మెయిన్ ఫీచర్

ఎదురుచూసి మోసపోకుమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవుటాఫ్ ఇండస్ట్రీలో ఆడియన్స్ డైలాగులివి. ఒక్కసారి హీరో అనిపించుకుంటే -శక్తి సన్నగిల్లేవరకూ పాతుకుపోవడం ఇండస్ట్రీలో కామన్. కొంతకాలంగా హీరోయిన్లూ అదే స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. కాకపోతే -కొత్త హీరోయిన్ల కోసం ఇండస్ట్రీ వెతుకుతుందన్న వార్తలు వస్తుంటాయి. ఆడియన్స్ ఆశగా ఎదురు చూస్తుంటారు. అలాంటి కథనాలు విని.. ఎదురుచూసి పోసపోవద్దని పాతుకుపోయిన హీరోయిన్లు ప్రాజెక్టుల్లో కనిపిస్తూ చెబుతూనే ఉంటారు. ఓ స్టార్ హీరోనో.. ఓ స్టార్ డైరెక్టరో.. మరే స్టార్ ప్రొడ్యూసరో -పెద్ద ప్రాజెక్టుకు ప్లాన్ చేశారంటే, వాళ్లకు మిగిలిన విభాగాల్లో ఆప్షన్లు ఉండొచ్చేమోగానీ, ఆప్షన్‌కు అవకాశంలేని ఒకే ఒక్క విభాగం -హీరోయిన్. ఔను! ఇప్పుడు టాలీవుడ్ కొత్త హీరోయిన్ల కొరతతో సతమతమవుతుంది.
**
ఏ ప్రాజెక్టును మెలితిప్పినా ఏమున్నది కొత్తందం. కొత్త సినిమాల నిండా పాత హీరోయిన్ల ప్రతాపం -అని తిట్టుకుంటూ ఆడియన్స్ కూడా వాళ్లనే చూడ్డానికి అలవాటుపడిపోతున్నాడు. పెద్ద హీరోలు, పెద్ద ప్రాజెక్టుల్లోనే కాదు.. కుర్ర హీరోలు కుర్ర ప్రాజెక్టుల్లోనూ ఎంతసేపూ కనిపించేది -సమంత, తమన్నా, శ్రీయ, తాప్సీ, అనుష్క, ఇలియానా, నయనతార, కాజల్.. మహా అయితే మరో ఇద్దరు ముగ్గురు పేర్లు. ఇంతకుమించి అలవాటుగా వినిపించే పేరొక్కటీ ఉండదు. ఇలియానా బాలీవుడ్‌కు చెక్కేసింది. శ్రీయకు డిమాండ్ పడిపోయింది. ప్రయోగాత్మక చిత్రాలతో అనుష్క లావైపోయింది. సమంతకు పెళ్లైపోయింది. నయన్‌కు డిమాండ్ పెరిగిపోయింది.. ఇలా ఒక్కో హీరోయిన్‌కు ఒక్కో కాజ్ వినిపిస్తున్నా -మళ్లీ వీళ్లే దిక్కు. ఎందుకంటే ఇంతకుమించి హీరోయిన్లు లేరు. అడపాదడపా అటు బాలీవుడ్ నుంచో, ఇటు తమిళ మలయాళం నుంచో ఒకరో ఇద్దరో వచ్చి ఒకటో రెండో సినిమాలు చేసి మాయమైపోయేవాళ్లే. లేదూ.. చిన్న బడ్జెట్ చిత్రాల్లో తళుక్కున మెరిసిన కొత్తందానికి స్టార్ తిరిగిందన్న ఊసులు వినిపించడాలే. నిజానికి అది నిజమయ్యే పరిస్థితి బహు తక్కువ. అదేంటి? ఏటా టాలీవుడ్‌కు కొత్త హీరోయిన్లు వస్తుంటారే? అన్న డౌట్లకు ఇక్కడ ఆన్సర్లూ అంతే చిత్రంగా ఉంటాయి. నూటికో కోటికోగానీ కొత్త అమ్మాయిలు రారు. వచ్చినా నిలబడరు. కారణమేంటో ఎవ్వరూ చెప్పలేరు. పాత్రకు తగిన గ్లామర్ నచ్చి సినిమా చాన్సిచ్చే దర్శక నిర్మాతలు, సినిమా పోతే మాత్రం మళ్లీ వాళ్లకు చాన్సివ్వరు. ఎందుకు? అన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. సో, వచ్చిన కొత్త అమ్మాయిలంతా కొన్నాళ్లకే కనిపించకుండా పోతారు. చచ్చినట్టు పాత హీరోయినే్ల మళ్లీ గతి.
