మెయన్ ఫీచర్

తల తీసి మొండెం ఇచ్చినట్లుగా విశాఖ రైల్వే జోన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర విభజన జరిగిన తీరుపై 2014 ఎన్నికల సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ విమర్శనాస్త్రాలను సంధించారు. హడావుడిగా చేసిన రైల్వే జోన్ ప్రకటన కూడా అందుకు భిన్నంగా లేదు. ఏనాడో జోన్ ఏర్పాటు చేయవలసిందిపోయి నాలుగేళ్లపాటు జాప్యం చేసి ఇప్పుడివ్వడం ఒకటైతే, విశాఖ డివిజన్‌నే లేకుండా చేయడం తలతీసి మొండెం ఇచ్చినట్లుగా ఉంది. ఇక రవాణా ఆదాయం అధికంగా లభించే రైలు మార్గాలను ఒడిశాకు అప్పగించి, ప్రయాణికుల రెవెన్యూతోనే ఆంధ్రా సరిపెట్టుకోవాలనడం దారుణమైన అంశం. విభజన చట్టంలో కొత్త జోన్ ఏర్పాటు చేయమని ఉంది గాని, ఉన్న డివిజన్‌ను తీసివేయమనలేదు.
వాల్తేర్ డివిజన్‌ను ముక్కలు చేసి, ఇప్పుడు విస్తరించాలి అనుకొంటున్న విజయవాడ డివిజన్ దేశంలోనే నిర్వహణకు సమస్యలు సృష్టించే విధంగా ఉండే ప్రమాదం ఉంది. ఎప్పటికైనా వాల్తేర్ డివిజన్‌గా ఏర్పాటు చేయక తప్పదు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారిగా బీజేపీకి చెందిన వ్యక్తిని విశాఖపట్నం నుండి లోక్‌సభకు ఎన్నుకున్నందుకు ఈ ప్రాంత ప్రజలను ఈ విధంగా విద్రోహం చేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం సిద్ధపడుతున్నదా? ఏదో సాధించామని సంబరాలు చేసుకొంటున్న బీజీపీ నేతలకు ఈ ప్రాంతానికి జరిగిన దారుణమైన విద్రోహం గుంరించి నోరు విప్పే దమ్ము లేదా ?
166 ఏళ్ళ చరిత్ర గల భారతీయ రైల్వేలలో ఎక్కడ కూడా సుస్థిరమైన, లాభదాయకమైన రైల్వే డివిజన్‌ను రెండుగా చేసే, వేరే డివిజన్‌లలో కలిపిన ఉదంతమే లేదు. ఇప్పుడే దేశంలోనే అత్యంత లాభదాయకమైన 55ఏళ్ల వాల్తేరు డివిజన్‌ను బెజవాడ-రాయగడ రెండు డివిజన్లలోకి విలీనం చేసి, వాల్తేరు డివిజన్‌ను అంతర్థానం చేసే దుర్మార్గ చర్యకు పాల్పడ్డారు.
ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తున్న దేశంలో కొద్దీ నూతన డివిజన్‌లను ఏర్పాటు చేస్తున్నారు గాని ఉన్న డివిజన్‌ను తీసివేయడం ఎక్కడ జరగనే లేదు. గత ఎన్డీయే హయాంలోనే ఎనిమిది డివిజన్ లను - నాందేడ్, అగ్ర, గుంటూరు, రాంచి, రాయపూర్, రంగియా, అహ్మదాబాద్, పూణే డివిజన్‌లను ఏర్పాటు చేశారు. 1998లో ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పుడు ఛత్తీస్ ఘర్ రాష్ట్రం ఏర్పాటుకు ముందే దేశంలోనే అతి చిన్నదైన దక్షిణ తూర్పు రైల్వే డివిజన్‌ను బిలాసపూర్ కేంద్రముగా ఏర్పాటు చేశారు. అప్పుడు దానిలో బిలాసపూర్, నాగపూర్ - రెండు డివిజన్లు మాత్రమే ఉన్నాయి.
