశ్నించడం మానేసి అపోహలను, అసత్యాలను గొప్పగా ప్రచారం చేస్తున్నాయి. వీటివల్ల ప్రజలకు ‘క్షీరనీర న్యాయం’ లేకుండా అయోమయ అవస్థ కలుగుతుంది. దుష్ప్రచారానికి పెద్దపీట వేస్తూ మసాలా దట్టిస్తున్న వార్తల సమాహారాన్ని ఆపకపోతే ఇది జాతి ద్రోహమే కాదు జాతీయ ద్రోహం అవుతుంది. రాజకీయ అనామకుల చిలుక పలుకులను గొప్ప ప్రచవనాలుగా చిత్రీకరిస్తే మీడియాకున్న ఈ కాస్త పవిత్రతకూ భంగపాటే? నాయకులు, మేధావులు మాట్లాడే అసత్యాలకు ప్రాచుర్యం ఇచ్చి, వాళ్లను సెలబ్రిటీలుగా మార్చడం ‘అక్షర దృశ్య వ్యభిచారం’ తప్ప ఇంకోటి కాదు.

-శ్రీకౌస్త్భు