మెయిన్ ఫీచర్

ఎన్నికల్లో మహిళలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి యూనివర్శిటీ.. వరల్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ రీసెర్చ్ (యు.ఎన్. యు- డబ్ల్యూ.ఐ.డి. ఇ.ఆర్) 1992-2012 మధ్యకాలంలో 4,265 అసెంబ్లీ నియోజక వర్గాలపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం జరిగిన 20 ఏళ్లకాలంలో, చాలా రాష్ట్రాల్లో నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. ఉపగ్రహ సమాచారం ద్వారా ఈ నియోజక వర్గాల్లో రాత్రిపూట వెలిగే విద్యుత్ కాంతుల ఆధారంగా ఆర్థిక పురోగతిని లెక్కగట్టారు. మహిళా పాలకులు.. మహిళలు, పిల్లలకు సంబంధించి ఆసక్తి కనబరుస్తున్నారని, స్ర్తి, శిశు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది. అంతేకాకుండా రోడ్డు నిర్మాణ పనులను పూర్తిచేయడంలో కూడా మహిళలు మెరుగ్గా పనిచేస్తున్నారని నివేదిక పేర్కొంది. పురుషులతో కంటే మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో 22 శాతం ఎక్కువగా రోడ్డు పనులు పూర్తిచేశారు. పురుష ఎమ్మెల్యేలు, ఎంపీల కంటే, మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు.. వారి నియోజక వర్గాల్లో ఏడాదికి 1.8 శాతం ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నారని ఓ అధ్యయనం తెలిపింది.
ఎన్నికల్లో పురుషుల కంటే మహిళల్లో విజయం సాధించినవారి శాతం ఎక్కువగా ఉందని మీకు తెలుసా? 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల నుంచి 16వ లోక్‌సభ ఎన్నికల వరకు గమనిస్తే ప్రతిసారీ విజయం సాధించినవారి నిష్పత్తి పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో మొత్తం 1874 మంచి అభ్యర్థులు పోటీ చేశారు. అందులో 1831 మంది పురుషులు, 43 మంది మహిళలు.. మొత్తం 1831 మంది పురుషు అభ్యర్థుల్లో 467మంది గెలుపొందగా, 43 మంది మహిళా అభ్యర్థుల్లో 22 మంది విజయం సాధించారు. ఈ లెక్కన మహిళల్లో విజయశాతం 51.6 ఉండగా, పురుష అభ్యర్థుల్లో 25.50 శాతం మాత్రమే ఉంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో గెలిచిన అభ్యర్థుల సంఖ్య ఆధారంగా విజయశాతం ఉంటుంది. కానీ రానురానూ ఎన్నికల్లో విజయం సాధిస్తున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది.
రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం కోసం పనిచేస్తోన్న ‘శక్తి’ అనే సంస్థ గణాంకాల ప్రకారం 2019లో 82 శాతం ప్రజలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువమంది మహిళలను ఎన్నుకోవాలని భావిస్తున్నారు. దేశంలోని మహిళలు, పురుషులు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో.. ఎదురైన ప్రత్యక్ష అనుభవాలు వేరుగా ఉన్నాయి. ఈమధ్యనే సరోగసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పార్లమెంటులోని 90 శాతం మంది పురుషులు ఎంత ప్రయత్నించినా గర్భం దాల్చలేరు. అలాంటిది మహిళల శరీరం ఆధారంగా 90 శాతం మంది పురుషులు.. నిబంధనలు విధిస్తూ సరోగసీ బిల్లుకు ఆమోదం తెలిపారు. అందుకే మన చట్టసభల్లో ఇంకా ఎక్కువ మంది మహిళలు ఉండాలి అని శక్తి సంస్థ సహ వ్యవస్థాపకురాలు తారా కృష్ణస్వామి తెలిపారు. తారా కృష్ణస్వామి మాత్రమే కాదు.. మహారాష్టల్రోని ఓ గిరిజన గ్రామంలో ఉండే మహిళలు కూడా మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కువమంది ఉంటేనే చట్టసభల్లో మహిళా సమస్యలు చర్చకు వస్తాయని విశ్వసిస్తున్నారు. వాస్తవ జీవితం ఆధారంగా రాజకీయాలను నిర్వచించినట్లయితే.. మహిళల సమస్యల పట్ల తమ ఊళ్లోని పురుషుల వైఖరిని చూసి, రాజకీయాల్లో కూడా పురుషులు అలాగే ఉంటారని అందరి విశ్వాసం. కానీ రాజకీయాలు పురుషులకు మాత్రమే సంబంధించినవిగా అయ్యాయి. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడానికి అనువుగా రాజకీయ పార్టీల నిర్మాణంలో ఇంతవరకూ మార్పులు రాలేదు. చాలామందికి మహిళల గురించి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. ఇతర రంగాల్లో దూసుకుపోతున్నట్లే, రాజకీయాల్లో కూడా మహిళలు అడ్డుగోడలను బద్దలు కొట్టాలి అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది.
రాజకీయాల్లో మహిళలు కొన్ని పరిమితుల్లో, మరొకరి కంట్రోల్‌లో ఉండాల్సి వస్తుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కేవలం మహిళల సమస్యలను పరిష్కరించుకోవడం కోసం మాత్రమే మహిళలను ఎన్నుకోవాలని అందరూ అనుకోరు. మహిళల పాలన అత్యుత్తమంగా ఉంటుందో, లేదో నాకు తెలీదు. నిజం చెప్పాలంటే దాని గురించి ఎవ్వరూ ఆలోచించరు. మహిళల సమస్యలు పరిష్కరిస్తారనో, పురుషుల కంటే తక్కువ అవినీతికి పాల్పడుతారనో, లేదంటే మహిళలకు రాజకీయాల్లో నైతిక విలువలు ఎక్కువగా ఉంటాయన్న కారణాలు, మహిళలను ఎన్నుకోవడానికి సిసలైన ప్రాతిపదిక కాదు. పరిపాలన చేయడానికి పురుషులతో సమానంగా మహిళలకు కూడా హక్కు ఉందనే మాట మాత్రం నిజం. పురుషులతో పోలిస్తే మహిళా నేతలపై మూడోవంతు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
మహిళా ప్రాతినిధ్యం
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం అంశంలో మొత్తం 193 దేశాల్లో భారతదేశం 153వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని చట్టసభలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 25 శాతం మాత్రమే.. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో రువాండా 63 శాతం, క్యూబా 58 శాతం, బొవీలియా 53 శాతంతో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. భారతదేశ పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం శాతం దగ్గర దగ్గరగా 11.8 శాతం ఉంది. దేశాభివృద్ధికి, పార్లమెంటు, అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యానికి ప్రత్యక్ష సంబంధం లేదన్నది సుస్పష్టం. పురుష అభ్యర్థుల కంటే మహిళా అభ్యర్థుల విజయ శాతం ఎప్పుడూ ఎక్కువగానే ఉందని ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. కానీ పోటీచేసే పురుష, మహిళా అభ్యర్థుల శాతం పెరిగినప్పుడు, ఇద్దరిలోనూ విజయ శాతం పడిపోవడం జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో విజయ శాతం ఎక్కువగా ఉంది. కానీ మహిళా ఓటర్ల శాతాన్ని కూడా మనం గమనించాలి. వారు కూడా పెరుగుతున్నారు. ఇది మంచి పరిణామం.

- సన్నిధి