ఇక, బిలాసపూర్ నుండి కేవలం 292 కిమీ రైల్ మార్గంతో రాయపూర్ డివిజన్‌ను, శంబాలాపూర్ డివిజన్ ను 24 కి.మీ.తో ఏర్పాటు చేశారు. వాల్తేర్ డివిజన్ వీటన్నింటికన్నా పెద్దదే కావడం గమనార్హం. దేశంలో చాల రైల్వే జోన్‌లు రాజకీయ అవసరం కోసం ఏర్పడినవే గాని, తగు హేతుబద్దత ఉన్నవి కావు. కానీ వాల్తేరు డివిజన్‌కు రైల్వే జోన్‌గా మారడానికి అవసరమైన అన్ని రకాల వౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నా రాజకీయ సంకల్పం, వత్తిడి కొరవడటం కారణంగా దశాబ్దాలుగా ఏపీ ప్రజలు కోరుతున్నా సాధ్యం కాలేదు.
చివరకు విభజన చట్టంలో అందుకు స్పష్టమైన హామీ లభించినా, ఒడిశాలో రాజకీయ ప్రయోజనాలపై కన్ను వేసిన ప్రధాని మోదీ అమలు కాకుండా చూడగలిగారు. ఇప్పుడు అమలు చేస్తున్నట్లు చెబుతూ మరోరకంగా ద్రోహం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పారిశ్రామిక కేంద్రమైన విశాఖపట్నం, గంగవరం ఓడరేవుల పరిసరాలలోని ప్రాంతాల అవసరాలు తీర్చడం కోసమే ప్రధానంగా వాల్తేర్ డివిజన్ ఉన్నది.
రైల్వే జోన్ కావాలని అడిగినందుకు కేంద్రంలోని బిజెపి ఈ ప్రాంతంపై కక్షగట్టిందా అన్నట్లు ఇప్పుడు 12వేల మంది రైల్వే ఉద్యోగులను ఎక్కడకో నెట్టే ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్ర విభజనను అశాస్ర్తీయంగా చేసారని విమర్శిస్తున్న బీజేపీ నేతలు ఇప్పుడు జోన్ విషయంలో అదే విధంగా చేశారు. దేశ రైల్వేల చరిత్రలో జోన్‌లు ఏర్పాటైన ప్రతీ సందర్భంలోనూ హెడ్ క్వార్టర్స్‌లోనే డివిజన్ ఉండడం ఆనవాయితీగా కొనసాగు తోంది. సౌత్ సెంట్రల్ రైల్వేలో సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లు ఉన్నాయి. ఈస్టర్న్ రైల్వే జోన్ కోల్‌కతాలో హౌరా డివిజన్ అక్కడే ఉంది. సదరన్ రైల్వేలో చెన్నై డివిజన్ కూడా వేరు పడలేదు.
మరోపక్క అధిక ఆదాయం వచ్చే కెకె లైనును రాయగడ డివిజన్ ఏర్పాటు చేసి అటు కలిపేశారు. ఇది ఒడిశా-ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం మాత్రమే కాగలదు. 2018లో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి డిఆర్‌ఎం కార్యాలయ ఉన్నతాధికారులు భువనేశ్వర్ రైల్వే సమర్పించిన బ్లూప్రింట్ మారిపోయిందంటూ డిఆర్‌ఎం కార్యాలయ సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. వాల్తేరు డివిజన్ లేని జోన్ ప్రస్తావనే అందులో లేదని కొంతమంది చెబుతున్నారు. బ్లూ ప్రింట్‌లో వాల్తేరు డివిజన్ అధికారులు అడిగిన మేరకు సౌత్ సెంట్రల్‌లో రాజమండ్రి వరకూ కోరారని తెలుస్తోంది.
విశాఖ - రాయపూర్ (ఆర్‌విలైన్)లో లడ్డా, కెకెలైనులో హక్కు ఉండాలని అందులో స్పష్టంగా ఉంటూనే... పలాస నుంచి ఇచ్చాపురం వరకూ మెయిన్ లైనును బ్లూ ప్రింట్‌లో ప్రతిపాదించారు. కానీ భువనేశ్వర్ జోనల్ రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు పంపించేటప్పుడు బ్లూ ప్రింట్‌ను మార్చేశారంటూ రైల్వే అధికారులే స్పష్టం చేస్తున్నారు. అందుకు సంకుచిత రాజకీయ వత్తిడులే కారణంగా కనిపిస్తున్నది.
