మెయిన్ ఫీచర్

ఏది నిజం.. ఏది సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసపెట్టి వస్తున్న బయోపిక్‌లు భయపెడుతున్నాయ. యథార్ధాలను దాచిపెట్టి, సినిమాటిక్ ముడిసరుకును ఎక్కుపెట్టి.. ఇదే బయోపిక్ అంటూ స్క్రీన్ మీదకు తెస్తున్న బతుకు కథల బరువు మోయడం కష్టమవుతుంది. విషయం తెలియనివాళ్లు స్క్రీన్ సీనే్ల నిజమని నమ్మే ప్రమాదం తలెత్తుతోంది. తెలిసినవాళ్లు వక్రీకరణను భరించలేక విలవిల్లాడాల్సి వస్తుంది. బాలీ, టాలీ, కోలీ, మాలీ.. ఇలా ఏ వుడ్ సినిమాలోనైనా ఇదే పరిస్థితి. ప్రశ్నించడానికి అవకాశం ఉండదు కనుక, వాళ్లు చూపిందే వేదమవుతుంది. అదే బయోపిక్ అని రుద్దేస్తుంటే -నిజమే కాబోలు అని నమ్మే పరిస్థితీ లేకపోలేదు. గత నాలుగైదేళ్లలో వచ్చిన ఎన్నో బయోపిక్‌లలో ఎన్ని నిజాలు చూపించారు? ఎన్ని అవాస్తవాలను నిజం చేశారు? గొప్పవాళ్ల జీవితాల్లో ప్రపంచానికి తెలిసిన ఎన్నో అభ్యంతరకర విషయాలకు ఎందుకు ముసుగేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఉండదు. ఉన్నా.. సినిమా కనుక అన్నీ చూపించలేం అన్నదొక్కటే సమాధానం. మరి బయోపిక్ అని ఎందుకనాలి? అంటే మాత్రం ఉలుకూ పలుకూ ఉండదు.
*
భారతీయ సినిమాల్లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. బాలీవుడ్ అయితే బయోపిక్‌పైనే పూర్తిగా ఫోకస్ పెట్టింది. క్రమంగా ఇది దక్షిణాదికీ పాకుతోంది. కొన్ని బయోపిక్‌లకు విజయాలు దక్కడంతో ఈ తరహా సినిమాలకు క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో పురచ్చితలైవి కథనూ స్క్రీన్‌కు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయ. తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని అధికారం చెలాయంచిన మాజీ సీఎం జయలలిత జీవితకథ ఆధారంగా చిత్రాన్ని రూపొందించే ఆలోచనకు పునాధి పడింది. అమ్మ కథను తెరకెక్కించేందుకు దర్శకురాలు ప్రియదర్శిని రంగం సిద్ధం చేస్తున్నట్టు వినికిడి. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ది ఐరన్ లేడీ పోస్టర్ విడుదల చేశాడు. వరలక్ష్మీ శరత్‌కుమార్ జయలలిత పాత్రలో నటించనుందని వినికిడి. మరోవైపు యువ నిర్మాత విష్ణు ఇందూరి సైతం ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించే ఏర్పాట్లలో ఉన్నట్టు కథనాలు. అంటే, త్వరలో మరో బయోపిక్ రాబోతోందన్న మాట.
