మెయిన్ ఫీచర్

ఫినిషింగ్ టచ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా పరిశ్రమకు సంబంధించి ఏడాది మొత్తం ఒకెత్తు. చివరి నెల డిసెంబర్ ఒకెత్తు. ఆడియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ టేస్ట్‌ను సంతృప్తిపర్చడానికి చివర్లో ప్రత్యేక, భారీ బడ్జెట్ సినిమాలు వరుసపెట్టడం గత కొనే్నళ్లుగా కనిపిస్తోన్న దృశ్యం. ఈ ఏడాదీ వైవిధ్యమైన చిత్రాలు డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. గత ఏడాదికంటే పరిశ్రమ మరో పదడుగులు ముందుకేసిందని చెప్పుకోతగ్గ చిత్రాలు ఈ ఏడాదికి -ఫైనల్ టచ్ ఇవ్వనున్నాయి. రాబోయేవన్నీ సంచలనం సృష్టించతగ్గ చిత్రాలే కనుక -వీటి హిట్లతో కొత్త ఏడాదిని ఘనంగా మొదలుపెట్టవచ్చన్న ఉత్సాహంతో పరిశ్రమ కనిపిస్తోంది. దక్షిణాది చిత్రసీమలోనే కాదు, అటు బాలీవుడ్, హాలీవుడ్ నుంచీ ఆసక్తికరమైన చిత్రాలు థియేటర్లకు వస్తుండటంతో ఆడియన్స్‌లోనూ ఉత్సాహం కనిపిస్తోంది.
ఎక్కడ విన్నా 2.0
ఈ ఏడాది చిట్టచివరి పెద్ద సినిమా 2.ఓపై చర్చ రోజురోజుకూ సెగ పెంచుతోంది. ఓపక్క సూపర్‌స్టార్. మరోపక్క స్టార్ డైరెక్టర్. మధ్యలో స్లిమ్ బ్యూటీ. వివరించాల్సిన పనిలేని సినిమా -2.0. రోబో సీక్వెల్ -2.ఓ.తో. శంకర్ గురిపెట్టిన చిట్టి థియేటర్లకు నవంబర్ 29న వస్తున్నాడు. దీంతో దక్షిణాదిలోనే కాదు, బాలీవుడ్‌లోనూ స్టార్ డైరెక్టర్ శంకర్ చిత్రంపై పెద్ద అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్న హీరో అక్షయ్‌కుమార్ క్రోమ్యాన్ (విలన్)గా, ప్రాణం పోసుకున్న చిట్టితో తలపడబోతున్నాడన్నది ఆసక్తికరం. పాత్రల గెటప్పులు, లుక్కులు, ప్రచార చిత్రాలతో అంచనాలు పెంచిన శంకర్, కామ్‌గా తనపని తను చేసుకు పోతున్నాడు. విడుదల తేదీ దగ్గర పడుతుండటతో ఓపక్క ప్రమోషన్‌ను ఊదరగొడుతున్నారు. మరోపక్క నిర్మాణ సమయంలోని ఆసక్తికరమైన సంగతులను మీడియాకు వదులుతున్నారు. ఇంకోపక్క బడ్జెట్ ముచ్చట్లు పెడుతున్నారు. అదేపనిగా టెక్నాలజీ సంగతులూ బుర్రల్లోకి తోస్తున్నారు. ఇలా 2.ఓ గురించి ఆడియన్స్‌కి ఫోర్డీ సౌండ్స్ వినిపిస్తున్నాయి.