తూర్పు కోస్తా రైల్వేలో వాల్తేరు ఏటా రూ.3600కోట్ల ఆదాయాన్ని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఎన్‌ఎండిసి నుంచి (బచ్చేలి, కిరండోల్) ఐరన్ ఓర్‌ను కెకెలైన్ ద్వారా పోర్టు, స్టీల్‌ప్లాంట్‌లకు తీసుకొచ్చి పొందుతోంది. వాల్తేరు డివిజన్ ఉండడం వల్ల ఈ ఆదాయం మాత్రమే కాదని, ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌కు ఢోకా ఉండదని, డివిజన్ లేకపోతే కేంద్రం ఇష్టారాజ్యం అయ్యే అవకాశం ఉంది. గతంలో ఒడిశా కింద పనిచేసిన తాము నేడు విజయవాడ ఉన్నతాధికారులతో సిబ్బంది సీనియారిటీ సమస్యలపై ఆందోళన చేసే పరిస్థితి లేకపోలేదంటూ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
జోన్ వస్తే కొత్త రైళలు కొన్ని వస్తాయని, కొత్త లైన్ల నిర్మాణం జరుగుతుందని, ఉద్యోగాలు ఈ ప్రాంత యువతకు దక్కుతాయని ఆశించినందునే జోన్ డిమాండ్ ముందుకొచ్చింది. కాని ఆదాయం వచ్చే భాగాన్ని విడగొట్టి దానిని తూర్పుకోస్తా జోన్‌లోనే కొనసాగిస్తే దక్షిణ కోస్తా జోన్ అభివృద్ధి, కొత్త లైన్లు, కొత్త రైళలు, అదనపు ఉద్యోగాలు, ప్రయాణికులకు అదనపు సౌకర్యాలు ఎలా సాధ్యపడతాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వాల్తేరు రైల్వే డివిజన్‌లో 21,800 శాంక్షన్ పోస్టులు (వివిధ కేడర్)లో ఉండగా 17800 మంది పనిచేస్తున్నారు. వీరిలో సగానికి పైగా విజయవాడ లేదంటే రాయగడకు విధిగా వెళ్లాల్సిందే.
ఇప్పుడు జోన్ ఇవ్వడం రాజకీయ ప్రేరేపిత నిర్ణయం కానీ ఈ ప్రాంత ప్రజల అభీష్టం నెరవేర్చడం కోసం, విభజన హామీలను అమలు పరచడం కోసం బీజేపీ చేయలేదని స్పష్టం అవుతుంది. ప్రధాన మంత్రి గుంటూరు పర్యటన సందర్భంగా విభజన హామీలు అమలు పరచకుండా ఏపీ ప్రజలను మోసం చేసిన మోదీ అంటూ పెద్ద ఎత్తున నిరసనలు ఎదురయ్యాయి. విశాఖపట్నంలో కూడా అదే పునరావృతం అయ్యే అవకాశం కనిపించడంతో మోడీ విశాఖ పర్యటనను ఫిబ్రవరి 16 నుండి మార్చి 1కి వాయిదా వేశారు. ఈ లోగా ఏపీ బిజెపి నేతలు రైల్వే మంత్రిని కలవడం, వెంటనే జోన్ ప్రకటన రావడం నాటకీయంగా జరిగిపోయాయి.
జోన్ ప్రకటన చేయడానికి రెండు రోజుల ముందు జానా ఏర్పాటు సాధ్యం కాదంటూ రైల్వే బోర్డు పార్లమెంటరీ కమిటీకి నివేదిక ఇవ్వడం గమనార్హం. ఇప్పట్లో బిజెపికి ఏపీలో ఒక్క సీట్ కూడా గెలిచే సత్తా లేదు. కానీ పొరుగున ఉన్న ఒడిశాలో బలం పుంజుకొని అధికారం చేపట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఈ జోన్ ఏర్పాటు ద్వారా తాము ఒడిశా ప్రయోజనాల కోసమే ఉన్నామనే రాజకీయ సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారు.
