మెయన్ ఫీచర్

అరాచకాల వేళ.. అప్రమత్తతే ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటకలో బేలూరు వేణుగోపాల్ కాంగ్రెస్ ప్రము ఖ నాయకుడు. ఆయన ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ, ‘భారత ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేయటం కన్నా వేరే మార్గం లేదు’ అన్నాడని వార్తలు వచ్చాయి. ఈ ప్రసంగం వీడియో కెమెరాల్లో నిక్షిప్తమై వివిధ టీవీ చానళ్లలో దర్శనమిచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన దేశ ప్రధానిని హత్యచేయాలని జాతీయ స్థాయి పార్టీ నాయకుడు కోరుకోవటం ఏమిటి? ఈ దేశంలో రాజ్యాంగం లేదా? చట్టసభలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు లేవా? తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించండని మార్క్సిజం చెపుతున్నది. మరి బేలూరు వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు మార్క్సిస్టు భాషను ఎందుకు ఉపయోగించాడు? కొద్దికాలం క్రితం ఆంధ్రప్రదేశ్‌లో సిపిఐ నాయకుడు కె.నారాయణ ‘నరేంద్ర మోదీని నూటొక్కసార్లు తుపాకీతో కాల్చి చంపండి’ అని బహిరంగంగా పత్రికా విలేకరుల సమావేశంలో అన్నాడు. ఆయన అలా ఎందుకు మాట్లాడాడని ప్రశ్నిస్తే ఆయనకు పెద్దనోట్ల రద్దుద్వారా మోదీ తీసుకున్న చర్య నచ్చలేదట. సారాంశం ఏమంటే ఎవరికి ఎవరైనా నచ్చకపోతే ఇక హత్య చేయవలసిందేనా? ఇలాంటి మాటలను ఎవరైనా అంటే చైనాలో అక్కడి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు కదా!
***
ఉగ్రవాదానికి ప్రపంచవ్యాప్తంగా ఎందరో దేశాధినేతలు బలైపోయారు. అబ్రహాం లింకన్, కెన్నడీ, ఇందిరాగాంధీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, రాజీవ్‌గాంధీ.. ఇలా ఎందరెందరో హతులైనారు. ఐనా మన రాజకీయ నాయకులు ఉగ్రవాద భాషను వదులుకోలేదు. ఛత్తీస్‌గఢ్‌లో చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు 74 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను గతంలో హత్యచేశారు. మొన్న కాశ్మీర్‌లోని పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి దళ సభ్యుడు 45 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను చంపాడు. అందుకు ప్రతీకారంగా భారత సైన్యం బాలాకోట్ ప్రాంతంలోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఈ చర్య తీసుకున్నందుకు దేశమంతా కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచవలసి ఉంది. కానీ జరిగిందేమిటి? కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్- ‘అసలు ఉగ్రవాద స్థావరంపై దాడి జరిగిందా? జరిగితే ఆధారాలు చూపండి. దాడుల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయా?’అంటూ చేసిన ప్రసంగాలు పాకిస్తాన్ పత్రికలలో పతాక శీర్షికలలో ప్రచురితమైనాయి. ఆర్థిక నేరాల్లో బెయిల్ మీద తిరుగుతున్న పి.చిదంబరం, రాహుల్ గాంధీ వంటివారు భారత సైనిక చర్యలను విమర్శిస్తూ మాట్లాడటం దేశద్రోహం క్రిందికి వస్తుంది. తప్పు వీరిది కాదు. నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే. ఎప్పుడో మణిశంకర్ అయ్యర్‌లను, మమతాబెనర్జీలను, మెహబూబా ముఫ్తీలను అరెస్టుచేసి ఉండవలసింది. వందల మంది భారత సైనికులు చనిపోతే ఈ శవ రాజకీయాలేమిటి? ఇక మన రాజకీయ నాయకులకు బుద్ధిరాదు. ఈ దేశ చరిత్ర ఇంతే!! వీరు పుట్టుబానిసలు. వందలాది సంవత్సరాలుగా విదేశీ పాలనకు అలవాటుపడ్డారు. వీరికి జాతీయవాదం వద్దు. ఫిదాయిలే (ఆత్మాహుతి దాడులు చేసేవారు) ముద్దు. జైషే మహమ్మద్ ఉగ్రవాద దాడి మన ప్రధానికి ముందే తెలుసునని కొందరు విపక్ష నేతలు అంటున్నారు. అంటే 2019లో జరిగే ఎన్నికలలో లబ్ధికోసం మన అంగుష్టమాత్రులు చైనా జీతగాళ్లు, ఏ పాపం చేయడానికైనా సిద్ధపడతారు.
