మెయిన్ ఫీచర్

ఏడనున్నారో.. ఎక్కడున్నారో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేనికైనా ‘టైం’ -ఇంపార్టెంట్.
ఇది రియల్ లైఫ్‌లో వినిపించే మాట.
దేనికైనా ‘టైమింగ్’ -ఇంపార్టెంట్.
ఇది రీల్ లైఫ్‌లో వినిపించే మాట. ‘టైమ్’ కలిసొస్తే కమెడియన్ కూడా హీరో అయిపోవచ్చు. కానీ, టైమింగ్ మిస్సయితే -హీరో కూడా జీరోగా మిగిలిపోవడం ఖాయం. అందుకే -ఇండస్ట్రీలో టైమ్‌ని కాదు టైమింగ్‌ని నమ్ముకోమని చెబుతారు.
***
హీరోలకి రీల్ టైం ఎక్కువ. ఒక్కసారి -ప్రూవ్ చేసుకుంటే.. ఒకే ఒక్క బ్లాక్‌బస్టర్ అందుకుంటే -లైఫ్‌టైం మొత్తం రీల్ హీరోగా కీర్తి అందుకోవచ్చు. ఫస్ట్ సినిమాతో హిట్టందుకుని టాప్ హీరో అయినోళ్లు, రన్ మధ్యలో స్లిప్పయినా లేచి నిలబడి ‘స్టార్’ తిప్పినోళ్లు.. -టాలీవుడ్‌లో లెక్కకుమించి కనిపిస్తారు. చిత్రమేంటంటే దీనికి రివర్స్ సీన్లూ ఇక్కడే కనిపిస్తాయి. హీరోగా క్రేజ్ అందుకుని నిలబడలేకపోయినోళ్లు, అకస్మాత్తుగా బ్రేక్ అందినా చివరి వరకూ నిలబెట్టుకోలేక జీరో అయపోయినోళ్లు ఇండస్ట్రీలో కనిపిస్తుంటారు. ఈ రెంటికీ ఒక్కటే కారణం -టైమింగ్.
***
బాలీ, టాలీ, కోలీ, మాలీ.. ఇలా ఏవుడ్ తీసుకున్నా -హీరోల జర్నీ ఉన్నంతగా హీరోయిన్లది ఉండదు. ఎందుకంటే -సీనియర్ హీరోలైనా కుర్ర హీరోయిన్లతో జోడీ కట్టేందుకే ఉత్సాహం చూపుతారు కనుక. అందుకు కారణాలు అనేకం, అవిక్కడ అప్రస్తుతం కూడా. ‘స్టార్’ అనిపించుకున్న హీరోయిన్ అయితే -ఓ పదేళ్లు అంతకుమించి కెరీర్ లైఫ్ ఉండోచ్చు. షష్టి పూర్తికి వచ్చిన హీరోలకైనా వాళ్లే దిక్కు కనుక. ఈ సీన్ -ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతటా కనిపించేదే. కానీ -టాపిక్ ఏంటంటే హీరోలుగా క్రేజ్ తెచ్చుకుని.. తరువాత వరుస ఫ్లాపులతో టెన్షన్ తెచ్చుకుని.. ఆ తరువాత హిట్లందుకోలేక తెరకు దూరమైన హీరోల గురించి.
**
ఒకప్పుడు స్టార్స్ అనిపించుకున్న హీరోలు ఇప్పుడేం చేస్తున్నారబ్బా -అంటూ అప్పుడప్పుడూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ వినిపిస్తుంది. అలాంటి హీరోలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే -లిస్టులో తరుణ్, వేణు తొటెంపూడి, రోహిత్, వడ్డే నవీన్, తారకరత్న, నవదీప్, రాజా, రాహుల్, ఆకాష్, తనీష్‌లాంటి పేర్లు వినిపిస్తాయి.
చాక్లెట్ బోయ్‌గా ఇమేజ్ తెచ్చుకున్న తరుణ్ స్రవంతీ మూవీస్ ‘నువ్వే కావాలి’తో హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్. దాంతో తరుణ్ కెరీర్ బంపర్ హిట్. వరుస సినిమాలు వచ్చేశాయి. వచ్చినవి వచ్చినట్టు చేసుకుంటూ పోయాడు. మంచి హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు కూడా. ఇక్కడే -కథ అడ్డం తిరిగింది. టైమ్ బావున్నా -టైమింగ్ మిస్సైంది. అతని చుట్టూ వివాదాలు ముసిరాయి. కెరీర్‌కు మైనస్ అయ్యింది. ఫ్యామిలీ హీరో అనిపించుకున్న తరుణ్ కెరీర్‌కు పాత్రే లేకుండా అయిపోయింది. వివాదాల సుడినుంచి తేరుకుని -కొద్ది గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ప్రయత్నాలు చేశాడు. వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం తరుణ్ చేస్తున్న, చేయబోయే సినిమాల వివరాలు ఏమీ లేవు. అంటే -కెరీర్ సందిగ్దంలో పడిందన్నమాట. అన్ని సినిమాలు చేసిన హిట్టు హీరో కాస్తా -కాలక్రమంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆటగాడిగానే గుర్తుండిపోయాడు. శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్‌కి అత్యంత సన్నిహితుడైన తరుణ్ -మళ్లీ రైజవుతాడా? డౌటే!
