మెయిన్ ఫీచర్

ఇదా మొదటి చదువు వాచకం?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిబియస్‌ఇ సిలబస్ ప్రకారం వివిధ పాఠ్యాంశాలను బోధిస్తున్నాం అని చెప్పుకునే స్కూళ్ళలోని ఒక రికగ్నైజ్డ్ స్కూలువారి ఒకటవ తరగతి తెలుగు వాచకం (Text Book)లో 5వ పుటలో ఒక రూపాయి నాణెం బొమ్మ పక్కన ‘బు’ అనే అక్షరంతో మొదలయ్యే పదమంటూ ‘బుక’ అని పేర్కొన్నారు. ఆ వాచక రచయిత్రి. వాచకం పేరు ‘ఆపిల్ తెలుగు భారతి- (1).
రూపాయి అనే పదానికి పర్యాయ పదం ‘రూక’. అంతేగాని ‘బుక’ అనేది కానే కాదు. కవి పండితులైన కీ.శే.మహాకాళి సుబ్బారాయుడుగారి శబ్దార్థ చంద్రిక గాని, కీ.శే.జయంతి రామయ్యగారి వంటి మహా పండితులు కలసి కూర్చొని, కూర్చిన శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువులోగాని, మఱే ఇతర నిఘంటువులోనైనా గాని ఎవరూ రూపాయి శబ్దాన్ని ‘బు’క’గా పేర్కొనలేదు. ‘రూక’లోని రకారం కేవలం ‘ఊ’కార పూర్వక రకాల హల్లు ధ్వని మాత్రమే.
ఏ తెలుగు నిఘంటువులోనూ అకారాది క్రమంలో ‘బు’ అనే దాని కింద ఏ పదమూ లేదు. కారణం ‘బు’ కారంతో తెలుగులో అసలు పదాలే లేవు. ఈ ‘బు’ కారం కేవలం సంస్కృత వాఙ్మయంలోనే కనిపిస్తుంది. ‘బు’ అనేది వేద వాఙ్మయంలో ఉంటే ఉండవచ్చు. కానీ అవేవీ తెలుగు పదాలు కావు.
ఈ ‘బు’ స్వరానికి మారురూపమే వృత్వం అన్నా, వట్రుసుడి అన్నా. దాని లేఖన చిహ్నం ‘ౄ’. ఈ దీర్ఘస్వర ‘బు’కారంతో ఇటు అచ్చుతో గాని, అటు హల్లుతోగాని ప్రారంభమయ్యే శబ్దమే కనిపించదు మన వాఙ్మయంలో.
కేవలం హ్రస్వ ఋకారం- అంటే - హ్రస్వ వట్రుసుడి (వృత్వం)తో మాత్రమే శబ్దాలు కోకొల్లలుగా ఉన్నాయి- ఋషి, ఋక్కు, ఋజువు, ఋణము, కృష్ణ, తృష్ణ, గృధ్రము, జృంభణ, నృపుడు, పృథివి, మృగము, సృష్టి, హృది- ఇలా. అసలు యథార్థానికి ఈ ‘ఋ’(ృ) ధ్వనికి ఛందస్సులో ఇ, ఈ, లు, ఏ, ఏలతో కూడిన హల్లులతో మాత్రమే యతిమైత్రి ఉంది. మనం ఆచరణలోకూడా ‘కృష్ణ’ శబ్దాన్ని ‘క్రిష్ణ’ అని పలుకుతుంటాము.
ఇక సంస్కృతంలోనయితే తప్పకుండా ‘ఋ’ స్వరాన్ని ‘ఇ’కారంతో మాత్రమే పలుకుతారు. ఇంగ్లీషులో రాసేటప్పుడు కూడా ‘ని’ అనే అచ్చు అక్షరా(VOWEL))నే్న వాడతారు. ఉదాహరణకు SANSKRIT (సాన్స్‌క్రిట్), KRISHI, BRINDAVAN, BRIHATKATHA (బృహత్క్థ)- ఇలానే రాస్తారు.