***
‘బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై 20 నిమిషాల సేపు భారత సైన్యం దాడి చేసిందనడం అబద్ధం. ఇదంతా ఎన్నికల కోసం చేస్తున్న ప్రచారం..’ అనే వారికి ఉపగ్రహం ద్వారా సేకరించిన ఛాయాచిత్రాలతో ప్రభుత్వం తగిన సమాధానం ఇచ్చింది. 250 మంది జైషేమహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. సైనికుల మెరుపుదాడిలో ఇజ్రాయిల్ 2000 టెక్నాలజీ ఉపయోగింపబడింది. శ్మశానంలో ఉన్న శవాల గుట్టలుకూడా చూపింపబడ్డాయి. ఈ సాక్ష్యాలు చూపడంతో బాలాకోట్ దాడి అబద్ధం అని పాక్ అనుకూలురైన వారు అనలేరు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కూడా ఇక అబద్ధాలు చెప్పలేడు. జైషే మహమ్మద్ ఉగ్రవాదులు యూరీ, పుల్వామా తరహా దాడులు మరిన్ని చేస్తామని ముందుగానే హెచ్చరించాయి. ఇప్పుడు ప్రధాన ఉగ్రవాద కార్యాలయం ధ్వంసం కావటంతో వారి వెనె్నముక విరిగినట్లయింది. అమెరికా నుండి కొనుగోలు చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాలను ఇండియాపై పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఉపయోగించటం అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినట్లయింది. ‘మేము ఉగ్రవాదులపై నిషేధం విధించాం’ అని పాకిస్తాన్ చైనాకు, అమెరికాకు సంజాయిషీ ఇచ్చింది. ఇది నాటకమేనని భారత్‌కు, చైనాకు కూడా తెలుసు. ఐనా ఎవరి వ్యూహాలు వారివి. భారత అణ్వస్త్ర నౌక కరాచీ తీరం చేరిందని ప్రచారం మొదలయింది. పాకిస్తాన్ భారత్ సముద్ర మార్గంలో ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చునని నిఘావర్గాలు హెచ్చరించాయి.
***
ఎయిర్ మార్షల్ బార్బొరా మాట్లాడుతూ ‘మేము మీకోసం శ్రమిస్తున్నాము మీరు మాకు సహకరించండి’ అన్నారు. వాయుసేన అధిపతి ఇలా కోరవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అంభి, జయచంద్, మీర్ జాఫర్‌లు జన్మించిన దేశమిది. ఈనాడు దిగ్విజయ్ సింగ్‌లూ, మణిశంకర్ అయ్యర్‌లూ, కన్నయకుమార్‌లు, పినరయి విజయన్‌లు, కె.నారాయణలు అదే పాత్ర పోషిస్తున్నారు. వీరికి దేశభద్రత పట్టదు. జాతి సమైక్యత పట్టదు. ఓట్లు, నోట్లు, పదవులు ముఖ్యం. ఇదే చరిత్ర గత డెబ్బది సంవత్సరాలుగా చూస్తున్నాం. ఈ దేశంలోని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లో దేశభక్తిలేని వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తక్కిన పార్టీలవారు దైవాంశ సంభూతులు కారు. ఉత్తరప్రదేశ్‌లో ఒక శిలాఫలకం ఆవిష్కరించిన సందర్భంగా ఫలకంపై తన పేరులేదని బిజెపి ఎంఎల్‌ఎ, ఎంపీలు చెప్పులతో కొట్టుకున్నారు. నేడు కాంగ్రెస్ పార్టీలో టంగుటూరి ప్రకాశం పంతులు వంటివారు లేరు. కమ్యూనిస్టు పార్టీలో పుచ్చలపల్లి సుందరయ్యలు, నంబూద్రిపాద్‌లూ లేరు. బిజెపిలో దీనదయాళ్ ఉపాధ్యాయలూ, నానాజీ దేశ్‌ముఖ్‌లూ లేరు. సోషలిస్టు పార్టీలో రామమనోహర్ లోహియాలూ లేరు. ములాయం సింగ్‌లు, అమర్‌సింగ్, అఖిలేశ్‌యాదవ్‌లు, మమతాబెనర్జీలు నేడు భారత రాజకీయాలను శాసిస్తున్నారు!