***
నిజానికి ఏటా పదుల సంఖ్యలో హీరోయిన్లు పరిశ్రమకు వస్తున్న మాట నిజమే. కానీ స్క్రీన్‌కు పరిచయమైన వాళ్లలో నిలదొక్కుకునేది కొందరు. అందులో క్రేజ్ తెచ్చుకునేది మరీ కొందరు. నటిగా ప్రూవ్ చేసుకునేది ఒకరిద్దరు. డజన్ల కొద్దీవున్న హీరోలకు ఆ ఒకరిద్దరు సరిపోరు కనుక -మళ్లీ సీనియర్ హీరోయిన్ల నుంచి ఎంపిక చేసుకోవడమే. మరోకోణంలో చూస్తే -చిన్న సినిమాతో పరిచయమై సక్సెస్ అయినా, స్టార్ హీరోల సరసన చాన్స్‌లు అంత సులువుగా రావు. హీరో రేంజ్ పడిపోతుందన్న భయం. ఓ హీరో కొత్త సినిమాకు ఓకే చెప్పాడనగానే.. అభిమానులు మొదట ఆలోచించేది హీరోయిన్ ఎవరు? అని. స్టార్ హీరో సరసన ముక్కూమొగం తెలీని కొత్తమ్మాయిని పెట్టలేని పరిస్థితి. దర్శకుడు- హీరో కాంబినేషన్‌కి ఎంత క్రేజ్ ఉంటుందో, నాయకానాయికల కాంబినేషన్‌కూ అంతే క్రేజ్ ఉండటం సహజం. అభిమాన హీరోలతో జతకడుతోంది టాప్ హీరోయిన్లా? లేక కొత్తవాళ్లా? అన్న ఆత్రుత అభిమానుల్లో ఉంటూనే ఉంటుంది.
**
ప్రస్తుతం టాలీవుడ్‌లో పలువురు హీరోల చిత్రాలు సెట్స్‌మీద ఉన్నాయి. కానీ ఆ హీరోలందరికీ హీరోయిన్లు కావాలి. ఈ విషయంలో సీనియర్ హీరోల పరిస్థితి మరి అర్థంకాకుండా ఉంది. సీనియర్ హీరోల సరసన కచ్చితంగా స్టార్ హీరోయిన్లనే తీసుకోవాలని దర్శకులు ప్రయత్నాలు చేస్తారు. కానీ వారిద్దరి మధ్య వయసు తారతమ్యం ఎక్కడ తేడా కొడుతుందో అన్న టెన్షన్ అయితే తప్పదు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా కమిటయ్యాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయిన సినిమా కోసం దర్శకుడికి టెన్షన్ పట్టుకుంది. కారణం ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? ప్రస్తుతం చిరు సరసన కథానాయికను వెతికే వేటలో పడ్డాడు కొరటాల శివ. తన సినిమాలో కథానాయికల నటనకు ప్రాధాన్యంతోపాటు గ్లామర్ హంగులూ ఉండేలా ప్లాన్ చేస్తాడు శివ. చిరంజీవి సరసన నయనతార, అనుష్కలాంటి కథానాయికల్ని జోడీగా తీసుకొస్తాడో లేక కొత్త అందాలను దింపే ప్రయత్నంలో ఉన్నాడో తెలుసుకోవాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.