ఒక్క తెలుగులో మాత్రమే ‘ఋ’ కారాన్ని (వృత్వ ధ్వనిని) ఉకారంతో పలకటం కనిపిస్తుంది- కృతి (క్రుతి), నమస్కృతి (నమస్క్రు....), కృషి, (క్రుషి), ఋషి (రుషి), ఇలాగే భృతి, భృత్యుడు, స్మృతి, ధృతి, కృతఘు్నడు, కృతజ్ఞత మొదలైన పదాలన్నీ ఉకార ఉచ్చారణతోనే వ్యవహృతాలవుతుంటాయి. బహుశః ఇలా తలపోస్తూ ‘ఆపిల్ తెలుగు భారతి 1వ తరగతి వాచక’ రచయిత్రి రూక నాణేనికి ‘బుక’ అని అక్షర రూప నిర్ణయంచేసి ఉండాలి. అది నూటికి నూఱుపాళ్ళు పొరపాటే.
అన్ని నిఘంటువులలోనూ ‘రూ’ అనే అక్షరంతో మొదలయ్యే పదాల జాబితాలోని మొట్టమొదటి పదం ‘రూక’ అనే ఉంది. ‘రూక’కు అర్థాలు ధనము, చిన్నమెత్తు వెండి- లేక- బంగారు నాణెము అని చెప్పబడ్డాయి.
మఱి రుూ ‘బుక’ ఆ పుస్తక రచయిత్రికి ఏ శబ్దకోశంలో ‘మోగిందో’ అంతుబట్టటం లేదు. అక్షర బీజాలు, చదువు పునాదులు, బాస మొలకలు పాదుకొనాల్సిన ఒకటవ తరగతి పసి పిల్లల విద్యామానస క్షేత్రాలలో ఇలాంటి ‘దోషాలు’ నాటుకుపోవటం ఏమాత్రం శ్రేయస్కరం గాని, వాంఛనీయం గాని, ఉపేక్షార్హంగానీ కాదు.
ఇదే వాచకం 9వ పుటలో రామ ములగకాయ (పండు) (చిత్తూరు జిల్లాలో ‘తక్కాళీ’) బొమ్మపక్కన ‘టమాట’ అని ఉంది. ఈ అక్షరత్రయ సముదాయ రూపం ఉచ్చారణా సుందరంగా లేదు. TOMATO అనే దానిని టొమాటో అని పలికితేనే వినసొంపుగాను, శ్రవణ సుభగంగానూ ఉంటుంది. టొమాటో అనే పదంలోని ‘మ’కారాన్ని CAT, MAT, RAT, MAN వంటి పదాలలోని ఏటవాలు అచ్చు (SLANT VOWEL) ధ్వనితోనే పలకాలి, పిల్లలచేత పలికించాలి. అలాగే పలుకుతాం కూడా.
11వ పుటలో ‘బ’ అనే అక్షరాన్ని పరిచయం చేస్తూ ‘బకము’ అని ఉంది. 1వ తరగతి పిల్లలకు అంత సంస్కృతపు మాఱుమూల శబ్దం అవసరమా? బడి, బల్లి, బద్ద, బట్ట, బజ్జి, బండ, బంతి, బలపము- అయిదారేళ్ళ పిల్లవాడికి పరిచయముండే ఇలాంటి పదాన్ని ఏదో ఒక దాన్ని ఎన్నుకొని బొమ్మ వేయించి ఉంటే బాగుండేది.
అలాగే 12వ పేజీలో ఉష (సూర్యోదయం) అనే మాఱుమూల పదానికి మాఱుగా వేషములాంటి తేలిగ్గా అర్థమయ్యే పదాన్ని ఎన్నుకుంటే బాగుండేదేమో!
12వ పేజీలోనే ఉన్న ‘క్షవరము’ అనే శబ్దం తప్పు. ‘క్షౌరం’ అనాలి. క్షురము అంటే వెండ్రుకలను తగ్గించటానికి వాడే కత్తి. క్షురము అనే పరికరంతో చేసే పని క్షౌరము. అంతేగాని క్షవరం అనే శబ్దరూపం ఏర్పడదు. మూలం - వౌలికం; కుటిలం - కౌటిల్యం; శుచి - శౌచం - మొదలైన శబ్దాల లాగే ఇది భావార్థక తద్ధిత రూపం. క్షవరం అనే తప్పుడు రాత రూపంతో శబ్దాన్ని బాల్యదశలోనే అలవాటు చేయటం భాషా యోషకే అపచారం, అవమానం.
