మెయిన్ ఫీచర్

అనే్వషణ ఆమె అభిలాష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అరుణాభిక్షు’ నాటక రచయిత్రి, డైరెక్టర్, నటి. నాలుగేళ్ల వయసులోనే కూచిపూడి నడకలు నేర్చుకుంది. నటనలోనూ తనదైన శైలిని ప్రదర్శిస్తోంది. టాలీవుడ్‌లో అగ్రస్థాయిలో ఉన్న కొందరు నటులు ఆమెవద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్నవారే. విభిన్న పాత్రల పోషణ ఆమె నటనాభిరుచిని తెలియజేస్తోంది. అంతర్జాతీయ వేదికపై తెలుగు సాంప్రదాయ నృత్యరీతులపై రీసెర్చ్ పేపర్ సమర్పించే అరుదైన అవకాశాన్ని పొందారు. ఆమె వృత్తిరీత్యా అధ్యాపకురాలైతే ప్రవృత్తిరీత్యా నటి, నృత్యకారిణి. నాలుగేళ్ల వయసులోనే కూచిపూడి అభ్యసించిన ఆమె నాలుగు పదులు వయసు దాటినా ఇప్పటికీ నటనలోగానీ, నాట్యంలోగానీ తాను విద్యార్థినే అని వినమ్రంగా చెబుతోంది. నృత్యాభినయంలో డాక్టరేట్ సంపాదించిన అరుణాభిక్షు హైదరాబాద్ యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
అంతర్జాతీయ వేదికపై పరిశోధనాపత్రం
నృత్యంపై చిన్నప్పటి నుంచి మక్కువ పెంచుకున్న ఆమె వాటి అభినయంతో పాటు శాస్ర్తియ నృత్యాల పుట్టూపూర్వోత్తరాలపై విస్తత్ర పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అరుణాభిక్షు ఇటీవల స్వీడన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ థియేటర్ రీసెర్చ్ కాన్ఫరెన్స్‌లో "Performative Intercessions Beyond Religion-A glimpse into telugu dance Traditions'' అనే అంశంఫై ఆమె రీసెర్చ్ పేపర్ సమర్పించారు. ఈ సబ్జెక్టునే ఎందుకు ఎంపికచేసుకున్నారని అడిగితే... వాస్తవానికి భారతీయ శాస్ర్తి య నృత్యరీతులన్నీ సంస్కృతం, బ్రాహ్మాణ సాంప్రదాయ పద్ధతులలో నడుస్తున్నాయి. కాని వీటికి సంబంధించిన చరిత్ర మనం చూస్తే విభిన్న సంస్కృతుల నేపథ్యం కనిపిస్తుందంటారు. తెలుగువారి కూచిపూడి నృత్యం కృష్ణాజిల్లాలోని కూచిపూడిలో స్థిరపడి, ఆ ఊరి పేరుతోనే ప్రసిద్ధిచెందటం వెనుక గోల్కొండ్ నవాబుల పాత్ర కూడా ఉందంటారు. కూచిపూడి కళాకారులు ఆ గ్రామంలో స్థిరపడటానికి, ఆ నృత్యానికి ఆ పేరు రావటానికి గోల్కోండ నవాబు లు ఇచ్చిన బహుమతి అంటారు. ఇందులో ఉర్దూ, పర్షియన్ పదాలు ఉంటాయని చెబుతూ ఈ వాస్తవాలను వెలుగులోకి తీసుకురావటానికే తాను తెలుగు నృత్యరీతులపై పరిశోధనా పత్రాన్ని సమర్పించానని వెల్లడించారు.
40 దేశాల నుంచి 900 మంది ప్రతినిధులు
అంతర్జాతీయ సదస్సుకు దాదాపు 40 దేశాల నుంచి 900 మంది ప్రతినిధులు హాజరయితే అరుణాభిక్షు సమర్పించిన పరిశోధనా పత్రానికి విశేషమైన స్పందన రావటమే కాకుండా కొరియా, బ్రెజి ల్, అమెరికా దేశస్థులు మనదేశ నృత్యాలపై అనేక ప్రశ్నలు సంధించి తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. మన శాస్ర్తియ నృత్యా లు ఒక తరం నుంచి మరొక తరానికి ఏమాత్రం వనె్న తగ్గకుండా అందిస్తున్న భారతీయుల కృషిని అంతర్జాతీయ వేదికపై ఆమె వివరించగలిగారు. బహుళ సాంస్కృతి సమానత్వానికి నిదర్శనంగా నిలిచే మన శాస్ర్తియ నృత్యాల పట్ల విదేశీయులలో అమితాసక్తి ఉందని ఆమె అంటున్నారు. నాటక రచన, దర్శకత్వం, నటన.. ఇలా విభిన్న అంశాలలో బహుముఖ ప్రజ్ఞ కలిగిన అరుణాభిక్షు టాలీవుడ్ నటీ నటులు సుహాసిని, పార్వతీ మెలన్, ఇలియనా, రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీయార్, పూనమ్ కౌర్, నిఖిల్, రామ్, నితిన్ తదితరులు ఆమె విద్యార్థులే.
**
మన శాస్ర్తియ నృత్యాలు ఒక తరం నుంచి మరొక తరానికి ఏమాత్రం వనె్న తగ్గకుండా అందిస్తున్న భారతీయుల కృషిని అంతర్జాతీయ వేదికపై ఆమె వివరించగలిగారు. బహుళ సాంస్కృతి సమానత్వానికి నిదర్శనంగా నిలిచే మన శాస్ర్తియ నృత్యాల పట్ల విదేశీయులలో అమితాసక్తి ఉందని ఆమె అంటున్నారు.