మెయిన్ ఫీచర్

ఊరిస్తున్న టీజర్‌లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా ఒక మాయాజాలపు పెట్టె. సిత్రాల్ని కూడా అబ్బో.. ఇది నిజమేమోనని భ్రమింపచేసేది! ఎన్ని సిత్ర ఇసిత్ర వేశాలు వేసేయాలో అన్ని చిత్ర విచిత్రాలు చేసే ఏకైక రంగం చలన చిత్ర రంగం! దర్శక నిర్మాతలు తయారుచేసిన సినిమా ముడి పదార్థమే యదార్థమని గుడ్డిగా నమ్మకం కలిగింపచేసి, ప్రేక్షక లోకాన్ని మాయలో పడదోసేది!
ఒకప్పుడు రిక్షాలకు ఆ తర్వాత ఆటోలకు పోస్టర్స్ అతికించేసి మైకు పట్టుకొని (లేదా రికార్డ్).. పాంప్లెంట్స్ విసురుకుంటూ... ప్రయాణం మొదలుపెట్టిన సినిమా ‘పబ్లిసిటీ’ ఎనె్నన్నో మార్పులతో చేర్పులతో సరికొత్త హంగులతో కొంగ్రొత్త పుంతలు తొక్కింది. పాత బూజును దులుపేసి పబ్లిసిటీ గోడమీద సరికొత్త ‘టీజరై’ కూర్చుంది. ప్రేక్షకుడికి ఎలా నచ్చచెప్పాలో అలా నచ్చ చెప్పేసి, ఎలా బుజ్జగించాలో అలా బుజ్జగించే పబ్లిసిటీ పనిలో పడుతున్నారు సినిమా తయారీదారులు.
*
ఫస్ట్ టీజర్ అంటూ, థియేరిటికల్ టీజర్ అంటూ సినిమా విడుదలకి ముందే దుమ్ములేపే పనిలో పడుతున్నారు. పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగా ప్రేక్షకుల్ని ఊరిస్తూ తమ సినిమా విడుదలకి ముందే అంచనాలు పెరిగేసేలా జాగ్రత్తపడుతున్నారు. పంచ్ డైలాగ్ ఆర్ అదరగొట్టే ఫైటింగ్ ఆర్ మరో ఇంట్రస్టింగ్ సన్నివేశమో చూపిస్తూ... గుండెని పిండేసే సీన్ కట్ చేసేస్తూనో.. ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేస్తూ... సినిమా క్రేజ్ ప్రాజెక్ట్ అయ్యేలా గారడీ టీజర్‌లను వదిలేస్తున్నారు, హతోస్మి! థియేటర్లో బొమ్మ ఆడాక ప్రేక్షకుడికి కనెక్ట్ అయితే ఓకే! లేకుంటే చచ్చింది గొర్రె.
అమ్మ అన్నం వండుతూ ఉడికిందా లేదా అని నాల్గుమెతుకులు చేతిలోకి తీసుకొని ఉడికిందా లేదా అని టెస్ట్ చేస్తుంది. మరి ఈ ‘టీజర్స్ అలా కాదే! టీజర్ భలేగుందే అనుకుంటే బొమ్మ బోల్తాకొట్టడం... ప్చ్ టీజర్! అని పెదవ్విరిస్తే సినిమా కాస్తా సూపరై పోవడం... లాంటి సంఘటనలు కోకొల్లలు! ఒక టీజర్ మెతుకు ‘టెస్ట్’చేసి ‘టేస్ట్’ చూద్దాం. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ టీజర్‌లోకి వెళదాం. అల్లు అర్జున్ నడుచుకుంటూ వెళ్ళి పోతుంటాడు. కెమెరా అతడి వెనకభాగాన్ని మనకి క్లోజప్‌లో చూపిస్తుంది. ఆ తర్వాత డైలాగ్స్ ఇలాగే వినపడతాయి.
‘హు ఆర్ యూ?’
‘ఐ ఆమ్ ఎ సోల్జర్’ తర్వాత ఒక ఫైట్ సీన్.
మళ్ళీ మరో డైలాగ్ ఇలా-
‘నీకు సూర్య అంటే సోల్జర్’.
‘ప్రపంచానికి సూర్య అంటే ఆంగర్’.
మధ్యలో కొంత, అనంతరం చివర్లో ‘ఇలాగే కొన్ని రోజులైతే చచ్చిపోతావ్ రా’.