ఇక ‘యన్‌టిఆర్ -మహానాయకుడు’ విడుదల తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ చేసే సినిమా మార్చిలో ప్రారంభం కానున్నట్టు వార్తలొస్తున్నాయి. మరి ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్నది ఇప్పటికే చిత్ర బృందానికి సస్పెన్స్‌గా మారింది. మరోపక్క సీనియర్ స్టార్ వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో ‘వెంకీ మామ’ సినిమా సెట్స్‌మీదుంది. నాగచైతన్యకు జోడీగా రకుల్ ప్రీత్‌సింగ్ ఎంపికైంది. వెంకటేశ్ పక్కన బాలీవుడ్ నటి హుమాఖురేషి నటించబోతోందని వినిపిస్తోంది. కానీ అధికారికంగా ప్రకటన రాలేదు. ఇప్పుడు వెంకటేష్ సరసన హీరోయిన్ ఎవరన్న టెన్షన్‌లో ఉంది యూనిట్. ఇక 2002లో నాగార్జున హీరోగా వచ్చిన మన్మథుడు సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 16ఏళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘చి.ల.సౌ’తో దర్శకుడిగా పరిచయమైన నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. అప్పట్లో నాగ్ సరసన సోనాలి బెంద్రే, అన్షు నటించారు. మరి సీక్వెల్‌లో ఇద్దరు హీరోయిన్లు ఉంటారా? లేక ఒకరే ఉంటారా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇద్దరుంటే ఇద్దరూ అలవాటుపడిన హీరోయినే్ల ఉంటారా? ప్రాజెక్టు ఫ్రెష్‌నెస్ కోసం ఇద్దర్నీ కొత్తవారిని తెస్తారా? ఫిఫ్టీ ఫిఫ్టీనా? అన్నదీ తేలాల్సి ఉంటుంది. అలాగే, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లాంటి స్టార్ హీరోలకు హీరోయిన్ టెన్షన్ తప్పడం లేదు. ఎందుకంటే ప్రతి సినిమాలోనూ ఒకే హీరోయిన్‌ని తీసుకోవడం సాధ్యం కాదు. ఉన్నవాళ్లను మార్చి మార్చి చేసినా -ప్రాజెక్టులో ఫ్రెష్ ఫీల్ దెబ్బతినే ప్రమాదం ఉండకపోదు. ఇలాంటి సమస్యలు టాలీవుడ్‌లో తప్పడం లేదు. మొత్తానికి టాలీవుడ్‌లో హీరోయిన్ కొరత ఉందన్న విషయం అర్థమవుతుంది. ఈ సమస్యకు పరిష్కారం -కొత్త అందాలను వెతికి పట్టడమే. ఇటీవలి కాలంలో అటు చిన్న ప్రాజెక్టులు, ఇటు మీడియం ప్రాజెక్టుల్లో చాలామందే అటు గ్లామర్, ఇటు నటనలో సత్తా చూపించిన కొత్త అమ్మాయిలు కనిపిస్తున్నారు. స్క్రీన్‌పైన సీనియర్ హీరోయిన్లంత దగ్గరగా ఆడియన్స్‌ని అల్లుకుపోయిన ఎక్స్‌ప్రెసివ్ ఫేస్‌లూ కనిపిస్తున్నాయి. వీళ్లలో ఎంతమందికి స్టార్ హీరోలు, పెద్ద ప్రాజెక్టుల్లో అవకాశం దక్కుతుంది? ఎన్ని కొత్త అందాలు ఆడియన్స్ ఆదరణకు నోచుకుంటాయి అన్నది కాలం నిర్ణయించాలి.
ఇక హీరోయిన్లలో తెలుగు అమ్మాయిల విషయానికొస్తే -పరిస్థితి మరీ దారుణం. టాలీవుడ్‌కు ఎప్పుడూ పొరుగింటి పుల్లకూరే రుచి. కాబట్టి సొంత భాషా హీరోయిన్లకంటే రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువైనా, పాత్రకు తగిన పౌష్టికత లేకున్నా -పరభాషా అమ్మాయిలను వెదికి మరీ తెచ్చుకుంటాం. ఇదీ పెద్ద సమస్యే.

-శ్రీనివాస్ ఆర్ రావ్