27వ పుటలోని ‘గురువును వినుము’ అనే వాక్యం తెలుగు వాక్య నిర్మాణ పద్ధతికి తగ్గట్టుగాను, సహజ సుందరంగాను లేదు. "HEAR THE TEACHER' ’ ‘గురుం శ్రుణు’ అనే విద్యర్థక ఆంగ్ల, సంస్కృత వాక్యాలను మనసులో అనుకొని, తెలుగులోకి దించినట్టు కృతకంగా ఉంది. ఆ భావవాక్యాన్ని తెలుగులో రాసేటప్పుడు ‘గురువు చెప్పేది వినుము’ అంటూ ఒక విశేషణాత్మక క్రియానామవాచక ద్వితీయా విభక్త్యర్థక భావాన్ని తెలియజేసే పదాన్ని (చెప్పేది అనే శబ్దాన్ని) తప్పక తెచ్చుకోవాలి. దీనిని అలోప కర్మ పద వాక్యం అంటారు.
‘‘గురవును వినుము’ అని మా పుస్తకంలో వాక్యంగూడా ఉన్నది. కనుక అది రైటే’’ అంటూ ఎవరైనా పిల్లవాడు ఆ అర్థంలోనే తన వాచకంలో రచయిత్రి ఇచ్చిన వాక్యాన్ని ఇళ్ళల్లో తన సంభాషణల్లో పలికితే, ప్రాక్టికల్‌గా ఉపయోగిస్తే- లేక- ప్రయోగిస్తే ‘‘ఇదేం చదువురా నాయనా?!’’ అంటూ అందరూ హేళనగా నవ్వుతారు. అలా పిల్లల్ని నవ్వులపాలు చేసే ఇలాంటి వాక్య రచనలా పాఠ్యపుస్తకాల్లోను, ప్రాథమిక వాచకాల్లోనూ ఉండాల్సింది?!
33వ పుట మొదటి పంక్తిలోని 6వ పదం అయిన ‘శృతి’ అనే దానికి అర్థం లేదు. అసలు ఆ రూపమే లేదు శబ్దార్థ చంద్రిక, సూర్యరాయాంధ్రం, ఆసియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, న్యూఢిల్లీ, చెన్నై వారల సంస్కృతాంధ్ర నిఘంటువు, వామన్ శివరామ్ ఆప్టే మహాశయుడు కూర్చిన సంస్కృత- ఆంగ్ల, ఆంగ్ల-సంస్కృత నిఘంటువులు మొదలైన వాటిలో దేంట్లోను. మఱి ‘ఆపిల్’ వాచక రచయిత్రి ‘శృతి’ని ఎక్కడ విన్నారో, కన్నారో ఏమో! ‘శ్రుతి’ అనే శబ్దం అయితే ఉన్నది. చెవి, శ్రవణము, అనుకొనే మాట (జనశ్రుతి), ధ్వని, వేదం, వేదమంత్రము, వేదజ్ఞానం, శ్రవణ నక్షత్రం, విషమ కర్ణం, రేఖావిశేషం (జ్యామితిలో), సూక్తి, సుద్ది అనే పలు విధాల అర్థాలలో, ఈ ‘శ్రుతి’నే ‘శృతి’ అనుకున్నారేమో రచయిత్రి! ఇలా మన వాచక రచనలు జరిగితే మన బాస చదువుల ప్రామాణికత, భవితవ్యాలు భూగోళమంత ప్రశ్నార్థకాలు.
వాచకాలు, పాఠ్యగ్రంథాలు రాసేవాళ్ళు ఒకటికి రెండుసార్లు తాము తయారుచేసే వౌలిక ప్రతి (మాతృకాప్రతి)ని తమకంటే అనుభవజ్ఞులు, విద్యావృద్ధులు, అక్షర జ్ఞాన పరిశుద్ధులు అయిన వాళ్ళకు చూపించి అలాంటి వాళ్ళచేత ఔననిపించుకోవటం మంచిది. సి.బి.ఎస్.ఇ. విద్యావేత్తలు, విద్యాధికారులు కూడా అక్షర-్భషాజ్ఞానంలో తలలు పండిన పండితులను ఫైనల్ కన్సల్టెంట్లుగా నియమించుకొని, వాళ్ళు ధ్రువీకరించి, యోగ్యతాపత్రం ఇచ్చాకనే ఏ వాచకాTEXT BOOK)నికైనా ఆమోదముద్ర వేయాలి, విద్యాలయాల్లో పఠన, పాఠనాదులకు అనుమతించాలి.
అక్షరం పరబ్రహ్మ స్వరూపం, కాకూడదది అపభ్రంశం. పదం భారతీదేవి పదమంజీరం. కాకూడదది భ్రష్టాకారం- పఠన, పాఠక మనోవికారం.

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 9849779290