బాలీవుడ్‌లో ప్రయోగాలకు పెట్టింది పేరు -షారుఖ్ ఖాన్. కొన్ని తరహా చిత్రాలు అతనుతప్ప మరెవ్వరూ చేయలేరన్న ఖ్యాతి సంపాదించుకున్న స్టార్ హీరో సడెన్‌గా మరుగుజ్జై ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆ చిత్రమే ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన -జీరో. ఒకప్పుడు విచిత్ర సోదరులు చిత్రంలో కమల్ చేసిన ప్రయోగానే్న ఇప్పుడు షారుఖ్ చేస్తున్నాడనే చెప్పొచ్చు. కాకపోతే బాలీవుడ్‌లో ఈ తరహా పాత్రలో కనిపించిన తొలి హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని సమయస్ఫూర్తిగా వాడుకుని షారుఖ్ పాత్రను డిజైన్ చేశారు. వీఎఫ్‌ఎక్స్‌లో ఆరితేరిన హాలీవుడ్ టెక్నీషియన్లు సినిమాకు కొత్త ప్రాశారన్నది వినికిడి. ఇక ఆరడుగుల అందగత్తె కత్రినాకైఫ్‌తో మరగుజ్జు షారఖ్ ‘లవ్ కెమిస్ట్రీ’ అద్భుతమేననీ టీం చెప్పుకొస్తుంది. వీల్‌చైర్‌కే పరిమితమై షారుఖ్‌ను ఇష్టపడే దివ్యాంగురాలి పాత్రలో అనుష్క శర్మ తన సత్తా చాటనుందట. లవ్ ట్రావెల్‌లో సునిశితమైన హాస్యంతోపాటు, భావోద్వేగాలను మెల్కొలిపే సన్నివేశాలను ఆనంద్ అద్భుతంగా తెరకెక్కించాడన్నది బాలీవుడ్‌లో వినిపిస్తోన్న మాట. వరుస చిత్రాలతో అటు కత్రినా, ఇటు అనుష్క మంచి ఊపుమీదున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురి కాంబినేషన్‌కుతోడు అతిధి పాత్రలో సల్మాన్ ఖాన్ మెరుపులు మెరిపించనున్నాడట. ప్రేమకోసం అంతరిక్షంలోకి వెళ్లే మరుగుజ్జు షారుఖ్ ఎపిసోడ్స్ చిత్రానికి హైలెట్ కానున్నాయట. సో.. డిసెంబర్ 21న జీరోతో షారుఖ్ సినిమా ఆనందాన్ని సంతృప్తిపరుస్తాడన్న మాట.
సింబా: దీపికతో పెళ్లిపీటల మీద చిర్నవ్వులు చిందించిన రణ్‌వీర్ -ఇప్పుడు థియేటర్లలో సింహగర్జన చేయనున్నాడు. తెలుగులో జూ.ఎన్టీఆర్‌కు కొత్త ఇమేజ్‌నిచ్చిన ‘టెంపర్’ చిత్రం బాలీవుడ్ రీమేక్‌లో రణ్‌వీర్ సింగ్ హీరో. సినిమా పేరు -సింబా. తొలిసారి రణ్‌వీర్ పోలీస్ క్యాప్ పెట్టబోతున్నాడు. మరోపక్క ఇదే సినిమాలో సారా అలీఖాన్ ఒకే నెలలో రెండో చిత్రంగా స్క్రీన్ ప్రజెంట్ ఇవ్వబోతోంది. సింగం సిరీస్‌తో యాక్షన్ చిత్రాల స్పెషలిస్టుగా మారిన రోహిత్ శెట్టి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరో విశేషం ఏంటంటే -ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గన్ అతిథి పాత్ర పోషిస్తుండటం. డిసెంబర్ చివరి సినిమాగా వస్తున్న సింబా -28న థియేటర్లకు వస్తుంది.
కేదారనాథ్: ఐదేళ్ల క్రితం కేదార్‌నాథ్‌ను ముంచెత్తిన వరదల తీవ్రత ఎప్పటికీ మర్చిపోలేం. పుణ్యక్షేత్రంలో చోటుచేసుకున్న మహా విషాదం నేపథ్యంగా ఓ అందమైన ప్రేమ కథను అల్లుకున్నాడు అభిషేక్ కఫూర్. ఆ కథే -యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సైఫ్ అలీ కుమార్తె సారా అలీఖాన్ జంటగా తెరకెక్కింది. డిసెంబర్ 7న థియేటర్లకు వస్తుంది. సారా ఈ చిత్రంతో తెరంగేట్రం చేస్తోంది. అప్పటి వరదల తీవ్రతను కళ్లముందు చూపించేందుకు భారీబడ్జెట్‌తో సన్నివేశాలను తెరకెక్కించారట. ఒకవిధంగా కృత్రిమ వరదలనే సృష్టించి, డూప్‌లేకుండా సుశాంత్, సారాలతో సన్నివేశాలను రూపొందించారని తెలుస్తోంది. కేదార్‌నాథ్ ట్రైలర్ ఇప్పటికే భారీ వ్యూస్ అందుకుని మంచి ఫలితాలు సాధించింది. ట్రైలర్‌లో భారీతనం కనిపించటంతో అంతకంతకూ అంచనాలు పెరుగుతున్నాయి.