మహానటి ‘సావిత్రి’ జీవిత గాథను ‘మహానటి’ చిత్రంగా నిర్మించారు. వారందరి కృషి ఫలించి చిత్రం విజయం సాధించింది. ఈ మహానటిపై ప్రేక్షకులకున్న అపార అభిమానమే చిత్ర విజయానికి తోడ్పడింది. అయిపోయిన పెళ్లికి మేళ తాళాలెందుకు అనే సామెత ప్రకారం విజయం సాధించిన చిత్రం గురించి చర్చ అనవసం. అయితే ఆ ‘మహానటి’ని అభిమానించిన ప్రేక్షకులుగాని, స్వర్ణయుగ ప్రేక్షకులుగాని ఊహించిన స్థాయిని మహానటి చిత్రం అందుకోలేదన్నా చర్చా గట్టిగానే సాగింది. సావిత్రి జెమినీ గణేషన్‌ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న సందర్భంలో ‘అక్కినేని, నందమూరి’ అగ్ర నటులు ఆమె యింటికెళ్లి ‘తొందరపడొద్దు. గుడ్డిగా జీవితం నాశనం చేసుకుంటున్నావు. మా మాట విని నిర్ణయం మార్చుకోమని’ నచ్చచెప్పిన విషయంగాని, ‘మూగమనసులు’ హక్కులు కొని చిత్ర నిర్మాణం చేపట్టాలని భావించుకున్నప్పుడు సైతం ‘నిర్మాణ బాధ్యతలు మోయలేవు. చిత్ర రంగంలో ఎవరిని నమ్మాలో, నమ్మకూడదో నీకు తెలీదు. ఉజ్వల భవిష్యత్ నీముందుంది. నిర్మాణ దిశగా అడుగులు వేయవద్దని’ సలహాలిచ్చారు. కాని, ప్రేమగుడ్డిది అనే విషయం గ్రహించలేక సావిత్రి జెమిని గణేశన్‌ను నమ్మి జీవితం నాశనం చేసికున్నదన్నది వాస్తవం. ఆమె పాత్రలో పరాకాయ ప్రవేశం చేసిన పిదమ ఓ అరగంట వరకు ఆ పాత్ర తాలూకు ఛాయలామెలో గోచరించేవి. ఆ సమయంలో ఆమెనెవరూ పలకరించేవారు కాదు. గ్లిజరిన్ లేకుండా కన్నీరు కార్చగల నటి సినీ రంగంలో సావిత్రి మాత్రమేనన్నది యధార్థం. సావిత్రి ఆటోగ్రాఫ్ ‘సా వి 3’ యిలా వుంటుందని చాలామందికి తెలియదు (తెలుగులో ‘సా’, ఇంగ్లీషులో ‘వి’ మేథమెటిక్స్ ప్రకారం 3 (త్రీ) ఇది వింతైన సంతకం). మహానటి సినిమాలు అసలు నిజాలు వదిలేసి, సినిమాటిక్ అంశాలను నిజాలుగా చూపించిన వైనాన్ని మర్చిపోలేం. మరి అలాంటప్పుడు అది బయోపిక్ ఎందుకవుతుంది? ఇదో ప్రశ్న.
మహానటి చిత్రంతో సినీ కళాకారుల జీవిత గాథలను చిత్రాలుగా నిర్మించ సన్నాహాలు చేస్తున్నారు. ఆలోచన ఎప్పటిదైనా, ఇటీవలి కాలంలో నందమూరి తారక రామారావు బయోపిక్ శరవేగంగా సాగుతోంది. చిత్ర నిర్మాణం కోసం ఎన్నో రచనలు పరిశీలిస్తున్నారు. మరెందరివద్దో విషయ సేకరణ కావిస్తున్నారు అధ్యయనం మంచిదే. అందరికీ తెలిసిన చరిత్రలోని అంశాలను ఎంతవరకూ చూపిస్తారన్నదే అసలు ప్రశ్న. ‘నారా చంద్రబాబు’ ఎన్టీఆర్‌కు పొడిచిన ‘వెన్నుపోటు’ చూపిస్తారా? ఆయన జీవితంలో ‘మచ్చ’గా మిగిలిన ‘లక్ష్మిపార్వతి’నెలా చూపిస్తారు.. అన్నదే ఈ బయోపిక్‌లో అతి కీలకం. అయితే చంద్రబాబు బాలకృష్ణకు వియ్యంకుడు కాబట్టి ఆ విషాద ఘట్టం చిత్రంలో కనిపించకపోవచ్చన్న చర్చా లేకపోలేదు. బయోపిక్ నిర్మించాలంటే పుస్తకాలు తిరగెయ్యడం, వివరాలు సేకరించడం మాత్రం చాలదని ఎందుకనుకోరు. పలానా బయోపిక్ నిర్మించదలిచాం. ప్రజలు, అభిమానులు ఎవరైనా చదివిన వివరాలు, విన్నవిషయాలు, అనుభవ యధార్థ సంఘటనలు తెలిపి చిత్ర నిర్మాణానికి సహకరించమని ఎందుకు అడగరు? ఇది జరిగితే నిర్మాత, దర్శకులు, వారసులు ఊహించిన దానికంటే ఎక్కువ వివరాలు వెలువడతాయి.
