మెయిన్ ఫీచర్

జానపద బృందావనిలో విరిసిన సిరిమల్లె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చుక్కలకోక కట్టూకొని
చుట్టూ గోటూ రైకా తొడిగీ
బుఱ్ఱా నున్నగా దువ్వూకొని
బొట్టూ, కాటుక పెట్టూకోని
నోటిలో సుట్టా పెట్టూకొని
సక్కదనమే సూసూకుంటూ
ఎక్కడికెళ్తవు చిట్టెమ్మంటే
పోలేరమ్మా మెరకల మీదికి
పుల్లలకెల్తను కొయ్యోడో
రయ్యో కొయ్యోడనే
పుల్లలకెల్తను కొయ్యాడో
ఈ పాట చదువుతూంటే ఎవ్వరైనా అప్రయత్నంగా చేత్తో తాళం వేసేస్తూ ఆనందించేస్తాడు. జానపద గేయాల్లోవున్న మజా ఇదే.. ఒకప్పుడు సినిమా కాలక్షేపం లేని రోజుల్లో ఊరూ వాడా హోరెత్తించిన జానపద గేయం, ఈ కొయ్యోడ పాట. ఇది వింటూ జనం ఊగిపోయేవారు. అప్పట్లో జానపద గేయాలంటే సరదాగా పాడుకునే కామిక్ పాటల్లా పరిగణింపబడేవి. నిజానికి వాటికి ఆదరణ కల్పించిన ఘనత ఇద్దరికి చెందుతుంది. వారే సీత, అనసూయలు. పుట్టింది కాకినాడైనా, పెరిగింది, తిరిగిందీ పిఠాపురంలోనే. ఈ యిద్దరిలో ‘కళాప్రపూర్ణ’ వింజమూరి అనసూయ అసాధారణ ప్రజ్ఞావంతురాలైన వ్యక్తిగా అందరికీ తెలిసిన వ్యక్తి. శుద్ధమైన సంప్రదాయ సంగీతం శ్రద్ధగా నేర్చుకుని, జానపద గేయాలపై మక్కువ కలిగించిన వ్యక్తి వల్లూరి జగన్నాథరావనే జానపద సంగీత గురువు.
నిజానికి పాడాలనే ఉత్సాహాన్నిచ్చినవి జానపద గేయాలే. పల్లెటూళ్ళకే పరిమితమైన ఈ పాటల రచయితలు ఎవరో తెలుసుకునే అవసరం ఆ రోజుల్లో ఎవరికీ ఉండేది కాదు. ఎక్కడా కల్మషమంటూ కనిపించని వీటిలో ప్రేమపదాలు, విరహపు పాటలు, వృత్తిపాటలు, హాస్యపుపాటలు.. ఆ నోటా ఈనోటా అందరూ బాగా పాడేసి వాళ్ళే సొంతంగా ప్రచారం చేసేసుకున్నారు. సినిమా సంగీతానికి జానపద కళాకారుల వరుసలు కూడా స్ఫూర్తినిచ్చేవే..
కూలి కొస్తావంటే పిల్ల, కోలాటం పాట, సిరిసిరి మువ్వ, కాకినాడ సెలగపప్పు, బండెనక బండికట్టి, బేట్రాయి సామిదేముడా, వల్లారి బాబో కావులోరన్నా, దుక్కులు దుక్కులు దున్నరే.. వంటి వందలాది పాటలు, ఆ రోజుల్లో అందరి నోళ్ళలోనూ బాగా తిరిగేవి. పొలం పనుల్లో జనపదులకివే కాలక్షేపం. సమయం తెలిసేది కాదు. అలసట కనిపించేది కాదు. జానపద గేయాల లక్ష్యమే అది.. ఓసారి కాకినాడ టౌన్ హాలులో హెల్త్ వీక్ వేడుకలు జరిగాయి. ఆ సందర్భంలో కర్ణాటక సంగీతం పోటీలు పెట్టారు. చిన్నపిల్లల విభాగంలో నేను పాల్గొన్నాను. కల్యాణి రాగంలో ‘నిధి చాలా సుఖమా’- కీర్తన బాగా సాధన చేసి పాడాను. నా పక్క యింట్లో వున్న దంటు సూర్యారావుగారి అమ్మాయింట్లో గ్రామఫోను రికార్డుల్లో ‘బిడారం రాచప్ప’ (మైసూరు ఆస్థాన విద్వాంసులు) ‘మగడొచ్చి పిలిచేడు పోయి వత్తురాసామి’ అనే జానపదం నాకెంతో నచ్చింది. నాలుగు రోజులపాటు విని విడవకుండా నేర్చుకుని ఆవేళ పాడాను.
ఆవేళ నా పాట విన్న వల్లూరి జగన్నాథరావుగారు మా నాన్నగారితో మాట్లాడుతూ ‘‘నీ కూతురు పిట్ట కొంచెం కూతఘనం. ఆమె గొంతు జానపద గేయాలకు బాగా నప్పుతుందని’’ ప్రోత్సహించి మద్రాసు తీసుకెళ్లి ఎన్నో పాటలు నేర్పించారు. జానపద గేయాలకు కూడా గమకాలు జోడించి పాడటం ఆయన ప్రత్యేకత. గ్రామఫోను రికార్డు కంపెనీ వారు రికార్డు చేసిన వాటిలో జగన్నాథరావు, నేనూ పాడిన ‘కొయ్యోడ’ పాటే మొట్టమొదటి పాటని, ఫోన్లో అనసూయాదేవి నాతో సరిగ్గా నెల క్రితం మాట్లాడుతూ చెప్పిన మాటలింకా నేను మర్చిపోలేదు. పాటలో లయ వినబడాలేగానీ లయకోసం పాట కాదు. చెవికి కమ్మగా నాదం పోసుకుని సాహిత్యం వినబడాలి. ఏ సంగీతానికైనా శృతి కావాలి. ‘లయా’ అవసరమే కానీ ఇదే ప్రధానం కాదు. అంతర్లీనంగానే వుండేది ‘లయ’. శాస్ర్తియ సంగీత కచేరీలలో పాడే కీర్తనలన్నీ భావప్రధానంగా వుంటూ లయ కాస్త అటూ యిటూ అసియాడితేనే అందం. కానీ జానపద గేయాలన్నీ లయ ప్రధానమైనవే. అందులోని సాహిత్యం ఉవ్విళ్ళూరేలా ఊరిస్తూ పాడేలాగానే వుంటుంది తప్ప గంభీరమై ఆలోచనామృతమై వుండదు. రక్తిగా పదిమందిచేత పాడించటమే లక్ష్యం. గమకాలను పలికించలేని గాయకులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం.