‘చచ్చిపోతాను గాడ్‌ఫాదర్.. కానీ ఇక్కడ కాదు బోర్డర్‌లోకెళ్ళి చచ్చిపోతాను’ అంటూ దేశభక్తి గుండెలో నింపే డైలాగ్ వినిపిస్తుంది. ఇదిగో ఇలాంటి టీజర్‌ని కనులారా తిలకించి, రక్తం ఉప్పొంగించే డైలాగ్స్ చెపుతారా వినిపించేసాక... థియేటర్‌కి పరుగు పరుగున వెళ్ళిన ప్రేక్షకుడు... ఊహించిందొకటై, టీజర్ ఊరించిందొకటై... బోల్తా పడ్డాడు. సినిమా ఫలితాలు మనమెరిగినవే! చూశారా అంచనాలు పెంచారు. కానీ విజయాన్నిఅందుకోలేకపోయారు.
సరే, మరో టీజర్ వ్యవహారం చర్చిద్దాం. ‘రంగస్థలం’ టీజర్ రంగు చూద్దాం. చెట్ల మధ్యలోంచి వంగుతూ వెళుతూ హీరో రామ్‌చరణ్ ఏదో వింటున్నట్టు ‘నా పేరు చిట్టిబాబండీ! ఈ ఊరికి మనమే ఇంజనీర్ అండీ!’ అంటూనే ‘అందరికీ సౌండ్ వినపడ్తుందండి. నాకు కనపడ్తదండి..’ అనేసి ఓ ఫైట్ చూపించేసి’ అందుకే అండి ఊళ్ళో అందరూమనల్ని సౌండ్ ఇంజనీర్ అంటారు.’ అనే సరదా డైలాగ్ వినిపిస్తారు. ఇక టీజర్ ఎండింగ్‌లో హీరో కత్తి పట్టుకొని ఆవేశంగా నడవడం చూపిస్తారు. సాదాసీదా సరదాగా మొదలై యాక్షన్ సీన్‌తో ఎండవడంతో టీజర్ ప్రేక్షకుడ్ని ఆసక్తివైపు నెట్టేసింది. అందుకు పదింతల థ్రిల్ సినిమా అందించింది. అంచనాల్ని పెంచడమే కాదు సినిమాలో అద్భుతాల్ని చూపెట్టారు. రిజల్ట్స్ డిస్టింక్షన్ లెవెల్లో రిలీజవడం మనమెరుగుదుము.
ఈ రెంటికి తేడా చెప్పకనే చెబుతుంది టీజర్! టీజర్ అంటే అంచనాల్ని పెంచేదే కాదు. అంచనాల్ని అందుకునేదై ఉండాలి. అంచనాల్ని తారుమారు చేసేదిగా ఉండకూడదు. అందుకే ఆయా సినిమాల ఫలితాలు అలా ఉంటున్నాయి. అందుకే ఈమధ్య హీరోలు, కొందరు దర్శక నిర్మాతలు సినిమా గురించి నిలువెల్లా ‘నరక్కుండా’ ఎలాంటి అంచనాలతో సినిమాకి వెళ్ళకండి, తప్పక ఈ సినిమా మీకు నచ్చుతుందని సెలవిస్తున్నారు. అలా అని అలాంటి సినిమాలు కంపల్సరీ హిట్టయ్యాయా అంటే... అబ్బే ఎక్కడా ఏ విషయంలో ఈ విషయంలోనూ అస్సలు గ్యారంటీ లేదండీ...ఇక ఏ టీజర్ ఏ నిర్మాతను కాపాడుతుందండి! టీజర్ వదిలేసి... దానిపై భరోసా ఉంచడం తప్ప! చూడాలి రేప్పొద్దున ఈ టీజర్ వ్యవహారమూ ఓల్డయపోయ మరో రకపు వెరయిటీ పబ్లిసిటీ డిజైనింగ్ మొదలవ్వొచ్చు!
అందాకనైతే టీజర్ అంటే ప్రేక్షకుల్ని థియేటర్‌కు రప్పించగలిగేదే కాదు... టీజర్ అనేది థియేటర్లో సినిమాని నిలబెట్టగలిగేదిగా ఉండాలి. ఈ విషయాన్ని సినీ మేకర్స్‌తో పాటు, టీజర్ కటింగ్ టెక్నీషియన్స్ కూడా పరికిస్తే చాలా మంచిది. ఎందుకంటే తాను చూసిన టీజర్ షాంపిల్ కంటే మరింత మిన్నగా, పసందైన సన్నివేశాల అనుభూతుల్ని ప్రేక్షకుడు కోరుకుంటాడు. ఆ ఫీలింగ్ మిస్సయినపుడు ఆటోమాటిగ్గా సినిమా తుస్సవుతుంది. అందుకే టీజర్ షార్పైన సీజర్ లాగ ఉంటూ సినిమా సక్సెస్‌కి మిస్సైల్‌లా పనిచేయాలి తప్ప మిస్ ఫైరింగ్‌లా తయారవకూడదు.
*

ఎనుగంటి వేణుగోపాల్