మూడు నెలల క్రితం 125వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న వాల్తేరు డివిజన్ కాస్తా మాయం కాబోతోందన్న విషయం కేవలం భావోద్వేగపరమైన అంశం మాత్రమే కాదు. కొత్త రైల్వే జోన్‌కు ఆర్థికంగా కష్టాలు తెచ్చిపెట్టే అంశం కూడా. నిరుడు వాల్తేరు డివిజన్ రూ. 7,500 కోట్లకుపైగా ఆదాయాన్ని గడించింది. కానీ తాజా నిర్ణయం ప్రకారం ప్రయాణికుల ద్వారా లభించే ఆదాయం విశాఖ కేంద్రంగా ఏర్పడే రైల్వే జోన్‌కూ, సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయం భువనేశ్వర్ జోన్‌లోని రాయగడ డివిజన్‌కూ వెళ్తాయి. కానీ కేకే లైన్ పరి ధిలో అరకు వరకూ ఉన్న రైలు మార్గం నిర్వహణ భారం మాత్రం విశాఖ జోన్‌కు బదిలీ అవుతుంది.
బైలదిల్లా గనులు ఒడిశా పరిధిలో ఉంటే, అక్కడి ఖనిజం విశాఖ ఓడరేవులకు రవాణా అవు తుంది. కనుక సమన్యాయం చేయదల్చుకుంటే ఇనుప ఖనిజం రవాణా ద్వారా లభించే ఆదా యాన్ని భువనేశ్వర్, విశాఖ రైల్వే జోన్‌లకు చెరి సగం పంచాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛను సాకారం చేస్తున్నామని సగర్వంగా చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిం చకపోవడం గమనిస్తే ఏపీ ప్రజల పట్ల వారిలో నెలకొన్న విషపూరిత విద్వేషాన్ని వెల్లడి చేస్తుంది.
చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి జరిగితే మరిన్ని కొత్త రైల్వే లైన్లు వేయవలసి ఉంటుంది. దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక కేంద్రమైన విశాఖపట్నంలో అటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ డివిజన్ కార్యాలయం లేకపోవడం పలు సమస్యలకు దారితీస్తుంది. ఇప్పటికి కూడా కేకే లైన్ తీసివేసినా వాల్తేర్ డివిజన్ ఆదాయం విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లకన్నా ఎక్కువగా ఉంటుంది. డివిజనల్ మేనేజర్ తరచూ ఈ ప్రాంతపు అధికారులతో, పరిశ్రమలతో సమావేశాలు జరుపుతూ ఉంటారు. ఇప్పుటు అటువంటి సమావేశాలకు వీరంతా విజయవాడకు వెళ్ళవలసి రావడం పలు ఇబ్బందులకు దారితీస్తుంది.
ఒక విధంగా జోన్ ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత ప్రజలను ఘోరంగా మోదీ ప్రభుత్వం అవమానాలకు గురిచేసింది. ఈ దారుణమైన అన్యాయానికి వ్యతిరేకంగా మనం మరో పోరాటానికి సిద్ధం కావాలి.
ఒడిశాలో కేకే లైన్ లో గల కోరాపుట్ - కిరాండల్, కూనేరు - తెరవాలి, కోరాపుట్ - రాయగడ రైల్వే లైన్ లను రాయగడ డివిజన్ కు బదిలీ చేయడానికి ఎటువంటి అభ్యంతరం ఉండనవసరం లేదు. కానీ వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రైల్వే ప్రాంతాలను కూడా బదిలీ చేయడం దుర్మార్గమైన చర్య కాగలదు. ఇచ్ఛాపురం నుండి రాజమండ్రి వరకు, కొత్తవలస నుండి గోరాపూర్, విజయనగరం నుండి కూనేరు, నౌపాడ నుండి గూనూరు, పిఠాపురం నుండి కాకినాడ, కాకినాడ నుండి కోటిపల్లి, ఎన్ టి పి సి, విశాఖపట్నం ఓడరేవు, గంగవరం ఓడరేవు తదితర ప్రాంతాలలో గల రైల్వే లైన్లను వాల్తేర్ డివిజన్‌ను కొనసాగించ వలసిందే.

- కొణతాల రామకృష్ణ మాజీ ఎంపీ, మాజీ మంత్రి కన్వీనర్, ఉత్తరాంధ్ర చర్చా వేదిక