సీత, అనసూయలు ఈ జానపద గేయాలను క్రమబద్ధం చేసి పాడి సంగీత కచేరీలలో సమానమైన సభార్హత కల్పించి కృతకృత్యులయ్యారు. గమక శుద్ధిగల జానపద గీతాల గానం వీరితోనే ఆరంభమైంది. మాధుర్యాన్ని ఏలూరు వైఎమ్‌హెచ్‌ఎ హాలులో స్వయంగా విన్న అనుభూతి నేటికీ మర్చిపోలేను. ఆమె గొంతుకు వృద్ధాప్యంలేదు. అనసూయగారూ! ఇనే్నసి పాటలు మీరు ఎలా సేకరించగలిగారని అడిగాను. కాకినాడ నుంచి పిఠాపురం రెండెడ్ల బండిలో ప్రయాణాలు, పొలాల్లో పాటలు, అప్పటి జాతర్లు, చెక్క్భజన్లు, తోలుబొమ్మలాటలు- యింకా ఎన్నో జానపద రూపాలు ననె్నంతో ఆకర్షించి, వాటిని సేకరించగలిగాను అన్నారు అనసూయ. ఆమె పుట్టి పెరిగిన వాతావరణ ప్రభావం అది. నవ్య సాహిత్య వైతాళికుడు, భావకవుల్లో సార్వభౌముడనదగ్గ ‘పద్మభూషణ్’ దేవులపల్లి కృష్ణశాస్ర్తీ మేనకోడలైన అనసూయాదేవి, ఆయన పాటలను ఎన్నో కంపోజ్ చేశారు. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ పాటల్లో కరుణ, భక్తి, శృంగార రసాలకు ప్రాధాన్యత ఉండేది. అంతేకాదు, జానపద శైలిలో కూడా రాశారు. గోదావరి ప్రాంతంలో పడవల్లో రకరకాల చేపలను వర్ణిస్తూ పాడేపాటలున్నాయి. ఆ పాటలకు ప్రాణం పోసి పాడిన అనసూయా, సీతలను మరువలేం. ఆయన రాసిన ప్రార్థనాగీతాలు ఆధ్యాత్మికంగానూ, భావగీతాలు సాహితీపరంగానే కాదు, ఆయన రాసిన జాతీయ గీతాలు వేటికవేసాటి. అనసూయ సినిమారంగ అనుభవం తక్కువేమీ కాదు. వాహినీ వారి ‘మల్లీశ్వరి’ చిత్రంతోనే దేవులపల్లి వారికి సినిమా పాటలు రాయడం ఆరంభమైంది. బి.ఎన్. రెడ్డిగారి చెల్లెలు వివాహానికి అనసూయ ‘్ధర సమీరే యమునా తీరే’ యమునా కల్యాణిలో ట్యూన్ చేసి పాడారు. రెడ్డిగారికి ఆ ట్యూన్ నచ్చింది. అలాంటి పాటేకావాలని అనసూయనడిగారు. కృష్ణశాస్ర్తీ రాసిన ‘మనసున మల్లెల మాలలూగెనే’ పాట భానుమతి పాడారు. దానికి వరస కట్టింది మాత్రం అనసూయాదేవి. అందులో మరో రెండు మూడు పాటలు అనసూయాదేవివే. ఈవిషయం భానుమతికి బాగా తెలిసినా, పేరు అనసూయకు బదులు రాజేశ్వరరావుకు వెళ్లింది. గాత్రాలు శృతిలో వున్నా లేకపోయినా చెల్లిపోతాయనీ రక్తిగాపాడితే చాలనుకునేవారికి సీత, అనసూయల జానపద గీతాలు శుభ్రమైన రాగాల్లో సుస్వరంతో స్వర గమక సహితంగా విన్పించటం వల్ల ఆ గీతాలకు సంగీత గౌరవం లభించింది.
సీత, అనసూయల తర్వాత మళ్ళీ అంతటి స్థానాన్ని ఎవరూ అందుకోలేక పోయారనేది నిర్వివాదాంశం. ఏ కళైనా భగవదనుగ్రహంతో లభించవలసినదే. కొందరు సద్వినియోగం చేసుకోగలరు. మరికొందరు అవకాశాలు రాక, లేక అడుగంటిపోతారు. కృషి ఉండదు. కానీ భగవంతుడు ఏ వ్యక్తిలో ఆత్మకళ ప్రకాశింపచేస్తాడో దాని ప్రకాశానికి ఆశీర్వాదాలు, ఆశీర్వాదమనే పేరుతో జోహారు చేస్తాయని జ్ఞానపీఠ గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ అనసూయకిచ్చిన పెద్ద కితాబు.

- మల్లాది సూరిబాబు, 90527 65490