ఆక్వామాన్: భారతీయ ప్రేక్షకుల సినిమా దాహాన్ని సంతృప్తిపర్చడానికి హాలీవుడ్‌నుంచి జలఖడ్గం వస్తోంది. హాలీవుడ్ యాక్షన్ సినిమాల కోసం పడిచచ్చే భారతీయ ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తూ -ఆక్వామెన్ డిసెంబర్‌లోనే వస్తున్నాడు. కాంజ్యురింగ్, ప్యూరియస్ 7 లాంటి సెక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన దర్శకుడు జేమ్స్ వాన్ తెరకెక్కించిన సినిమా ఇది. వెయ్యికోట్ల బడ్జెట్‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌గా మార్చి, సముద్రగర్భంలోని అట్లాంటిస్ రాజ్యంలోకి తీసుకెళ్లనున్నాడు వాన్. సముద్రగర్భంలో భారీ యుద్ధాలతో సాగే కథా సన్నివేశాలు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయో ఇప్పటికే ట్రైలర్లుగా వదిలిన వాన్, సరికొత్త అనుభూతి అందిస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. డిసెంబర్ 21న ఆక్వామెన్ చిత్రం తెలుగులో ‘సముద్ర పుత్రుడు’గా వస్తోంది.
టాలీవుడ్‌లోనూ చెప్పుకోతగ్గ ఓ పది చిత్రాలు ఆడియన్స్‌ని ఊరిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది -అంతరిక్షం 9000 కెఎంపీహెచ్. అంతరిక్షం నేపథ్యాన్ని ఇంతవరకూ తెలుగు దర్శకులు ఎవ్వరూ టచ్ చేయలేదు. ఆ సాహసాన్ని సంకల్పరెడ్డి చేస్తున్నాడు. ఘాజీలో సబ్‌మెరైన్ల యుద్ధ సాహసాలు చూపించి హిట్టందుకున్న దర్శకుడు సంకల్ప్‌రెడ్డి, ఈసారి అంతరిక్షాన్ని టార్గెట్ చేయడం ఆసక్తికరం. తొలి తెలుగు స్పేస్ బ్యాక్‌డ్రాప్ చిత్రంలో హీరో వరుణ్ తేజ్. అందుబాటులోకి వచ్చిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, విదేశీ వీఎఫ్‌ఎక్స్ నిపుణుల సాయంతో ఆడియన్స్‌ని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేశాడు. చిత్రాన్ని డిసెంబర్ 21న థియేటర్లకు తెస్తున్నారు. హను రాగవపూడి డైరెక్షన్‌లో శర్వానంద్, సాయిపల్లవి చేస్తోన్న ‘పడిపడిలేచె మనసు’ కూడా ఆసక్తిరేకెత్తిస్తోంది. అట్రాక్టివ్ టైటిల్‌ని చూస్తుంటే, అద్భుతమైన ప్రేమకథను హను తెరకెక్కించాడన్నది అర్థమవుతుంది. ఈ చిత్రం సైతం డిసెంబర్ 21నే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఓ పత్రికా రిపోర్టర్‌గా మెప్పించేందుకు నిఖిల్ చేస్తున్న ముద్ర, దివంగత సీఎం వైస్సాఆర్ నిర్వహించిన పాదయాత్ర నేపథ్యంలో బయోపిక్‌గా వస్తున్న ‘యాత్ర’ డిసెంబర్‌లోనే రానున్నాయి. వైఎస్సార్ పాత్రను మమ్ముట్టి చేస్తుండటం ఆసక్తికరమైన అంశం. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సుమంత్ -ఒక్కసారిగా స్పీడ్ పెంచేశాడు. ఒక్క డిసెంబర్‌లోనే సుమంత్ చిత్రాలు రెండు థియేటర్లకు వస్తున్నాయి. అందులో ఒకటి ఇదంజగత్, రెండోది సుబ్రహ్మణ్యపురం. ఓ హిట్టుకోసం పరతపిస్తున్న అఖిల్ మజ్ను సైతం టైం కలిస్తొస్తే డిసెంబర్‌లోనే రావొచ్చని తెలుస్తోంది. ఇవికాక భైరవగీత, కవచం, కేజీఎఫ్‌లాంటి ఆసక్తికరమైన చిత్రాలూ డిసెంబర్‌లోనే రానున్నాయి.