***
పాకిస్తాన్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నమాట నిజమే. అందుకు అవసరమైన యురేనియం ఇతర సాంకేతిక పరిజ్ఞానం చైనానుండి అందాయి. పాకిస్తాన్ నుండి ఈ టెక్నాలజీ ఉత్తర కొరియాకు అందాయి. ఇదీ రాజకీయం. ఇంతకాలం ఇస్లామిక్ బాంబు పేరుతో ఇండియాను, ప్రపంచాన్ని పాకిస్తాన్ బెదిరిస్తూ వచ్చింది. ఈ కాగితం పులిని నరేంద్ర మోదీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇదే 2019లో ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రధాన ఘట్టం. ‘మా పోరాటం పాక్ ప్రజలతోకాదు.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో మాత్రమే’- అని భారత్ అనటంలో వాస్తవం ఉంది. ప్రపంచ ఆమోదానికి వ్యూహాత్మక అంగీకారం కూడా లభించే అవకాశం ఉంది. భారత్‌లోని అంతర్గత శత్రువులు ఓటమిని అంత తేలికగా అంగీకరించరు కాబట్టి క్షణక్షణం మొత్తం దేశం అప్రమత్తంగా ఉండాలి.
***
ఆంధ్రులకు ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని తెదేపా వారు ప్రధాని మోదీని పదే పదే తిడుతున్నారు. మరి ఆంధ్రుల నోట్లో మట్టికొట్టిన సోనియాగాంధీ మాటేమిటి? అధికారంలో ఉన్నవారిని తిట్టడంలో కమ్యూనిస్టులు ఒక పాశవికానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎంతచేసినా ఇంకా చేయలేదు అని ఆక్షేపించటం వారి నైజం. 2014కు ముందు భారతదేశంలో వేలాది గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. వంట గ్యాస్ కనెక్షన్లు అంతగా లేవు. ఇంటికి నల్లాలు లేవు. 2019లో అలాంటి పరిస్థితి లేదు. దేశ ప్రజలకు నిరంతర విద్యుత్తు లభిస్తున్నది. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయమే. అంతేకాదు- ఉచిత ఆరోగ్య సంరక్షణ ఆయుష్మాన్ పథకం ద్వారా 50కోట్ల మందికి వైద్య చికిత్స- ప్రతి కుటుంబానికి 5 లక్షల చొప్పున ఆరోగ్య బీమా- 5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఆదాయం పన్ను మినహాయింపు, గుండెకు స్టెంట్‌లు, మోకాలి చిప్పల మార్పిడికి ఆర్థికభారం తగ్గింపు, బ్యాంకు ఋణాలపై తగ్గిన వడ్డీ రేట్లు, 6 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు, సుకన్య యోజన, బడుగువర్గాల వారికి జాతీయ కమిషన్, అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్, గర్భిణులకు 6000 ఆర్థిక సహాయం, ప్రసూతి సెలవులు, స్వచ్ఛ్భారత్ పేరుతో 10 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం, పెద్దనోట్ల రద్దుతో అక్రమార్కుల ఆటకట్టు, డొల్ల కంపెనీల మూసివేత, రైతులకు సాలీనా 6000 కోట్ల ఆర్థిక సహాయం, జన్‌ధన్ యోజన, మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా- పాక్‌పై సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్‌లో జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాల ధ్వంసం, రాబర్ట్‌వాద్రా, పి.చిదంబరం, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, శశిధరూర్, లల్లూప్రసాద్‌యాదవ్ వంటివారి ఆర్థిక నేరాలు వెలికితీసుకొని రావటం వంటివన్నీ మోదీ హయాంలో చూస్తున్నాం.