అసలు ఎన్టీఆర్‌కు రాజకీయ ఆలోచనెలా వచ్చిందంటే? తిరుపతి దర్శనం చేసుకుని హైదరాబాద్‌కు వస్తూ మధ్యలో విశ్రాంతికోసం ఓ టవున్ గెస్ట్‌హౌస్‌లో దిగారు. అర్ధరాత్రి ఆ అతిథిగృహ వర్కర్లు వచ్చి ఆయనను నిదురలేపి ‘మంత్రిగారు అనుకోకుండా వస్తున్నారు. ఆయనకు రూంకావాలి. మీరు రూం ఖాళీచేసి, మూలనున్న చిన్నరూంలో పడుకోండి’ అన్నారట. అది ఎన్టీఆర్‌కు అవమానమనిపించింది. లక్షల ప్రేక్షకుల మనసుదోచుకున్న ననే్న నిర్లక్ష్యం చేస్తున్నారే, ఐదేళ్లుండి కనుమరుగయ్యే రాజకీయులకు ఇంత విలువా? అని మనసులో భావించి ‘కాంగ్రెస్‌ను పుట్టగతులు లేకుండా చేయాలనే’ నిర్ణయం ఆ చిన్న గదిలో చేసినందునే ‘తెలుగుదేశం’ ఆవిర్భవించింది అన్నది లోకోత్తర కథనం. ఇది బయోపిక్‌కు ఎక్కేసరికి ఏ రూపం తీసుకుంటుందో తెలీదు?
ఎన్‌టిఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్లడానికి బేగంపేట విమానాశ్రయంలో ఎదురు చేస్తుంటే, దూరంగా హాస్యనటులు ‘అల్లు రామలింగయ్య’ బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారట. అల్లును దగ్గరకు రమ్మని పిలిచి, ఏంటి రామలింగయ్యగారు నన్ను మరచిపోయారా. గుర్తుపట్టలేదా రండి’ అంటే ‘అబ్బెబ్బె అదేంలేదండి, మీ చుట్టు సెక్యూరిటీ సిబ్బంది వున్నారు కదా. అందుకు రాలేకపోయానని అల్లువారు సమాధానం చెప్పి, ఓ పది నిముషాలు చిత్రరంగం గురించి మాట్లాడుకున్నారట. మరోసారి ఎన్‌టిఆర్, ఎఎన్నార్ ఏయిర్‌పోర్టులో అనుకోకుండా కలసినపుడు ‘హలోబ్రదర్ నీవు రాజకీయాల్లోకి వస్తే యిద్దరం కలసి రాష్ట్రాన్ని అభివృద్ధివైపు పరుగులు తీయిస్తాం కదా’ అన్నారట. అందుకు అక్కినేని ‘రాజకీయం నాకు అచ్చుబాటుకాదు, నాకు ఏమితెలియదు, నన్నొదిలెయ్ బ్రదర్’ అన్నారట అక్కినేని. ఇలా ఎనె్నన్నో ముచ్చట్లు ఎన్టీఆర్ బయోపిక్‌లో కనిపిస్తాయా? లేక సినిమాటిక్ సరుకునే స్క్రీన్‌కు తెస్తారా? అన్న సందేహాలు అన్న అభిమానుల్లో లెక్కలేనన్ని.
ఇలాంటి యధార్థ సంఘటనలతో, వారివారి వ్యక్తిత్వపు వివరాలతో చిత్రాన్ని పూర్తిగా నిర్మించగలగాలి. అపుడే ఆయా చిత్రాలను నిర్మించిన ఆశయం నెరవేరుతుంది. సెలబ్రిటీలను గౌరవించినట్లుంటుంది. ఋణం తీర్చుకున్నట్లుటుంది. మన టాలీవుడ్‌కు మరో పెద్ద రోగముంది. ఏ చిత్రమైన పొరపాటున హిట్ అయితే, కొద్దిమార్పుతో చిత్రం పేరును వాడతారు. పెడతారు. అదే మూసధోరణితో విసుగొచ్చేలా ట్రెండ్ సాకుతో చిత్రాలు నిర్మిస్తూనే వుంటారు. సినీ వారసులంతా వారి తండ్రుల, తాతల బయోపిక్స్‌ను రాబోవు రోజులలో ఎన్ని నిర్మిస్తారో, చూస్తామో ఎవరికీ తెలియదు.
*

- మురహరి ఆనందరావు