జై సినిమాతో హీరోగా ఎంట్రీఇచ్చిన నవదీప్ ‘చందమామ’లాంటి బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. చాలా సినిమాల్లో హీరోగా చేసి, బుల్లితెరపైనా రాణించాడు. కాకపోతే, హీరోగా నిలదొక్కుకున్నది మాత్రం లేదు. నెగెటివ్ షేడ్స్‌వున్న పాత్రలకూ సరిగ్గా సరిపోయే నవదీప్, ఆర్టిస్టుగా అలాంటి ప్రయత్నాలు గట్టిగా చేసినట్టు లేదు. ఇప్పుడు నవదీప్ -గుర్తు చేస్తునే గుర్తొచ్చే హీరో.
స్వయంవరంతో మొదలెట్టి చిరునవ్వుతో, హనుమాన్‌జంక్షన్ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న వేణు తొట్టెంపూడి పెర్ఫార్మెన్స్‌ని అభిమానులు మర్చిపోరు. కామెడీ ట్రాక్‌ను ప్రజెంట్ చేయడంలో వేణుది ఓ ప్రత్యేక శైలి. ఈజ్‌వున్న స్టార్‌గానూ పేరొచ్చింది. కానీ, అవకాశాలే ముఖం చాటేశాయి. కారణాలు ఏమైనా కావొచ్చు, హీరోగానే కాదు మరేరకంగానూ అవకాశాలు అతని దరి చేరలేదు. చివరిగా ఎన్టీఆర్ దమ్ములో అతిథిగా కనిపించిన వేణు, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానైనా కనిపించటం లేదు.
యంగ్ హీరోగా ఓ రేంజ్ ఇమేజ్ సాధించాడు రోహిత్. వరుస సినిమాలతో జోరు ప్రదర్శించిన రోహిత్, ఈ మధ్య పూర్తిగా మాయమైపోయాడు. 6టీన్స్‌వంటి యూత్‌ఫుల్ చిత్రాల్లో నటించిన రోహిత్ అద్భుతమైన డ్యాన్సర్ కూడా. నటుడిగానూ ఎమోషన్స్ పండించగల సత్తా ఉన్నా, కెరీర్ మాత్రం డార్క్‌లోనే ఉండిపోయింది. మళ్లీ వెలుగు చూస్తాడో లేదోనన్నది చెప్పలేం.
దర్శకరత్న దాసరి నారాయణ రావు వారసుడిగా బరిలోకి దిగిన దాసరి అరుణ్‌కుమార్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించినా సక్సెస్ పలకరించలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో తెరమరుగయ్యాడు. కమెడియన్ ఎంఎస్ నారాయణ కుమారుడు విక్రమ్, నిర్మాత కెఎస్ రామారావు కుమారుడు అలెగ్జాండర్ వల్లభ.. ఇలాంటి హీరోలంతా ఒకట్రెండు సినిమాలతోనే మాయమైపోయారు.
నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా బరిలోకి వచ్చిన వడ్డే నవీన్ ‘పెళ్లి’వంటి విజయం అనూహ్యంగా అందింది. ఆ ఊపులో డజన్లకొద్దీ సినిమాల్లో నటించినా -్ఫలితం మాత్రం రివర్స్‌లోనే ఉండిపోయింది. ‘శ్రీమతి కల్యాణం’ వడ్డే నవీన్ నటించిన చివరి చిత్రం. ‘అటాక్’లోనూ కనిపించాడు.
ఒకేసారి ఏడు సినిమాల ప్రకటనతో తెలుగు చలనచిత్ర సీమకు పరిచయమైన నందమూరి హీరో తారకరత్న ప్రస్తుత సన్నివేశమేంటో తెలిసిందే. స్క్రీన్ కెరీర్ మొదలెట్టిన దగ్గర్నుంచీ నిలదొక్కుకునే ప్రయత్నాల్లోనే ఉండిపోయాడు. అటు విలన్‌గానూ ప్రూవ్ చేసుకోడానికి చేసిన కృషి -అతన్ని రేసులోకి తేలేకపోయింది.
తెలుగు తమిళ చిత్రాల్లో నటించిన జై ఆకాష్ ‘ఆనందం’లాంటి క్లాసిక్ హిట్టందుకున్నాడు. ఆ ఇద్దరు తర్వాత మళ్లీ నటుడిగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. ‘ఆనంద్’తో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన రాజా, స్టైల్ వంటి చిత్రాల్లో నటించాడు. ఇటీవలి కాలంలో పూర్తిగా తెరకు దూరమయ్యాడు. ‘హ్యాపీడేస్’ రాహుల్ ప్రయత్నాలూ ఫలించక ఫిల్మ్‌సర్కిల్స్ నుంచి దూరమయ్యాడు. మరో హీరో వరుణ్ సందేశ్ సైతం ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా వెలుగు వెలిగాడు. సక్సెస్ ముఖం చాటేయడంతో కొంకాలంగా కనిపించటం లేదు, అతని ఊసు వినిపించటం లేదు.
**
అయితే, వీళ్ల కెరీర్ ఇక్కడితో ఆగిపోయినట్టేనా -అంటే ఎవ్వరూ చెప్పలేరు. పైన చెప్పుకున్నట్టు -టైమ్ కలిసొస్తేనే కాదు, టైమింగ్ చూపించినా మళ్లీ స్క్రీన్‌మీద ఓ వెలుగు వెలిగే అవకాశాలే లేకపోలేదు. అది హీరోలగానే కాకపోవచ్చు, విలన్లగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, ప్రత్యేక కథల్లో లీడ్‌రోల్ ఆర్టిస్టులుగా -ప్రూవ్ చేసుకోడానికి ఎన్నో మార్గాలు, ఎనె్నన్నో పాత్రలు. చేయాల్సిందల్లా ‘టైమింగ్’ను నమ్ముకోవడమే.
*