విదేశాలకు పారిపోయిన మిచేల్ క్రిస్టియన్, విజయ్ మాల్యాలను ఇండియాకు రప్పించే యత్నాలు, చాలా రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలకు అడ్రసు లేకుండా చేయటం, విశాఖ రైల్వేజోన్, మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు ఎంజిఆర్ పేరు, గుజరాత్‌లో అతిపెద్ద యూనిటీ ఆఫ్ ఇండియా విగ్రహం (సర్దార్ పటేల్) ఏర్పాటు, ట్రిపుల్ తలాక్ రద్దు.. ఇలాంటివన్నీ నరేంద్ర మోదీ కేవలం 4 సంవత్సరాల పాలనాకాలంలోనే సాధించిన విజయాలు. అందుకే మోదీని తుపాకీతో నూటొక్కసార్లు కాల్చి చంపండని కమ్యూనిస్టు నేత కె.నారాయణ అంటున్నాడు! ‘మోడీ.. బోడీ’ అని చంద్రబాబు నాయుడు ఆక్షేపిస్తున్నాడు. మోదీ ఇంకా అధికారంలో ఉంటే ఇండియా ‘హిందూస్థాన్’ అయిపోతుందని శశిధరూర్ ప్రజలను భయపెడుతున్నాడు. అనాదిగా ఇది హిందూస్థానమే కదా? ఒకటి మాత్రం నిజం! భారతదేశం బలపడటం చైనా, పాకిస్తాన్, బ్రిటన్, అమెరికాలకు ఇష్టం లేదు. అందుకే ఆ దేశాల జీతగాళ్లు ఇండియాలో అల్లరి చేస్తూ వివిధ టీవీ చానళ్లలో శబ్దకాలుష్యం సృష్టిస్తున్నారు.
***
వార్తలు అంటే జగన్, పవన్, చంద్రబాబు, మోదీ, అమిత్ షాలకే పరిమితమా? ఐటీ గ్రిడ్ లీకేజి వార్తలు అంటూ రోజంతా గోల చేయడమేనా? కళా సాంస్కృతిక రంగాల్లో ఎంతెంత పెద్ద సంఘటనలు జరిగినా అవి మీడియాలో ఎందుకు ప్రముఖంగా రావటం లేదు? ప్రయాగలో జరిగిన కుంభమేళా వివరాలు పూర్తి స్థాయిలో దేశానికి అందాయా? చైనాలో చాలా సంవత్సరాల తర్వాత ఇటీవల దీపోత్సవం (లాంప్ ఫెస్టివల్) జరిగింది. ఈ సంగతి ఎందరికి తెలుసు? హైదరాబాదులో సాహితీవేత్త మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఎవరీ మధునాపంతుల? అని ఈ తరం కుర్రాళ్లు అడుగుతున్నారు. ఆదికవి నన్నయ భారతావనికి ఎక్కడ శ్రీకారం చుట్టాడో అక్కడే మధునాపంతుల వారు మధువ్రతుడై ఆంధ్ర పురాణానికి శ్రీకారం చుట్టాడు. ఈ మహనీయునికి పద్మశ్రీ కాని జ్ఞానపీఠం కాని రాకపోవటం జాతి దురదృష్టం. పింగళి లక్ష్మీకాంతం శత జయంతి మొన్న హైదరాబాద్‌లో జరిగింది. ఈ వార్త ఎందరికి తెలుసు? అసలు పింగళి లక్ష్మీకాంతం అంటే ఎందరికి తెలుసు? ఇందుకు కారణం ఒకటే. సంచలనాత్మక రాజకీయ వార్తలకు మనం ప్రజలను అలవాటు చేశాం. వారికి పింగళి లక్ష్మీకాంతం, మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీ, మొదలి నాగభూషణశర్మ అంటే ఎవరో, వారుచేసిన కళాసాహిత్య సేవలు ఏమిటో తెలియవు. అవి ఇప్పటి పత్రికలలో రావు. ఇదీ వర్తమాన పరిస్థితి! సాహితీ ప్రముఖుడు ద్వానా శాస్ర్తీ దివంగతులైనా, హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కెవి రమణాచారి నేతృత్వంలో ‘హరికథా సప్తాహం’ జరిగినా మీడియా అంతగా పట్టించుకోలేదు.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్